వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మంచిర్యాల ఎమ్మెల్యే

 వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మంచిర్యాల ఎమ్మెల్యే



మంచిర్యాల:

మంచిర్యాల నియోజకవర్గం లోని హాజీపూర్ మండల పరిధిలోని పడ్తనపల్లి గ్రామంలో గురువారం మంచిర్యాల శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు  వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారభించారు.




ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో ఏర్పాటు చేసిన రైతుల సమావేశంలో ఎమ్మేల్యే  మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులపై వివక్ష చూపుతుందని, రాష్ర్టంలో పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయమని చెప్పి రైతులను ఆందోళనకు గురి చేసిందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ ప్రాంత రైతుల కోసం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసుటకు ప్రత్యేక చొరవ చూపుతున్నారని అన్నారు. 



మంచిర్యాల నియోజకవర్గం లో పడ్తనపల్లి గ్రామంలో మొదటి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో పండించిన పంటలు తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని, దళారులను నమ్మి మోసపోవద్దు అని సూచించారు.



 ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోలీ కేరి, అదనపు కలెక్టర్ మధుసూధన్ నాయక్, మంచిర్యాల వ్యవసాయ కమిటీ ఛైర్మెన్ పల్లె భుమేష్, హాజీపూర్ మండల టీఆరెఎస్ పార్టీ అధ్యక్షులు మొగిలి శ్రీనివాస్, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి