సైబర్ నేరగాళ్ల వల... చిక్కారో ఖాతా ఖాళీ...
తక్షణ ఫిర్యాదులకు జాతీయ హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ 155260, డయల్ 100,112
NCRP portal (www.cybercrime.gov.in) లో కూడా ఫిర్యాదు చేయవచ్చు
ఈజీ మనీకి అలవాటు పడ్డ సైబర్ నేరగాళ్లు ఆన్లైన్ వేదికగా అమాయకులను దోచుకుంటున్నారు. సరికొత్త పద్ధతిలో వలవేస్తూ నమ్మినోళ్లను నిండాముంచుతున్నారు. *"హలో.. మేం బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాం. మీ ఏటీఎం కార్డు కాల పరిమితి ముగిసింది. ఆధార్ అనుసంధానం చేయాలి.. మీ ఖాతా సంఖ్య చెప్పండి"* అని ఒకరు. *"నేను ఆర్మీ అధికారిని* డబ్బులు అత్యవసరం ఉండడంతో తన కార్, బైక్ తక్కువ ధరకే అమ్ముతున్నా.. ఆధార్ నంబర్, అడ్రస్ చెబితే చాలు నేరుగా మీ ఇంటికే పంపుతా! అంటూ మరొకరు పోస్టులు పెట్టి... ఫోన్లు చేసి డబ్బులు కొల్లగొడుతున్న సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతున్నది. కొంతకాలంగా ఇలాంటి వారి వలలో పడి మోసపోతున్న వారి సంఖ్య పెరుగుతుంది. ఫిర్యాదుల కోసం కేంద్ర హోం శాఖ టోల్ ఫ్రీ నంబర్ 155260 తోపాటు దానికి అనుసంధానంగా రాష్ట్ర పోలీసు విభాగం డయల్ 100,112 నంబర్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ టోల్ ఫ్రీ నెంబర్ లకు తక్షణం ఫిర్యాదు చేస్తేనే న్యాయం జరుగుతుందని, అనుమానాస్పద లింకులు మెసేజ్లను కూడా ఓపెన్ చేయొద్దని, అప్రమత్తంగా ఉండాలని ప్రజల అప్రమత్తతే సైబర్ నేరగాళ్ల నుండి రక్షణ అని రామగుండము పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్.చంద్రశేఖర్ రెడ్డి ఐపిఎస్.,(డిఐజి) గారు అన్నారు
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ వారం రోజుల వ్యవధి లో రిపోర్ట్ అయిన కొన్ని కేసుల వివరాలు...
1. ఒక సైబర్ నేరగాడు తేదీ.20/9/20 న భీమిని గ్రామానికి చెందిన ఒక వ్యక్తి పేరు మీద ఫేక్ Facebook అకౌంట్ క్రియేట్ చేసి, దాని ద్వారా ఫ్రెండ్స్ ని యాడ్ చేసుకొని నా భార్య హాస్పిటల్ లో చావు బ్రతుకుల మధ్య ఉంది, తక్షణం డబ్బులు కావాలి అనగా, తన అకౌంట్ లో ఉన్న స్నేహితులకు మెసెంజర్ ద్వారా మెసేజ్ పంపగా ఒక ఫ్రెండ్ 2 వేలు, మరొక ఫ్రెండ్ వెయ్యి రూపాయలు phone pay ద్వారా పంపి తన ఫ్రెండ్ కి ఫోన్ చేయగా అట్టి మెసేజ్ నేను పంపలేదు అని తెలపగా సదరు వ్యక్తులు సైబర్ నేరగాళ్ల చేతిలో మోస పోయామని గ్రహించారు.
2. 👉ఒక సైబర్ నేరగాడు తేదీ.13.6.21 న బెల్లంపల్లి పట్టణానికి చెందిన ఒక బాధితుని కి మీ బ్యాంక్ యొక్క KYC ని update చేసుకోవాలి, లేకుంటే అకౌంట్ బ్లాక్ అవుతుంది అని ఒక లింక్ ను URL రూపంలో SMS ద్వారా పంపించగా, అది నిజమని నమ్మి click చేయగా, Rs.14,900/- లు వివిధ దపా లు గా బ్యాంక్ ఖాతా నుండి కట్ అయినవి.
3. 👉మంచిర్యాల పట్టణానికి చెందిన ఒక బాధితుడు తన SBI bank యొక్క YONO application యొక్క password మర్చిపోగా, తెలుసుకోవడానికి SBI customer care number కి కాల్ చేయాలనుకొని GOOGLE లో search చేయగా, ఒక నంబర్ రాగా వారికి ఫోన్ చేస్తే Any Desk App download చేసుకోవాలి అని చెప్పగా, వారు చూచించిన విధంగా చేయగా, Rs.9 వేలు కట్ అయినవి. తాను దొంగ customer care number కి ఫోన్ చేసి మోస పోయానని గ్రహించాడు.
4. 👉 బెల్లంపల్లి పట్టణానికి చెందిన ఒక బాధితుని కంప్యూటర్ కు సైబర్ నేరగాడు ఒక లింక్ ని పంపించగా, దానిని క్లిక్ చేయగానే దానిలో ఉన్న GMail మరియు YouTube ఛానల్ యొక్క లాగ్ ఇన్ ఐడి padsword లు తెలుసుకొని మార్చి వేశాడు.
5. 👉 గోదావరిఖని పట్టణానికి చెందిన ఒక లారీ ఓనర్ కు సైబర్ నేరగాడు ఫోన్ చేసి, మా లారీ ట్రాన్స్ పోర్ట్ ఆఫీస్ లో మీ లారీ లీజుకు పెట్టుకుంటామని నమ్మించి, registration ఖర్చుల క్రింద రెండు ధపా లుగా 72 వేల రూపాయలు Online ద్వారా పంపి మోసపోయాడు.
6. 👉 మందమర్రి పట్టణానికి చెందిన ఒక బాధితుడు 2nd hand మోటార్ సైకిల్ OLX App ద్వారా కొనుక్కోవాలని వెతికి, ఒక మోటార్ సైకిల్ నచ్చి దాని ఓనర్ కు ఫోన్ చేసి విచారించగా అతను ఆర్మీ ఉద్యోగం చేస్తాను అని తెలపగా అది నమ్మి బాదితుడు మొదట Rs.2,100/- డబ్బులు పంపిస్తే బైక్ ని ట్రాన్స్పోర్ట్ లో వేస్తానని నమ్మించి ఆ తర్వాత GST కింద 8,200 రూ.లు ఆ తరువాత ఆఫ్ పేమెంట్ కింద 16,000 రూ. లు పంపించినా కూడా, ఇంకా కావాలని ఒత్తిడి చేయగా, మొత్తం డబ్బులు మోసపోయానని గ్రహించాడు.
7. 👉 గోదావరిఖని పట్టణానికి చెందిన ఒక నిరుద్యోగి quickerjob.com లో ఉద్యోగం కోసం రిజిస్టర్ చేసుకున్నాడు. సదరు వ్యక్తి బయోడేట ఆదరంగా ఒక సైబర్ నేరగాడు బాధితునికి ఫోన్ చేసి పార్ట్ టైం జాబ్ ఆఫర్ ఉందని జాయిన్ కావాలంటే ఫోన్ పే ద్వారా 2000రూ.లు పంపించి రిజిస్టర్ చేసుకోవాలని కోరగా, డబ్బులు పంపించి మోసపోయానని గ్రహించాడు.
8. 👉 మంచిర్యాల పట్టణానికి చెందిన ఒక బాధితునికి పార్ట్ టైం జాబ్ ఉందని Text మెసేజ్ వచ్చింది. దానిని క్లిక్ చేయగా, రిజిస్టర్ చేసుకున్న తర్వాత ప్రొడక్ట్స్ ని ఆర్డర్ చేయాలి, దానికి కమీషన్ వస్తుంది అనగా వివిధ దఫాలుగా 42 వేల రూపాయలు పంపించి మోసపోయాడు.
9. 👉 గోదావరిఖని పట్టణానికి చెందిన ఒక బాధితుడు Rupeesmart అనే లోన్ యాప్ ద్వారా 5000 రూ.లు తీసుకున్నాడు. 15 రోజుల తర్వాత లోన్ చెల్లించాలని అతడికి వాట్సాప్ ద్వారా మెసేజ్ రాగా లింక్ ఓపెన్ చేసి అమౌంట్ పే చేశాడు. మరల బాధితునికి డబ్బులు కట్టాలి అని ఫోన్ రాగా ఇంతకు ముందే కట్టాను కదా, అని విచారించగా సైబర్ నేరగాళ్ల కు డబ్బులు చెల్లించి మోసపోయానని గ్రహించాడు.
అప్రమత్తతే రక్షణ
👉 డెబిట్, క్రెడిట్ కార్డ్స్, యూపీఐ పిన్, పాస్వర్డ్ లను, కార్డుల సీవీవీ నెంబర్లను ఏ బ్యాంక్ అధికారి అడుగరు. వినియోగదారులు గమనించాలి. బ్యాంకు అధికారులమంటూ వచ్చే ఫోన్ కాల్క సమాధానం ఇవ్వకపోవడమే మంచిది.
👉ఫేస్బుక్, ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్ వేదికగా పలు యాప్ ద్వారా అందమైన అమ్మాయిలు, మహిళల ఫొటోలతో ఆకౌంట్లు తెరిచి ఫ్రెండ్ రిక్వెస్టులు, ఫొటోలు పంపుతారు. వలలో చిక్కేదాకా చాలా అనుకువగా ప్రవర్తించి, చిక్కిన తర్వాత బ్లాక్మె యిల్ చేసి డబ్బులు గుంజుతారు. ఇలాంటి వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
👉అపరిచితుల నుంచి వచ్చే ఆఫర్లు, లాటరీలు, డిస్కౌంట్లను నమ్మవద్దు. ఎవరూ ఊరికే మనకూ బహుమ తులు ఇవ్వరు. డబ్బులు పంపరు.
👉 ఒక్క క్లిక్తో లోన్ ఇస్తామని నమ్మిస్తూ పలు యాప్ ద్వారా లోన్లు ఇస్తారు. లోన్ మొత్తానికి 50 రెట్లు అధికంగా వసూలు చేయడమే కాదు మొత్తం తీర్చినా ఇంకా కట్టాల్సి ఉందని వేధి స్తారు. ఇలా వేధింపులు భరించలేక ఆత్మహత్య లు చేసుకుంటున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి