శనివారము 23-04-2022
రఘునాథపల్లి మండలం ,కుర్చపల్లి , గోవర్ధనగిరి మరియు కోమల్ల గ్రామాల్లో ఐకెపి(మహిళ సంఘాల)ఆధ్వర్యం లో నిర్వహించే యాసంగి ధాన్యం కొనుకోలు కేంద్రాలను తెలంగాణ తొలి ఉపముఖ్యమంత్రివర్యులు , ఎమ్మెల్యే డాక్టర్.తాటికొండ రాజయ్య ప్రారంభించారు.
ఎమ్మెల్యే డా.రాజయ్య కామెంట్స్:
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...
ఈ రోజు కుర్చపల్లి గోవర్ధనగిరి మరియు కోమల గ్రామాలలో ఐకెపి(మహిళా సంఘాల) ఆధ్వర్యంలో నిర్వహించే యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగిందని తెలిపారు.
రైతు బాంధవుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతుల పక్షపాతిగా రైతును రాజును చేయాలని అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాడని తెలిపారు.
రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చే ముందర ధాన్యాన్ని మంచిగా ఆరబెట్టి , తాలు , మట్టి లేకుండా , తేమశాతం 17 శాతం కంటే తక్కువగా ఉండే విధంగా చూసుకోవాలని రైతులకు సూచించారు.కొనుగోలు కేంద్రాల వద్ద నీళ్లు , నీడ కోసం ఏర్పాట్లు చేయాలని నిర్వాహకులకు సూచించారు
నకిలీ విత్తనాలు అమ్మితే అలాంటి షాపుల యజమానుల మీద పిడి ఆక్ట్ కేసులు పెట్టి అలాంటి వారికి రెండు లక్షల రూపాయల జరిమానా అదేవిధంగా రెండు సంవత్సరాలు జైలు శిక్ష విధించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
రైతులకు సాగునీరు అందించడం కోసం సాగునీటి రంగానికి ప్రాధాన్యతనిస్తూ దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేసి , పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు , సీతారామ ప్రాజెక్టు , ఎస్సారెస్పీ పునర్జీవ పథకం , అదేవిధంగా
85 వేల కోట్ల రూపాయలు వెచ్చించి కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి ఎడారిగా ఉన్న తెలంగాణ సస్యశ్యామలం చేసిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుందని తెలిపారు.
మన ముఖ్యమంత్రి కేసిఆర్ గారు స్వయంగా రైతు , అందులో మనసున్న మహారాజు , రైతుల పక్షపాతి , రైతుల పాలిట దేవుడు , రైతు బాంధవుడు కావున రైతుల కోసం అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాడు. కావున తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం దిగుబడి అధికంగా ఉందని తెలిపారు.
ఇవన్ని చూసి ఓర్వలేనితనంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం మీద కక్ష కట్టింది , తెలంగాణ ప్రభుత్వం మీద కక్ష కట్టి , సీఎం కెసిఆర్ మీద కక్ష గట్టి , తెలంగాణ రైతుల మీద కక్ష గట్టి తెలంగాణ రాష్ట్రంలో యాసంగి పండించే దాన్యం కొనుగోలు చేయమని చెప్పింది.ఎందుకు కొనుగోలు చేయరని ప్రశ్నించినపుడు యాసంగిలో పండే దాన్యం మరాడించేటప్పుడు నూకల శాతం ఎక్కువ అవుతుంది. కావున కొనుగోలు చేయమని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. అందుకు నిరసనగా తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి మద్దతుగా ఈనెల 11న దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున రాష్ట్ర ముఖ్యమంత్రి , మంత్రులు , ఎంపీలు , ఎమ్మెల్యేలు మరియు ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు తెలంగాణ రైతులు అందరు కలిసి టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగిందని తెలిపారు. అయినను కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోయేసరికి తెలంగాణ రాష్ట్ర రైతుల కంటే నాకేం ఎక్కువ కాదని చెప్పి సీఎం కేసీఆర్ గారు మొండి ధైర్యంతో పోతే పోనీ రూ.3000 కోట్లు అని చెప్పి తెలంగాణ రాష్ట్ర రైతాంగం ఈ యాసంగిలో పండించిన ధాన్యాన్ని మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా రైతుల వద్ద నుండి కొనుగోలు చేస్తుందని తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి కెసిఆర్ గారు భరోసా ఇవ్వడం జరిగిందని తెలిపారు. అందులో భాగంగానే రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో కూడా ఒక కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఆ కొనుగోలు కేంద్రం ద్వారా రైతులు పండించిన ధాన్యాన్ని మొత్తం కూడా ఆఖరు గింజ వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సీఎం కేసీఆర్ గారు తెలపడం జరిగిందన్నారు.
భారతదేశ చరిత్రలో అత్యధికంగా వరి పండించే రాష్ట్రం ఇంతకు ముందు పంజాబ్ ఉండేడిది. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చాక గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో సాగునీటి రంగానికి పెద్దపీట వేసి , అధిక ప్రాధాన్యతనిచ్చి అనేక సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి వ్యవసాయానికి అనుకూలంగా సాగునీరు అందడంతో తెలంగాణ రాష్ట్రంలో అధికంగా వరి సాగుచేయబడి , అత్యధిక వరి ఉత్పత్తి చేయబడుతున్న రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 500 టీఎంసిల నీటిని నిల్వ చేసి 600 మీటర్లకు ఎత్తిపోసి తెలంగాణలో రిజర్వాయర్లోకి మీరు ఫుల్ గా చేరి ఉండటం అదేవిధంగా దేవాదుల ద్వారా కాలువల నిర్మాణం తెలంగాణకు హరితహారం కార్యక్రమం ద్వారా నాలుగు శాతం అటవీ విస్తీర్ణం పెంచుకొని తెలంగాణలో సాధారణ వర్షపాతం 760 మిల్లీమీటర్ల నుండి ఈరోజు తెలంగాణలో వర్షపాతం 933 మిల్లీమీటర్లుగా నమోదు అయిందని తెలిపారు. తద్వారా చెరువుల్లో కుంటల్లో నీరు సమృద్ధిగా రావడం గ్రౌండ్ లెవెల్ వాటర్ లెవెల్ పెరిగి బావుల్లో , బోరు బావుల్లో నీరు సమృద్ధిగా రావడం వల్ల ఈ రోజు వరి అత్యధిక ఎకరాల్లో పంట పండించడం జరిగిందని తెలిపారు.
తెలంగాణ రైతులు యాసంగిలో పండించే మొత్తం ధాన్యాన్ని ప్రతిగింజ కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే కొంటది.!
మద్దతు ధరకే రాష్ట్ర ప్రభుత్వం కొంటది రైతులు ఎవ్వరూ కూడా ఆందోళన చెంది తక్కువ ధరకు అమ్ముకోవద్దని సీఎం కేసీఆర్ గారు తెలంగాణ రైతన్నలకు బరోసానిచ్చారు.
ఏ-గ్రేడ్ వరి రకానికి 1960 /- , సాధారణ వరి రకానికి 1940 /- రూపాలుగా కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు.
గ్రామస్థాయిలోనే నేరుగా రైతుల వద్ద నుండి వరి ధాన్యం కొంటున్నా దేశంలోనే ఏకైక రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలోని కేసీఆర్ గారి ప్రభుత్వం అని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం రాకముందు ఆరుకాలం కష్టపడి రైతు పండించిన పంటను ఆఖరికి మధ్య దళారులకు అమ్ముకునేది.కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చాక స్వయంగా మన ప్రియతమ ముఖ్యమంత్రివర్యులు మనసున్న మహారాజు కేసీఆర్ గారు రైతుల ఆత్మహత్యలు నివారించడానికి రైతును రాజును చేయడానికి అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నా రైతు బాంధవుడు కేసీఆర్ గారని తెలిపారు.
రైతుబంధు పథకం ద్వారా సంవత్సరానికి ఎకరాకు 10000 రూపాయలు పెట్టుబడి సాయం అందిస్తు , అదేవిధంగా రాష్ట్రంలోని రైతులకు సంబంధించిన 20 లక్షల మోటర్లకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తు అందిస్తూ , గుంట భూమి ఉన్న రైతు మరణిస్తే రైతుబీమా ద్వారా 5 లక్షల రూపాయలు ఇస్తున్న గొప్ప మనస్సున్న మహారాజు , రైతు బాంధవుడు , రైతు పక్షపాతి కెసిఆర్ గారని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి అనేకమైన సాకులు చెబుతూ మాటలు మారుస్తూ రైతులను ఇబ్బంది పెట్టే విధంగా బిజెపి ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలైన నల్ల చట్టాలను తీసుకు వచ్చిందని తెలిపారు.కానీ తెలంగాణ రాష్ట్రంలో రైతు పక్షపాతి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండడం తెలంగాణ రైతుల అదృష్టమని తెలిపారు.
రాష్ట్రంలో ఈ యాసంగి(ఎండాకాలం) సీజన్ లో 36 లక్షల ఎకరాల్లో పండిన వరి ధాన్యం రైతుల వద్ద నుండి కొనుగోలు చేయడం కోసం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల వద్ద నుండి నేరుగా కొంటున్న రాష్ట్రం దేశంలోనే ఒక తెలంగాణ రాష్ట్రమని తెలిపారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బిజేపి ప్రభుత్వం యాసంగిలో పండించిన ధాన్యాన్ని కొనుగోలు చెయ్యమని చెపుతున్న దృష్ట్యా వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 11 వ తారీఖున తెలంగాణ రాష్ట్ర రైతుల పక్షాన టిఆర్ఎస్ పార్టీ దేశరాజధాని డిల్లీ నడిబొడ్డున ధర్నా చేయడం జరిగిందని తెలిపారు.అయిన కూడా కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో రైతుల పక్షపాతి రైతుల పాలిట దేవుడు రైతు బాంధవుడు రైతుల కోసం ఆలోచించి క్వింటాలు ధాన్యం మీద 600 /- రూపాయలు నష్టానికి మొత్తం రూ.3000 కోట్లు(మూడు వేల కోట్ల) రూపాయల నష్టాన్ని భరిస్తూ కేంద్రంతో సంబంధం లేకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర 1960 /- రూపాయలతో కొనుగోలు చేస్తుందని ముఖ్యమంత్రి కెసిఆర్ గారు తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ధైర్యం చెప్పి భరోసా ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర రైతాంగం యాసంగిలో పండించే ధాన్యాన్ని కొనుగోలు కోసం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు
ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.రైతులు పండించిన ఆఖరి గింజ వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని తెలిపారు.కావున రైతులు ఎవ్వరూ ఆధైర్యపడవద్దని రైతులకు భరోసా కల్పించారు.
ఈ కార్యక్రమంలో అందుబాటులో ఉన్న ప్రజాప్రతినిధులు ముఖ్య నాయకులు మరియు పార్టీ శ్రేణులు సంబంధిత శాఖల అధికారులు మరియు రైతులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.