పెళ్లి అయిన మూడు రోజులకే గర్భవతి... తమ్ముడు తో రెండో పెళ్లి చేసిన ప్రియుడు వాళ్ల స్కెచ్ కి ప్రియుడి మైండ్ బ్లాక్...

 పెళ్లి అయిన మూడు రోజులకే గర్భవతి... తమ్ముడు తో రెండో పెళ్లి చేసిన ప్రియుడు వాళ్ల స్కెచ్ కి ప్రియుడి మైండ్ బ్లాక్...


వైజాగ్ చీటింగ్ లేడీ: 

ఒక వైపు ప్రియుడుతో ఎఫైర్ సాగిస్తూనే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకుంది ఈ మహిళ. అంతేనా ఇంతటితో ఆగకుండా భర్తను నట్టేట ముంచి అతడి నుండి భారీగా బంగారం డబ్బులు దండుకుంది.


భారతీయ సంస్కృతి సాంప్రదాయాలలో వైవాహిక బంధానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది.పెళ్లి(marriage) అనే బంధాన్ని ప్రతి ఒక్కరూ గౌరవిస్తూ ఉంటారు. కానీ ఈ మహిళ మాత్రం ఆ బంధాన్ని అపహాస్యం పాలు చేసింది. ఓవైపు ప్రియుడితో ఎఫైర్ సాగిస్తూనే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకుంది. అంతటితో ఆగకుండా భర్తను నట్టేట ముంచి భారీగా డబ్బులు బంగారం దండుకుంది. ఆహారంలో కూడా తనలోనే మహానటిని బయటపెట్టి ప్రియుడి కథ,స్క్రీన్ ప్లే, డైరెక్షన్ తో నాటకాన్ని రక్తికట్టించింది.


అంతేనా రెండో భర్త కూడా జెర్క్ ఇచ్చి మూడో పెళ్లి చేసుకుంది. వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం లోని గాజువాక ప్రాంతానికి చెందిన నబారు రేణుక అనే యువతికి కొంత కాలంక్రితం జగదీశ్ అనే యువకుడితో పెద్దలు పెళ్లి చేశారు. అయితే ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే పెళ్లి అయిన మూడు రోజులకే రేణుక గర్భవతి అని తేలడంతో భర్త రేణుక ను వదిలేశాడు.

ఇది కూడా చదవండి: గాంధీ హాస్పిటల్ హత్యచర ఘటన సుఖాంతం

అప్పటికీ శ్రీనివాస్ అనే వ్యక్తి ని ప్రేమించిన రేణుక. అతడితో హద్దులు దాటడం తో గర్భవతి అయింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన శ్రీనివాస్ వాయిదా వచ్చాడు. ఈలోగా రేణుక పాపకు జన్మనిచ్చింది. ఇదిలా ఉంటే మరో యువతితో పెళ్లికి సిద్ధమైన శ్రీనివాస్ ను రేణుక ఆర తీయగా పాప బాధ్యత తాను తీసుకుంటానని నగదు డిపాజిట్ కూడా చేస్తానని సర్ది చెప్పి పెద్దలు చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.

అయితే రేణుకను వదిలించుకునే ఈ క్రమంలో శ్రీనివాస్ కి ఒక కన్నిగ్ ఐడియా తట్టింది. వెంటనే ఆమెను కూర్చోబెట్టి తన ప్లాన్ వివరించాడు. శ్రీనివాస్ పిన్ని కొడుకు అయినా నా ప్రసాద్ ఆర్మీ లో ఉద్యోగం చేస్తున్నాడు అని చెప్పి అతని ఫోన్ నెంబర్ మరియు కొన్ని ఫోటోలు శ్రీనివాస్ రేణుక కి పంపి ప్రసాద్ ని లైన్ లో పెట్టమని చెప్పాడు. ప్రేమ చెప్పిన ప్లాన్ ని పక్కాగా అమలుచేసిన రేణుక ప్రసాద్ నీ అనుకున్నట్టే ముగ్గులోకి దించింది. తర్వాత తనకు చెప్పకుండా అతన్ని పెళ్లి చేసుకునే లాగా చేసింది ఉద్యోగరీత్యా లక్నో లో ఉన్న ప్రసాద్ అన్న వెంటనే భార్యను కూడా కాపురానికి తీసుకెళ్లాడు. అక్కడ ప్రసాద్ రేణుక కి లక్షల విలువ చేసే బంగారం కొనిపెట్టాడు. కొంతకాలం తర్వాత రేణుక తనకి జీవీఎంసీ లో ఉద్యోగం వచ్చిందని ప్రసాద్ ని నమ్మించి తిరిగి వైజాగ్ వచ్చి ప్రియుడు శ్రీనివాస్ తో సెటిల్ అయింది. ఈ లోగా కరోన రావడంతో ప్రసాద్ విశాఖకు రాలేకపోయాడు. కానీ తరచూ రేణుక తో ఫోన్లో మాట్లాడుతూ ఉండేవాడు.


ఆ తర్వాత రేణుక పథకం ప్రకారం మా అమ్మకి హెల్త్ బాగా లేదని ఇంట్లో వెయ్యాలని డబ్బులు పంపమని ప్రసాద్ అని అడగడం మొదలు పెట్టింది. ఇలా పలుమార్లు బైపాస్ అంటూ, గొంతు సర్జరీ అని ఇతర చికిత్సల పేరుతో ప్రసాద్ నుండి 45 లక్షల రూపాయలు దండుకుంది. చివరకు అమ్మ చనిపోయిందని ప్రసాదం నమ్మించింది. ఆర్మీ లో ఉండడం కాలేకపోవడంతో తనకు తెలియకుండా ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలో పనిచేస్తున్న సాయి అనే యువకుని మూడో పెళ్లి చేసుకుంది.చివరకు రేణుక అసలు రంగు బయట పడటం తో ప్రసాద్ గాజువాక  పోలీసు లని ఆశ్రయించగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


వ్యవస్థీకృత నేరాలపై దృష్టి సారించాలి : డిజిపి మహేందర్ రెడ్డి

 వ్యవస్థీకృత నేరాలపై దృష్టి సారించాలి  : డిజిపి మహేందర్ రెడ్డి


👉 ప్రజలకు పారదర్శక సేవలందించాలన్న డిజిపి


👉 పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించేలా చర్యలు తీసుకోవాలని సూచన


👉 పోలీస్ ఉన్నతాధికారులు, కమిషనర్లు, జిల్లా ఎస్పీలతో నేర సమీక్షా సమావేశం

నల్లగొండ : వ్యవస్థీకృత నేరాలపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు వాటిని అదుపు చేయడానికి మరింత సమర్ధవంతమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డి పోలీస్ అధికారులకు సూచించారు.




శుక్రవారం డిజిపి కార్యాలయం నుండి పోలీస్ ఉన్నతాధికారులు, పోలీస్ కమిషనర్లు, జిల్లా ఎస్పీలతో నెలవారి నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నల్లగొండ జిల్లాలో నేరాల నియంత్రించడానికి తీసుకుంటున్న చర్యలు, పెండింగులో ఉన్న కేసుల వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. నల్లగొండ జిల్లాలో కేసుల పరిష్కారానికి అధికారులు చూపిస్తున్న చొరవ, నేరాలకు పాల్పడిన నేరస్తులకు కోర్టులో శిక్షలు పడే విధంగా తీసుకుంటున్న ముందస్తు చర్యలను డిజిపికి జిల్లా ఎస్పీ ఏ.వి. రంగనాధ్ వివరించారు. పెండింగ్ లో వున్న కేసులను తగ్గించడం కోసం తీసుకుంటున్న చర్యలను డిజిపి అభినందించారు.  ఈ సందర్భంగా డిజిపి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా అవసరాలకు అనుగుణంగా పోలీస్ శాఖ పారదర్శకంగా సేవలందిస్తూ ప్రజా మన్ననలు పొందేలా ముందుకు సాగాలన్నారు. పెరిగిపోతున్న వ్యవస్థీకృత నేరాలపై ప్రత్యేక దృష్టి సారించి వాటి నియంత్రణ కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటూ శాంతి భద్రతల పరిరక్షణలో రాజీ లేకుండా పని చేయాలన్నారు.


దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకెళ్లడం ద్వారా తెలంగాణ పోలీసుల గౌరవం మరింత ఇనుమడించేలా పని చేయాలని ఆయన సూచించారు. ముఖ్యంగా నిఘా వ్యవస్థకు ప్రధాన సంపత్తిగా మారిన సిసి టీవీల వల్ల భద్రతా ప్రమాణాలు పెరుగుతున్న క్రమంలో నేను సైతం, కమ్యూనిటీ పోలీసింగ్ లో సిసి కెమెరాల ఏర్పాటును మరింత ప్రోత్సహించే విధంగా అన్ని జిల్లాల అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. నేరం చేసే వాడికి శిక్ష పడాలి, నేరం చేయని వారికి రక్షణగా ఉండాలనే లక్ష్యంతో సాంకేతికపరమైన సంస్కరణలు తీసుకురావాలని, తద్వారా మంచి ఫలితాలు, సమర్ధ సేవలు ప్రజలకు అందాలన్న సంకల్పం పోలీస్ శాఖ లక్ష్యంగా పనిచేయాలని అన్నారు అదే విధంగా మహిళల భద్రతకు మరింత భరోసా కల్పిస్తూ వారి రక్షణ ప్రధాన ధ్యేయంగా  నాణ్యమైన, సత్వర సేవలు అందించాన్నారు. పోక్సో కేసుల్లో విచారణ వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం అవసరమైన అన్ని రకాల రోడ్డు భద్రత ప్రమాణాలు పాటించడం, అన్ని ప్రాంతాలలో ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు సంబంధిత శాఖలు, ప్రజలను సమన్వయం చేస్తూ వాటిని అధిగమించేలా ముందుకు సాగాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఫంక్షనల్ వర్టికల్ అమలుపై క్షేత్రస్థాయిలో దృష్టి సారించి ఉత్తమ ఫలితాలు రాబట్టాలని అధికారులకు డిజిపి మహేందర్ రెడ్డి ఆదేశించారు.

వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు ఎస్పీ శ్రీమతి నర్మద, డిఎస్పీలు వెంకటేశ్వర్ రెడ్డి, ఆనంద్ రెడ్డి, రమణా రెడ్డి, సిఐలు మధు, రౌతు గోపి తదితరులున్నారు.

అన్నాచెల్లెళ్ల అనురాగానికి సంకేతమే రాఖీ!!

 

అన్నాచెల్లెళ్ల అనురాగానికి సంకేతమే రాఖీ!!




శ్రావణ పూర్ణిమనాడు కట్టిన రక్షాసూత్రం అశుభాలను, అనారోగ్యాలను నశింపచేసి సంవత్సరమంతా రక్షణ కల్పిస్తుంది. తోబుట్టువులు ఒకరికొకరు రక్షగా ఉండాలనే సంకల్పంతో ఆచరిస్తోన్న సనాతన సంప్రదాయమిది. ఈ రక్షరేకు కట్టడం లక్ష్మీ దేవితోనే మొదలైంది. వామనావతారంలో విష్ణువు- బలిని అణచివేసి, ఆ బలి భక్తికి మురిసి, ఆతని కోరిక మేరకు కావలివానిగా ఉండిపోయాడు. ఎంతకీ వైకుంఠపురికి చేరని భర్త కోసం లక్ష్మీదేవి బలిచక్రవర్తి ఉండే సుతలలోకానికెళ్లింది. రక్షాబంధనం కట్టి, సోదరిగా మన్నించి పతినిమ్మని కోరగా విష్ణువును విడుదల చేశాడు బలి. నాటి నుంచి అక్కచెల్లెళ్లు సోదరులకు రక్షాబంధనం కడుతున్నారన్నది పురాణోదంతం.



సూర్యదేవుని పుత్రిక యమున, తన సోదరుడైన యమునికి రక్ష కట్టి, ఆడపడుచులకు యముని రక్ష ఉండాలని కోరి, ఆ వరం పొందింది. ద్రౌపదీదేవి శ్రీకృష్ణునికి రక్ష కట్టి, అనుక్షణం రక్షణ పొందింది. శాంత- శ్రీరామునికి, కామాక్షీదేవి- పెరుమాళ్‌ వరదరాజస్వామికి, మానసాదేవి- వినాయకునికి.. ఇలా దేవతామూర్తులెందరో సోదరునికి రక్ష కట్టినవారే. పూర్వం రక్షరేకు సోదరులకే కాదు భర్తలకూ కట్టేవారు. యుద్ధభూమికి వెళ్తున్న భర్తలకు రక్షాబంధనం కట్టి, వీరతిలకం దిద్దేవారు. శచీదేవి ఇంద్రునికి రక్ష కట్టి, విజయసాధనకు తోడ్పడింది. తర్వాత్తర్వాత అన్నలకు రక్ష కట్టడం ఆనవాయితీ అయింది. చరిత్రలో కూడా ఈ సంప్రదాయం కొనసాగింది. ముస్లిం సోదరుడు హుమాయూన్‌కి రక్ష కట్టి కర్ణావతి- తన చిన్న సామ్రాజ్యాన్ని రక్షించుకుంది. 1905 బెంగాల్‌ విభజన పోరాటంలో ముస్లిం స్త్రీలు హిందూ సోదరులకు రక్ష కట్టి, పోరాటాన్ని ఉపశమింపచేశారు. కుల, మత, వర్గ, జాతి, దేశ భేదాలు లేకుండా మహోన్నత ఐకమత్యానికి సంకేతం ఈ ఆచారం.



నేటి రాఖీ ఒకప్పుడు కేవలం పసుపు పూసిన దారం. దానికి పూజ చేసి, దేవదేవుని అనుగ్రహాన్ని అందులో నిలిపి, పసుపు కుంకుమలద్ది సిద్ధం చేస్తారు. సోదరుడంటే అమ్మానాన్నల వంటివాడేనని భావిస్తారు. నుదుట కుంకుమ పెట్టి, హారతిచ్చి, తీపి తినిపించి కుడిచేతికి కడతారు. ఆత్మీయతానుబంధాన్ని ఆస్వాదిస్తారు. అన్నల నుండి కానుకలందుకుని ఆనందిస్తారు. సూర్యుడు నడినెత్తిన ప్రచండంగా ప్రకాశిస్తున్న సమయంలో అంటే సుమారుగా పట్టపగలు 12-3 గంటల మధ్య ప్రాంతంలో రాఖీ కట్టాలని గర్గ మహర్షి నిర్ణయించాడు.

రక్షాబంధనం మొదట ఉత్తరభారత ఆచారం. ఇపుడు యావద్భారత సంప్రదాయం. మహారాష్ట్రలో నారికేళ పూర్ణిమ అనీ, నార్లీ పూర్ణిమ అనీ అంటారు. సోదరులకు కొబ్బరినీళ్లు తాగించి, అప్పడు రాఖీ కడతారు. నేపాల్‌, పాకిస్థాన్‌ దేశాల్లోనూ ఆర్భాటంగా చేసుకుంటున్నారు.



మన పండుగలన్నీ దాదాపు దైవకార్యాలతో కూడి ఉన్నవే. ఈ పండుగ మాత్రం కేవలం మనుషులకు సంబంధించింది. భక్తి ప్రపత్తులకు అతీతంగా అనురాగ మమకారాలతో చేసుకునేది. సొంతవారికే కాక బంధువులు, ఇరుగుపొరుగువారు, అన్నదమ్ముల స్నేహితులు- ఇలా అందరినీ సోదరులుగా భావించి, రాఖీ కడుతున్నారు. ఇది సర్వ సమైక్యతను సాధించింది. భారతీయులంతా సహోదరులంటూ చేసే ప్రతిజ్ఞను నిజం చేసింది ఈ పండుగ.

కొంప ముంచిన బుల్లెట్టు బండి సాంగ్......

 కొంప ముంచిన బుల్లెట్ బండి సాంగ్.....

రాజన్న సిరిసిల్ల జిల్లా

కొంప ముంచిన బుల్లెట్ బండి సాంగ్ నిన్న పెళ్లి భారత్ లో చేసిన అమ్మాయి వీడియో వైరల్ అయ్యిందని ఒక నర్స్ హాస్పిటల్ లో డాన్స్ చేసి వైరల్ అవడం అనుకుందో ఏమో చివరకు ఇలా ఇంది పాపం....

రాజన్న సిరిసిల్ల జిల్లా లోని తంగళ్ళపల్లి  ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుల్లెట్ బండి పాట పై ఆస్పత్రి ప్రాంగణంలో నర్సు నృత్యం చేసి ఆ వీడియో ని స్టేటస్లు పెట్టగా ఆ వీడియో కాస్త వైరల్ అయ్యింది ఇంకేముంది నర్స్ కి ప్రశంశలు వచ్చాయి బాగానే ఉంది వాటితో



పాటు జిల్లా వైద్యాధికారి నుండి మెమో కూడా రావడం జరిగింది.

కలెక్టర్  కృష్ణ భాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ,తక్షణ విచారణకు ఆదేశాలు జారీ చేశారు.

నర్సు కు మెమో జారీ చేసిన జిల్లా వైద్యాధికారి సుమన్ రావు.

విచారణ అనంతరం చర్యలు.


ఇది ఇలా ఉండగా నర్సు డాన్స్ కు నెటిజన్లు ప్రశంసలు ఇవ్వగా మరికొందరు ఆస్పత్రిలో ఈ డాన్సులు ఏంటని విమర్శల నేపథ్యంలో కలెక్టర్ కృష్ణ భాస్కర్ విచారణకు ఆదేశించారు.


కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని చేపట్టింది.

 2022 జనవరి ఒకటి అర్హతా తేదీగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. 


కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని చేపట్టింది. 2022 జనవరి ఒకటి అర్హతా తేదీగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి సవరణ ముందస్తు కార్యక్రమాలను చేపట్టింది. ఇందులో భాగంగా పునరావృతమైన పేర్లను తొలగిస్తారు. తప్పులను సరిచేస్తారు. నవంబర్ ఒకటో తేదీన ఓటర్ల జాబితా ముసాయిదాను ప్రచురిస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,03,56,854 మంది ఓటర్లున్నారు. అర్హులైన ఓటర్లతో కూడిన జాబితాను 2022 జనవరి ఐదో తేదీన ప్రకటిస్తారు.


ఎవరెవరు దరఖాస్తు చేసుకోవచ్చు...




2022 జనవరి ఒకటో తేదీ వరకు 18 ఏళ్ల వయస్సు నిండిన వారందరూ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం ఆన్​లైన్​లో www.nvsp.in లేదా www.votersportal.eci.gov.in లలో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లేదా ఓటర్స్ పోర్టల్ యాప్ డౌన్​లోడ్ చేసుకుని దాని ద్వారా కూడా మీ ఓటరు కార్డు కోసం ఓటు ఎన్​రోల్ చేసుకోవచ్చు. అర్హత ఉండి ఓటుహక్కు లేని వారు, ఓటు హక్కును మరో చోటుకు మార్చుకోవాలనుకున్న వారు, వివరాల్లో మార్పులు చేసుకోవాలనుకున్న వారందరూ ఆన్​లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.



విస్తృత కార్యక్రమాలు..




అర్హులందరూ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునే దిశగా చైతన్యపరిచేలా విస్తృత కార్యక్రమాలు చేపట్టనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ తెలిపారు. గణనీయంగా ఉన్న యవతకు ఓటు హక్కు కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. కరోనా పరిస్థితులు లేకపోయుంటే సిబ్బంది కళాశాలలు, సంస్థలకు వెళ్లే వారని... ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని సీఈఓ కోరారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటుహక్కుకు దరఖాస్తు చేసుకునేలా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.


జాబితాలో పేరు తొలగించేలా చూస్కోండి..




ఎవరైనా మరణించి ఉంటే కుటుంబ సభ్యులు వారి వివరాలను స్వచ్ఛందంగా ఇచ్చి జాబితాలో పేరు తొలగించేలా చూడాలని శశాంక్ గోయల్ కోరారు. కొత్తగా ఓటుహక్కుతో పాటు మార్పులు, చేర్పుల కోసం కోసం దరఖాస్తు చేసుకునేందుకు నవంబర్ నెలాఖరు వరకు గడువునిచ్చారు.

అస్సలు ట్రెండ్ అవ్వాల్సింది వీళ్లు కదా.

 సెల్యూట్ జవాన్స్.. 

తాలిబాన్ల చెర నుండి 62 మంది భారతీయులను కాపాడి క్షేమంగా భారత్ కు చేర్చడంలో కీలక పాత్ర పోషించిన తెలుగు జవాన్లు.




👉ఆప్ఘనిస్తాన్ లో నరరూప రాక్షస తాలిబాన్ల చెర నుండి 62 మంది భారతీయులను కాపాడి క్షేమంగా భారత్ కు చేర్చడంలో కీలక పాత్ర పోషించిన తెలుగు జవాన్లు. 

ట్రెండ్ అవ్వాల్సింది వీళ్లు కదా. 

👉సోషల్ మీడియాలో , మేన్ మీడియాలో దుమ్ములేపాల్సింది వీళ్ల సాహసం గొప్పగా చెప్పి కదా. యువతలో నూతన ఉత్తేజాన్ని నింపాల్సింది వీళ్ల ధైర్యాన్ని తెలిపి కదా. 

👉అస్సలుసిస్సలు సెల్యూట్ చేయాల్సింది వీళ్లకు కదా. 

👉తాలిబాన్ల వికృత చర్యలు చూస్తునే ఉన్నాం.. నర రూప రాక్షస చర్యలు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. 

👉ఏదేమైనా ఆప్ఘనిస్తాన్ భారతీయులను కాబుల్, కాందహార్ లో క్షేమంగా తాలిబాన్ల చెర నుండి కాపాడటంలో కీలక పాత్ర పోషించిన సైనికుల్లో  సురేష్ @ఐటిబిపి కమాండో మంచిర్యాల , లక్షేట్టిపేట. ఆప్ఘనిస్తాన్ ఇండియన్ ఎంబసిలో సేవలందించిన తెలుగు జవాన్ల సాహసం మరువలేనిది. సెల్యూట్ రాజశేఖర్ ఐటిబిపి సీనియర్ కమాండో ( శ్రీకాకుళం ) , కేపీ రెడ్డి , ఐటిబిపి కమాండో ( కడప ).



వాట్సాప్‌ వెరిఫికేషన్‌ పేరుతో ఫోన్‌..

 వాట్సాప్‌ వెరిఫికేషన్‌ పేరుతో ఫోన్‌..


ఇక్కడ డీ యాక్టివేట్‌.. అక్కడ యాక్టివేట్


ఒక్కరిది హ్యాక్‌ ఐతే.. కాంటాక్టులన్నీ హ్యాకర్ల చేతికి


లింకులు కొందరికి.. డబ్బులు అవసరమని ఇంకొందరికి మెస్సేజ్‌లు


నయా పంథాలో హ్యాకింగ్‌కు పాల్పడుతున్న సైబర్‌ నేరగాళ్లు


వీఐపీల నంబర్లు దొరికితే పండుగే
టోలిచౌకి వారినుంచి రూ.3లక్షలు స్వాహా


నైజీరియన్‌ నేరగాళ్ల పనే అంటున్న సైబర్‌ పోలీసులు
రెండంచెల ధ్రువీకరణతో భద్రత


హ్యాకింగ్‌ జరుగుతుందిలా..




సాధారణంగా ఎవరైనా వాట్సాప్‌ను తమ సెల్‌ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోగానే, ఏ ఫోన్‌ నంబర్‌కు వాట్సాప్‌ కనెక్ట్‌ చేయాలని అడుగుతుంది. వెంటనే ఫోన్‌ నంబర్‌ ఇవ్వగానే, ఆ నంబర్‌కు వాట్సాప్‌ సంస్థ నుంచి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంట్రీ చేయగానే సెల్‌ఫోన్‌లో వాట్సాప్‌ యాక్టివేట్‌ అవుతుంది. ఆ సెల్‌ఫోన్‌కు ఉండే బ్యాకప్‌ కూడా వచ్చేస్తుంది.


సైబర్‌నేరగాళ్లు కూడా తమ సెల్‌ఫోన్‌లో వాట్సాప్‌ డౌన్‌లోడ్‌ చేసి, అందులో ఒక ఫోన్‌ నంబర్‌ ఇస్తున్నారు. అందులో ఇచ్చిన ఫోన్‌ నంబర్‌కు ఫోన్‌ చేసి తాము వాట్సాప్‌ వెరిఫికేషన్‌ చేస్తున్నామంటూ మాట్లాడుతున్నారు. వాళ్ల మాటలు విని ఎవరైనా తమ సెల్‌ఫోన్‌కు వచ్చిన ఓటీపీ చెప్పారంటే, వెంటనే ఓటీపీ చెప్పిన వారి ఫోన్‌లో ఉండే వాట్సాప్‌ డీ యాక్టివేట్‌ అయిపోయి, ఓటీపీ తీసుకున్న సైబర్‌నేరగాళ్ల ఫోన్‌లో వాట్సాప్‌ యాక్టివేట్‌ అవుతుంది.


సైబర్‌నేరగాళ్ల ఫోన్‌లో వాట్సాప్‌ యాక్టివేట్‌ కాగానే, ఓటీపీ చెప్పిన వ్యక్తికి సంబంధించిన ఫోన్‌లో ఉండే వాట్సాప్‌ నంబర్లు అన్ని సైబర్‌నేరగాళ్ల ఫోన్‌లో కన్పిస్తాయి. ఆ ఫోన్‌ నంబర్లో ఎంత మంది వీఐపీలున్నారని పరిశీలిస్తారు.


అందులో ఉండే ఫోన్‌ నంబర్లతో సైబర్‌నేరగాళ్లు మైండ్‌గేమ్‌ అడటం ప్రారంభిస్తారు.




అందులో ఉండే వాట్సాప్‌ నంబర్లలో కొందరికి ఒక లింక్‌ పంపిస్తారు. మరికొందరికి డబ్బులు అత్యవసరమంటూ మేసేజ్‌లు పెడుతుంటారు.


లింక్‌లు రీసివ్‌ చేసుకున్న వ్యక్తులు, ఆ లింక్‌ను క్లిక్‌ చేయగానే సైబర్‌నేరగాళ్ల ఫోన్‌లో క్లిక్‌ చేసిన నంబర్‌ వాట్సాప్‌ యాక్టివేట్‌ అవుతుంది.


ఇలా యాక్టివేట్‌ కాగానే మరోసారి అందులో ఉండే నంబర్లకు డబ్బులు అవసరమున్నాయని, మరికొందరికి లింక్‌లు పంపిస్తూ డబ్బులు లాగుతుంటారు.




మొదట ఓటీపీ చెప్పిన వ్యక్తికి సంబంధించిన ఫోన్‌ నంబర్‌కు వాట్సాప్‌ ధ్రువీకరణ అంశాలను కూడా సైబర్‌నేరగాళ్లు మార్చేస్తున్నారు. హ్యాకర్‌ ఆ నంబర్‌ను వాడకుండా, మరో నంబర్‌ను తన వాట్సాప్‌కు యాక్టివేట్‌ చేసుకున్నా ధ్రువీకరణ అంశాలు మారడంతో అసలు ఫోన్‌ నంబర్‌ యజమాని దానిని వాట్సాప్‌కు ఉపయోగించుకోలేడు.


మనకు తెలిసిన వారు ఎవరో ఒకరు ఓటీపీ చెప్పినా, చైన్‌ సిస్టమ్‌ మాదిరిగా ఆ నంబర్‌తో సంబంధమున్న వారి వివరాలు సైబర్‌నేరగాళ్ల చేతికి వెళ్తుంటాయి.


మూడు ఘటనలు.. నాలుగు లక్షలు




వాట్సాప్‌ను హ్యాక్‌ చేసిన సైబర్‌నేరగాళ్లు తమ తల్లికి ఆరోగ్యం బాగలేదంటూ మేసేజ్‌లు పంపించారు. సహాయం చేసే వాళ్లు పలాన ఖాతాకు డబ్బులు డిపాజిట్‌ చేయాలని కోరారు. ఆ మేసేజ్‌లు చూసిన టోలిచౌకికి చెందిన ఇద్దరు వ్యక్తులు తన స్నేహితుడు ఆపదలో ఉన్నాడని రూ.3 లక్షలు వేర్వేరుగా బ్యాంకు ఖాతాలో డిపాజిట్‌ చేశారు. మరుసటి రోజు ఫోన్‌ చేసి మీ అమ్మకు ఎలా ఉందని అడిగారు. ఫోన్‌ రీసివ్‌ చేసుకున్న వ్యక్తి అశ్చర్యపోయాడు. అదంతా మోసమని చెప్పడంతో బాధితులిద్దరూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరో ఘటనలో లక్ష రూపాయలు సైబర్‌నేరగాళ్లు కాజేశారు. ఇదిలా ఉండగా వీఎస్‌టీ కంపెనీ ఎండీ పేరుతో తనకు అత్యవసరంగా డబ్బులు కావాలంటూ అందులో పనిచేసే ఉద్యోగులకు సమాచారం వెళ్లింది. అప్రమత్తమైన సిబ్బంది విషయాన్ని తమ ఎండీ దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


రెండంచెల ధ్రువీకరణతో భద్రత

వాట్సాప్‌లో రెండంచెల ధ్రువీకరణ పెట్టుకోవడం సురక్షితం. సైబర్‌నేరగాళ్లు ముందుగా ఎవరో ఒకరు అమాయకుల నంబర్‌ను యాక్టివేట్‌ చేసుకొని, వాళ్ల ఓటీపీతో వాట్సాప్‌ను యాక్టివేట్‌ చేస్తారు. ఇలా అందులోని ఫోన్‌ నంబర్లతో, మరిన్ని కాంటాక్టులకు లింక్‌లు పంపి వాట్సాప్‌లను యాక్టివేట్‌ చేస్తుంటారు. వీఐపీల పేరు, వారి డీపీలతో డబ్బులు కావాలని ఇతరాత్ర పనుల కోసం మేసేజ్‌ పంపిస్తుంటారు. కొందరు నిజమని నమ్మి డబ్బు వేస్తుంటారు. అయితే హ్యాక్‌ అయిన వాట్సాప్‌లలో విలువైన సమాచారం ఉంటే దాని వల్ల కూడా బాధితులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. వాట్సాప్‌ సెట్టింగ్‌లో, అకౌంట్‌ అని ఉంటుంది. అందులో డబుల్‌ వెరిఫికేషన్‌ అని ఉంటుంది. దాన్ని ఎనేబుల్డ్‌ చేసుకుంటే, వాట్సాప్‌ను నేరగాళ్ల్లకు హ్యాకింగ్‌ చేయడం సాధ్యం కాదు. – కేవీఎం ప్రసాద్‌, ఏసీపీ, హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్స్‌

37 లక్షల రూపాయలు మోసం చేసిన సైబర్ చీటర్స్..

37 లక్షల రూపాయలు మోసం చేసిన సైబర్ చీటర్స్..
ఆన్లైన్ ట్రేడింగ్ లో అధిక లాభాలు ఇస్తామని ఇద్దరు వ్యక్తుల నుండి 3.7 లక్షల మోసం.


హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు.

గిఫ్ట్ పేరుతో ఓ మహిళ నుండి 16 లక్షల మోసం.


నైజీరియన్ అరెస్ట్

హైదరాబాద్ బోయిన్ పల్లి కి ఓ మహిళకు విలువైన బహుమతి వచ్చిందని కాల్.అందుకుగాను వివిధ చార్జీల పేరుతో 16 లక్షలు మోసపోయిన మహిళ.గతంలో సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు.ఈ కేసులో ఢిల్లీలో మైకేల్ అనే నైజీరియన్ ను అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు.

లాటరీలో విలువైన కారు గెలుపొందారని  17.35 లక్షల మోసం.హైదరాబాద్ గోల్కొండ కు చెందిన అబ్దుల్ ముజీబ్ ఖాన్ కు విలువైన కార్ గెలిచారంటూ కాల్ చేసిన సైబర్ చీటర్స్.

కార్ కావాలా, క్యాష్ కావాలా అడిగిన చీటర్స్..నగదు కావాలని అడిగిన బాధితుడు ఆ డబ్బు ట్రాన్స్ఫర్ చేయాలంటే వివిధ చార్జీలు కట్టాలని. ఆన్లైన్ ద్వారా 17.35 లక్షలు కాజేసిన చీటర్స్.

హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు.కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

మనిషి ఇరుక్కున్నాడు... గ్లోబలైజేషన్ లో...🤔

 మనిషి ఇరుక్కున్నాడు...

గ్లోబలైజేషన్ లో...🤔




👉డ్రమ్ముల మోతను సంగీతమంటున్నారు.!




👉పీలికబట్టల్ని 

వస్త్ర ధారణ అంటున్నారు.!


👉భౌతిక అకర్షణను ప్రేమని పిలుస్తున్నారు.!




👉సహజీవనాన్ని సంసారమంటున్నారు.!


👉గ్రాఫిక్ గిమ్మిక్కులను సినిమా అంటున్నారు.!




👉డూప్ ల పోరాటాన్ని

హీరోయిజం అంటున్నారు.!


👉పదవుల పోరాటాన్ని

ప్రజాస్వామ్యమంటున్నారు


👉అధికార ఆరాటాన్ని రాజకీయమంటున్నారు.!


👉ఆస్తుల పంపకాన్ని కుటుంబం అంటున్నారు.!


👉సరదాలను సంస్కృతి అంటున్నారు.!


👉భుక్తి మార్గాన్ని చదువు అంటున్నారు.!


👉కోరిన కోర్కెలు తీరిస్తేనే... దేవుడంటున్నారు.!


👉ఆస్తి ఉంటేనే... గొప్పవాడు అంటున్నారు.!


👉మందు పోయిస్తేనే...

మిత్రుడు అంటున్నారు.!


👉కట్నం తెస్తేనే...

భార్య అంటున్నారు.!


👉సొమ్ములు తెస్తేనే...

సంసారం అంటున్నారు.!




👉కాసులు తెస్తేనే...

కాపురం అంటున్నారు.!


👉 నిజాయితీగా ఉంటే... అసమర్ధుడంటున్నారు.!


👉 సక్రమంగా ఉంటే... అమాయకుడంటున్నారు.!


👉అసత్యాలు మాట్లాడితే... 

బ్రతక నేర్చిన వాడంటున్నారు.!


👉నిజం పలికితే...

బ్రతక నేర్వని వాడంటున్నారు.!


👉న్యాయబద్ధంగా ఉంటే... 

ఎలా బ్రతుకుతాడో అంటున్నారు.!


👉అన్యాయంగా బ్రతికినా...

ఎంచక్కా ఉన్నాడంటున్నారు.!


👉అన్యాయాన్ని ఎదిరిస్తే...

అతనికెందుకు అంటున్నారు.!


👉నిజాయితీగా బ్రతికితే... కూడుపెడుతుందా అంటున్నారు.!


👉మాయకమ్మిన జీవితాన్ని శాశ్వతమనుకుంటున్నారు.!


👉మరణమనే మహా సత్యాన్ని విస్మరిస్తున్నారు.!


👉 పరిస్థితులకు అనుగుణంగా. పాత అర్ధం చెరిగిపోయి,

ప్రయోజనాలకు అండగా...

పరమార్ధం ఆవిర్భవిస్తోంది.!


🤔స్వార్ధ కాంక్షాణుగుణంగా... విపరీతార్ధం ఆవిష్కృతమవుతోంది.!🤔


*ఇదే గ్లోబలైజేషన్ మహిమ అంటే*




🔥 టెక్నాలజీ పెరిగింది...

🔥 సౌకర్యం పెరిగింది...

🔥 విలాసం పెరిగింది...

🔥 విజ్ఞానం పెరిగింది...

🔥 కాలుష్యం పెరుగింది...

🔥 ఖర్చు పెరిగింది...

🔥 కల్తీ పెరిగింది...

🔥 రసాయన బంధం పెరిగింది...

🔥 అన్నీ పెరిగాయి...


కానీ! *పెరుగుట విరుగుట కొరకే అన్నట్లు*  

*మన ఆయుష్ ప్రమాణం మాత్రం 50% పైగా తగ్గింది*


*సర్వే జనా సుఖినోభవంతు*

ఏ దేశం ప్రగతి సాధించాలన్న యువత ప్రదానం. యువతే దేశానికి వెన్నెముక.

 ఒలంపిక్ లో వస్తున్న  విజయాలు చూసి ఆహా ఓహో అని సంబరపడి పోతున్నాం కానీ
ఒకసారి విశ్లేషణ చేసుకుంటే .....



👉135 కోట్ల జనాభా ఉన్న మన దేశం లో సుమారు

70 కోట్లు యువత ఉంటుంది..

కానీ ఒలంపిక్స్ లో ఇప్పుడు మనం సాధించిన మెడల్స్  పరంగా చూస్తే మన దేశం 65 వ స్థానంలో ఉంది..

మిగతా దేశాల యువత ఆట పాటల్లో యుద్ద విద్యల్లో జీవన నైపుణ్యాలు పెంచుకోవడం లో కృషి చేస్తుంటే మన దేశ యువత మాత్రం.....

సుమారు 16 గంటలు

సోషల్ మీడియా లో గడిపే యువత మన దేశం యువతే

ఆన్లైన్ క్లాసెస్ అయినాక

90% యువత స్మార్ట్ బానిసలు అయ్యారని నివేదిక లో మనోళ్లే టాప్

ఆశ్లీల వీడియో లు వీక్షించే వారిలో మన యువతే టాప్

90% విద్యార్దులు ఆన్లైన్ తరగతులు వినడంలేదని

ఆ సమయంలో ఛాటింగ్ చీటింగ్...ల్లో బిజీ..

బాల నేరస్థుల శాతం

సుమారు 40%

30 సంవత్సరాలు దాటిన కూడా తల్లి దండ్రుల ఆస్తుల మీద ఆధార పడి బతికే యువత మన దేశంలోనే ఎక్కువ .......

ఇది మన యువత ఘన కార్యాలు..



🔥ఇది నిజం..సత్యం

👍 D/o కృష్ణ మూర్తి సినిమా చూస్తే అర్థం అవుతుంది..


👉ఏ దేశం ప్రగతి సాధించాలన్న యువత ప్రదానం.

యువతే దేశానికి వెన్నెముక.

కావున యువత ఆ దిశలో విద్య,వైజ్ఞానిక, క్రీడలు మరియు మన దేశ సంస్కృతి మొదలైన అంశాలపై దృష్టి సారించాలి..

ప్రభుత్వాలు, తల్లిదండ్రులు మార్కులు గాక, విద్యాప్రమాణాలు, నైపుణ్యాలు వారిలో  అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తే రాబోయే కాలంలో మన దేశం ఉన్నత స్థాయి లో ఉండటం ఆశించవచ్చు......

✍️ జైహింద్



సైబర్ నేరగాళ్లు ఇప్పుడు కొత్త తరహాలో మోసం చేస్తున్నారు

 సైబర్ నేరగాళ్లు ఇప్పుడు కొత్త తరహాలో మోసం చేస్తున్నారు మనం 



ఆన్లైన్ షాపింగ్ లో ఎటువంటి వస్తువులు ఆర్డర్ చేయకపోయినా ఎవరో ఒక వ్యక్తి డెలివరీ బాయ్ లాగా మన అడ్రస్ కి వచ్చి మీరు ఆన్లైన్ షాపింగ్ చేశారు మీకు పార్సిల్ వచ్చింది అని చెబుతారు.దానికి మనం మేము షాపింగ్ చేయలేదు ఈ కొరియర్ మాది కాదు మాకు తెలియదు అని చెప్పినప్పుడు వెంటనే ఆ కొరియర్ బాయ్ అయితే మీ ఆర్డర్ క్యన్సెల్ చేస్తాను అని చెప్పి మీ మొబైల్ కి ఆర్డర్ క్యన్సిల్ ఓటిపి వస్తుంది చెప్పమని అడుగుతారు ఒకవేళ మనం ఓటిపి చెప్పినట్లు అయితే మన బ్యాంక్ ఖాతాలో ఉన్న నగదు లేదా ఫోన్ లో ఉన్న మీ వ్యక్తిగత సమాచారం బయటకు వెళ్తుంది.కావున మీరు ఆర్డర్ చేయకుండా ఒకవేళ మీ ఇంటికి ఇటువంటి ఆన్లైన్ పార్సిల్ వచ్చాయని ఎవరైనా మీ దగ్గరకు వస్తె వెంటనే పోలీస్ వారికి సమాచారం ఇవ్వగలరు అని కోరుతున్నాము. మీ రక్షణే మా బాధ్యత పోలీసులు.



వాసాలమర్రి గ్రామ దళిత బందు సభలో ముఖ్యమంత్రి కేసీఆర్

 పట్టుపట్టాలె.. జట్టుకట్టాలె..గెలిచి చూపాలె 












పట్టుపట్టాలె.. జట్టుకట్టాలె..గెలిచి చూపాలె 

 

వాసాలమర్రి నుంచే దళిత బంధుకు అంకురార్పణ


76 కుటుంబాలకు రూ.7 కోట్ల 60 లక్షలు మంజూరు


సభలోనే ప్రకటన చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్


దళిత వాడల్లో ప్రతి ఇల్లూ కలియ దిరిగిన సీఎం 


కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఇళ్లను చూసి

     చలించిపోయిన ముఖ్యమంత్రి కేసీఆర్ 


అందరికీ డబల్ బెడ్ రూమ్ ఇళ్ళు 

     మంజూరు చేస్తామని హామీ 


వృద్దులు , మహిళలు అందరినీ 

     ఆప్యాయంగా పలకరించిన ముఖ్యమంత్రి 


సుమారు 3 గంటలు,4 కిలోమీటర్లు 

     కాలినడకన పర్యటన 


ఎర్రవల్లిలాగే వాసాలమర్రి దశ దిశ మారుస్తాం


రూ. 10 లక్షలతో పైసకు పైసా సంపాదించాలె


రాష్ట్రంలోని దళితులు ఈ పథకంతో బాగుపడితే 

     నేనే గర్వంగా కాలర్ ఎగరేసి చెప్పుకుంటాను


వాసాలమర్రి రాష్ట్రంలోని దళితులకు దారి చూపాలె 


దళితుల పథకంపై దళితులదే పెత్తనం


గ్రామం, మండలం, రాష్ట్రస్థాయిలో కమిటీలు


వ్యాపారాలకు అండగా దళిత రక్షణ నిధి ఏర్పాటు


వాసాలమర్రి బంగారు వాసాలమర్రి కావాలె 


వాసాలమర్రి గ్రామ దళిత బందు సభలో

     ముఖ్యమంత్రి కేసీఆర్

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం దత్తత గ్రామం వాసాలమర్రిలో తెలంగాణ దళితబందు పథకానికి ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు అంకురార్పణ చేశారు. సమాజంలో అత్యంత వెనుకబడిన దళిత వర్గాల అభవృద్ధి కోసం దళితబందు పథకాన్ని అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. హుజూరాబాద్ దళితబందు పైలెట్ ప్రాజెక్ట్ ఇక లాంఛనమేనని సీఎం పేర్కొన్నారు. 


గ్రామంలోని మొత్తం 76 దళిత కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షల చొప్పున రూ. 7 కోట్ల 60 లక్షల రూపాయాలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. రేపటి నుంచే లబ్దిదారుల చేతికి సాయం అందుతుందన్నారు. దళితులంతా మార్వాడీల్లా వ్యాపారం చేసే స్థాయికి ఎదగాలన్నదే తన ఆరాటమన్నారు ముఖ్యమంత్రి. 


దళిత బంధు పథకంలో దళితులదే పెత్తనమని చెప్పిన సీఎం కేసీఆర్.. ప్రభుత్వం సాయం అందించిన పది లక్షల్లో పది పైసలు కూడా తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదన్నారు, బ్యాంకు లింకేజీ కూడా లేదన్నారు, వ్యాపారం చేసుకునేందుకు నిపుణులతో సలహాలు ఇచ్చేందుకు ప్రత్యేకంగా మానిటరింగ్ కమిటీ వేస్తామని చెప్పారు. అదే విధంగా గ్రామ స్థాయి నుంచి మండలం, జిల్లా తర్వాత రాష్ట్ర స్థాయిలో దళిత బంధు కమిటీలను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా మెక్రో చిప్ ఐడీ కార్డులు అందజేస్తామని చెప్పారు. 


పథకం పక్కదారి పట్టకుండా తానే కావలి ఉంటానని సీఎం తెలిపారు, ఎమ్మెల్యేలు అధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తారని చెప్పారు. రేపటి నుంచే వాసాలమర్రిలో దళిత బంధు అమలు అవుతుందని చెప్పారు. ఆరు నెలల్లోనే జీవితాలు మారేలా ఎవరికి వారు బిజినెస్ ప్లాన్ చేసుకోవాలని..ఇంటిల్లాది కూర్చుని ఏం వ్యాపారం చేస్తే బాగుంటుందో చర్చించుకోవాలన్నారు. పైస పైసా కూడబెట్టినప్పుడు ఫలితం ఉంటదన్న సీఎం కేసీఆర్... దళితులు బాగుపడితే తానే కాలర్ ఎగరేసి గర్వంగా చెప్పుకుంటానని చెప్పారు. అనుకోని సమస్యలు ఎదురైనా ఇబ్బంది తలెత్తకుండా రూ. 30కోట్లతో దళిత బంధు రక్షణ నిధిని ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వం సాయం అందించే పది లక్షల్లో   నుంచి పది వేలు దళిత రక్షణ నిధికి బదిలి చేస్తామన్నారు. దళిత బంధు పొందినవారికి ఎక్కడా ఎలాంటి ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో కొరత ఉండదన్నారు. 

అంతకు ముందు కాలినడకన దళితవాడల్లో కలియ తిరిగిన సీఎం ఊరంతా ఆగమాగం ఉందన్నారు. అందుకే ఎర్రవెల్లిలా వాసాలమర్రి గ్రామాన్ని కొత్తగా పక్కా ప్లాన్ తో నిర్మిస్తామని చెప్పారు. సకల సౌకర్యాలు ఉండేలా లేవుట్ తో కొత్త గ్రామం నిర్మిస్తామని చెప్పారు. ఇందుకు గ్రామస్తులు కలిసిమెలసి సహకరిస్తే సరిపోతుందన్నారు. ఆర్నెళ్లలో వాసాలమర్రిని బంగారు వాసాలమర్రిని చేస్తామన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్.  గ్రామంలోని సర్కార్ మిగులు భూములను కూడా దళితులకు పంచుతామని చెప్పారు సీఎం కేసీఆర్. దళితులంతా తగాదాలు, భూమి పంచాయితీలు వదిలిపెట్టి పట్టుపట్టి, జట్టుకట్టి దళిత బంధును విజయవంతం చేసి చూపాలని చెప్పారు. 

 

దళితులంతా కష్టజీవులని చెప్పిన సీఎం..ఇన్నాళ్లు ఎలాంటి సాయం అందకనే వెనకబడి పోయారని చెప్పారు. ఎంతో నైపుణ్యం, బిజినెస్ ఐడియాలు ఉన్నా..పెట్టుబడి లేక వెనుకబడిపోయారని...ఇప్పుడు సర్కార్ వారికి ఇన్వెస్ట్ మెంట్ చేస్తుందని చెప్పారు. ఇక దళితులంతా చేయాల్సింది వారి నైపుణ్యాన్ని ఉపయోగించుకుని బతుకులు మార్చుకోవాలని సూచించారు. భవిష్యత్ తరాలకు బంగారు బాటలు వేయాలన్నారు. 


వాసాలమర్రి రాష్ట్రంలో దళిత బంధుకు మోడల్ అని చెప్పిన సీఎం కేసీఆర్ ఈ స్కీమ్ ను విజయవంతం చేసే బాధ్యత కూడా ఇక్కడి గ్రామస్తులపై ఉందని చెప్పారు. అందివచ్చిన అవకాశాన్ని ఆలస్యం అయినా..ఆలోచించి అడుగులు వేయాలని దిశానిర్దేశం చేశారు. ఇక రాష్ట్రంలోని దళితులందరికి దళిత బంధు అందిస్తామని చెప్పిన సీఎం కేసీఆర్..దశల వారీగా అమలు చేస్తామని చెప్పారు. 20 ఏండ్లుగా తెలంగాణ కోసం కొట్లాడి ఎలా సాధించామో అదే ఉద్యమ స్పూర్తితో అనతికాలంలోనే దళితుల జీవితాల్లో మార్పు కోసం కష్టపడుతామని సీఎం కేసీఆర్ చెప్పారు. 


దళితుల పేదరికానికి గత పాలకులే కారణమని చెప్పారు సీఎం కేసీఆర్. మహనీయుడు డా. బీ.ఆర్ అంబేడ్కర్ తర్వాత అంతలా కృషి చేసిన నేతలెవరు లేరన్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అలాంటి ప్రయత్నం చేస్తుంటే..కొందరు అవాకులు చెవాక్కులు పేలుతున్నారు అని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో మొదట్లోనే ఇలాంటి అవరోదాలు వచ్చాయని చెప్పిన సీఎం కేసీఆర్... ఆరు నూరైనా దళిత బంధును సక్సెస్ చేసి చూపుతామని చెప్పారు. 


దళిత వాడల్లో ప్రతి ఇల్లూ కలియ దిరిగిన సీఎం 

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని దత్తత గ్రామం వాసాలమర్రి లోని దళిత వాడల్లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు బుధవారం సుమారు 3 గంటలపాటు పర్యటించారు.  దళిత కుటుంబాల మహిళలు ముఖ్యమంత్రి కేసిఆర్ కు బొట్టు పెట్టి స్వాగతం పలికారు. 


దళిత వాడల్లోని సుమారు 60  ఇండ్లలోకి వెళ్లి  కాలినడకన పర్యటిస్తూ  ప్రతి ఒక్కరినీ యోగక్షేమాలను కుటుంబ పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. మొదట దళిత వాడల్లో పర్యటించిన ముఖ్యమంత్రి ఇండ్లు లేని వారందరికీ డబల్ బెడ్ రూం ఇండ్లను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. దళిత బందు పథకం గురించి తెలుసా అని అడిగి తెలుసుకున్నారు. ఇంటికి పది లక్షలు వస్తే ఏం చేస్తారు..? దళిత బందు డబ్బలు వస్తే ఎం చేద్దాం అని అనుకున్నారు అని సీఎం ప్రశ్నించారు..? కొంత మంది మిల్క్ డైరీ ఫాం పెట్టుకుంటామని కొందరు ట్రాక్టర్ లు కొంటామని, మరికొందరు వ్యాపారాలు చేసుకుంటామని సీఎం కు తెలిపారు. దళిత వాడల్లో పర్యటిస్తున్న క్రమంలో ముఖ్యమంత్రి ప్రతి ఒక్కరినీ పేరు పేరునా పలకరిస్తూ ... మీకు పెన్షన్ వస్తున్నదా.. అని ఆరా తీసారు. పెన్షన్ రానివాళ్ళు ఏవరైనా వుంటే వారికి వెంటనే పెన్షన్ మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ని ఆదేశించారు. దళిత వాడల్లో మట్టి గోడల మీద కూలిపోయే స్థితిలో ఉన్న ఇండ్లను చూసి ముఖ్యమంత్రి చలించిపోయారు. కొన్ని ఇండ్లలో ఇంటిలోపలికి వెళ్ళి కుటుంబ సభ్యులతో మాట్లాడి దళిత బందు డబ్బులు వస్తే వాటిని ఉపయోగించుకునే మంచి ఆలోచనలు చేయాలని సీఎం వారికి సూచించారు. దళిత కుటుంబాలతోపాటు ఇతర కాలనీల్లో కూడా సీఎం పర్యటించారు. ప్రతి ఒక్కరికీ ఇండ్లు మంజూరు చేస్తామని దిగులు పడవద్దని సీఎం వారికి భరోసానిచ్చారు. నిరుపేద మహిళలు వృద్ధులు చెప్పిన సమస్యలను ముఖ్యమంత్రి జాగ్రత్తగా విని అప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తమ ఇండ్లు రోడ్డకు దిగువన ఉండటంతో వర్షం వచ్చినప్పుడు మొత్తం నీటితో నిండిపోతున్నాయని పలువురు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. పేదలందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం చేపట్టనున్నందున కాలనీల రోడ్లు, డ్రైనేజీలు ఒక ప్లాన్ ప్రకారం ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం కలెక్టర్ ను ఆదేశించారు. తమకు పెన్షన్ రావడం లేదని విన్నవించిన సుమారు 20 మంది బీడీ మహిళా కార్మికులకు రెండు రోజుల్లో వెంటనే పెన్షన్ మంజూరు చేయాలని ముఖ్యమంత్రి కలెక్టర్ ను ఆదేశించారు. ఒక మహిళ బీడీ కార్మికుల కష్టాల గురించి చెప్పబోతుండగా.. ‘‘నేను బీడీలు చేసేటోళ్ళ ఇంటిలో ఉండే చదువుకున్నా వాళ్ళ కష్టాలు నాకు తెలుసమ్మా’’ అని సీఎం వాఖ్యానించారు.  


ఒక దళిత కుటుంబం ఇంటి దగ్గర ఆగినప్పుడు వాళ్ళు తమ కూతురుకి ఏదైనా సహాయం చేయాలని సీఎం కు విన్నవించగా అల్లుడు డ్రైవర్ గా పని చేస్తాడు అని చెప్పడంతో దళితబందు కింద అతనికి ట్రాక్టర్ ఇప్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఒక ఇంటిలోపలికి వెళ్లిన సమయంలో పక్కనే వున్న ప్రజా కవి , ఎమ్మెల్సీ గోరేటి వెంకన్నను చూపిస్తూ ఈయన మీకు తెలుసా.. దళిత నాయకుడు ‘‘ పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల’’ అని పాట రాసింది ఈయనే అని సీఎం వారికి పరిచయం చేశారు. ప్రతి ఒక్కరిని పెన్షన్ వస్తుందా? 24 గంటల కరెంట్ వస్తుందా? సాగు నీళ్ళు వస్తున్నాయా..? రైతు బందు డబ్బులు వస్తున్నయా ? ఏమేమ్ పంటలు సాగు చేస్తున్నారు అని సీఎం ఆయా కుటుంబాల సభ్యులను అడిగి తెలుసుకున్నారు. కొందరు వృద్ధుల దగ్గర వెళ్ళీ పెన్షన్ లో   కొంత ఏమైనా పక్కకు పోదుపు చేసుకుంటున్నరా అని  అని ఆరా తీసారు. గ్రామంలో సుమారు వంద ఎకరాలకు పైగావున్న ప్రభుత్వ భూమిని నిరుపేద దళితులకు, ఇతరులకు పట్టాలు ఇప్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు. దత్తత గ్రామమైనందున అన్ని కుటుంబాల వాళ్ళకు ఆర్థిక సహాయం అందించి వాళ్ళ కుటుంబాలు నిలదొక్కుకునేలా సహాయం అందిస్తామని సీఎం వారికి హామి ఇచ్చారు. 


సీఎం మద్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు గ్రామ కాలనీల్లో సుమారు నాలుగు కిలోమీటర్ల వరకు కాలినడకన పర్యటించారు. ముఖ్యమంత్రి వెంట శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖెందర్ రెడ్డి , ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ప్రభుత్వ విప్ , ఎమ్మెల్యే గొంగిడి సునితా మహెందర్ రెడ్డి , ఎమ్మెల్సీ గోరేటీ వెంకన్న, ఎమ్మెల్యే , సాంస్కృతిక సారధి చైర్మన్ రసమయి బాలకిషన్ , కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి , రాచకొండ పోలీస్ కమీషనర్ మహేష్ భగవత్, సీఎం ఓస్డీ దేశపతి శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ ఆంజనేయులు,  ఎంపీటీసీ పి. నవీన్ కుమార్ కవులు , రచయితలు మిట్టపల్లి సురెందర్, సాయిచంద్ , అంబటి వెంకన్న అభినయ్ శ్రీనివాస్ , కోదారి శ్రీనివాస్, బూర సతీష్, మానుకోట ప్రసాద్, బాబు, శివ, బిక్షపతి,  తదితరులు ఉన్నారు. దళిత వాడల్లో పర్యటించిన అనంతరం ముఖ్యమంత్రి సర్పంచ్ ఆంజనేయులు ఇంటికి వెళ్లి భోజనం చేశారు .



SI పై అట్రాసిటీ కేస్, సబ్ జైల్ కి తరలింపు

SI పై అట్రాసిటీ కేస్, సబ్ జైల్ కి తరలింపు


◆ మహిళా ట్రైనీ ఎస్ఐపై అత్యాచారయత్నం చేసిన మరిపెడఎస్ఐ శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు రిమాండ్ కి తరలించారు. 

◆ ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డిపై మంగళవారం లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఐజీ నాగిరెడ్డి ఆదేశాల మేరకు మహబూబాబాద్ ఎస్పీ కోటిరెడ్డి..ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

◆  శ్రీనివాస్ రెడ్డిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీస్ అధికారే ఇలా చేయడంపై డిపార్ట్ మెంట్ సీరియస్ గా తీసుకుంది.

◆  ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డిపై అట్రాసిటి కేసు నమోదు చేశారు. అంతేకాదు అత్యాచార యత్నం కింద కేసు నమోదు చేసి 14 రోజుల మహబూబాబాద్ సబ్ జైలు రిమాండ్‌కు తరలించారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని, తప్పు చేస్తే ఎంతటివారైనా సరే శిక్ష తప్పదని జిల్లా ఎస్పీ ఎన్. కోటిరెడ్డి తెలిపారు.

◆ మహిళా ట్రైనీ ఎస్ఐపై అత్యాచారయత్నం ఘటన తెలంగాణ పోలీస్ డిపార్ట్‌ మెంట్ లో తీవ్ర కలకలం రేగింది. 

◆ తోటి ఎస్ఐనే బలాత్కారం చేయడం సంచలనం కలిగించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకుఎస్ఐ శ్రీనివాస్ రెడ్డిపై సస్పెన్షన్ వేటేసిన ఉన్నతాధికారులు. అత్యాచారయత్నం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసు విచారణ అధికారిగా తొర్రూరు డీఎస్పీకి బాధ్యతలు అప్పగించారు. 

◆ ఈ తెల్లవారుజామున శ్రీనివాస్ రెడ్డిని అరెస్ట్ చేసి న్యాయమూర్తి ముందు హాజరుపర్చారు. అనంతరం, జైలుకు తరలించారు.

ఉదయం మహబూబాబాద్ జిల్లా ఎస్పీ తో అవార్డు..!సాయంత్రం అదే ఎస్పీ సస్పెన్షన్ ఆదేశాలు…!!

ఈరోజు ఉదయం మహబూబాబాద్ జిల్లా ఎస్పీ తో అవార్డు..!

సాయంత్రం అదే ఎస్పీ సస్పెన్షన్ ఆదేశాలు…!! 




మహబూబాబాద్ జిల్లా;

మహబూబాబాద్ జిల్లా లో ఘోరం జరిగింది.మహిళా ట్రైనీ ఎస్సై పై ఎస్సై శ్రీనివాస్ రెడ్డి లైగిక వేదింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన దృశ్య బాధితురాలు వరంగల్ సిపి కార్యాలయాన్ని ఆశ్రయించింది.న్యాయం చెయ్యకపోతే ఉద్యోగానికి రాజీనామా చేస్తానని ఆవేదన వ్యక్తం చేశారు. 

● మరిపెడ ఎస్‌ఐపై సస్పెన్షన్‌ వేటు.. లైంగిక వేధింపుల ఆరోపణలపై అధికారుల సీరియస్........!

◆ జిల్లాలోని మరిపెడ SI శ్రీనివాస్‌రెడ్డిపై సస్పెన్షన్‌ వేటు పడింది. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న SI శ్రీనివాస్‌రెడ్డిపై వరంగల్‌ ఐజీ నాగిరెడ్డి చర్యలు తీసుకున్నారు.

◆ ఎస్సై శ్రీనివాస్ రెడ్డి.. తనపై అత్యాచారయత్నం చేశాడని మహిళా ట్రైనీ ఎస్సై వరంగల్ పోలీస్ కమిషనర్ లో ఆందోళనకు దిగింది. కుటుంబ సభ్యులతో కలిసి సీపీ కార్యాలయానికి వచ్చిన బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ బైఠాయించింది. 

◆ అనంతరం, వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషికి ఫిర్యాదు చేసింది. అటవీప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి యత్నించాడని ఆరోపిస్తోంది బాధితురాలు. దీంతో అతనిపై చర్యలు తీసుకున్నారు.

◆ రక్షణ కల్పించాల్సిన పోలీసులు …మృగాళ్లుగా మారుతున్నారు. భద్రత కల్పించాల్సిపోయి.. వాళ్లే, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. 
◆ తాజాగా ఎస్సై శ్రీనివాస్ రెడ్డి.. మొత్తం పోలీస్ వ్యవస్థకే మచ్చ తెచ్చేలా ప్రవర్తించాడు. తనతో కలిసి పనిచేస్తున్న మహిళా ఎస్సైపై అనుచితంగా ప్రవర్తించి.. వృత్తికే కలంకం తీసుకొచ్చారాయన.

◆ వ‌రంగ‌ల్ సీపీ ప‌రిధిలో పోస్టింగ్ తీసుకున్న స‌ద‌రు ట్రైనీ ఎస్సై..SHOలున్న పోలీస్ స్టేష‌న్‌లో నెల రోజులు ప్రొహిబిష‌న్ పీరియ‌డ్‌ను కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే SI ఆమెపై అఘాయిత్యానికి పాల్పడడం పోలీసు వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి తీవ్రంగా స్పందించారు.

◆ జరిగిన సంఘటనపై నిజానిజాలు నిగ్గుతేల్చేందుకు విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. మహిళా ట్రైనీ ఎస్ఐపై ఎస్సై శ్రీనివాస్ రెడ్డి లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా రుజువైతే ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తరుణ్ జోషి తెలిపారు.

సమాచార హక్కుచట్టాన్ని ఉపయోగించండి అవినీతి అధికారుల భరతం పట్టండి. మెరుగైన సమాజానికి తోడ్పాటు ఇవ్వoడి

సమాచారం అడిగితే ఇవ్వము అనడం కూడా నేరమే,



సమాచారం అడిగితే లేదు ,ఇవ్వము ,అందుబాటులో లేదు అంటున్న అధికారులు తెలుసు కోవాలిసిన అంశాలు
సమాచారం ఇవ్వకపోతే ఆ ప్రజా సమాచార అధికారి గారు >IPC సెక్షన్స్ 166,167, 217, 218, 219, 220, 420, 406, 407, మరియు 408 నేరపరిదిలోకి వస్తారు. 

అందువలన స.హ చట్టం కింద దరఖాస్తు దారులు కోరిన సమాచారాన్ని ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి. లేని పక్షములో సమాచార నిబంధనలు ఉల్లంఘించి నందుకు చట్టాన్ని దుర్వినియోగం చేసినందుకు గాను పై సెక్షన్ల ప్రకారం కేంద్ర, రాష్ట్ర కమీషనర్లు కూడా సమాచారం ఇవ్వని వారిని జైలుకు పంపవచ్చు అని చట్టంలో పేర్కొనబడింది.లేదా అర్జీదారుడే సంబంధిత పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయవచ్చు. 

పోలీసు స్టేషన్ అధికారి కేసు రిజిస్టర్ చేసేందుకు అంగీకరించకుండా ఫిర్యాదు ను తిరస్కరిస్తే కోర్టు లో ప్రయివేటు కంప్లైంట్ ద్వారా క్రిమినల్ కేసు నమోదుకు ఉత్తర్వులు పొందవచ్చు.

ఒకవేళ పూర్తి అవగాహన లేకపోతె క్రింది వివరాలు పరిశీలించవచ్చు. 















“ >సమాచార హక్కు ప్రతి దరఖా స్తుదారుడు వినియోగదారుడే” 30రోజుల్లో సమాచారం ఇవ్వకుంటే వినియోగదారుల ఫోరమ్ కు వెళ్ళవచ్చు. 

సమాచారాన్నిని కోరడానికి దరఖాస్తు ఫారం లేదు, కావలసిన సమాచారం తెల్లకాగితం పై రాసి IPO (ప్రజా సమాచార అధికారికి) అడగవచ్చు అధికారికి డైరెక్టు గా గాని రిజిస్టర్ పోస్టు ద్వారా అయినపంపి అడగవచ్చు. 

“దరఖాస్తు దారునికి వయసు స్థానికత అవసరం లేదు”. సెక్షన్ 2 (f)ప్రకారం సమాచారం నిర్వచనం.(కార్యాలయాల్లో రికార్డులు, పత్రాలు, మెమోలు, ఈ మైయిల్స్, అభిప్రాయాలు, పుస్తకాలు, ప్రకటనలు, సీడీలు, డివిడిలు, మొదలైనవి).

 సెక్షన్ 2 (h)ప్రకారం సమాచార చట్ట పరిధిలోకి వచ్చే కార్యా లయాలు. ప్రభుత్వంచే గుర్తింపుబడిన, స్వచ్చంద సంస్థలు) సెక్షన్ 2(i) ప్రకారం రికార్డు నిర్వచనం. సెక్షన్ 2(j)ప్రకారం ప్రభుత్వం చేపట్టే అన్ని కార్యక్రమాలు పరిశీలించవచ్చు. ఏ ప్రభుత్వపు కార్యాలయంలో రికార్డులనైనా దరఖాస్తు చేసుకొని తనిఖీ చేయవచ్చు అవసరం అయితే జిరాక్స్ చేసుకోవచ్చు.

సెక్షన్ 2(j)(1) ప్రకారం పనులను, పత్రాలను తనిఖీ చేసే హక్కు (ఒక గంటకు రూ5/-). గ్రామస్థాయి సమాచారం ఉచితం సెక్షన్ 3 ప్రకారం పౌరులందరికి సమాచారం ఇవ్వాలి. (దరఖాస్తు చేసుకోవడానికి మీ పరిధి కాదు అని ప్రశ్నించడానికి వీలు లేదు.సెక్షన్4(1)(a) ప్రకారం ప్రతి శాఖ వారు రికార్డు నిర్వహణ. సెక్షన్ 4(b) ప్రకారం స్వచ్చందముగా వెల్లడించ వలసిన సమాచారం ఎవరు ఆడగక ముందే ఆ సమాచారాన్ని అందుబాటులో ఉంచాలి. 

సెక్షన్ 4(1)(c), (d) ప్రకారం నిర్ణయాలు వాటికీ కారణాలు చెప్పకరలేదు, (సమాచారం ఎందుకు అని చెప్పక్కరలేదు) సెక్షన్ 4(2) ప్రకారం వీలయినంత ఎక్కువుగా స్వచ్చందంగా ఇవ్వవలసిన సమాచారం.సెక్షన్ 4(4) ప్రకారం స్థానిక భాషలో ఇవ్వాలి. సెక్షన్5(1),(2) ప్రకారం ప్రజాసమాచార అధికారులు (IPO) అప్పిలేట్ అధికారుల నియామకం.

 సెక్షన్-6(1) ప్రకారం సమాచార హక్కు దాఖలు విధానం. సెక్షన్ 6(2)ప్రకారం సమాచారం ఎందుకో చెప్పనక్కరలేదు.సెక్షన్ - 6(3) ప్రకారం కోరిన సమాచారం సంబంధిత శాఖ అధికారికి దరఖాస్తు బదిలీ (సమాచారం మరో కార్యాలయానికి పంపవలసిన బాద్యత అధికారులదే). 

సెక్షన్-7(1) ప్రకారం 30రోజుల లోపు సమాచారం ఇవ్వ వలసిందే. వ్యక్తి జీవితానికీ స్వేచ్ఛ సంభందించినది ఐతే 48 గంటల లోపే ఇవ్వాలి. సెక్షన్7(3)(a)ప్రకారం సమాచార రుసుము (కోర్టు సంబంచిన మాత్రం రూ 25/- మిగతా శాఖ వారికి రూ 10/- మాత్రమే చెల్లించాలి.

ఏ రూపంలో చెలించాలంటే (1) నగదు రూపంలో, (2) ఇండియన్ పోస్టల్ ఆర్డర్లు, (3) డిమాండ్ డ్రాఫ్టు, (4) కోర్టు ఫీ స్టాంపు వేయాలి, (5)బ్యాంకర్స్ చెక్కురూపంలో మాత్రమే దరఖాస్తు రుసుం. 

ఎకౌంట్ అధికారి పేరిట పంపించాలి. విలయినంతగా పోస్టల్ ఆర్డర్ మాత్రమే రుసుముగా చెల్లించాలి. (ప్రతి పేజీకి, ఏ-4 రూ 2/- చెప్పున, సీడికి రూ100/- చెప్పున, ప్లాపికి రూ50/- చెప్పున, డీవీడీ కి 200 చెలించాలి. కోర్టు లో ప్రతి పేజీకి రూ 5/- చెప్పున చెల్లించాలి). 

సెక్షన్ 7(1) ప్రకారం దరఖాస్తు గడువు 30 రోజులు సెక్షన్7(6) ప్రకారం గడువులోపు సమాచారం ఇవ్వకుంటే సమాచారం ఉచితముగా ఇవ్వాలి.సెక్షన్8(1)ప్రకారం సమాచారం మినహహింపులు (డాక్టర్ పేషెంట్ కు ఇంజెక్షన్ ద్వారా ఇచ్చిన మందులు, మనిషికి ఉన్న వ్యాధులు, దేశ రక్షణ కు సంబంచించిన ఒప్పందాలు) సెక్షన్ 8(2)ప్రకారం అడిగిన సమాచారంలో ప్రజా ప్రయోజనం ఉంటే మినహాయింపులు వర్తించవు. సెక్షన్18(1)ప్రకారం కమీషన్లకు పిర్యాదు.

సెక్షన్19(1)ప్రకారం మొదటి అప్పీలు. సెక్షన్19(3)రెండవ అప్పీలు, 90 రోజుల లోగా రాష్ట్ర కేంద్ర సమాచార కమీషన్ అప్పీల్ చేసుకోవాలి. సరైన కారణాలు ఉంటే 90 రోజుల తరువాత అప్పీల్ చేసుకోవచ్చు. సెక్షన్19(1)ప్రకారం కమీసన్ల నిర్ణయాలు సెక్షన్-19(8)(b) ప్రకారం ధరాఖస్తుదారు తనకు కలిగిన ఆర్థిక పరమైన కష్ట నష్టలపై కమిషన్ ఆధారాలు సమర్పించాలి సక్రమంగా ఉంటే నష్టపరిహారం మంజూరు చేయాలి. సెక్షన్20(1)ప్రకారం సమాచారం ఇవ్వకపోతే (తప్పుడు సమాచారం ఇస్తే రోజుకు రూ 250 చొప్పున రూ 25,000 వరకు జరిమానా.

 సెక్షన్ 20(2)ప్రకారం క్రమక్షణ చర్యలకు సిపారసు గడువు లోగా సమాచారం ఇవ్వకపోతే వినియోగదారుల ఫోరo నికి వెళ్ళవచ్చు. పీఐవో (PIO) తప్పుడు సమాచారం ఇస్తే రాష్ట్ర కమిసనర్ లేకుంటే డైరెక్టుగా న్యాయస్థానానికి వెళ్ళవచ్చు.

  సమాచార హక్కుచట్టాన్ని ఉపయోగించండి అవినీతి అధికారుల భరతం పట్టండి. మెరుగైన సమాజానికి తోడ్పాటుఇవ్వoడి