- పోడు రైతుల్లో చిగురిస్తున్న ఆశలు
- గంజా మొక్కల సాగు చేస్తున్న వ్యక్తి అరెస్టు
- రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆహ్వానం....
- సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో బయోమెట్రిక్ టోకెన్ మెషిన్
- లింగభేదాన్ని పక్కనపెట్టేశారు.. మానసిక వికలాంగుడని కూడా చూడకుండా..
- రోగుల సహయకులకి వినతి
- వేధింపులు భరించలేక సుపారీ ఇచ్చి చంపించిన భార్య
- రౌడీ షటర్స్ సత్ప్రవర్తనతో మెలగాలి
పోడు రైతుల్లో చిగురిస్తున్న ఆశలు
- హక్కు పత్రాలిస్తామన్న సీఎం ప్రకటనతో హడావుడి
- రికార్డుల దుమ్ము దులుపనున్న ఐటీడీఏ
- జిల్లాలో 35వేలకు పైనే దరఖాస్తు చేసుకునే అవకాశం
- గిరిజనేతరుల అంశం ఇంకా డోలయామానంలోనే
ఆసిఫాబాద్:
ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్‌ఆర్ ప్రభుత్వం 2006లో అటవీ భూములను సాగు చేసుకుంటున్న ఆదివాసీలకు హక్కు పత్రాలిచ్చింది. ఆ తర్వాత సరిగ్గా 15ఏళ్లకు మళ్లీ ఈ అంశంపై కదలిక మొదలైంది. రాష్ట్రంలో నిత్యకృత్యంగా మారిన పోడు వివాదాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అటవీ భూములను సాగు చేసుకుంటున్న రైతులకు ఆర్‌వోఎఫ్‌ఆర్ కింద మరోసారి పట్టిలిస్తామంటూ తాజా ప్రకటన జారీ చేశారు. దీంతో జిల్లాకు చెందిన వేలాది మంది రైతుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ముఖ్యంగా పట్టాలకోసం ఎదురు చూస్తున్న ఆదివాసీ రైతులు ముఖ్యమంత్రి ప్రకటనలతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీ జిల్లాగా గుర్తింపు పొందిన ఆసిఫాబాద్‌లో ప్రతీఏటా పోడు రైతులు సాగు ప్రారంభంలోనే అటవీ అధికారులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కొనసాగుతూ వస్తోంది. ఈ క్రమంలో దాడులు, ప్రతిదాడులు వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దాంతో స్థానిక శాసన సభ్యులు, పార్లమెంటు సభ్యులపై రైతుల ఒత్తిడి అధికంగా ఉంది. ఈ క్రమంలో గత ఎన్నికల ముందు ముఖ్యమంత్రి పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామంటూ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగానే అర్హులైన రైతులు వారు సాగు చేసుకుంటున్న పోడు భూములకు హక్కు పత్రాలు జారీ చేయడం కోసం ఈ నెల3వ వారం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభిస్తామని పేర్కొనడంతో దీనిపై స్పష్టత వచ్చినట్లయింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో అర్హులు ఇదివరకు ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు, గతంలో ఎంతమందికి పట్టాలిచ్చారు, ఎంతమందికి హద్దులు నిర్ణయించి పొజిషన్ ఇచ్చారన్న విషయాన్ని తేల్చేందుకు ఉట్నూరు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) రికార్డుల దుమ్ము దులుపుతోంది.
35వేలకు పైనే దరఖాస్తులు వచ్చే అవకాశం..
జిల్లాలో 3మండలాలు మినహా మిగితా అన్ని మండలాల్లోనూ అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం తాజా నిర్ణయంతో భారీ ఎత్తున పోడు పట్టాల కోసం దరఖాస్తుల వెల్లువ కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 2006లో ఆర్‌వోఎఫ్‌ఆర్ కింద మొత్తం 82,129ఎకరాల అటవీ భూములకు పోడు పట్టాలకోసం 21,641మంది రైతులు గిరిజన సంక్షేమ శాఖలో దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో కేవలం 12,631మందికి 46,321ఎకరాలకు మాత్రమే పట్టాలు జారీ చే శారు. దాదాపు 9వేల మంది రైతుల దరఖాస్తులను బుట్టదాఖలు చేశారన్నమాట. అయితే వీరిలో చాలామంది అర్హులైన రైతులున్నా అటవీశాఖ మోకాలడ్డడంతో మిగితా వారికి భూమి హక్కు పత్రాలు అందకుండా పోయాయి. ప్రస్తుతం అలాంటి రైతు కుటుంబాల సంఖ్య అపరిమితంగా పెరిగిపోయినట్లు చెబుతున్నారు. తాజా అంచనాల ప్రకారం ఈ దఫా దరఖాస్తులు 35వేల నుంచి 40వేల వరకు ఉండొచ్చంటున్నారు.
గిరిజనేతర రైతులపై ఇంకా అస్పష్టతే..
జిల్లాలో అటవీశాఖ లెక్కల ప్రకారం సుమారు 40వేల ఎకరాలకు పైగా అటవీ భూములు సాగు భూములుగా మారాయి. ప్రభుత్వం గిరిజనులకు మరోసారి ఆర్‌వోఎఫ్‌ఆర్ కింద పట్టాలిచ్చేందుకు ప్రయత్నిస్తోంది. అయితే జిల్లావ్యాప్తంగా సుమారు 15-20వేల ఎకరాలలో గిరిజనేతర రైతులు సాగు చేసుకుంటున్న భూములపై మాత్రం ఇంకా స్పష్టతనివ్వలేదు. దీంతో తమ పరిస్థితి ఏమిటన్నదానిపై గిరిజనేతర రైతులు సంకట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉంటే జిల్లాలో రెవెన్యూ, అటవీ శాఖల మధ్య సుమారు 3,661ఎకరాల్లో వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ భూములపై రెవెన్యూశాఖ గిరిజనేతర రైతులకు లావుని పట్టాల రూపంలో హక్కు పత్రాలిచ్చింది. అయితే అటవీశాఖ మాత్రం ఆ భూములు తమవేనంటూ పేచీ పెడుతుండడాన్ని రైతులు జీర్ణించుకోలేక పోతున్నారు.
2)గంజా మొక్కల సాగు చేస్తున్న వ్యక్తి అరెస్టు
ఆసిఫాబాద్
గంజాయి మొక్కల సాగు మరియు అక్రమ రవాణా నిరోధించడానికి ఆసిఫాబాద్ ఇన్స్పెక్టర్ పోలీసు ఆద్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పరచి విస్తృత తనిఖీలలో భాగంగా తేదీ 11.10.2021 రోజున
ఆసిఫాబాద్ మండలంలోని తుంపెల్లి గ్రామ శివారులోని పత్తి చేనులో గంజాయి మొక్కల సాగుచేస్తున్నట్లు సమాచారం అందగా ఆసిఫాబాద్ సబ్ ఇన్స్పెక్టర్ అయిన సి. హెచ్. గంగన్న మరియు పోలీస్ సిబ్బంది వెళ్ళి తనిఖీ చేయగా చునార్కర్ ముకుంద్ రావు పత్తి చేనులో గంజాయి మొక్కలు ఉండడంతో వెంటనే ఆసిఫాబాద్ తహశీల్దార్ కి సమాచారం అందించగా, ఆసిఫాబాద్ తహశీల్దార్ అక్కడకు వచ్చి నేరస్తుని ఒప్పుదల మరియు జప్తు పంచనామా చేసి ఇవ్వగా సబ్ ఇన్స్పెక్టర్ 40 గంజాయి మొక్కలను స్వాదీనమ్ చేసుకొని నిందితున్ని అదుపులోనికి తీసుకుని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు, ఆసిఫాబాద్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేసి నిందితుణ్ణి అరెస్ట్ చేసి ఈ రోజు రిమాండుకు పంపించడం జరిగినది.
ఆసిఫాబాద్ మండలం లో, గ్రామాల్లో ఎక్కడైనా గంజాయి మొక్కల సాగు మరియు అక్రమ రవాణా చేస్తే కేసులు నమోదు చేసి చట్ట పరమైన చర్యలు తీసుకోబడుతుందని ఎ. అశోక్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు, ఆసిఫాబాద్ తెలిపారు.
3)రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆహ్వానం....
శాంతి భద్రతల మరియు సమాజ రక్షణలో తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా పెట్టి, పోరాడి వీరమరణం పొందిన అమర పోలీసుల జ్ఞాపకార్థం అక్టోబర్ 21 నాడు జరుగు “అమరవీరుల సంస్మరణ దినం” సందర్భంగా పోలీసు శాఖకు సంబంధించిన విధులు, వివిధ సేవలు, ప్రత్యేకతలతో కూడిన షార్ట్ ఫిల్మ్ (తెలుగు/ఉర్దూ/ఇంగ్లీష్ భాషలలో) అంశం మీద షార్ట్ ఫిలిం మరియు ఫోటోగ్రఫీ పోటీలు: (10X12 సైజ్ ఫోటోలు రెండు కాపీలు ఇవ్వవలెను) ఈమధ్య కాలపు ఫోటోలు మాత్రమే. కమీషనరేట్ పరిధిలో ఆసక్తి గల యువతీ, యువకులు, ప్రజలు, ఆసక్తి గల్గినవారు ముందుకు రావాలని సిపి శ్రీ చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్ గారు ఒక ప్రకటనలో కోరారు. షార్ట్ ఫిలిం తీసి పంపేవారు తేదీ: 16-10-2021 నాడు సాయంత్రం వరకు సిపి గారి కార్యాలయంలో అందజేయగలరు. ఇట్టి షార్ట్ ఫిలిం 3 నిమిషాలు మించకూడదు, అలాగే తీసిన షార్ట్ ఫిలింను సిడిలో లేదా పెన్ డ్రైవ్ లో అందజేయగలరని మనవి. వారి యొక్క ప్రతిభను బట్టి విజేతలుగా నిలిచిన వారికి మొదటి, రెండవ మరియు మూడవ బహుమతులు మెరిట్ సర్టిఫికెట్స్ తేదీ: 21-10-2021 నాడు అందజేస్తామని తెలిపారు. కమీషనరేట్ స్థాయిలో సెలెక్ట్ అయిన మూడు షార్ట్ ఫిలింలను స్టేట్ కాంపిటేషన్ గురించి డీజీపీ ఆఫీస్ హైదరాబాదుకు పంపించడం జరుగుతుంది.
ఇట్లు
ఎస్. చంద్రశేఖర్ రెడ్డి, ఐపీఎస్.,(డిఐజి)
కమీషనర్ ఆఫ్ పోలీస్, రామగుండం
4)సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో బయోమెట్రిక్ టోకెన్ మెషిన్
సికింద్రాబాద్: జనరల్ బోగీల్లో ప్రయాణం చేసేప్పుడు ఇబ్బందులు పడుతున్నారా? అయితే ఒక్క టోకెన్ తో ఈ ఇబ్బందులకు చెక్ పెట్టింది దక్షిణ మధ్య రైల్వే పరిగెత్తుకుంటూ వచ్చి చెమటలు వస్తుంటే రైలులో ఒక్కసీటు కోసం ఎంత కష్టపడిపోతామో కదా. అదృష్టం బాగుంటే దొరుకుతుంది. ఒక్కోసారి అస్సలు దొరకదు. గమ్యస్థానం వరకూ నిలబడే ఉండాలి. ఇలాంటి సమస్యలకు దక్షిణమధ్య రైల్వే ఒక టోకెన్తో పరిష్కారాన్ని అందుబాటులోకి తెచ్చింది. సాధారణ బోగీల్లో ప్రయాణం చేసేవారు ఒక్క టోకెన్ తీసుకొంటే చాలు. సీటులో కూర్చొని ప్రశాంతంగా వెళ్లొచ్చు. భారతీయ రైల్వే బయోమెట్రిక్ టోకెన్ మెషిన్ సేవలను ప్రారంభించింది. ప్రయాణికుల రద్దీని తగ్గించడంతోపాటు. క్యూలో నిల్చుని ఇబ్బందులు పడేవారి కోసం మొదటిసారిగా సికింద్రబాద్ రైల్వే స్టేషన్ లో బయోమెట్రిక్ టోకెన్ మెషిన్ ను ప్రారంభించారు.
5)లింగభేదాన్ని పక్కనపెట్టేశారు.. మానసిక వికలాంగుడని కూడా చూడకుండా..
సమాజంలో కామాంధుల పైశాచిత్వం పెచ్చరిల్లుతోంది. వావివరుసలు, వయోబేధాలు లేకుండా పేట్రేగిపోతున్న ఉదంతాలు రోజూ ఎక్కడో ఓ చోట వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఆ ఊర్లో ఉన్న ఐదురుగు ప్రబుద్ధులు ఇంకో అడుగు ముందుకేసి.. లింగభేదాన్ని కూడా పక్కన పెట్టేశారు. మానసిక వికలాంగుడ(mentally challenged)నే మానవత్వం కూడా లేకుండా వికృత చేష్టల(sexual harassment)కు పాల్పడ్డారు.
అమ్మాయిలను లైంగికంగా వేధిస్తున్న(sexual abuse) వాళ్లను కీచకులుగా చూస్తుంటే.. వీళ్లు అబ్బాయి మీద లైంగిక దాడి(sexual harassment)కి దిగారంటేనే.. వారిలో ఎంత సైకోయిజం ఉందో అర్థమవుతోంది. అందులోనూ.. ఆ బాధితుడు మానసిక వికలాంగుడు(mentally challenged) అని కూడా చూడకుండా లైంగిక దాడి(sexual harassment)కి దిగారంటే.. వారిని ఎమని సంభోదించాలో కూడా అర్థం కాని పరిస్థితి.
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం దొరగారిపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. 19 ఏళ్ల మానసిక వికలాంగునిపై గత కొన్ని రోజులుగా కొందరు వ్యక్తులు లైంగికదాడికి పాల్పడుతున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అదే గ్రామానికి చెందిన నలుగురు యువకులతో పాటు తండ్రి వయసున్న ఇంకో వ్యక్తి.. మానసిక వికలాంగుని అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని లైంగిక దాడికి పాల్పడుతూ వచ్చారు. రెండు మూడు రోజులుగా బాధితుని ప్రవర్తనలో తేడా రావడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వివరాలు ఆరా తీయగా ఈ దుశ్చర్య వెలుగులోకి వచ్చింది.
కుటుంబసభ్యులు వెంటనే జైపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రవి, నందం, సాదిక్, రాజలింగు, సురేష్ అనే ఐదుగురిపై కంప్లైంట్ ఇచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
6)రోగుల సహయకులకి వినతి
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్‌లోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రులలో రోగుల వెంట వచ్చే సహాయకులకు దసరా నుంచి వసతి సౌకర్యం కల్పిస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ తెలిపారు. దీని కోసం ఏర్పాట్లు చేపట్టామన్నారు. ఆసుపత్రిలో వసతి సౌకర్యాలపై శనివారం ఆయన బీఆర్‌కే భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వైద్య, ఆరోగ్య కార్యదర్శి రిజ్వి, హరే కృష్ణ మిషన్ ఛారిటబుల్ ఫౌండేషన్ సీఈవో కౌంతేయ దాస్, ఆసుపత్రుల సూపరింటెండెంట్లు ఇందులో పాల్గొన్నారు. నిమ్స్, నిలోఫర్, ఉస్మానియా, గాంధీ, టిమ్స్, కింగ్ కోఠి, ఫీవర్ ఆసుపత్రి, ఎంఎన్‌జే క్యాన్సర్, ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రులకు రోగులతో పాటు పెద్ద సంఖ్యలో సహాయకులు వస్తున్నందున అక్కడ వసతి సౌకర్యం కల్పిస్తామని సీఎస్ తెలిపారు. అన్ని వసతులు కలిగిన ఆశ్రయంతోపాటు మహిళా సహాయకులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామన్నారు. ఆయా ఆసుపత్రుల వద్ద షెల్టర్లను గుర్తించేందుకు ఆదేశించామన్నారు. హరేకృష్ణ మిషన్ ఫౌండేషన్ సహకారంతో సబ్సిడీపై అల్పాహారం, భోజన సౌకర్యాలు కల్పిస్తామన్నారు.
7)వేధింపులు భరించలేక సుపారీ ఇచ్చి చంపించిన భార్య
లక్షెట్టిపేట పట్టణం లోని జరిగినటువంటి హత్య కేసుకు సంబంధీచి ప్రెస్ మీట్ ఇచ్చిన ఏసీపీ అఖిల్ మహాజన్ కేసు దర్యాప్తు చేస్తూ వెల్లడించిన వివరాల ప్రకారం గత సంవత్సరం నుండి మా అన్నయ్య అయినటువంటి రవి కుమార్ కనబడుట లేదని నింధితుని చెల్లి దివ్య 27.06.2021 నాడు లక్షెట్టిపేట స్థానిక పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసింది రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిచారు శైలజ వాడుతున్న మొబైల్ ని సీడీఆర్ ద్వారా రికార్డింగ్ తెప్పించుకుని శైలజ ని అదుపులో కి తీసుకొని విచారించగా మేము2007 లో ప్రేమ వివాహం చేసుకున్నాము రోజు మద్యం తాగి వచ్చి వేధించేవాడు 2018లో విడాకులు తీసుకున్నాము అయినప్పటికీ రవి మళ్ళీ వచ్చి గత మాదిరిగా ఉంటూ విపరీతంగా వేధించేవాడు వేధింపులకు భరించలేక 26/06/2020 రోజున గంగారాం, సాయికుమార్ అనే ఇద్దరు వ్యక్తులతో లక్షరూపాయల ఒప్పందంతో చంపించినట్లు ఒప్పుకుందని గంగారాం,సాయికుమార్ కలిసి రవి కుమార్ ను స్థానిక ఇటిక్యాల్ చెరువు సమీపంలో మద్యం తాగించి తలపై బండరాయి తో బలంగా కొట్టి చంపి మృతదేహాన్ని చెరువులో పడేసి వెళ్లినట్టు ఏసీపీ అఖిల్ మహాజన్ తెలిపారు.
8)రౌడీ షటర్స్ సత్ప్రవర్తనతో మెలగాలి
భూకబ్జాలకు, బెదిరింపులకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు : గోదావరిఖని ఏసీపీ గిరి ప్రసాద్
గోదావరిఖని పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి ఐపిఎస్., గారి ఆదేశానుసారం గోదావరిఖని 1టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లను పిలిపించి వారి జీవన విధానంతో పాటు, ప్రస్తుత వారి కుటుంబం స్థితిగతులను గురించి అడిగి తెలుసుకుని సత్ప్రవర్తనతో మెలగాలని కౌన్సెలింగ్ నిర్వహించిన గోదావరిఖని ఏసిపి గిరి ప్రసాద్ గారు.
ఈ సందర్భంగా ఏసీపీ గారు మాట్లాడుతూ.... రౌడీషీటర్లు నేర రహిత జీవితం నుండి బయటకు వచ్చి ఏదో కాయకష్టం చేసుకుని, లేదా ప్రభుత్వం కల్పిస్తున్న ఉపాధి పథకాలు, సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకొని ప్రశాంతమైన జీవితం గడపాలని వారికి వారి కుటుంబ సభ్యులకు సమాజంలో మంచి గౌరవం లభిస్తుందని తెలిపారు. శాంతిభద్రతలకు మరియు ప్రజల హక్కులకు భంగం కలిగిస్తూ వారిపై, దాడులకు పాల్పడితే సహించేది లేదని, ముఖ్యంగా భూకజ్జాలకు పాల్పడతూ తగదాలకు మద్యవర్తిత్వం చేస్తూ ప్రజలపై దాడులకు పాల్పడడంలాంటి చట్టవ్యతిరేక కార్యకలపాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యహరించడంతో పాటు కేసు నమోదు చేసి, పీడీ యాక్ట్ కింద జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. ప్రతి 6 నెలలకు ఒక్కసారి చెడు ప్రవర్తన కలిగిన వారిని బైండోవర్ చేయడం వలన వారిపై పోలీస్ నిఘా ఉంటుంది కాబట్టి వారి కదలికలు మరియు ప్రవర్తన గురించిన విషయాలు తెలుసుకొవడం జరుగుతుంది. రౌడీ షీటర్లలో ఇకనైన మార్పురావాలని సూచించారు. తెలంగాణ పోలీసులు ప్రజలకు ఫ్రెండ్లీ పోలీసింగ్ తో సేవలు అందించడం జరుగుతుంది. అదే సమయంలో చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడిన వారిపై, మరియు చట్టాన్ని చేతిలోకి తీసుకున్న వారిపై చట్టని అతిక్రమించే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు, రాజ్ కుమార్, సర్కిల్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి