టాప్ 10 న్యూస్ టుడే 29/10/2021

1) ఆన్‌లైన్‌లో పోస్ట్ పెట్టి.. మాజీ మిస్​ తెలంగాణ ఆత్మహత్యాయత్నం..


2) గంజాయి విక్రయిస్తే చర్యలు తప్పవు మంచిర్యాల ఏ సి పి అఖిల్ మహాజన్


3)యువకులకు క్రికెట్ కిట్స్ పంపిణీ చేసిన మంచిర్యాల ఏసీపీ అఖిల్ మహాజన్ ఐపీఎస్


4)ధరణిలో ఇబ్బందులు.. ఏడాదైనా రైతులకు తప్పని తిప్పలు


5)పలువురు ఎస్సైల బదిలీలు


6)పేకాట స్థావరం పై లక్షేట్టిపేట  పోలీసుల ఆకస్మిక దాడి


7)గంజాయి చెట్లను స్వాధీనం చేసుకుని వాటిని ధ్వంసం  చేసి తగుల బెట్టిన లక్షేటిపేట ఆబ్కారీ సి ఐ 


8)ప్రీతమ్ జకల్కర్ తో సమంత దుబాయ్ టూర్.


9)అర్దరాత్రి యువతి గొంతు కోసిన యువకుడు 


10)బిగ్ బ్రేకింగ్......కరోన మూడో ముప్పు మొదలైంది!!_





1) ఆన్‌లైన్‌లో పోస్ట్ పెట్టి.. మాజీ మిస్​ తెలంగాణ ఆత్మహత్యాయత్నం.. 

  


హైదరాబాద్‌ నారాయణ గూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని హాసిని 2018లో మిస్ తెలంగాణగా ఎంపికైంది. ఆమె ప్రస్తుతం హైదరాబాద్‌లోని హిమాయత్‌ నగర్‌లో నివాసం ఉంటుంది. అయితే ఇంట్లో ఎవరూ లేని సమయంలో హాసిని ఉరేసుకుని ఆత్మహత్యకు యత్నించింది.ఈ క్రమంలోనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇది చూసిన ఆమె స్నేహితులు వెంటనే పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు హిమాయత్ నగర్ రోడ్ నెంబర్ 6లో ఉన్న తన ఫ్లాట్‌లోకి వెళ్లి యువతిని రక్షించి హైదర్ గూడ అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ ఆమెకు పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. ప్రమాదం ఏం లేదని తేల్చారు. అయితే హాసిని ఇలా చేయడానికి ఆర్థిక ఇబ్బందులే కారణమని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలోనే ఆమె ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చని వారు అనుమానిస్తున్నారు. మరోవైపు తనను ఓ యువకుడు శారీరకంగా వేధించాడని హాసిని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే ఆమె ఆత్మహత్యకు యత్నించడంతో..  ఏ కారణం చేత ఆమె ఇలా చేసిందనేది తేలాల్సి ఉంది.అయితే సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఎందుకు చనిపోవాలని అనుకుంది..? అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. హాసినిది తెలంగాణలోని ఖమ్మం జిల్లా. ఆమెకు ఇద్దరు అక్కలు, ఒక అన్నయ్య.తనది పేద కుటుంబం అని,తాను బ్యూటీపార్లర్‌లో వర్క్ చేసేదానిని గతంతో ఓ ఇంటర్యూలో హాసిని చెప్పుకొచ్చింది.


2) గంజాయి విక్రయిస్తే చర్యలు తప్పవు మంచిర్యాల ఏ సి పి అఖిల్ మహాజన్



మంచిర్యాల: దండేపల్లి

గంజాయి ఎవరైనా అమ్మినా వినియోగించిన కఠిన చర్యలు తప్పవని అవసరమైతే వారిపై పీడీ యాక్ట్ సైతం నమోదు చేస్తామని మంచిర్యాల్ ఏ సి పి అఖిల్ మహాజన్ హెచ్చరించారు. గంజాయి రహిత రాష్ట్రంగా మార్చేందుకు ముఖ్యమంత్రి  కెసిఆర్ కృషి చేస్తున్నారని రాష్ట్ర పోలీస్ శాఖ డి సి పి ఆదేశాల మేరకు రామగుండం కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, మంచిర్యాల డిసిపి ఉదయ్ కుమార్ రెడ్డి పర్యవేక్షణలో సబ్ డివిజన్ పరిధిలో ప్రతిరోజు గంజాయికి బానిసలైన వ్యక్తులకు,ప్రాథమిక దశలో ఉన్న వారికి కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు గంజాయి విక్రయిస్తున్న వారిని కూడా అదుపులోకి తీసుకుని అరెస్టు చేయడం జరుగుతుందని ఏసీపీ తెలిపారు. లక్షేట్టీపెట్ సర్కిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దండేపల్లి మండలం రాజు గూడా గ్రామంలో కుంరం శ్యామ్ రావు అను వ్యక్తి  తళ్ళపేట బస్ స్టాండ్ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఏముల విజయ్ కుమార్ గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని పట్టుకొని మరియు కుమ్రం శ్యామ్ రావు వద్ద నుండి 250 గ్రాములు మరియు వారికి గంజాయి సరఫరా చేస్తున్న లోతోర్రే గ్రామం ఎన్నారం మండలానికి చెందిన కుర్సింగ జుగాది రావు,సోయం గగ్రు,పూసం సంపత్ రావు మరియు నైతం లింగు అను వారిని అదుపులోకి తీసుకోవడం గురించి వెళ్తుండగా లోతోరె గ్రామానికి 1 km దూరం లో ఆ నలుగురు వ్యక్తులు కుమ్రం శ్యామ్ రావు కి అమ్మి పెట్టడానికి తీసుకువస్తుండగా అదుపులోకి తీసుకోవడం జరిగింది. మరియు వారి వద్ద  నుండి 250 గ్రాములు స్వాధీనం చేసుకొని వారిని అరెస్ట్ చేయడం జరిగింది. మీడియా సమావేశానికి ఎసిపి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఇప్పటివరకు దండేపల్లి పీఎస్ పరిధిలో మూడు కేసులు నమోదు చేసి 16 మంది నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 2910 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. యువత గంజాయి కి అలవాటుపడి ఆ మత్తులో నేరాలకు పాల్పడుతున్నారని తల్లిదండ్రులు వారి పిల్లల పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ వారి కదలికలు గమనించాలని సూచించారు.ఈ విషయంలో చాలా కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని అందులో భాగంగా గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం ఎక్కడైనా తెలిస్తే ఆయ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిబ్బందికి సమాచారం అందించాలని వారి వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుందని ఏసీపీ తెలిపారు. ఈ మీడియా సమావేశంలో లక్షెట్టిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ కరీముల్లా ఖాన్ తో పాటు దండేపల్లి ఎస్ఐ శ్రీకాంత్,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

యూట్యూబ్ విడియో కొసం క్లిక్ చేయండి


3) యువకులకు క్రికెట్ కిట్స్ పంపిణీ చేసిన మంచిర్యాల ఏసీపీ అఖిల్ మహాజన్ ఐపీఎస్



   రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి ఐపిఎస్, డిసిపి మంచిర్యాల ఉదయ్ కుమార్ రెడ్డి  గార్ల  ఆదేశాల మేరకు కాల్వ దండేపల్లి పోలీస్ స్టేషన్ పరిధి ద్వారకా గ్రామ యువతకు క్రికెట్ కిట్ లు, మంచిరాల ఏసిపి అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారు పంపిణీ చేయడం జరిగింది.


 ఈ సందర్భంగా ఏసీపీ గారు మాట్లాడుతూ.. ఫ్రెండ్లీ పోలీసింగ్, కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా క్రీడా స్ఫూర్తి, సమయ కార్యాచరణ, సానుకూల వైఖరిని యువతలో ప్రోత్సహించడం కోసం యువత  ఎటువంటి చెడు కార్యకలాపాలకు బానిసలై జీవితాలు నాశనం చేసుకోవద్దని వారికి సూచించారు. క్రీడలు బలాన్ని మరియు మానసిక ఆనందాన్ని ఇవ్వగలవు అన్నారు.


 ఏసిపి గారి వెంట లక్షట్ పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ కరిముల్లా ఖాన్, దండేపల్లి ఎస్ఐ శ్రీకాంత్ పాల్గొన్నారు.

4) ధరణిలో ఇబ్బందులు.. ఏడాదైనా రైతులకు తప్పని తిప్పలు



TS: ధరణిలో నిషేధిత జాబితాలో చేరిన పట్టాభూములు విడిపించుకునేందుకు ఏడాదిగా రైతులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగుతున్నా కష్టాలు మాత్రం తీరట్లేదు. తమ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని దాదాపు లక్షమంది దరఖాస్తు చేసుకోగా సుమారు 20 శాతం మందికే పరిష్కారం లభించింది. 43 శాతం దరఖాస్తులు కలెక్టర్ల వద్ద పెండింగ్‌లో ఉండగా మిగిలిన 37 శాతం దరఖాస్తులను తిరస్కరించారు. ధరణి సమస్యల విభాగంలో దరఖాస్తుతోపాటు సమర్పించిన ఆధారాలను ప్రాతిపదికగా తహసీల్దార్, ఆర్డీవోలు పరిశీలన చేస్తున్నారు. అందుకు చాలా సమయం పడుతోంది. నిషేధిత జాబితాలో దేవాదాయ, అటవీ, భూదాన్‌ పేరిట భూములున్నాయి. వాటిని పరిష్కరించాలంటే ఆయాశాఖలు ఎన్​వోసీ ఇవ్వాల్సి ఉంటుంది. అందుకు ఆ శాఖల అధికారులు నిరాకరిస్తుండటంతో కలెక్టర్ల వద్ద పెండింగ్‌ దరఖాస్తుల సంఖ్య పెరుగుతోంది. గతంలో ఈ తరహా సమస్య వస్తే వీఆర్​వో, ఆర్​ఐ ద్వారా పంచనామాచేయించి తహసీల్దార్, ఆర్డీఓ విచారణ చేసేవారు. క్షేత్రస్థాయిలో వీఆర్వో వ్యవస్థ రద్దుతో ధరణి సేవలు లోపభూయిష్టంగా మారాయి. ఇప్పటికైనా ధరణి వ్యవస్థను రద్దు చేసి సమస్యలను పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు.


ఇటీవలే ధరణిలో సవరణలు చేసిన ప్రభుత్వం కలెక్టర్ల లాగిన్‌లో మార్పులు చేయడంతో సమస్యల పరిష్కారంపై అధికారులు దృష్టిసారించారు. వాటిని ఇప్పడికప్పుడు పరిష్కారం చేయడం అంత వేగంగా సాధ్యం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రెవెన్యూ శాఖలో సేవలందించిన విశ్రాంత అధికారుల సూచనలు తీసుకొని ధరణి అమలు చేసినట్లేతే ఈ సమస్యలు వచ్చేవి కావని చెబుతున్నారు. 


కొలిశెట్టి లక్ష్మయ్య, మాజీ ఛైర్మన్ రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం

సాధారణంగా దరఖాస్తు అధికారి తిరస్కరిస్తే కారణం తెలపాలి. కానీ నెలలు గడుస్తున్నా తిరస్కరించడానికి గల కారణాలు చెప్పకపోవడంపై సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. చాలా భూములు నిషేధిత జాబితాలో కనిపిస్తుడటంతో రైతులకు కష్టాలు తప్పట్లేదు. భూరికార్డుల ప్రక్షాళన చేపట్టినప్పుడే భూయజమానుల భాగస్వామ్యం తీసుకుంటే బాగుండేదని భూచట్టాల రూపకల్పన నిపుణులు సూచిస్తున్నారు. 

ప్రొఫెసర్ ఎం. సునీల్‌కుమార్, భూచట్టాల రూపకల్పన నిపుణులు

పట్టా భూమిని నిషేధితజాబితాలో చేర్చడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబ, ఇతర అవసరాల కోసం భూమి విక్రయించాలంటే నిషేధిత జాబితాలో ఉండటం వల్ల రిజిస్ట్రేషన్‌ కావడం లేదు. వాటికి తోడు పేరు, సర్వే నంబరు తప్పు ఉందని, కమతం విస్తీర్ణంలో హెచ్చుతగ్గుల పరిష్కారానికి ధరణిలో సరైన మార్గం లేకపోవడం వల్ల సమస్యలు తప్పడం లేదు. కొన్ని సమస్యలు మినహా ధరణి అద్భుతంగా ఉందని వాటని పరిష్కరిస్తే భూసమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని రెవెన్యూ శాఖ అధికారులు చెబుతున్నారు.

బి.గీత, తహసీల్దార్ జాయింట్ సబ్‌ రిజిస్ట్రార్, మేడ్చల్

భూసమగ్ర సర్వే చేస్తే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఇప్పటికే ఆ దిశగా కృషి చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఆ మేరకు మంత్రివర్గం ఉపసంఘం వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు స్వీకరిస్తోందని వివరించారు. 

నిరంజన్‌రెడ్డి,

వ్యవసాయ శాఖ మంత్రి

ఇప్పటికైనా వేగంగా దరఖాస్తులను పరిష్కరిస్తే మేలు జరుగుతుందన్న అభిప్రాయం పలువురి నుంచి వ్యక్తమవుతోంది.

5) పలువురు ఎస్సైల బదిలీలు


నిర్మల్‌ : జిల్లాలో ఎస్సైలను బదిలీ చేస్తూ గురువారం సాయంత్రం ఎస్పీ ప్రవీణ్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీచేశారు. బదిలీ అయిన ఎస్సైల ను తక్షణం రిలీవ్‌ చేయాలని ఆదేశించారు. సాయి కుమార్‌ ముధోల్‌ నుండి లోకేశ్వరం, మహేష్‌ కుభీర్‌ నుంచి బాసర బదిలీ అయ్యారు.  సాయికిరణ్‌ భైంసా రూరల్‌ నుంచి ముధోల్‌కు, కే.రాజు కడెం నుంచి పెంబి, ఎండీ షరీఫ్‌ కుంటాల నుంచి భైంసా టౌన్‌, ఎం.కృష్ణసాగర్‌రెడ్డి సారంగాపూర్‌ రెగ్యులర్‌గా, శ్రీనివాస్‌ నిర్మల్‌ రూరల్‌ నుంచి ఎస్సై 2 నిర్మల్‌ రూరల్‌, శివరామకృష్ణ తానూర్‌ నుండి భైంసా రూరల్‌ 2 ఎస్సై, ప్రసాద్‌ దిలావర్‌పూర్‌ పూర్తిస్థాయి, కందులరాణి మామడ నుండి నర్సాపూర్‌ (జి), స్రవంతి నర్సాపూర్‌ నుంచి కుంటాల, జ్యోతిమణి సోన్‌ నుంచి దస్తూరాబాద్‌, ఎల్‌. వెంకటరమణ నర్సా పూర్‌ నుంచి సీసీఎస్‌ నిర్మల్‌, శ్రీరామ్‌ ప్రదీప్‌ బాసర నుండి వీఆర్‌ నిర్మల్‌, జి. రాజన్న తానూర్‌ నుండి సీసీఎస్‌ నిర్మల్‌, బాలకృష్ణ, యాసిర్‌ అరాఫత్‌ భైంసా నుండి సీసీఎస్‌ నిర్మల్‌, సుమన్‌ నిర్మల్‌ రూరల్‌ నుండి డీఎస్బీ నిర్మల్‌, దయానంద్‌రావు కడెం నుండి కదం ఎస్సై 2గా, తసియుద్దీన్‌ భైంసా నుండి వీఆర్‌ నిర్మల్‌, కే. రోహిణి దిలావర్‌పూర్‌ వీఆర్‌ నిర్మల్‌, జివి. రమణరెడ్డి డీఎస్బీ నిర్మల్‌, గంగాధర్‌, శివాజీ నిర్మల్‌ నుండి వీఆర్‌ నిర్మల్‌కు బదిలీ అయ్యారు. కొందరు అటాచ్‌మెంట్‌ ఉన్న ఎస్సైలకు పూర్తిస్థాయి బాధ్యత అప్పగించారు.

6) పేకాట స్థావరం పై లక్షేట్టిపేట  పోలీసుల ఆకస్మిక దాడి



06 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్...


6000 వేల రూపాయల నగదు స్వాధీనం



 లక్షెట్టిపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాపూర్ గ్రామశివారులో డబ్బులు పందెంగా పెట్టుకుని పేకాట ఆడుతున్నారు నమ్మదగిన సమాచారం మేరకు ఎస్ఐ చంద్రశేఖర్ తమ సిబ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీ నిర్వహించి అక్కడే ఉన్న ఆరుగురు అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 6000 రూపాయల నగదు, పేకాట ముక్కలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదుపులోకి తీసుకున్న వీరిని లక్షెట్టిపేట్ పోలీస్ స్టేషన్ కి తరలించి కేసు నమోదు చేయడం జరిగింది.


 పట్టుబడిన వారి వివరాలు


1. నిమ్మల రమేష్ గౌడ్ s/o లాంగాగౌడ్

2.నిమ్మల శంకరయ్య s/o పాపాగౌడ్

3.కోట స్వామి s/o పోషాగౌడ్

4.గుర్రాల కృష్ణ s/o రాజయ్య

5.పార్వతి శ్రీనివాస్ s/o పోషయ్య

6.ఇండ్ల లింగయ్య s/o పోశయ్య  r/o లక్సెట్టిపేట మండలం తిమ్మాపూర్ గ్రామం


 ఈ సందర్భంగా ఎస్ఐ చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ...... తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు అనే అత్యాశకు పోయి చాలా మంది పేకాట బానిసలుగా మారుతున్నారు  అని అప్పుల పాలవుతున్న కుటుంబలను రోడ్డుపాలు చేస్తున్నారన్నారు. పేకాట ఆడుతూ పట్టుబడిన వారు వారి ప్రవర్తన మార్చుకో నట్లయితే  వారిపై పీడీ యాక్ట్  అమలు చేయడం జరుగుతుందని హెచ్చరించారు.

7)గంజాయి చెట్లను స్వాధీనం చేసుకుని వాటిని ధ్వంసం  చేసి తగుల బెట్టిన లక్షేటిపేట ఆబ్కారీ సి ఐ 



మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని బెహరన్ గూడ లో  మెస్రం భాది రావు అనేవ్యక్తి ఇంటి సమీపంలో సాగు చేసిన  

5 గంజాయి చెట్లను స్వాధీనం చేసుకుని వాటిని ధ్వంసం  చేసి తగుల బెట్టిన లక్షేటిపేట ఆబ్కారీ సి ఐ బా బా ,మంచిర్యాల డి టి ఎఫ్ సి ఐ గంగా రెడ్డి ,

8)ప్రీతమ్ జకల్కర్ తో సమంత దుబాయ్ టూర్... 




సమంత దుబాయ్ టూర్ సంచలనానికి తెరలేపింది. దానికి కారణం ఆమె ఈ ట్రిప్ ప్రీతమ్ జుకల్కర్ తో వెళ్లడమే.


సమంత పర్సనల్ స్టైలిష్, డిజైనర్ ప్రీతమ్ జుకల్కర్ పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగింది. సమంత విడాకులకు కారణం ఇతడే అంటూ మీడియా కోడై కూసింది. సమంత అతనితో సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయటకు తీసి నానా రాద్ధాంతం చేశారు. 

ఈ నేపథ్యంలో ప్రీతమ్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. సమంతను తాను అక్కగా భావిస్తానని, తమ మధ్య ఉన్న రిలేషన్ ఏమిటో నాగ చైతన్యకు కూడా తెలుసని మీడియా ద్వారా వెల్లడించారు. అయినా సమంత, అక్కినేని అభిమానులు ప్రీతమ్ ని టార్గెట్ చేయడం మానలేదు. నిప్పులేకుండా పొగరాదంటూ, నెగిటివ్ కామెంట్స్ చేశారు. నిజం ఏదైనా... ఇంత రచ్చ జరిగినప్పుడు  ఎవరైనా కొన్నాళ్ళు దూరంగా ఉంటారు. కానీ అందరిలా ఆలోచిస్తే ఆమె సమంత ఎందుకు అవుతుంది...? ఫ్యాన్స్ మైండ్ బ్లాక్ చేస్తూ, సమంత ప్రీతమ్ తో కలిసి దుబాయ్ ట్రిప్ కి వెళ్లారు. అంతే కాకుండా ప్రీతమ్ తో దిగిన ఫోటో ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో షేర్ చేసి, దుబాయ్ వెళుతున్నట్లు కామెంట్ చేశారు.వీరిద్దరితో పాటు సమంత మేకప్ ఆర్టిస్ట్ సాధనా సింగ్ ఉన్నారు. ఇక ఈ ట్రిప్ ద్వారా సమంత మీరు ఎన్ని అనుకున్నా నేను భయపడేది లేదని చెప్పే ప్రయత్నం చేశారు. అదే సమయంలో మీడియా ద్వారా ఈ న్యూస్ బయటికి వస్తే మరింత నెగిటివ్ గా ప్రొజెక్ట్ అవుతుంది. అందుకే సమంత స్వయంగా చెప్పినట్లు ఉన్నారు. ఏది ఏమైన సమంత నిర్ణయాలు సాధారణ అభిమానులను షాక్ కి గురిచేస్తున్నాయి.

9) అర్దరాత్రి యువతి గొంతు కోసిన యువకుడు 



హైదరాబాద్  గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్టినాగులపల్లిలో  అర్ధరాత్రి ప్రియురాలి బెడ్రూంలోకి చొరబడిన ప్రియుడు కత్తితో గొంతు కోశాడు.యువతి అరవడంతో తల్లిదండ్రులు, బంధువులు నిందితుడిని పట్టుకుని చితకబాదారు.జీడిమెట్లకు చెందిన బాయన ప్రేమ్ సింగ్ (21) కేపీహెచ్‌బీలోని ఎంఎన్ ఆర్ డిగ్రీ కళాశాలలో చదువుతున్నాడు. మాదాపూర్‌లోని వెంకటేశ్వర ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో చదువుతున్న గొడీల రూఖీ సింగ్ (21) బంధువు కావడంతో పరిచయం ఏర్పడింది.

వట్టినాగులపల్లికి చేరుకున్న ప్రేమ్ సింగ్ బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల సమయంలో యువతి బెడ్ రూమ్ తలుపు తన్ని లోనికి చొరబడ్డాడు. కత్తితో యువతి గొంతు కోయడానికి ప్రయత్నించగా అప్పటికే అప్రమత్తమై గట్టిగా కేకలు వేసింది. కుటుంబ సభ్యులు లేచి యువకుడిని పట్టుకుని చితకబాది బంధించారు. యువతికి గొంతు, అరచేయి, కాలు, మణికట్టు వద్ద కత్తి గాట్లు పడ్డాయి. చికిత్స నిమిత్తం యువతిని కాంటినెంటల్ హాస్పిటల్‌లో, యువకుడిని కిమ్స్ హాస్పిటల్‌లో చేర్పించారు. గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. గంజాయి మత్తులో ప్రేమ్ సింగ్ ఘతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

10)బిగ్ బ్రేకింగ్......కరోన మూడో ముప్పు మొదలైంది!!_



- 2022 జనవరి-ఏప్రిల్ మధ్య ఉధృతి పెరిగి తీవ్రస్థాయికి


- జాగ్రత్తలు లేకుంటే ఈసారి అల్లకల్లోలం


- మా లెక్కలు తప్పవు


- ఎయిమ్స్ వెల్లడి



_అక్టోబర్ నెల నుంచి క్రమంగా కేసులు పెరిగి, 2022 జనవరి - ఏప్రిల్ మధ్య కట్టడి చేయలేనంత తీవ్ర స్థాయికి కరోనా చేరే అవకాశం ఉందని అంచనా వేశారు. దీంతో కచ్చితంగా ప్రజలు సూచనలు పాటించాలని ఎయిమ్స్ ఆరోగ్య గణాంక నిపుణులు హెచ్చరించారు. టూరిస్ట్‌ల సంఖ్య పెరగడం, సభలు, సమావేశాలతో ప్రజలు గుమిగూడటం మూడో ఉద్ధృతికి దారి తీయొచ్చని తెలిపారు. ఇటీవల టూరిస్ట్ లు పెరిగిన మనాలి, డార్జిలింగ్‌ ప్రాంతాల్లో కొవిడ్‌ కేసులు పెరిగాయని పేర్కొన్నారు._


_రాష్ట్రాలు ఆంక్షలను పాటించకపోతే మూడో ఉద్ధృతి ఆటోమేటిక్‌గా పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. భారత్‌లో మూడో వేవ్‌లో కొన్ని ప్రాంతాల్లో రోజువారీ కేసులు 103శాతం వరకూ ఉండొచ్చనే అంచనా వేశారు. ఇక కొవిడ్‌ ఆంక్షల్ని పూర్తిగా ఎత్తేసినా,  పర్యాటకుల తాకిడి లేకపోతే మూడో ఉద్ధృతి తీవ్రత కొంతమేర తగ్గుతుందని తెలిపారు. ఆంక్షల ఎత్తివేతతో పాటు సెలవు రోజుల్లో పర్యాటకుల సంఖ్య పెరిగితే మాత్రం మహమ్మారి వ్యాప్తి ఎక్కువగా ఉంటుందన్నారు._


_సోషల్ డిస్టెన్స్‌ పాటించకపోతే కరోనా వంటి శ్వాసకోశ సంబంధ రోగాలు విస్తృతంగా వ్యాపించే అవకాశాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. హోటళ్లు, కేఫ్‌లలో కూర్చొని ఎక్కువసేపు మాట్లాడుకోవడం.. షేక్‌హ్యాండ్ ఇచ్చుకోవడం వంటి పనులతో కరోనా ముప్పు ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. పర్యాటకులు పెరిగి స్థానిక వ్యాపారులకు లబ్ధి చేకూరుతుంది కానీ... టూరిస్ట్‌లు, స్థానికులు, అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. కరోనా వ్యాప్తి పెరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని... అప్పుడే అందరి సంక్షేమాన్ని కాపాడుకుంటూ ముందడుగు వేయడం సాధ్యమవుతుందన్నారు._


_దేశానికి మూడో ఉద్ధృతి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ సూచించారు. కోవిడ్ అంశంపై తమ నిపుణులు పేర్కొన్న గణాంకాలు  ఇప్పటివరకు తప్పలేదని హెచ్చరించారు._


_ముఖ్యంగా ప్రస్తుత పండగల సీజన్‌లో అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. కనీసం మరో 6-8 వారాల పాటు బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తే మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టే అవకాశముందని చెప్పారు._



టాప్ న్యూస్ టుడే 12/10/2021

  1. పోడు రైతుల్లో చిగురిస్తున్న ఆశలు
  2. గంజా మొక్కల సాగు చేస్తున్న వ్యక్తి అరెస్టు
  3. రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆహ్వానం....
  4. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో బయోమెట్రిక్ టోకెన్ మెషిన్
  5. లింగభేదాన్ని పక్కనపెట్టేశారు.. మానసిక వికలాంగుడని కూడా చూడకుండా..
  6. రోగుల సహయకులకి వినతి 
  7. వేధింపులు భరించలేక సుపారీ ఇచ్చి చంపించిన భార్య
  8. రౌడీ షటర్స్ సత్ప్రవర్తనతో మెలగాలి

పోడు రైతుల్లో చిగురిస్తున్న ఆశలు





- హక్కు పత్రాలిస్తామన్న సీఎం ప్రకటనతో హడావుడి

- రికార్డుల దుమ్ము దులుపనున్న ఐటీడీఏ


- జిల్లాలో 35వేలకు పైనే దరఖాస్తు చేసుకునే అవకాశం 


- గిరిజనేతరుల అంశం ఇంకా డోలయామానంలోనే  


 ఆసిఫాబాద్‌:


ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌ ప్రభుత్వం 2006లో అటవీ భూములను సాగు చేసుకుంటున్న ఆదివాసీలకు హక్కు పత్రాలిచ్చింది. ఆ తర్వాత సరిగ్గా 15ఏళ్లకు మళ్లీ ఈ అంశంపై కదలిక మొదలైంది. రాష్ట్రంలో నిత్యకృత్యంగా మారిన పోడు వివాదాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అటవీ భూములను సాగు చేసుకుంటున్న రైతులకు ఆర్‌వోఎఫ్‌ఆర్‌ కింద మరోసారి పట్టిలిస్తామంటూ తాజా ప్రకటన జారీ చేశారు. దీంతో జిల్లాకు చెందిన వేలాది మంది రైతుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ముఖ్యంగా పట్టాలకోసం ఎదురు చూస్తున్న ఆదివాసీ రైతులు ముఖ్యమంత్రి ప్రకటనలతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీ జిల్లాగా గుర్తింపు పొందిన ఆసిఫాబాద్‌లో ప్రతీఏటా పోడు రైతులు సాగు ప్రారంభంలోనే అటవీ అధికారులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కొనసాగుతూ వస్తోంది. ఈ క్రమంలో దాడులు, ప్రతిదాడులు వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దాంతో స్థానిక శాసన సభ్యులు, పార్లమెంటు సభ్యులపై రైతుల ఒత్తిడి అధికంగా ఉంది. ఈ క్రమంలో గత ఎన్నికల ముందు ముఖ్యమంత్రి పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామంటూ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగానే అర్హులైన రైతులు వారు సాగు చేసుకుంటున్న పోడు భూములకు హక్కు పత్రాలు జారీ చేయడం కోసం ఈ నెల3వ వారం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభిస్తామని పేర్కొనడంతో దీనిపై స్పష్టత వచ్చినట్లయింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో అర్హులు ఇదివరకు ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు, గతంలో ఎంతమందికి పట్టాలిచ్చారు, ఎంతమందికి హద్దులు నిర్ణయించి పొజిషన్‌ ఇచ్చారన్న విషయాన్ని తేల్చేందుకు ఉట్నూరు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) రికార్డుల దుమ్ము దులుపుతోంది. 


35వేలకు పైనే దరఖాస్తులు వచ్చే అవకాశం..


జిల్లాలో 3మండలాలు మినహా మిగితా అన్ని మండలాల్లోనూ అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం తాజా నిర్ణయంతో భారీ ఎత్తున పోడు పట్టాల కోసం దరఖాస్తుల వెల్లువ కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 2006లో ఆర్‌వోఎఫ్‌ఆర్‌ కింద మొత్తం 82,129ఎకరాల అటవీ భూములకు పోడు పట్టాలకోసం 21,641మంది రైతులు గిరిజన సంక్షేమ శాఖలో దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో కేవలం 12,631మందికి 46,321ఎకరాలకు మాత్రమే పట్టాలు జారీ చే శారు. దాదాపు 9వేల మంది రైతుల దరఖాస్తులను బుట్టదాఖలు చేశారన్నమాట. అయితే వీరిలో చాలామంది అర్హులైన రైతులున్నా అటవీశాఖ మోకాలడ్డడంతో మిగితా వారికి భూమి హక్కు పత్రాలు అందకుండా పోయాయి. ప్రస్తుతం అలాంటి రైతు కుటుంబాల సంఖ్య అపరిమితంగా పెరిగిపోయినట్లు చెబుతున్నారు. తాజా అంచనాల ప్రకారం ఈ దఫా దరఖాస్తులు 35వేల నుంచి 40వేల వరకు ఉండొచ్చంటున్నారు.


గిరిజనేతర రైతులపై ఇంకా అస్పష్టతే..


జిల్లాలో అటవీశాఖ లెక్కల ప్రకారం సుమారు 40వేల ఎకరాలకు పైగా అటవీ భూములు సాగు భూములుగా మారాయి. ప్రభుత్వం గిరిజనులకు మరోసారి ఆర్‌వోఎఫ్‌ఆర్‌ కింద పట్టాలిచ్చేందుకు ప్రయత్నిస్తోంది. అయితే  జిల్లావ్యాప్తంగా సుమారు 15-20వేల ఎకరాలలో  గిరిజనేతర రైతులు సాగు చేసుకుంటున్న భూములపై మాత్రం ఇంకా స్పష్టతనివ్వలేదు. దీంతో తమ పరిస్థితి ఏమిటన్నదానిపై గిరిజనేతర రైతులు సంకట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉంటే జిల్లాలో రెవెన్యూ, అటవీ శాఖల మధ్య సుమారు 3,661ఎకరాల్లో వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ భూములపై రెవెన్యూశాఖ గిరిజనేతర రైతులకు లావుని పట్టాల రూపంలో హక్కు పత్రాలిచ్చింది. అయితే అటవీశాఖ మాత్రం ఆ భూములు తమవేనంటూ పేచీ పెడుతుండడాన్ని రైతులు జీర్ణించుకోలేక పోతున్నారు.

2)గంజా మొక్కల సాగు చేస్తున్న వ్యక్తి అరెస్టు 



ఆసిఫాబాద్


గంజాయి మొక్కల సాగు మరియు అక్రమ రవాణా నిరోధించడానికి ఆసిఫాబాద్ ఇన్స్పెక్టర్ పోలీసు  ఆద్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పరచి విస్తృత తనిఖీలలో భాగంగా తేదీ 11.10.2021 రోజున 


ఆసిఫాబాద్ మండలంలోని తుంపెల్లి గ్రామ శివారులోని పత్తి చేనులో గంజాయి మొక్కల సాగుచేస్తున్నట్లు సమాచారం అందగా ఆసిఫాబాద్ సబ్ ఇన్స్పెక్టర్ అయిన సి. హెచ్. గంగన్న మరియు పోలీస్ సిబ్బంది వెళ్ళి తనిఖీ చేయగా చునార్కర్ ముకుంద్ రావు పత్తి చేనులో గంజాయి మొక్కలు ఉండడంతో వెంటనే ఆసిఫాబాద్ తహశీల్దార్ కి సమాచారం అందించగా, ఆసిఫాబాద్ తహశీల్దార్  అక్కడకు వచ్చి నేరస్తుని ఒప్పుదల మరియు జప్తు పంచనామా చేసి ఇవ్వగా సబ్ ఇన్స్పెక్టర్  40 గంజాయి మొక్కలను స్వాదీనమ్ చేసుకొని నిందితున్ని అదుపులోనికి తీసుకుని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు, ఆసిఫాబాద్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేసి నిందితుణ్ణి అరెస్ట్ చేసి ఈ రోజు రిమాండుకు పంపించడం జరిగినది. 


ఆసిఫాబాద్ మండలం లో, గ్రామాల్లో ఎక్కడైనా గంజాయి మొక్కల సాగు మరియు అక్రమ రవాణా చేస్తే కేసులు నమోదు చేసి చట్ట పరమైన చర్యలు తీసుకోబడుతుందని ఎ. అశోక్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు, ఆసిఫాబాద్  తెలిపారు.


3)రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆహ్వానం....


శాంతి భద్రతల మరియు సమాజ రక్షణలో తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా పెట్టి, పోరాడి వీరమరణం పొందిన అమర పోలీసుల జ్ఞాపకార్థం అక్టోబర్ 21 నాడు జరుగు “అమరవీరుల సంస్మరణ దినం” సందర్భంగా పోలీసు శాఖకు సంబంధించిన విధులు, వివిధ సేవలు, ప్రత్యేకతలతో కూడిన షార్ట్ ఫిల్మ్ (తెలుగు/ఉర్దూ/ఇంగ్లీష్ భాషలలో) అంశం మీద షార్ట్ ఫిలిం మరియు ఫోటోగ్రఫీ పోటీలు: (10X12 సైజ్ ఫోటోలు రెండు కాపీలు ఇవ్వవలెను) ఈమధ్య కాలపు ఫోటోలు మాత్రమే. కమీషనరేట్ పరిధిలో ఆసక్తి గల యువతీ, యువకులు, ప్రజలు, ఆసక్తి గల్గినవారు ముందుకు రావాలని  సిపి శ్రీ చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్ గారు ఒక ప్రకటనలో కోరారు. షార్ట్ ఫిలిం తీసి పంపేవారు తేదీ: 16-10-2021 నాడు సాయంత్రం వరకు సిపి గారి కార్యాలయంలో అందజేయగలరు. ఇట్టి షార్ట్ ఫిలిం 3 నిమిషాలు మించకూడదు, అలాగే తీసిన షార్ట్ ఫిలింను సిడిలో లేదా పెన్ డ్రైవ్ లో  అందజేయగలరని మనవి. వారి యొక్క ప్రతిభను బట్టి విజేతలుగా నిలిచిన వారికి మొదటి, రెండవ మరియు మూడవ  బహుమతులు మెరిట్ సర్టిఫికెట్స్ తేదీ: 21-10-2021 నాడు అందజేస్తామని తెలిపారు. కమీషనరేట్ స్థాయిలో  సెలెక్ట్ అయిన మూడు షార్ట్ ఫిలింలను స్టేట్ కాంపిటేషన్ గురించి డీజీపీ  ఆఫీస్ హైదరాబాదుకు పంపించడం జరుగుతుంది.


                                                                                ఇట్లు


ఎస్. చంద్రశేఖర్ రెడ్డి, ఐపీఎస్.,(డిఐజి)

కమీషనర్ ఆఫ్ పోలీస్, రామగుండం


4)సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో బయోమెట్రిక్ టోకెన్ మెషిన్



సికింద్రాబాద్: జనరల్ బోగీల్లో ప్రయాణం చేసేప్పుడు ఇబ్బందులు పడుతున్నారా? అయితే ఒక్క టోకెన్ తో ఈ ఇబ్బందులకు చెక్ పెట్టింది దక్షిణ మధ్య రైల్వే పరిగెత్తుకుంటూ వచ్చి చెమటలు వస్తుంటే రైలులో ఒక్కసీటు కోసం ఎంత కష్టపడిపోతామో కదా. అదృష్టం బాగుంటే దొరుకుతుంది. ఒక్కోసారి అస్సలు దొరకదు. గమ్యస్థానం వరకూ నిలబడే ఉండాలి. ఇలాంటి సమస్యలకు దక్షిణమధ్య రైల్వే ఒక టోకెన్తో పరిష్కారాన్ని అందుబాటులోకి తెచ్చింది. సాధారణ బోగీల్లో ప్రయాణం చేసేవారు ఒక్క టోకెన్ తీసుకొంటే చాలు. సీటులో కూర్చొని ప్రశాంతంగా వెళ్లొచ్చు. భారతీయ రైల్వే బయోమెట్రిక్ టోకెన్ మెషిన్ సేవలను ప్రారంభించింది. ప్రయాణికుల రద్దీని తగ్గించడంతోపాటు. క్యూలో నిల్చుని ఇబ్బందులు పడేవారి కోసం మొదటిసారిగా సికింద్రబాద్ రైల్వే స్టేషన్ లో బయోమెట్రిక్ టోకెన్ మెషిన్ ను ప్రారంభించారు.

5)లింగభేదాన్ని పక్కనపెట్టేశారు.. మానసిక వికలాంగుడని కూడా చూడకుండా..




సమాజంలో కామాంధుల పైశాచిత్వం పెచ్చరిల్లుతోంది. వావివరుసలు, వయోబేధాలు లేకుండా పేట్రేగిపోతున్న ఉదంతాలు రోజూ ఎక్కడో ఓ చోట వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఆ ఊర్లో ఉన్న ఐదురుగు ప్రబుద్ధులు ఇంకో అడుగు ముందుకేసి.. లింగభేదాన్ని కూడా పక్కన పెట్టేశారు. మానసిక వికలాంగుడ(mentally challenged)నే మానవత్వం కూడా లేకుండా వికృత చేష్టల(sexual harassment)కు పాల్పడ్డారు.


అమ్మాయిలను లైంగికంగా వేధిస్తున్న(sexual abuse) వాళ్లను కీచకులుగా చూస్తుంటే.. వీళ్లు అబ్బాయి మీద లైంగిక దాడి(sexual harassment)కి దిగారంటేనే.. వారిలో ఎంత సైకోయిజం ఉందో అర్థమవుతోంది. అందులోనూ.. ఆ బాధితుడు మానసిక వికలాంగుడు(mentally challenged) అని కూడా చూడకుండా లైంగిక దాడి(sexual harassment)కి దిగారంటే.. వారిని ఎమని సంభోదించాలో కూడా అర్థం కాని పరిస్థితి.



మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం దొరగారిపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. 19 ఏళ్ల మానసిక వికలాంగునిపై గత కొన్ని రోజులుగా కొందరు వ్యక్తులు లైంగికదాడికి పాల్పడుతున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అదే గ్రామానికి చెందిన నలుగురు యువకులతో పాటు తండ్రి వయసున్న ఇంకో వ్యక్తి.. మానసిక వికలాంగుని అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని లైంగిక దాడికి పాల్పడుతూ వచ్చారు. రెండు మూడు రోజులుగా బాధితుని ప్రవర్తనలో తేడా రావడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వివరాలు ఆరా తీయగా ఈ దుశ్చర్య వెలుగులోకి వచ్చింది.


కుటుంబసభ్యులు వెంటనే జైపూర్ పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. రవి, నందం, సాదిక్, రాజలింగు, సురేష్ అనే ఐదుగురిపై కంప్లైంట్​ ఇచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

6)రోగుల సహయకులకి వినతి 



హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు హైదరాబాద్‌లోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రులలో రోగుల వెంట వచ్చే సహాయకులకు దసరా నుంచి వసతి సౌకర్యం కల్పిస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ తెలిపారు. దీని కోసం ఏర్పాట్లు చేపట్టామన్నారు.  ఆసుపత్రిలో వసతి సౌకర్యాలపై శనివారం ఆయన బీఆర్‌కే భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వైద్య, ఆరోగ్య కార్యదర్శి రిజ్వి, హరే కృష్ణ మిషన్‌ ఛారిటబుల్‌ ఫౌండేషన్‌ సీఈవో కౌంతేయ దాస్‌, ఆసుపత్రుల సూపరింటెండెంట్లు ఇందులో పాల్గొన్నారు. నిమ్స్‌, నిలోఫర్‌, ఉస్మానియా, గాంధీ, టిమ్స్‌, కింగ్‌ కోఠి, ఫీవర్‌ ఆసుపత్రి, ఎంఎన్‌జే క్యాన్సర్‌, ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రులకు రోగులతో పాటు పెద్ద సంఖ్యలో సహాయకులు వస్తున్నందున అక్కడ వసతి సౌకర్యం కల్పిస్తామని సీఎస్‌ తెలిపారు. అన్ని వసతులు కలిగిన ఆశ్రయంతోపాటు మహిళా సహాయకులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామన్నారు. ఆయా ఆసుపత్రుల వద్ద షెల్టర్లను గుర్తించేందుకు ఆదేశించామన్నారు. హరేకృష్ణ మిషన్‌ ఫౌండేషన్‌ సహకారంతో సబ్సిడీపై అల్పాహారం, భోజన సౌకర్యాలు కల్పిస్తామన్నారు.


7)వేధింపులు భరించలేక సుపారీ ఇచ్చి చంపించిన భార్య



 లక్షెట్టిపేట పట్టణం లోని జరిగినటువంటి హత్య కేసుకు సంబంధీచి ప్రెస్ మీట్ ఇచ్చిన ఏసీపీ అఖిల్ మహాజన్ కేసు దర్యాప్తు చేస్తూ వెల్లడించిన వివరాల ప్రకారం గత సంవత్సరం నుండి మా అన్నయ్య అయినటువంటి రవి కుమార్ కనబడుట లేదని నింధితుని చెల్లి దివ్య 27.06.2021 నాడు లక్షెట్టిపేట స్థానిక పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసింది రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిచారు శైలజ వాడుతున్న మొబైల్ ని సీడీఆర్ ద్వారా రికార్డింగ్ తెప్పించుకుని శైలజ ని అదుపులో కి తీసుకొని విచారించగా మేము2007 లో ప్రేమ వివాహం చేసుకున్నాము రోజు మద్యం తాగి వచ్చి వేధించేవాడు 2018లో విడాకులు తీసుకున్నాము అయినప్పటికీ రవి మళ్ళీ వచ్చి గత మాదిరిగా ఉంటూ విపరీతంగా వేధించేవాడు వేధింపులకు భరించలేక 26/06/2020 రోజున గంగారాం, సాయికుమార్ అనే ఇద్దరు వ్యక్తులతో లక్షరూపాయల ఒప్పందంతో చంపించినట్లు ఒప్పుకుందని గంగారాం,సాయికుమార్ కలిసి రవి కుమార్ ను స్థానిక ఇటిక్యాల్ చెరువు సమీపంలో మద్యం తాగించి తలపై బండరాయి తో బలంగా కొట్టి చంపి మృతదేహాన్ని చెరువులో పడేసి వెళ్లినట్టు ఏసీపీ అఖిల్ మహాజన్ తెలిపారు.

8)రౌడీ షటర్స్ సత్ప్రవర్తనతో మెలగాలి



భూకబ్జాలకు, బెదిరింపులకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు : గోదావరిఖని ఏసీపీ గిరి ప్రసాద్

 

గోదావరిఖని పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి ఐపిఎస్., గారి ఆదేశానుసారం గోదావరిఖని 1టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లను పిలిపించి వారి జీవన విధానంతో పాటు, ప్రస్తుత వారి కుటుంబం స్థితిగతులను గురించి అడిగి తెలుసుకుని సత్ప్రవర్తనతో మెలగాలని కౌన్సెలింగ్ నిర్వహించిన గోదావరిఖని ఏసిపి గిరి ప్రసాద్ గారు.

ఈ సందర్భంగా ఏసీపీ గారు మాట్లాడుతూ.... రౌడీషీటర్లు నేర రహిత జీవితం నుండి బయటకు వచ్చి  ఏదో కాయకష్టం చేసుకుని, లేదా ప్రభుత్వం కల్పిస్తున్న ఉపాధి పథకాలు, సంక్షేమ  పథకాలు సద్వినియోగం చేసుకొని ప్రశాంతమైన జీవితం గడపాలని వారికి వారి కుటుంబ సభ్యులకు సమాజంలో మంచి గౌరవం లభిస్తుందని తెలిపారు. శాంతిభద్రతలకు మరియు ప్రజల హక్కులకు భంగం కలిగిస్తూ వారిపై, దాడులకు పాల్పడితే సహించేది లేదని, ముఖ్యంగా భూకజ్జాలకు పాల్పడతూ  తగదాలకు మద్యవర్తిత్వం చేస్తూ ప్రజలపై దాడులకు పాల్పడడంలాంటి చట్టవ్యతిరేక  కార్యకలపాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యహరించడంతో పాటు కేసు నమోదు చేసి, పీడీ యాక్ట్ కింద జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. ప్రతి 6 నెలలకు ఒక్కసారి  చెడు ప్రవర్తన కలిగిన వారిని  బైండోవర్ చేయడం వలన వారిపై  పోలీస్ నిఘా ఉంటుంది కాబట్టి వారి కదలికలు మరియు ప్రవర్తన గురించిన విషయాలు తెలుసుకొవడం జరుగుతుంది. రౌడీ షీటర్లలో ఇకనైన మార్పురావాలని సూచించారు. తెలంగాణ పోలీసులు ప్రజలకు ఫ్రెండ్లీ పోలీసింగ్ తో సేవలు అందించడం జరుగుతుంది. అదే సమయంలో చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడిన వారిపై, మరియు చట్టాన్ని చేతిలోకి తీసుకున్న వారిపై చట్టని అతిక్రమించే వారిపట్ల  కఠినంగా వ్యవహరిస్తారని తెలిపారు. 

 

ఈ కార్యక్రమంలో గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు, రాజ్ కుమార్, సర్కిల్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ, పోలీసు అధికారులు పాల్గొన్నారు.


టాప్ న్యూస్ టుడే 10/10/2021

 

1) సోలార్‌ వాహనం..ఆవిష్కరణ అద్భుతం

2) ఎస్పీఎం కార్మికులకు భద్రత ఏది ?

3) కొత్త వృద్ధాప్య పింఛన్ల మంజూరు కోసం దరఖాస్తుల స్వీకరణ

4)పోడు భూముల పరిష్కారానికి కార్యాచరణ చేపట్టాలని సీఎం ఆదేశం

5)దండేపల్లి లో డ్రాగన్ కుంగ్ ఫు పోటీలు

6)ఉద్యోగ వయసు పరిమితిని 40 ఏళ్లకు  పెంచాలి

7)గుడిసె కూలి ఐదుగురు మృతి

8)సింగరేణి లాబాల వాట విషయంలో తప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న టిబిజికేఎస్....సారయ్య.

1)సోలార్‌ వాహనం..ఆవిష్కరణ అద్భుతం



సూర్యరశ్మితో పరుగులు పెడుతున్న ట్రాలీ..

మెట్‌పల్లి యువకుడి వినూత్న ఆలోచన

మండిపోతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. లీటరు చమురు ధర ఇప్పటికే రూ.వంద దాటేసింది. మరోవైపు, పెరిగిపోతున్న కాలుష్యంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో ఈ సమస్యలకు చెక్‌ పెట్టేందుకు జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలోని బీడీ కాలనీకి చెందిన యువకుడు అల్లాడి ప్రణయ్‌ కుమార్‌ నడుం బిగించారు. పెట్రోల్‌, డీజిల్‌ అవసరం లేకుండా, సూర్యరశ్మితో నడిచే సోలార్‌ పవర్‌ ఎలక్ట్రిక్‌ వాహనాన్ని ఆవిష్కరించారు. పారిశుధ్య కార్మికులు చెత్తను తరలించేందుకు, రైతులకు సాగు పనుల్లో ఉపయోగపడేలా దీనిని రూపొందించారు. నాలుగు చక్రాలతో నడిచే ఈ బండికి హైడ్రాలిక్‌ జాక్‌ సిస్టమ్‌ను అమర్చారు. ఇది సుమారు ఎనిమిది క్వింటాళ్ల బరువును మోస్తుంది. సోలార్‌ ప్యానెళ్లు, నాలుగు బ్యాటరీలు, మోటార్లతో తయారు చేసిన ఈ వాహనానికి సుమారు రూ.2 లక్షల వరకు ఖర్చయింది.


గంటకు 40కి.మీ వేగంతో ప్రయాణించే ఈ వాహనం ఒక్కసారి చార్జ్‌ చేస్తే 30 కి.మీ వరకు వెళుతుంది. జీపులు, కారు, ఆటో, ట్రాలీ ఆటో వంటి వాహనాలకు ఇలా సోలార్‌ పలకలు అమర్చి వినియోగించుకోవడానికి వీలుంటుందని ప్రణయ్‌ అంటున్నారు. సాధారణ వాహనాలను సోలార్‌ పవర్‌గా మార్చడానికి రూ.రెండు లక్షలు అవుతుందని చెబుతున్నారు. ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తే మరిన్ని ఆవిష్కరణలు చేయడానికి ప్రయత్నిస్తానని ప్రణయ్‌ కుమార్‌ తెలిపారు.

2)ఎస్పీఎం కార్మికులకు భద్రత ఏది ?


-ప్రమాదాలు నిత్యకృత్యం 

-పరిహారానికి లేదు మార్గం-

కార్మిక సంఘాలున్నా సమస్యలకు లేదు మోక్షం

-అధికారులు స్పందిస్తేనే మనుగడ 



కాగజ్‌నగర్‌లోని ఎస్పీఎంలో కార్మికులకు భద్రత లేని పరిస్థితి నెలకొంది. మిల్లులో యాజమాన్యం రక్షణతో కూడు కున్న చర్యలు తీసుకున్నప్పటికీ ప్రమాదాలు జరుగు తున్నాయి. మూడురోజుల క్రితం ఎలక్ర్టికల్‌ డిపార్టు మెంటులో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుడు శంకర్‌ ప్రమాదశాత్తు కిండపడిపోయి చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. న్యాయపరంగా రావాల్సిన పరిహారం అందలేదన్న ఆరోపణలున్నాయి. మిల్లు పునరుద్ధరణ జరిగిన తర్వాత తరుచూ ప్రమాదాలు జరిగాయి. అయితే వీటిని బయటకి పొక్కనీయకుండా యాజమాన్యం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఆరునెలల క్రితం కూడా కాంట్రాక్టు కార్మికుడు వికాస్‌నాయక్‌ మృతి చెందాడు. మిల్లులో తరుచూ ప్రమాదాలు జరుగుతుండడంతో విధులు నిర్వహించాలంటే కార్మికుల్లో అభద్రతా భావం ఏర్పడుతోందని కార్మిక సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. కార్మికుడు చనిపోతే న్యాయపరంగా రావాల్సిన పరిహారం కూడా ఇచ్చే విషయంలో యాజ మాన్యం ముందడుగు వేయడం లేదన్న ఆరోపణలున్నాయి.


పరిహారం ఇవ్వడం లేదు..


2018లో మిల్లు పునరుద్ధరణ జరిగిన తర్వాత మిల్లులోని భాగాలను మరమ్మతులు చేసే క్రమంలో పలుమార్లు ప్రమాదాలు జరిగాయి. ఇందులో కొంత మంది కార్మికులకు గాయాలు కూడా అయ్యాయి. రెండేళ్ల క్రితం బాయిలర్‌ నిర్మాణ పనుల్లో భారీ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇతర రాష్ట్రాలకు చెందిన ముగ్గురు కార్మికులు ప్రాణాలు కొల్పోయారు. వీరి విషయంలో కూడా పరిహారం అందలేదని కార్మికులు పేర్కొంటున్నారు. 2014నుంచి మిల్లు మూత బడడంతో అన్ని మిషనరీలను తరుచూ మరమ్మతులు చేసేందుకు యాజమాన్యం చర్యలు తీసుకుంది. ఈ విషయంలోనే తరుచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రక్షణ విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు గట్టిగా నిఘా పెట్టాలని పలువురు డిమాండు చేస్తున్నారు. పరిహారం విషయంలో యాజమాన్యం మొండి వైఖరి వహిస్తోందని బీజేపీ నాయకుడు డాక్టర్‌ హరీష్‌ బాబు మండిపడ్డారు. ప్రమాదాల విషయంలో నిర్లక్ష్యం చేస్తే ఊరుకునేది లేదని పేర్కొంటున్నారు. కార్మిక చట్టం ప్రకారం పరిహారం అందిస్తేనే తమకు న్యాయం జరు గుతుందని పలువురు కార్మికులు డిమాండు చేస్తు న్నారు. మూడు రోజుల క్రితం కాంట్రాక్టు కార్మికుడు శంకర్‌ మృతిచెందిన విషయంలో కూడా పరిహారం ఎంత ఇచ్చారు..? ఏ ప్రతిపాదికన ఇచ్చారన్నది కూడా ఇంతవరకు యాజమాన్యం ప్రకటించలేదు.


దీంతో కార్మికుల ప్రాణాలకు విలువ లేకుండా పోతోందని కార్మిక సంఘాలు యాజమాన్యం తీరుపై మండి పడుతున్నాయి. న్యాయపరంగా పరిహారం అందకుంటే పోరుబాట పడుతామని కార్మిక సంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారు. మిల్లులో ఎంతమంది స్థానికులు, స్థానికేతరులు పని చేస్తున్నారన్నది జాబితా స్పష్టంగా తేలాల్సి ఉంది. స్థానికేతరులు చనిపోతే యాజమాన్యం ఎంత పరిహారం ఇస్తోందనేది ఇంకా తేలడం లేదు. ఈ విషయంలో కలెక్టర్‌తోపాటు రెవెన్యూ అధికారులు, కార్మికశాఖ స్పందించి మిల్లులో పనిచేసే కార్మికులపై కూలంకుషంగా జాబితా రూపొందించాలని, వీరందరికి యాజమాన్యం ఈఎస్‌ఐ, పీఎఫ్‌ కల్పిస్తోందా? లేదా అనే కోణంలో సమగ్ర విచారణ జరపాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండు చేస్తున్నారు. కార్మి కుడు చనిపోతే పరిహారం కోసం డిమాండ్‌ చేసే ప్రక్రియలో యాజమాన్యం పోలీసుల సహాయంతో అణగదొక్కేందుకు చర్యలు తీసుకుంటోందని పలువురు పేర్కొంటున్నారు. కార్మికులకు న్యాయం కోసం అధికారులు స్పందించాలని అంతా డిమాండు చేస్తున్నారు.


కార్మికుడు చనిపోతే పరిస్థితి దారుణం..


-అంబాల ఓదెలు, కార్మిక సంఘం నాయకుడు


మిల్లులో కార్మికుడు చనిపోతే పరిస్థితి దారుణంగా ఉంటోంది. పరిహారం విషయంలో జేకే యాజమాన్యం స్పష్టంగా ప్రకటించడం లేదు. చనిపోయిన కార్మికుడికి ఎంత సర్వీసు ఉందో దాన్ని పరిగణలోకి తీసుకొని పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. విధి నిర్వహణలో చనిపోతే ప్రత్యేక ప్యాకేజీతోపాటు ఇంటిలోని కుటుంబ సభ్యులకు ఒకరికి ఉద్యోగం ఇప్పిస్తే బాగుంటుంది. వీటన్నిటినీ పక్కనపెట్టి యాజమాన్యం ఇష్టాను సారంగా నిర్ణయం తీసుకుంటోంది. ఇక్కడ కార్మికులకు ముమ్మాటికీ అన్యాయమే జరుగుతోంది. అధికారులు తేరుకొని సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలి.

3)కొత్త వృద్ధాప్య పింఛన్ల మంజూరు కోసం దరఖాస్తుల స్వీకరణ



TS: కొత్త వృద్ధాప్య పింఛన్ల (Old Age Pensions) మంజూరు కోసం దరఖాస్తుల స్వీకరించనున్నారు. 57 ఏళ్లు నిండిన వారి నుంచి పింఛన్ల దరఖాస్తులు తీసుకోనున్నారు. సోమవారం నుంచి ఈ నెలాఖరు వరకు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం చేపట్టనున్నారు. మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.

2019 నుంచి నిలిచిన ప్రక్రియ...

రాష్ట్రంలో 2019 జులై నుంచి కొత్త పింఛన్ల మంజూరు ప్రక్రియ నిలిచిపోయింది. తెరాస ప్రభుత్వం తొలిసారిగా అధికారంలోకి వచ్చినప్పుడు ఆసరా పింఛన్లను రూ. వెయ్యికి, వికలాంగులకు ఇచ్చే పింఛన్లను రూ. 2 వేలకు పెంచింది. ఏ ఆధారంలేని నిరుపేద అర్హులు ఫించన్లతోనైనా బతకవచ్చనే ఆనందం వ్యక్తం చేశారు. తిరిగి రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత రూ. వెయ్యిగా పింఛన్​ను 2016 రూపాయలకు, 2 వేలను 3016 రూపాయలకు పెంచడంతో అర్హుల ఆనందం అంతా ఇంతా కాదు. కానీ వృద్ధాప్య పిఛన్లకు 65 ఏళ్లు వయసు ఉండాలని ప్రభుత్వ చెప్పడంతో చాలామందికి పింఛన్ వర్తించకుండా పోయింది.


అనర్హులు ఎవరంటే?


దరఖాస్తుదారు వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షలు, పట్టణప్రాంతాల్లో రూ.2 లక్షలు మించొద్ధు. దరఖాస్తుదారు పేరిట మెట్ట భూమి 7.5 ఎకరాలు, మాగాణి 5 ఎకరాల్లోపు ఉండాలి. కుటుంబంలో ఇది వరకే పింఛను పొందుతుంటే మరొకరు అనర్హులుగా తేల్చుతారు. విచారణ సమయంలో ఇవన్నీ చూశాకే అర్హులను గుర్తిస్తారు. ఆ తర్వాతే పింఛను మంజూరవుతుంది.


దరఖాస్తు ఇలా..


ఈ నెల 31తో 57 ఏళ్లు నిండిన వారంతా వృద్ధాప్య పింఛను పొందేందుకు అర్హులుగా పరిగణిస్తారు. సంబంధీకులు దగ్గరలోని మీసేవ కేంద్రాలకు వెళ్లి తగు ఆధారాలతో దరఖాస్తు చేయాలి. వయసు నిర్ధరణకు పంచాయతీ, మున్సిపల్‌ జారీ చేసిన జనన ధ్రువీకరణపత్రాలు లేదా గతంలో చదివిన విద్యాసంస్థలు జారీచేసిన పత్రాలు, లేదంటే ఓటరు గుర్తింపుకార్డులో నమోదైన వయసును ఆధారంగా చూపించాలి. దరఖాస్తుకు ఆధార్‌కార్డు, వయసు నిర్ధరణ పత్రంతో పాటు బ్యాంకు పాసుపుస్తకం, పాస్‌పోర్టుసైజ్‌ ఫొటోతో స్వయంగా దరఖాస్తుదారు వెళ్లి వేలిముద్ర వేయాల్సి ఉంటుంది.

4)పోడు భూముల పరిష్కారానికి కార్యాచరణ చేపట్టాలని సీఎం ఆదేశం



పోడు భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ముఖ్యమంత్రి దృష్టిసారించారు. రాష్ట్రంలోని పోడు భూములపై అధికారులతో సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష (CM KCR Review on Podu Lands) నిర్వహించారు. పోడు భూముల పరిష్కారానికి కార్యాచరణ చేపట్టాలని ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. దసరా తర్వాత కార్యాచరణ ప్రారంభించాలని సూచించారు. పోడు సాగుదారుల లెక్క తేల్చి సమస్య పరిష్కరించాలన్నారు.


గజం భూమి కూడా అన్యాక్రాంతం కావొద్దు..


అడవుల నడిమధ్యలో పోడు సాగు ఉండొద్దని సీఎం కేసీఆర్​ పేర్కొన్నారు. నడి అడవిలోని పోడు సాగును మరో చోటకు తరలించాలన్న ముఖ్యమంత్రి.. అలాంటి సాగుదారులకు అడవి అంచున భూమి కేటాయిస్తామన్నారు. పోడు భూమి తరలించి ఇచ్చిన వారికి సర్టిఫికెట్లు ఇవ్వాలన్నారు.  సాగుకు నీటి సౌకర్యంతో పాటు విద్యుత్‌ వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. పోడు రైతులకు రైతుబంధు, రైతుబీమా కూడా ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. పోడు భూముల వ్యవహారం లెక్క తేలిన తర్వాత ఒక్క గజం అటవీభూమి కూడా అన్యాక్రాంతం కావొద్దని సీఎం కేసీఆర్​ స్పష్టం చేశారు.


అటవీ పరిరక్షణ కమిటీలను నియమించాలి..

  

దురాక్రమణలు అడ్డుకోవడానికి రక్షణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్​ అధికారులకు సూచించారు. అడవుల రక్షణ కోసం ఎలాంటి కఠిన చర్యలకూ వెనకాడవద్దన్నారు. పోడు సమస్యపై అవసరమైతే అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామన్నారు. అటవీ పరిరక్షణ కమిటీలు నియమించి..విధివిధానాలను రూపొందించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.  


ఆక్రమణకు గురికావొద్దనేది అంతిమ లక్ష్యం

 

ఈనెల మూడోవారంలో పోడు రైతుల నుంచి దరఖాస్తుల స్వీకరణ చేపట్టాలన్నారు. దరఖాస్తుల ఆధారంగా క్షేత్రస్థాయిలో భూమిని పరిశీలించాలని.. ఎమ్మెల్యేల సూచనలు, సలహాలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గిరిజన, అటవీశాఖలతో సమన్వయం చేసుకోవాలన్నారు. నవంబర్ నుంచి అటవీ భూముల సర్వే, సరిహద్దుల గుర్తించి.. అవసరమైన మేరకు కందకాలు తవ్వకంతో పాటు ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలన్నారు. పకడ్బందీ చర్యల కోసం అవసరమైతే పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని.. అడవులు ఆక్రమణకు గురికావొద్దనేది అంతిమలక్ష్యమని సీఎం స్పష్టం చేశారు.

5)దండేపల్లి లో డ్రాగన్ కుంగ్ ఫు పోటీలు


డ్రాగన్ స్వాడ్ కుంగ్ ఫు అకాడమీ .ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆదివారం మండల కేంద్రంలోని పద్మశాలి భవనంలో మాస్టర్  బొడ్డు. రాయమల్లు.సిహెచ్. రాజేందర్  .కె మహేష్ లు  బెల్టు పోటీలు నిర్వహించారు.


 ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా  దండేపల్లి ఎస్ ఐ తాళ్ల .శ్రీకాంత్ పాల్గొన్నారు.


అనంతరం ఎస్ ఐ మాట్లాడుతూ డ్రాగన్ స్వాడ్ కుంగ్ ఫు నేటి యూవతరానికి ఎంతో ఆత్మరక్షణ ఉంటుంది అన్నారు.


 కుంగ్ ఫు పోటీలో  విద్యార్థుల కు బెల్ట్ తో పాటు గోల్డ్ .సిల్వర్ మెడల్ . ప్రశంస పత్రాలు అందజేశారు.
అనంతరం ఎస్ఐకి మాస్టర్స్ విద్యార్థులు శాలువతో సన్మానించారు.


 ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

6)ఉద్యోగ వయసు పరిమితిని 40 ఏళ్లకు  పెంచాలి



గోదావరి ఖని:  సింగరేణిలో కారుణ్యము కింద అన్ పిట్ అయి  ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న కొడుకులకు, వారసులకు ఉద్యోగ అర్హత వయస్సు 35 సంవత్సరాల నుండి 40 సంవత్సరాలకు పెంచేలా కృషి చేయాలని రెండు పేర్లు ఉన్న కార్మికులకు  వారి ఒరిజినల్  పేరు మార్చే విధంగా చూడాలని టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా తరుపున టీబీజీకేఎస్ సెంట్రల్ కమిటీ లో బెల్లంపల్లి ఏరియా వైస్ ప్రెసిడెంట్ మాల్రాజు శ్రీనివాసరావు కేంద్ర కమిటీని కోరారు. 

టిబిజినెస్ అధ్యక్షులు బి.వెంకట్ రావు అధ్యక్షతన గోదావరిఖని లోని ఇల్లందు క్లబ్ లో జరిగిన కేంద్ర కమిటీ  సమావేశంలో  శ్రీనివాసరావు  మాట్లాడుతూ బెల్లంపల్లి ఏరియాలో త్వరలో 2 ocp లు రానున్నాయని మరింత మందిని కార్మికులను నియమించాలని విజ్ఞప్తి చేశారు.
ఇన్కమ్ టాక్స్ లో  perks పేరు మీద విధిస్తున్న టాక్స్ ను  రద్దు చేయాలని పేర్కొన్నారు.
 మైనింగ్  సోదరులకు అండర్ గ్రౌండ్ లో ఆన్ పిట్ అయిన  క్రమంలో సర్ఫేస్ లో అదే ఉద్యోగం ఇవ్వాలని కోరారు. బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి హాస్పిటల్ ను మంచిర్యాల జిల్లా కరోనా హాస్పిటల్ గా కేటాయించడం వలన కార్మికులకు వైద్య సౌకర్యం అందక ఇబ్బందులు అవుతున్నాయని తెలిపారు. కరోనా ఆసుపత్రిని వేరేచోటికి తరలించాలని కోరారు. సింగరేణిలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బెల్లంపల్లి ఏరియా లో టిబిజికెఎస్ ను అత్యధిక మెజారిటీతో గెలిస్తామని ధీమా వ్యక్తం చేశారు.. హుజూరాబాద్ టిఆర్ఎస్ అభ్యర్థి గెలుపు శ్రీనివాస్ యాదవ్ గెలుపు కోసం బెల్లంపల్లి ఏరియా తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటామని పేర్కొన్నారు... 
అనంతరం అధ్యక్షడు వెంకట్రావు మాట్లాడుతూ TBGKS బలోపేతం కోసం కృషి చేయాలని సూచించారు..కార్మికులకు అందుబాటులో ఉండి సీఎం కేసీఆర్ యూనియన్ అందించిన హక్కులను కార్మికులకు తెలుయజేయలని కోరారు..
ఈ సమావేశంలో టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజి రెడ్డి, మాజీ అధ్యక్షులు కెంగర్ల మల్లయ్య,  అన్ని ఏరియాల ఉపాధ్యక్షులు, సెంట్రల్ కమిటీ నాయకులు,11 మెన్ కమిటీ సభ్యులు, బెల్లంపల్లి ఏరియా నుండి  సెంట్రల్ చీఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి సంగం ప్రకాష్ రావు, 11 మెన్ కమిటీ మెంబర్ ధరావత్  మంగిలాల్, సెంట్రల్ కమిటీ సభ్యుడు గెల్లి రాజలింగు, తదితరులు పాల్గొన్నారు..

7)గుడిసె కూలి ఐదుగురు మృతి



అక్టోబర్ 10 =శనివారం రాత్రి కురిసిన అకాల వర్షం కారణంగా రాత్రి నిద్రిస్తున్న సమయంలో గుడిసె కూలి ఒకే కుటుంబానికి చెందిన భార్య భర్త ముగ్గురు పిల్లలు చనిపోయారు. ఐదు సంవత్సరాల కూతురు స్నేహ మూడు సంవత్సరాల రాము మాత్రమే ప్రమాదం నుండి బయటపడ్డారు. ఈ విషాద సంఘటన జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామాన్ని కలచివేసింది. ప్రతిరోజు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని కలిసిమెలిసి బతికేవారు అనుకోకుండా ఈ దుర్ఘటనలో చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నిరుపేద దళిత కుటుంబం అందరూ చనిపోయి ఇద్దరు చిన్నారులు మాత్రమే బ్రతకడం తో ఆ చిన్నారుల పరిస్థితి ఏమిటి అనేది ప్రశ్నార్థకంగా మారింది. కావున తక్షణమే జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ స్థానిక ఎమ్మెల్యే ఆ గ్రామానికి చేరుకున్న గా గ్రామ ప్రజలు వారితో ఒంటరైన చిన్నారులను ప్రభుత్వం చదువుకు బాధ్యత తీసుకోవాలి 10 లక్షల ఎక్స్గ్రేషియాన్ స్నేహ పేరున ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి అలాగే భవిష్యత్తు చిన్నారులకు నివాసం కోసం ఒక ఇల్లు నిర్మించాలి మూడు ఎకరాల ప్రభుత్వ భూమి ఆ చిన్నారులకు వయసు వచ్చేక కుటుంబ పోషణ కోసం ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే విధంగా చొరవ తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. మృతి చెందిన విషయం తెలుసుకున్న జిల్లా జడ్పీ చైర్మన్ సరిత తిరుపతయ్య మృతదేహాలను సందర్శించి ప్రస్తుతం దహన సంస్కారాలకు ఖర్చులకు ఆర్థిక సహాయం చేశారు. ప్రమాదంలో గాయాల పాలు అయినా చిన్నారులకు తమ వంతు సాయం ఎప్పుడూ ఉంటుందని ఆమె అన్నారు దుర్ఘటన విషయం తెలుసుకున్న మంత్రి నిరంజన్ రెడ్డి కి ఫోన్ చేసి ఇ దుర్ఘటనపై ఆరా తీసిన ముఖ్యమంత్రి కెసిఆర్ ఆర్ పతులు ఒక్కరికి ఐదు లక్షల చొప్పున ఎక్స్గ్రేషియాన్ ప్రకటించాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటాం వారి కుటుంబంలో మిగతా వారికి ప్రభుత్వ పరంగా విద్యా వైద్య సౌకర్యాలు కల్పిస్తాం గ్రామాలలో శిధిలావస్థలో ఉన్న ఇళ్లను నిర్మాణాలను అధికారులు గుర్తించాలి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలిస్తున్నారని ఆయన మంత్రి అన్నారు ఈ సంఘటన తెలుసుకున్న అల్లంపూర్ ఎమ్మెల్యే  అబ్రహం ఆ గ్రామానికి చేరుకొని ఆ సంఘటన గురించి తెలుసుకొని గాయాలతో బయట పడిన పిల్లల ఆరోగ్య పరిస్థితిని క్షమించు ఎమ్మెల్యే గద్వాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరిని పిల్లలను చూసి ఇ మెరుగైన చికిత్స అందించండి పిల్లలకు ఎలాంటి అపాయం జరగకూడదు అని డాక్టర్లతో అలంపూర్ ఎమ్మెల్యే తెలియజేశారు. పిల్లలకు అండగా నేనున్నా అధైర్య పడవద్దని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉత్తనూర్ తిరుమల్ రెడ్డి .సర్పంచ్ గోపాలకృష్ణ. శ్రీనాథ్ రెడ్డి. టిఆర్ఎస్ యువజన నాయకుడు కిషోర్. జైపాల్ రెడ్డి . మల్లేష్ .ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మనీ టర్నింగ్ జిల్లా సభ్యులు బుడగలు ప్రకాష్. గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

8)సింగరేణి లాబాల వాట విషయంలో తప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న టిబిజికేఎస్....సారయ్య.


సింగరేణి లాభాలపై యాజమాన్యం స్వేతపత్రం విడుదల చెయ్యాలి.
కార్మికుల హక్కులకై పోరాడేది కేవలం ఎర్రజెండా పార్టీలు మాత్రమే...బంధం నాగయ్య.




భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆదివారం ఇల్లందు ఏరియా లొ సింగరేణి కాలరీస్ వర్క్స్ యునియన్ ఎఐటియుసి ఆద్వర్యంలో స్థానిక ఏరియా వర్క్ షాప్ మరియు సిహెచ్పి, లలొ ఉదయం షిఫ్ట్ నందు ఫిట్ మీటింగ్ జరిగింది ఈ సమావేశానికి వర్క్స్ యునియన్ కేంద్ర కమిటీ డిప్యూటీ ప్రదాన కార్యదర్శి కె.సారయ్య పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ కంపెనీ 2020-21 వార్షిక లాభాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అని అందుకు యాజమాన్యం శ్వేత పత్రం విడుదల చెయాలని వారు డిమాండ్ చెసారు. సింగరేణి లొ గుర్తింపు సంఘం పూర్తిగా యాజమాన్యం తొత్తులుగా మారింది అని కంపెనీ లొ రాజకీయ జొక్యం పెరిగి కార్మికులు తమ రక్తాన్ని చెమటగ చేసి లాబాలు తెస్తావుంటె తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కెసిఆర్ తన సొంత కంపెనీ లా కోట్ల రూపాయలు దొచుకుంటున్నారని వారు అన్నారు. ఎఐటియుసి గుర్తింపు సంఘంగా వున్న సమయంలో యునియన్ అద్యక్షులు గా వున్న అమరజీవి కేఎల్.మహేంద్ర అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో వున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొ చర్చలు జరిపి ఏ ప్రభుత్వ రంగ సంథలొ లెనివిదంగా కంపెనీ లాబాలలొ కార్మికుల ను భాగస్వాములను చేసి ఇండస్ట్రియల్ డిస్ట్రిబ్యూట్ యాక్ట్ 12/3 అగ్రిమెంట్ చెసి లాబాల వాట సాదిస్తె నేడు గుర్తింపు సంఘం టిబిజికేఎస్ ఇల్లందు నాయకులు మా కెసిఆర్ ఇచ్చిండు అని పాలాభిషేకాలు చేయడం సిగ్గు చేటు అని ఆయన అన్నారు.2018- 2019 లో లక్ష రూపాయలు తీసుకున్న కార్మికుడు 2019-2020 లో 50,000 వరకు తగ్గింది 2020- 2021 కి వచ్చేసరికి 10 వేల నుండి 21వేల పైచీలుకు వరకు వచ్చింది కనుక కార్మికునికి మహా గొప్ప అగ్రిమెంట్ చేసినము అని  మురిసిపోతున్న టిబిజికేఎస్ యూనియన్,టీఆరెస్, సింగరేణి కార్మికులు కొవైడ్-19 సమయంలో ప్రాణాలను,వారి కుటుంబాలను పణంగా పెట్టీ సింగరేణికి లాభాలను గడించి పెడితే టిఆర్ఎస్ ప్రభుత్వం అప్పనంగ దోచుకొని ,ముఖ్యమంత్రి తన సొంత సంపాదన సింగరేణి కార్మకులకు 1%పెంచి 29%ఇస్తున్నామని,టిబిజికేఎస్ నాయకులు గొప్పలు చప్పుకుంటున్నారు. కావున  దీని పై  కార్మికలోకం ఆలోచించాలనీ సారయ్య కొరారు.మోడి నియంత్రంత్వ పొకడలకు వ్యతిరేకంగా కార్మిక హక్కుల రక్షణ కోసం కార్మిక వర్గం పొరాటాలకు సిద్ధంగా వుండాలని వారు పిలుపు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఏరియా వర్క్ షాప్ ఫిట్ కార్యదర్శి ఎడ్విన్, సిహెచ్పి ఫిట్ కార్యదర్శి నూనె శ్రీనివాస్, సుబ్బరాజు, నర్సింహారావు,భూషణం,జగ్నాదం, ముత్తయ్య,తదితరులు పాల్గొన్నారు

టాప్ 10 న్యూస్ టుడే 04/10/2021

టాప్ 10 న్యూస్ టుడే 

  1. పంట దక్కక అప్పు తీర్చలేక ఇద్దరు రైతుల బలవన్మరణం..
  2. దళిత బందు విధి విధానాలు జారీ చేసిన ప్రభుత్వం...
  3. పెట్రో మంట.. మరో సారి పెరిగిన పెట్రోల్ రేట్
  4. 8 న ఈటల రాజేందర్ నామినినేషన్.బీజేపీ అభ్యర్థిగా అధికారిక ప్రకటన.
  5. కొత్త బైక్ కంటే 2 హెల్మెట్లు ఇవ్వాల్సిందే..
  6. తిరిగి తెలంగాణకి విక్రమ్ జిత్ దుగ్గల్...
  7. TSRTC ఉద్యోగులకు ఆర్టీసి బంపర్ ఆఫర్.. ఐదు ఏళ్ల వరకు సెలవలు....
  8. కఠినంగా జేఈఈ అడ్వాన్స్డ్ ......పేపర్ 1 తో పోల్చుకుంటే పేపర్ 2 కష్టం. రేపు సాయంత్రం వెబ్ సైట్ లో ఓఎంఆర్ పత్రం
  9. టీటీడీ శ్రీ పద్మావతి ఆస్పత్రిలో సేవలందించడానికి దరఖాస్తులు ఆహ్వానించిన టీటీడీ.
  10. కరోనా 199 రోజుల కనిష్టానికి ఆక్టివ్ కేసులు.   

1)పంట దక్కక అప్పు తీర్చలేక ఇద్దరు రైతుల బలవన్మరణం..



TG: భారీ వర్షాలకు పంటలు దెబ్బతినడంతో తీవ్ర మనోవేదనకు గురైన ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. పంట పెట్టుబడి కోసం చేసిన అప్పులు తీర్చే దారి లేక ఆదిలాబాద్‌, సిరిసిల్ల జిల్లాల్లో ఇద్దరు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ మండలం సొనాల గ్రామానికి చెందిన ఎకిలం శశిధర్‌(28) మూడెకరాల సొంత భూమితో పాటు, 12 ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. 12 ఎకరాల్లో సోయా, మూడెకరాల్లో పత్తి వేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సోయా పంట నీట మునగగా.. పత్తి దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. బ్యాంకులో రూ.లక్ష, ప్రైవేటులో మరో రూ.4 లక్షల అప్పులున్నాయి. పంటలు నష్టపోవడంతో రుణాలు ఎలా తీర్చాలనే మనోవేదనతకు గురైయ్యాడు. ఆదివారం బజార్‌హత్నూర్‌ మండలం కొలారి శివారులోని తన పంటపొలంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శశిధర్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం జవారిపేట గ్రామానికి చెందిన గౌవేని రాజయ్య(45) 6 ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి పంట సాగుచేస్తున్నాడు. కొన్నేళ్లుగా పంట దిగుబడులు సరిగా రావడంలేదు. ఇటీవల కురిసిన వర్షాలకు ఈ ఏడాది పంటా దెబ్బతింది. మరోవైపు రూ.10 లక్షల అప్పు ఉండటంతో మనోవేదనకు గురైయ్యాడు. ఆదివారం పత్తి చేనుకు వెళ్లిన పురుగుల మందు తాగి తన సోదరుడికి ఫోన్‌ చేసి చెప్పాడు. వెంటనే రాజయ్య భార్య, సోదరుడు చేను వద్దకు వెళ్లి.. అపస్మారక స్థితిలో ఉన్న రాజయ్యను సిరిసిల్ల ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

2)దళిత బందు విధి విధానాలు జారీ చేసిన ప్రభుత్వం...



హైదరాబాద్‌: దళితబంధు పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం అదనపు విధివిధానాలు జారీ చేసింది. ఈమేరకు మార్గదర్శకాలు ప్రకటిస్తూ ఎస్సీ అభివృద్ధిశాఖ ఆదేశాలు జారీ చేసింది. లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ పూర్తయ్యాక దళితబంధు కోసం ప్రత్యేకంగా బ్యాంకు ఖాతా తెరవాలని, సంబంధిత పాసుపుస్తకాలను లబ్ధిదారులకు అందించాలని తెలిపింది. ఆఖాతాలోకి రూ.9.90లక్షలు కలెక్టర్‌ బదిలీ చేయాలని పేర్కొంది.

రూ.10లక్షలతో నిధులతో సాధ్యమైతే రెండు విభిన్న యూనిట్లకు అనుమతి

లబ్ధిదారులను వారు ఆసక్తి కనబర్చే యూనిట్లను బట్టి గ్రూపులుగా వర్గీకరించాలని.. వ్యవసాయం- అనుబంధ రంగాలు, రవాణా రంగం, తయారీ- పరిశ్రమల రంగం, రిటైల్‌ దుకాణాలు, సేవలు- సరఫరా రంగాలుగా విభజించాలని తెలిపింది. ఆయా రంగాల వారీగా రిసోర్స్‌ పర్సన్స్‌ను ఎంపిక చేయడంతో పాటు బృందాలను కలెక్టర్‌ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. రూ.10లక్షలు యూనిట్‌ వ్యయం అయ్యే ప్రాజెక్టులను రిసోర్స్‌ బృందాలు రూపొందించాలి. మొత్తం రూ.10లక్షలు విలువచేసేలా రెండు సబ్‌ యూనిట్లు కూడా ఉండొచ్చని ప్రభుత్వం తెలిపింది. ఒకరి కంటే ఎక్కువ మంది లబ్ధిదారులు కలిసి  ఎక్కువ మొత్తంతో పెద్ద యూనిట్‌కు కూడా అవకాశం ఇవ్వాలని పేర్కొంది.

యూనిట్ల అవసరాల దృష్ట్యా లబ్ధిదారులకు శిక్షణ

రిసోర్స్ బృందాలతో కలెక్టర్ లబ్ధిదారుల వద్దకు వెళ్లి వారికి వివిధ యూనిట్లపై అవగాహన కల్పించాలి. అవసరమైతే రిసోర్స్ బృందాలు ఎక్కువమార్లు కూడా లబ్దిదారుల వద్దకు వెళ్లాలని ప్రభుత్వం తెలిపింది. లబ్ధిదారుని ప్రాధాన్యం, ఆసక్తి, అనుభవం, యూనిట్ ఆర్థిక సాధ్యాసాధ్యాలను యూనిట్ ఎంపికలో పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. యూనిట్ల ఖరారు అనంతరం వారికి అందులో శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. ఆయా రంగాలు, యూనిట్ల అవసరాల దృష్ట్యా రెండు నుంచి ఆరు వారాల పాటు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం తెలిపింది. ఇదే సమయంలో లబ్దిదారులు ఎంచుకున్న యూనిట్ల పనితీరు పరిశీలన కోసం పర్యటనలు ఏర్పాటు చేయాలని, ఆయా రంగాల్లో విజయవంతమైన వారిచే అవగాహన  కల్పించాలని సూచించింది. లబ్ధిదారుల కుటుంబాలకు యూనిట్ పై పూర్తి అవగాహన కలిగి, పూర్తి స్థాయిలో నడిపించేందుకు సిద్ధమైనట్లు కలెక్టర్, రీసోర్స్ బృందం సంతృప్తి చెందితే యూనిట్ ను వారికి అందించాలని తెలిపింది. మంజూరు అనంతరం కూడా యూనిట్ల నిర్వహణలో రిసోర్స్ బృందాలు లబ్దిదారులకు తగిన సహకారం అందించాల్సి ఉంటుంది. యూనిట్లన్నీ మంజూరై పూర్తి స్థాయిలో నడిచేలా ప్రతిదశలోనూ పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేయాలని జిల్లా కలెక్టర్, బృందాలకు ప్రభుత్వం స్పష్టం చేసింది.

3)పెట్రో మంట మరో సారీ పెరిగిన పెట్రోల్ రేట్..


























దిల్లీ: దేశంలో సామాన్యుడిపై పెట్రో మంట కొనసాగుతుంది. వరుసగా రుగుతున్న ధరలు సరికొత్త రికార్డ్‌లను క్రియేట్‌ చేస్తున్నాయి. ఆదివారం సైతం లీటర్‌ పెట్రోల్‌ పై 25పైసలు, డీజిల్‌ పై 30పైసలు పెరిగింది. దీంతో దేశంలో పలు ప్రధాన నగరాల్లో డీజిల్‌ ధరలు సెంచరీని క్రాస్‌ చేశాయి. ముఖ్యంగా గత నాలుగు రోజులుగా పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదే సమయంలో ఇంధన ధరల పెంపుపై కేంద్రం చెప్పిన కారణాలపై పెదవి విరిస్తున్నారు.  

దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో పెరిగిన పెట్రోల్‌ డీజిల్‌ ధరలు

హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.106.26 ఉండగా.. డీజిల్ ధర రూ.98.72 ఉంది.  

విజయవాడలో పెట్రోల్ ధర రూ.108.57 ఉండగా డీజిల్ ధర రూ.100.45 ఉంది.  

వైజాగ్‌లో పెట్రోల్ ధర రూ.107.19 ఉండగా..డీజిల్ ధర రూ.99.14 ఉంది. 

ఢిల్లీలో  పెట్రోల్‌ ధర రూ.102.39 ఉండగా.. డీజిల్‌ ధర రూ.108.43 ఉంది

కోల్‌ కతాలో పెట్రోల్‌ ధర రూ. 103 ఉండగా .. డీజిల్‌ ధర రూ.93.87 ఉంది

4)8 న ఈటల రాజేందర్ నామినినేషన్.బీజేపీ అభ్యర్థిగా అధికారిక ప్రకటన.



























కరీంనగర్‌: అందరూ ఊహించినట్లుగానే హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో భాజపా అభ్యర్థిగా ఈటల రాజేందర్‌ ఖరారయ్యారు. పార్టీ రాష్ట్ర కమిటీ పంపిన ప్రతిపాదనల మేరకు ఆయన పేరును ఖరారు చేస్తూ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్‌ ఆదివారం ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 8న నామినేషన్‌ వేసేందుకు ఈటల ముహూర్తాన్ని ఖరారు చేసుకున్నారు. ఎసైన్డ్‌ భూముల విషయమై ఆరోపణలను ఎదుర్కొన్న రాజేందర్‌ను రాష్ట్ర మంత్రివర్గం నుంచి మే 2న బర్తరఫ్‌ చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక నేతగా గుర్తింపు పొందిన ఆయన హుజూరాబాద్‌, కమలాపూర్‌ నియోజకవర్గాల నుంచి వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. జూన్‌ 12న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. జూన్‌ 14న దిల్లీలో భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆ పార్టీలో చేరారు.

5)కొత్త బైక్ కంటే 2 హెల్మెట్లు ఇవ్వాల్సిందే




హైదరాబాద్: మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా బహుదూర్‌పల్లికి చెందిన లక్ష్మి తన భర్తతో కలిసి కొద్దిరోజుల క్రితం మియాపూర్‌లో జరిగే శుభకార్యానికి ద్విచక్ర వాహనంపై వెళ్లారు. బాచుపల్లి వద్ద రాంగ్‌రూట్‌లో వచ్చిన టిప్పర్‌ ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే అసువులు బాశారు. శిరస్త్రాణం ఉండటంతో భర్త మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు.

రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా ద్విచక్ర వాహనదారులు మృతి చెందుతుండగా.. శిరస్త్రాణం లేకపోవడం వల్లే అధిక మరణాలు సంభవిస్తున్నాయి. 2019లో రాష్ట్రవ్యాప్తంగా 21,999 ప్రమాదాలు జరగగా.. 6,964 మంది చనిపోయారు. వీరిలో 2,863 మంది ద్విచక్ర వాహనదారులే. మృతుల్లో 1,996 మంది డ్రైవర్లు, 867 మంది పిలియన్‌ రైడర్లు ఉన్నారు. వాహనం నడిపేవారితో పాటు పిలియన్‌ రైడర్‌ (వెనక కూర్చున్న వ్యక్తి) శిరస్త్రాణం ధరిస్తే ప్రాణాపాయం నుంచి బయటపడొచ్చు. వాహనాలు విక్రయించే డీలర్లే రెండు శిరస్త్రాణాలను ఉచితంగా ఇవ్వాలని నిబంధనలున్నాయి. వాటిని చాలామంది బేఖాతరు చేస్తుండటమే అసలు సమస్య.

ఇదీ నిబంధన 

కేంద్ర మోటారు వాహనాల నిబంధనలు, 1989లోని 138(4)(ఎఫ్‌) ప్రకారం.. ప్రతి ద్విచక్ర వాహనం అమ్మకం సమయంలో కొనుగోలుదారుకు తయారీదారుల నుంచి తెప్పించి డీలర్లు తప్పనిసరిగా రెండు శిరస్త్రాణాల్ని ఉచితంగా అందించాలి. అవి కచ్చితంగా బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్‌ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. వాహనం తయారీ సమయంలో పాటించే వివిధ భద్రత ప్రమాణాల్లో శిరస్త్రాణాన్నీ పరిగణించాలి.

ఉచిత శిరస్త్రాణాలు పొందడం తమ హక్కు అని.. చాలామంది వాహనదారులకు అవగాహన లేదు. కొందరు డీలర్లను అడిగితే తయారీదారులు సరఫరా చేయడం లేదంటూ చేతులెత్తేస్తున్నారు. ఓ ప్రముఖ సంస్థకు చెందిన ఒకరిద్దరు డీలర్లు తప్ప ఎక్కడా ఉచితంగా అందిస్తున్న దాఖలాలు లేవు.

ఇలా చేయాలి..

* రిజిస్ట్రేషన్‌ సమయంలో ఆర్టీవో కార్యాలయాల్లో వాహనం ఇన్‌వాయిస్‌తోపాటు ఉచిత శిరస్త్రాణాలు పొందినట్లు చూపించే ధ్రువీకరణపత్రం జత చేయడాన్ని తప్పనిసరి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

* వాహన డీలర్లు రెండు శిరస్త్రాణాల్ని ఉచితంగా తమకు ఇచ్చినట్లు కొనుగోలుదారు ధ్రువీకరణ ఇవ్వకపోతే వాహనం రిజిస్ట్రేషన్‌ ఆపేయాలి. అలాంటి సందర్భాల్లో డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలి.

* షోరూంలలో ‘ఉచిత నిబంధన’ బోర్డులను తప్పనిసరిగా ప్రదర్శించాలి.

* తెలంగాణలో 2020-21 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 9,06,705 వాహనాలు విక్రయించగా.. వాటిలో 6,45,954 (71.2 శాతం) ద్విచక్ర వాహనాలే.

* ద్విచక్ర వాహనదారుల ప్రమాద మరణాల్లో దేశంలో తెలంగాణ అయిదో స్థానంలో ఉంది.

* రాష్ట్రంలో ట్రాఫిక్‌ పోలీసులు విధిస్తున్న జరిమానాల్లో 70 శాతానికిపైగా శిరస్త్రాణం ధరించని కేసులే ఉంటున్నాయి. 2019లో 72,74,713 (73.3 శాతం), 2020లో అక్టోబరు నాటికి 89,13,892 (78.13 శాతం) కేసులు నమోదయ్యాయి.

6)తిరిగి తెలంగాణకి విక్రమ్ జిత్ దుగ్గల్... 



 తెలంగాణ కేడర్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి విక్రమ్‌జీత్‌ దుగ్గల్‌ను ఆకస్మికంగా రిలీవ్‌ చేస్తూ పంజాబ్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వెంటనే తిరిగి వెళ్లాలని ఆదేశిస్తూ ఆ రాష్ట్ర హోంశాఖ మూడు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు డీజీపీ మహేందర్‌రెడ్డికి సమాచారం అందించింది. రామగుండం కమిషనర్‌గా పనిచేస్తూ.. ఇంటర్‌స్టేట్‌ డిప్యుటేషన్‌పై 2019 ఏప్రిల్‌లో ఆయన సొంత రాష్ట్రం పంజాబ్‌కు వెళ్లారు. ఆ రాష్ట్ర సీఎంగా పనిచేసిన అమరీందర్‌సింగ్‌ అప్పట్లో దుగ్గల్‌ను సొంత రాష్ట్రానికి పిలిపించుకున్నారు. అమృత్‌సర్‌ కమిషనర్‌గా ఉంటూ రిలీవ్‌ అయ్యారు. ఇటీవలే అమరీందర్‌ ప్రభుత్వం మారిన నేపథ్యంలోనే కొత్త సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

7)TSRTC ఉద్యోగులకు ఆర్టీసి బంపర్ ఆఫర్.. ఐదు ఏళ్ల వరకు సెలవలు....


ఐదేళ్ల వరకు సెలవులు

అయినా మీ ఉద్యోగం భద్రం

డ్రైవర్లు, కండక్టర్లకు ఆర్టీసీ బంపర్‌ ఆఫర్‌

3 వేల మిగులు సిబ్బంది నేపథ్యంలో నిర్ణయం

‘అసాధారణ సెలవు’ను పునరుద్ధరించిన సంస్థ 


హైదరాబాద్‌: మస్తాన్, శేఖర్‌కే కాదు.. వీరిలా సుదీర్ఘ సెలవు పెట్టాలనుకునే డ్రైవర్, కండక్టర్లకు ఆర్టీసీ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. వీరికి ‘అసాధారణ సెలవు’విధానం వర్తింపజేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వు జారీ చేసింది. మీరు ఏదైనా కారణంతో విధులకు హాజరుకాలేని పరిస్థితి ఉందా.. అయితే దరఖాస్తు చేసుకోండి.. ‘అసాధారణ సెలవు’ఇచ్చేస్తామంటూ డిపో మేనేజర్లు డ్రైవర్, కండక్టర్లకు సూచిస్తున్నారు. దీంతో భారీ సంఖ్యలో సిబ్బంది ఈ ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ లీవ్‌ (ఈఓఎల్‌)’కు దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు.  

గుర్తొచ్చిందే తడవు అమల్లోకి..

రెండేళ్ల క్రితం కార్మికుల సమ్మె సందర్భంగా ఆర్టీసీ 1,300 అద్దె బస్సులను అదనంగా తీసుకుంది. వాటిల్లో అద్దె బస్సు యజమానులే ప్రైవేటు డ్రైవర్లను ఏర్పాటు చేసినందున అంతమేర సంస్థ డ్రైవర్లు మిగిలిపోయారు. ఆ వెంటనే వేయి బస్సులను ఆర్టీసీ తగ్గించుకోవటంతో మళ్లీ డ్రైవర్లు, కండక్టర్లు మిగిలిపోయారు. ఇలా ప్రస్తుతం దాదాపు 3 వేల మంది డ్రైవర్లు, కండక్టర్లు మిగిలిపోయి ఉన్నారు.

వీరికి పని లేకపోయినా జీతం చెల్లించాల్సిందే. అసలే అంతంత మాత్రంగా ఉన్న సంస్థ ఆర్థిక పరిస్థితి, మిగులు ఉద్యోగుల నేపథ్యంలో ఆర్టీసీకి ఈ అసాధారణ సెలవు గుర్తొచ్చింది. ఇలా సిబ్బంది మిగిలిపోతే ఈ సెలవు ఇవ్వచ్చని ఆర్టీసీ విధివిధానాల్లో ఉంది. గతంలో అమలు చేశారు కూడా. తర్వాత డ్రైవర్, కండక్టర్ల కొరత దృష్ట్యా దీన్ని నిలిపేశారు.   

గరిష్టంగా ఐదేళ్లే..: ఈఓఎల్‌ కింద గరిష్టంగా ఐదేళ్లపాటు సెలవులో ఉండొచ్చు. అప్పటివరకు వారి ఉద్యోగం అలాగే పదిలంగా ఉంటుంది. మిగిలి ఉన్న సెలవులను వినియోగించుకున్నంత మేర వారికి జీతం వస్తుంది. ఆ తర్వాత ఎలాంటి జీతం ఉండదు. అయితే జీతం రాకపోయినా పరవాలేదు సెలవు దొరి కితేచాలు అనుకునే.. అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నవా రికి, విదేశాలకు వెళ్లే ఆలోచన ఉన్నవారికి, రిటైర్మెంట్‌కు చేరువలో ఉన్న వారికి ఇది ఉపకరిస్తుంది. 

ఇబ్బందిగా మారిన రెండేళ్ల పొడిగింపు

గత సమ్మె తర్వాత ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ కాలాన్ని రెండేళ్లు పొడిగించారు. దీంతో 58 ఏళ్లకు బదులు 60 ఏళ్ల వయస్సు వరకు ఉద్యోగంలో కొనసాగే అవకాశం ఏర్పడింది. ఇది డ్రైవర్లు, కండక్టర్లకు ఇబ్బందిగా మారింది. వీరిలో చాలామంది 58 ఏళ్ల వయసు వచ్చేవరకు ఈ విధులు నిర్వర్తించడానికే ఇబ్బంది పడుతుంటారు. ఆరోగ్యపరంగా ఏర్పడే సమస్యలే దీనికి ప్రధాన కారణం. ఈ పరిస్థితుల్లో సర్వీసు మరో రెండేళ్లు పొడిగించటంతో చాలామంది నిస్సహాయ స్ధితిలో ఉన్నారు. తాజాగా ఇలాంటివారు కూడా ఈ అసాధారణ సెలవును వినియోగించుకునేందుకు, ఇతర ఆదాయ మార్గాలు చూసుకునేందుకు అవకాశం ఏర్పడింది.  

►మస్తాన్‌ ఆర్టీసీలో కండక్టర్‌.. కుటుంబ అవసరాలకు ఆదాయం సరిపోక పోవడంతో దుబాయ్‌ వెళ్లి పెద్దమొత్తంలో సంపాదించుకోవాలనుకుంటున్నాడు. నాలుగైదేళ్ల పాటు అక్కడే ఉండాలనే ఉద్దేశంతో అప్పటివరకు ఆర్టీసీ విధులకు రాలేనంటూ సెలవు ఆర్జీ పెట్టాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఇంత సుదీర్ఘ సెలవు పెడితే ఉద్యోగం ఉంటుందా? అనే సందిగ్ధంలో ఉన్నాడు. 

►శేఖర్‌ హైదరాబాద్‌లో బస్సు డ్రైవర్‌.. మరో నాలుగేళ్లలో రిటైర్మెంట్‌ ఉంది. కానీ ఇటీవల ఒంట్లో నిస్సత్తువగా ఉంటూ నగరంలో డ్రైవింగ్‌ చేయటానికి ఇబ్బంది పడుతున్నాడు. విధులకు వెళ్లొద్దని కుటుంబసభ్యులు సూచిస్తుండటంతో సుదీర్ఘ సెలవు పెట్టేసి ఇతర ఆదాయ మార్గాలు చూసుకోవాలనుకుంటున్నాడు. కానీ సంస్థ అనుమతిస్తుందో, లేదోనన్న అనుమానంతో ఉన్నాడు.

ఫిర్యాదులు నాకు చెప్పండి: సజ్జనార్‌

హైదరాబాద్‌: ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి చురుగ్గా వ్యవహరిస్తున్న సజ్జనార్‌.. ప్రయాణికులు, సొంత సిబ్బంది ఆర్టీసీకి సంబంధించి ఫిర్యాదులను, సూచనలను నేరుగా తన దృష్టికి తేవాలని సూచించారు. md@tsrtc.telangana.gov.in మెయిల్‌ ఐడీని వెల్లడించారు. @tsrtcmdoffice ట్విట్టర్‌ ఖాతాను కూడా అనుసరించాల్సిందిగా కోరారు.

8)కఠినంగా జేఈఈ అడ్వాన్స్డ్ ......పేపర్ 1 తో పోల్చుకుంటే పేపర్ 2 కష్టం. రేపు సాయంత్రం వెబ్ సైట్ లో ఓఎంఆర్ పత్రం




ఈనాడు- హైదరాబాద్‌, అమరావతి: ఐఐటీల్లో ప్రవేశానికి దేశవ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ కఠినంగా ఉందని నిపుణులు స్పష్టం చేశారు. గత ఏడాది పరీక్షతో పోల్చుకున్నా కష్టంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈసారి ఉదయం జరిగిన పేపర్‌-1 కంటే మధ్యాహ్నం జరిగిన పేపర్‌-2 ప్రశ్నపత్రం కష్టంగా ఉందని పేర్కొన్నారు. అధిక శాతం మంది విద్యార్థులు గణితం ప్రశ్నలకు ఎక్కువ సమయం వెచ్చించాల్సి వచ్చిందని, రసాయనశాస్త్రం ప్రశ్నలు క్లిష్టంగాను, భౌతికశాస్త్రం మధ్యస్తంగానూ ఉన్నాయని శ్రీచైతన్య జేఈఈ జాతీయ డీన్‌ ఎం.ఉమాశంకర్‌ చెప్పారు. మొత్తంమీద సగటు విద్యార్థికి ఈ పరీక్ష చాలా కఠినంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. రసాయనశాస్త్రం మార్కులు ఈసారి ఉత్తమ ర్యాంకును నిర్ణయిస్తాయన్నారు. సగటున 18 శాతం మార్కులు అంటే.. 360కి 65 వస్తే జనరల్‌ కేటగిరీ విద్యార్థులు అడ్వాన్స్‌డ్‌లో ఉత్తీర్ణులై కౌన్సెలింగ్‌కు అర్హత సాధిస్తారని అంచనా వేశారు. పేపర్‌-1, 2లో గణితం ప్రశ్నలు క్లిష్టంగా ఉన్నాయని విజయవాడకు చెందిన శారదా విద్యాసంస్థల నిపుణుడు విఘ్నేశ్వరరావు చెప్పారు. తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 25 వేల మంది పరీక్ష రాశారు. కొందరు విద్యార్థులు 310కి పైగా మార్కులు సాధించే అవకాశం ఉందని తెలుస్తోంది.

9)టీటీడీ శ్రీ పద్మావతి ఆస్పత్రిలో సేవలందించడానికి దరఖాస్తులు ఆహ్వానించిన టీటీడీ.


తిరుపతిలోని శ్రీపద్మావతి పిల్లల హృదయాలయం(శ్రీపద్మావతి చిల్డ్రన్స్‌ హార్ట్‌ సెంటర్‌) ఆసుపత్రిలో స్వచ్ఛందంగా సేవలందించడానికి దేశంలో గుర్తింపు పొందిన వైద్య నిపుణుల నుంచి తితిదే దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రాణదానం పథకం కింద నిర్వహిస్తున్న ఈ ఆసుపత్రిలో నవజాత శిశువులు, పిల్లలకు గుండె శస్త్ర చికిత్సలు, వైద్యసేవలు అందించడానికి పదిహేను ఏళ్ల అనుభవం కలిగి, హిందూ మతానికి చెందిన పీడియాట్రిక్‌ కార్డియో థొరాసిక్‌ సర్జన్లు అర్హులని తెలిపింది. ఈ సేవలు రెండు విధానాల్లో ఉంటాయని పేర్కొంది. ఆప్షన్‌-ఎ కింద సేవకు వచ్చే వైద్యుడితోపాటు ఐదుగురు కుటుంబ సభ్యులకు ఉచిత వసతి, తిరుమల శ్రీవారి ప్రొటోకాల్‌ దర్శనం, తిరుపతి-తిరుమల మధ్య ఉచిత రవాణా సదుపాయం కల్పించనుంది. ఆప్షన్‌-బి కింద తితిదే నియమ నిబంధనల మేరకు వైద్య నిపుణులకు పరస్పర ఒప్పందం ప్రకారం పారితోషికం చెల్లిస్తుంది. రెండో ఆప్షన్‌ ఎంచుకున్న వారికి వసతి, దర్శనం, స్థానిక రవాణా సదుపాయాలు ఉండవు. ఆసక్తి ఉన్న వైద్యులు cmo.adldirector@gmail.com మెయిల్‌ ఐడీకి వివరాలు పంపాలని కోరింది.

10)కరోనా 199 రోజుల కనిష్టానికి ఆక్టివ్ కేసులు.   




దిల్లీ: దేశంలో కొవిడ్‌ కేసుల సంఖ్య ఆదివారం మరింత తగ్గి 199 రోజుల కనిష్ఠానికి చేరింది. గత 24 గంటల్లో కొత్తగా 22,842 మంది వైరస్‌బారిన పడగా.. 25,930 మంది కోలుకున్నారు. 244 కొవిడ్‌ మరణాలు సంభవించాయి. మొత్తంగా వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య  3,38,13,903కి చేరగా.. వీరిలో 3,30,94,529 మంది కోలుకున్నారు. 4,48,817 మంది మహమ్మారికి బలైపోయారు. మరోవైపు దేశవ్యాప్తంగా 90.51 కోట్ల టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.