HOME

రాసి పెట్టుకోండి, 2028లో తెలంగాణ ముఖ్యమంత్రి ఆయనే.. Write it down, he is the Chief Minister of Telangana in 2028..

 రాసి పెట్టుకోండి, 2028లో తెలంగాణ ముఖ్యమంత్రి ఆయనే..

Write it down, he is the Chief Minister of Telangana in 2028..



రాజకీయంగా కష్టాలు ఎదుర్కొంటున్న కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు రానున్న రోజుల్లో మహర్దశ పట్టనుందని ప్రముఖ జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని జాతకం చెప్పారు. ఆయనకు త్వరలో శుభ గడియలు ప్రారంభం కానున్నాయని అన్నారు.రాసి పెట్టుకోండి, 2028లో తెలంగాణ ముఖ్యమంత్రి  ఆయనే.. ప్రముఖ జ్యోతిష్యుడు..

Famous astrologer Prashanth Kini Jatakam said that Kalvakuntla Chandrasekhara Rao who is facing political difficulties will get Mahardasha in the coming days. He said that auspicious hours will start for him soon. Write it down, he will be the Chief Minister of Telangana in 2028.. a famous astrologer..

పదేళ్ల అధికారానికి దూరమై, లోక్ సభ ఎన్నికల్లో సున్నా స్థానాలకు పరిమితమై, పార్టీ నుంచి జారిపోతున్న నేతలను కాపాడుకోలేక, పార్టీలో గ్రూపు రాజకీయాలను అదుపు చేయలేక సతమతమవుతోంది ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాలు గెలుచుకున్న బీఆర్ఎస్ ఆ తరువాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. అసెంబ్లీ ఎన్నికలయ్యాక మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌  బాత్‌రూంలో జారి పడటం, ఆయన తుంటి ఎముక విరిగి 3 నెలలకుపైగా విశ్రాంతి తీసుకోవడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఒక్కసారిగా నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయారు. 39 మంది ఎమ్మెల్యేలలో దాదాపు 10 మంది అధికార కాంగ్రెస్‌లోకి జంప్ కావడంతో శ్రేణులు మరింతగా డీలా పడ్డారు. సంవత్సర కాలంగా బీఆర్ఎస్ రాజకీయంగా, న్యాయపరంగా అనేక సమస్యలను ఎదుర్కుంటోంది.జీవితంలో కష్ట సుఖాలు రావడం సాధారణమే. అయితే ఇన్నాళ్లు రాజకీయంగా కష్టాలు ఎదుర్కొంటున్న కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు రానున్న రోజుల్లో మహర్దశ పట్టనుందని ప్రముఖ జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని జాతకం చెప్పారు. ఆయనకు త్వరలో శుభ గడియలు ప్రారంభం కానున్నాయని అన్నారు. కేసీఆర్‌కు ప్రస్తుతం రాహు కాలం కొనసాగుతోందని.. త్వరలోనే ఆయనకు కాలం కలిసి వస్తుందని పేర్కొన్నారు. పరిస్థితులు కలిసి వచ్చి కేసీఆర్‌కు రాజయోగం కలగనుందని విశ్లేషించారు. ఈ మేరకు ఆయన్ ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ఆయన చెప్పే జోతిష్యాలు ప్రాచుర్యం పొందాయి. ప్రశాంత్‌కు.. ఎక్స్‌లో 52 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. కేసీఆర్‌ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? భవిష్యత్‌లో ఎలా ఉండబోతున్నదనే విషయాలను తన ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశారు. ఆ పోస్ట్‌ నెట్టింట్లో తెగ వైరల్‌గా మారింది. దీన్ని లక్ష మందికిపైగా చూశారు.

After 10 years of power, the main opposition BRS has been limited to zero seats in the Lok Sabha elections, unable to protect the leaders who are slipping away from the party and unable to control the group politics in the party. The BRS won 39 seats in the 2023 assembly elections but could not make any impact in the subsequent Lok Sabha elections. After the assembly elections, the former CM and BRS leader KCR slipped in the bathroom and broke his hip bone and took rest for more than 3 months. Out of the 39 MLAs, about 10 have jumped into the ruling Congress and the ranks have become more divided. During the year, BRS is facing many problems politically and legally. But famous astrologer Prashanth Kini Jatakam said that Kalvakuntla Chandrasekhara Rao, who has been facing political difficulties for many years, will get Mahardasha in the coming days. He said that auspicious times will begin soon. It is said that KCR is currently in the period of Rahu. It is analyzed that the circumstances will come together and KCR will get Rajyoga. To this extent, he made a post on X. His predictions are popular on social media. Prashanth has 52 thousand followers on X. What is KCR's current situation? He posted on his ex account what the future would be like. The post went viral on the net. More than one lakh people have seen it.

పోస్ట్‌లో ఏముందంటే..

What is in the post?

రాహు అంతరదశ ప్రారంభమైన సమయంలో కేసీఆర్‌ సీఎం పదవిని కోల్పోయారు. ఆయన జాతకం ప్రకారం.. రాహు నుంచి కుజుడు 12వ స్థానంలో ఉన్నాడు. 2024 సెప్టెంబర్‌ నుంచి గురు దశ ప్రారంభమైంది. అక్టోబర్‌ 2026లో రాజకీయంగా ఫెయిల్ అవుతారు. అయితే 2027 జనవరిలో ఆయన రాజకీయ భవిష్యత్‌ అనూహ్య మలుపులు తిరుగుతుంది. 2027 జనవరి నుంచి 2029 మే వరకు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి కేసీఆర్ తన మార్క్‌ను ప్రదర్శిస్తారు. 2029లో అత్యంత శుభయోగం ఆయనకు పట్టబోతోంది. మరోసారి సీఎంగా కంబ్యాక్ ఇస్తారు ' అని ఆ పోస్ట్‌లో రాసుకొచ్చారు.

KCR lost the post of CM when Rahu antaradasa started. According to his horoscope.. Mars is in 12th place from Rahu. Guru Dasha started from September 2024. He will fail politically in October 2026. But in January 2027, his political future will take unexpected turns. From January 2027 to May 2029, KCR will once again make his mark in state politics. 2029 is going to be the most auspicious year for him. Once again he will make a comeback as CM,' he wrote in the post.

గతంలో..

In the past..

ప్రశాంత్ కిని డిసెంబరు 14, 2023లో ఎక్స్‌లో ఓ పోస్ట్ పెట్టారు. బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తి ప్రధాని హసినా పదవీచ్యుతురాలు అవుతారని అందులో పేర్కొన్నారు. ఆమెను హత్య చేసే అవకాశం కూడా ఉందని చెప్పారు. ‘షేక్ హసీనా 2024 మే నుంచి ఆగస్టు వరకూ అప్రమత్తంగా ఉండాలి. దేశంలో జులై, ఆగస్టులో సంక్షోభం తలెత్తే అవకాశం ఉంది. ఆమెపై హత్యాయత్నం కూడా జరగవచ్చు’ అని పోస్ట్‌లో పేర్కొన్నారు. ఆయన అంచనాలకు తగినట్లే ఆగస్టు నెలలో బంగ్లాలో రాజకీయ సంక్షోభం చోటుచేసుకుని.. షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని భారత్‌ను ఆశ్రయించారు. ఇదే కాకుండా ఈ ఏడాది వయనాడ్‌లో కొండ చరియలు విరిగిపడిన ఘటనను ప్రశాంత్ కిని ముందే అంచనా వేశారు.

Prashanth Kini posted a post on December 14, 2023 in X. It stated that there will be a political crisis in Bangladesh and Prime Minister Hasina will be deposed. He said that there is a possibility of killing her. Sheikh Hasina should be vigilant from May to August 2024. Crisis is likely to arise in the country in July and August. An assassination attempt may also be made against her,' the post stated. As per his expectations, in the month of August, there was a political crisis in Bangla.. Sheikh Hasina stepped down from the post. They resorted to India with their lives in their hands. Apart from this, Prashanth Kini predicted the landslide incident in Wayanad this year.




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి