బ్యాంకులను మోసం చేస్తున్న హర్యానా రాష్ట్ర నేరస్తులను పట్టుకున్న మంచిర్యాల పోలీసులు.
గత కొద్ది నెలలుగా ATM వద్ద నుండి డబ్బులను డ్రా చేస్తూ వారి వద్ద వున్న ఒక చిన్న తాళం చెవితో మోసపూరితంగా ATM మెషీన్ ను పనిచేయకుండా చేసి తిరిగి వారు డబ్బులు డ్రా చేయనట్టుగా సదరు బ్యాంకు వారికి ఫిర్యాదు చేసి తిరిగి డబ్బులు బ్యాంకు నుండి పొందుతూ బ్యాంకులను మోసం చేస్తున్న హర్యానా రాష్ట్ర నేరస్తులను పట్టుకున్న మంచిర్యాల పోలీసులు.
తేదీ 03.11.2021 రోజున శ్రీ. నల్లపు వెంకటేష్ వృ; అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదు మేరకు రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ గౌ; శ్రీ ఎస్.చంద్ర శేఖర్ రెడ్డి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మరియు గౌ; శ్రీ. ఉదయ్ కుమార్ రెడ్డి డిసిపి మంచిర్యాల , గౌ; శ్రీ. N. అశోక్ కుమార్ డిసిపి ( అడ్మిన్) రామగుండం , గౌ; శ్రీ. అఖిల్ మహాజన్ IPS, ఏసీపీ మంచిర్యాల, గార్ల ఆద్వర్యం లో B. నారాయణ ఇన్స్ పెక్టర్ ఆఫ్ పోలిస్, మంచిర్యాల , డి. కిరణ్ కుమార్ సబ్ ఇన్స్ పెక్టర్ ఆఫ్ పోలిస్ మంచిర్యాల మరియు బి.దివాకర్ HC 249 , శ్రీనివాస్ PC 3320,బ్రహ్మచారి PC 3598 మరియు సిబ్బంది తో కలిసి మంచిర్యాల పట్టణం లో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా మంచిర్యాల పట్టణం లోని రైల్వే స్టేషన్ వద్ద నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించటం తో వారిని పట్టుకొని విచారించగ వారి పేర్లు 1) రాబిన్ ఖాన్ 2) ఎజాజ్ అహ్మద్ ఖాన్ 3) హరేస్ 4) సాహిబ్ అలియాస్ మహమ్మద్ సాహిబ్ లు అని తెలపడం జరిగింది.వారిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరాలకు పాల్పడినట్లు ఒప్పుకోవడం జరిగింది.
నిందితుల వివరాలు :-
A1) రాబిన్ ఖాన్ s/o ఎలియాస్, వయస్సు 25 సంవత్సరాలు, కులం - ముల్సిం, Occ: అగ్రిల్ R/O సక్రాస్ గ్రామం, జిల్లా: నుహ్, హర్యానా రాష్ట్రం,
A2) సాహిబ్ @ మహమ్మద్ సాహిబ్ s/o ఉమర్ మొహమ్మద్, వయస్సు 20 సంవత్సరాలు, కులం - ముస్లిం, Occ: అగ్రిల్ R/O భజ్లాకా గ్రామం, జిల్లా: నుహ్, హర్యానా రాష్ట్రం,
A3) హరీష్ s/o సహబుద్దీన్, వయస్సు 22 సంవత్సరాలు, కులం-ముస్లిం, Occ: అగ్రిల్ R/O భజ్లాకా గ్రామం, జిల్లా: నుహ్, హర్యానా రాష్ట్రం
A4) ఎజాజ్ అహెమద్ ఖాన్ s/o జమీల్ అహెమద్ ఖాన్, వయస్సు 28 సంవత్సరాలు, కులం - ముస్లిం, Occ: సెంటర్ వర్క్ R/O సరైఖ్తాలి గ్రామం, జిల్లా: హర్యానా రాష్ట్రం పాల్వాల్.
సీజ్ చేసిన ప్రాపర్టీ వివరములు
1) ATM CARDS -30 ( axis, HDFC ,ICICI ,KOTAK MAHENDERA, IDFC and EQUIUITAS BAKS CARDS )
2) Mobile Phones- 4
3) Rs. 2,70,000/- నగదు
4) SMALL KEY ( ATM ఓపెన్ చేయటానికి ఉపయోగించే key ను స్వాధీన పరుచుకొనైనది
వివరాల్లోకి వెళితే.....
నిందితులు జల్సాలకు అలవాటు పడి, ఏదైనా తప్పుడూ మార్గం లో డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకొని బ్యాంక్ ఏటిఎం కి వెళ్ళి డబ్బులు డ్రా చేసుకొనే క్రమం లో *ఏటిఎం మేషన్ ను ఆఫ్ చేసి డబ్బులు తీసుకొని ఏటిఎం మేషన్ ఆఫ్ చేయటం వలన వారి అక్కౌంట్ నుండి డబ్బులు డెబిట్ అయినట్టు చూపించ లేదు. దీనితో ఏటిఎం నుండి డబ్బులు విత్ డ్రా చేసేటప్పుడు ఏటిఎం మేసిన్ ఆగిపోతే డబ్బులు వస్తాయి, కానీ అక్కౌంట్ నుంచి కాష్ డెబిట్ కాదు అని గ్రహించి* దీని గురించి ఏటిఎం మేసిన్ ఆపడం కోసం , *అమెరికా లో వున్న వారి బందువుల వద్ద నుండి ఏటిఎం మేసిన్ ఆఫ్ చేసే ఒక తాళం ను పెద్దమొత్తం లో డబ్బులు చెల్లించి కొనుగోలు చేసి, ఈ తాళం తో వారి రాష్ట్రం లో దొంగతనం చేస్తే దొరికి పోతమని గ్రహించి. చెన్నై సిటీ లో, తెలంగాణ లోని నిజామాబాద్, వరంగల్ లో పలు ఏటిఎం లలో వారి మిత్రులు, బందువుల దగ్గర నుండి తీసుకున్న ఏటిఎం కార్డుల* నుండి పైన చెప్పిన విదంగా డబ్బులు విత్ డ్రా చేసుకొని జల్సాలకు మరియు వారి స్వంత అవసరాలకు వాడుకునేవాళ్ళు. ఇదేక్రమంలో మంచిర్యాల లో గత 3 రోజుల నుండి ప్రదాన రహదారి కి దగ్గర ఉన్న ఎస్‌బిఐ బ్యాంక్ పక్కన గల ఏటిఎం లో ఇదేరకంగా చేస్తూ డబ్బులను విత్ డ్రా చేసి పంచుకున్నారు.
ప్రజలకు విజ్ఞప్తి
పైన జరిగిన నేరము బట్టి మంచిర్యాల పట్టణం ప్రజలకు తెలియజేయునది ఏమనగా వారి బ్యాంక్ యొక్క అక్కౌంట్ డీటైల్స్ కానీ ATM వివరములు గాని గుర్తుతెలియని వ్యక్తులకు కానీ వారి స్వంత వారికి కూడా ఎటువంటి వివరములు తెలపటం కానీ ATM ఇవ్వటం కానీ చేయవద్దని మనవి.
చాకచక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుకొని వారి వద్దనుండి చోరీ సొత్తును రికవరీ చేసిన B. నారాయణ ,ఇన్స్ పెక్టర్ ఆఫ్ పోలిస్, మరియు , డి. కిరణ్ కుమార్, వి ప్రవీణ్ కుమార్ ,N. దేవయ్య సబ్ ఇన్స్ పెక్టర్ ఆఫ్ పోలిస్ మంచిర్యాల మరియు బి.దివాకర్ HC 249 , శ్రీనివాస్ PC 3320,బ్రహ్మచారి PC 3598 , భరత్ pc 3395 లను ఏసిపి మంచిర్యాల గారు అభినందించి రివార్డ్ ను అందజేయటం జరిగింది అని అఖిల్ మహాజన్ IPS,ఏసిపి మంచిర్యాల తెలిపారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి