మావోయిస్టు అగ్రనేత సుజాత అరెస్టు వార్త పచ్చి అబద్దం -మావోయిస్టు పార్టీ ప్రకటన
మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ సభ్యురాలు కామ్రేడ్ సుజాత ఎలియాస్ మైనా భాయి అరెస్టయ్యిందంటూ కొద్ది రోజులుగా జరిగుతున్న ప్రచారాన్ని మావోయిస్టు పార్టీ ఖండించింది. ప్రజలపై మానసిక దాడులు చేస్తూ, భయాందోళనలు సృష్టించడానికే కా.సుజాత అరెస్టు అయినట్లుగా బూటకపు ప్రచారం చేస్తున్నారని ఆ పార్టీ దక్షిణ్ సబ్ జోనల్ బ్యూరో అధికార ప్రతినిధి సమత ఓ ప్రకటన విడుదల చేశారు.
The Maoist Party has denied the campaign that has been going on for a few days that Comrade Sujata Elias Maina Bhai, a member of the Central Committee of the Maoist Party, has been arrested. Samatha, spokesperson of the party's Dakshin Sub-Zonal Bureau, has released a statement saying that they are making false propaganda about Sujatha's arrest in order to create fear and psychological attacks on the people.
ఆ ప్రకటన పూర్తి పాఠం…
Full text of that ad…
మావోయిస్టు మహిళా అగ్రనేత సుజాతను అదుపులోకి తీసుకున్నా మంటూ పాలక వర్గాలు చేస్తూన్న బూటకపు (గోదీ) ప్రచారలను ఖండించండి.
Condemn the hoax (Godi) campaigns of Mantu ruling factions despite the arrest of Sujata, a top woman Maoist leader.
బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు కగార్ పేరుతో జరుపుతున్న సాముహిక హత్యలకు- అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాడుదాం.
Let us fight against the mass murders and rapes being carried out in the name of Brahminical Hindutva Fascist Kagar.
ప్రియమైన ప్రజలారా ప్రజాస్వామికవాదులారా!
సామ్రాజ్యవాదుల, దళారీ నిరంకుశ బూర్జువా వర్గాల దోపిడీ ప్రయోజనాలకు అడ్డంకిగా మారిన భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు)ని నిర్మూలించడానికి కేంద్ర, చత్తీస్ గడ్ రాష్ట్రంలో బిజెపి, తెలంగాణలో కాంగ్రెస్ ఒక్కటై ఆపరేషన్ కగార్ ను కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా నాయకత్వంలో 11 రాష్ట్రాల ముఖ్య మంత్రులు, పోలీసు ఉన్నత అధికారులతో ప్రత్యేక సమావేశం జరిపి 2026 మార్చి వరకు మావోయిస్టులను నామ రూపాలు లేకుండా చేస్తామని డేట్ ప్రకటించారు. అందుకుగాను ఉద్యమంపై, ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొంటున్న వారిపై సామ,దాన, దండోపాయాలు అమలు చేస్తున్నారు. పార్టీపై దుష్ప్రచారం, అబద్దాలు, వక్రీకరణాలు ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రజలపై మానసిక దాడులు చేస్తూ, భయాందోళనలు సృష్టించడానికి కా.సుజాత అరెస్టు అయినట్లుగా బూటకపు ప్రచారం చేస్తున్నారు. ప్రజలు భయాందోళనలకు గురి కావాలస్సిన అవసరం ఏమీలేదు. అరెస్టు దుష్పాచారం ప్రభుత్వాలు పన్నిన కుట్ర మాత్రమే. విప్లవోద్యమాన్ని నిర్మూలించడానికి విప్లవ ప్రజలపై పాలక వర్గాలు LIC దాడులను కొనసాగిస్తున్నాయి. అందులో భాగమే నేడు జరగుతున్న తప్పుడు ప్రచారం. పీడిత ప్రజల నాయకత్వంపై కొనసాగిస్తున్న దుష్ప్రచారాన్ని, ప్రజల్లో గందర గోళాన్ని సృష్టించడాన్ని తక్షణం నిలిపి వేయాలి.
Dear people, democrats!
To eliminate the Communist Party of India (Maoist), which has become an obstacle to the exploitative interests of the imperialists and the broker autocratic bourgeoisie, the BJP and the Congress in the state of Chhattisgarh and Telangana jointly launched Operation Kagar under the leadership of Union Home Minister Amit Shah and held a special meeting with the Chief Ministers and top police officers of 11 states on March 2026. Date announced that the Maoists will be made without name forms. As a result, the movement and those who are actively participating in the movement are being subjected to sama, dana and dandopayas. Misinformation, lies and distortions are being spread against the party. As a part of that, they are making psychological attacks on the people and spreading false propaganda that Sujatha has been arrested to create panic. There is no need for people to panic. The crime of arrest is only a conspiracy by governments. The ruling elites are continuing LIC attacks on the revolutionary people to eradicate the revolutionary movement. Part of that is the false propaganda going on today. The ongoing evil propaganda against the leadership of the oppressed people and creating confusion among the people should be stopped immediately.
తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపి ప్రభుత్వంతో కుమ్మక్కై కార్పోరేట్ల ప్రయోజనాలకు కొమ్ము కాస్తున్న ముఖ్యమత్రి రేవంత్ రెడ్డి, చత్తీష్ గడ్ లో కార్పోరేట్ల కోసమే పని చేస్తున్నమని బాహటంగా చెప్పుకుంటున్న బీజేపి ప్రభుత్వ ముఖ్య మంత్రి విష్ణుదేవ్ సాయి పార్టీ నిర్మూలనలో క్రీయాశీలంగా వ్యవహరిస్తున్నారు.
Chief Minister Revanth Reddy, who is in collusion with the Congress government led by Revanth Reddy and the BJP government in Telangana, is promoting the interests of the corporates, and the Chief Minister of the BJP government, Vishnudev Sai, who openly claims that he is working only for the corporates in Chhattisgarh, is actively working in the eradication of the party.
కేవలం సామ్రాజ్యవాదుల, కార్పోరేట్ల ప్రయోజనాల కోసమే కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి నిరోధక పథకానికి తెలంగాణ రాష్ట్ర అనుమతులతో దామగుండంలో VLF రాడార్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. ఫలితంగా జీవనాడి లాంటి అడవులు, అనేక ఔషధ మొక్కలు, జంతుజాలం, ఉజ్జ్వలమైనా జీవ వైవిధ్యం వింద్వంసం కాబడుతున్నాయి. 20 గ్రామాలు, ఈ గ్రామలలో నివసించే 60,000 వేల మంది ప్రజలు నిర్వాసితులు అయి చెల్లాచెదురు అవుతున్నారు.
The construction of VLF radar project in Damagundam was undertaken with the permission of Telangana state for the development prevention scheme undertaken by the central government only for the interests of imperialists and corporates. As a result, life-giving forests, many medicinal plants, fauna and vibrant biodiversity are being destroyed. 20 villages, 60,000 people living in these villages are displaced and scattered.
బస్తర్ లో పాకృతిక వనరులను కొల్లగొట్టడానికి క్యాంపులు పెట్టి ఆదివాసీ ప్రజలపై దాడులకు పాల్పడుతూ వారిని అడవుల నుండి తరిమి వేయాలనుకుంటున్నారు. నేషనల్ పార్క్ ప్రాంతంలో పులుల పెంపకం పేరుతో టైగర్ జోన్ నిర్మాణం చేపట్టి ముందు 22 గ్రామాలను, ఆ తరువాత 56 గ్రామాలను, మొత్తంగా 78 గ్రామాల ప్రజల్ని తరతరాలుగా జీవిస్తున్న మాతృ భూమి నుండి ఖాళి చేయిస్తున్నారు. ఇంతటి మానవ హననానికి, పర్యవరణ విధ్వంసానికి పాల్పడుతున్న బ్రాహ్మణీయ హిందుత్వ పాశవిక బీజేపీ, కాంగ్రేస్ ప్రభుత్వాలు బస్తర్ లో జల్,జంగల్,జమీన్, ఆత్మగౌరవం కోసం, మా ఊళ్ళో మా రాజ్యం అంటూ అధికారం కోసం పోరాడుతున్న ప్రజలపై, పెసా (1996) చట్టాన్ని అనుసరించి గ్రామ సభను అమలు చేయాలని, హస్ దేవ్, కువ్వేమారి, సుర్జాగడ్, బైలదిల్లా, తరాల్ మెట్ట వంటి స్థానిక ప్రాకృతిక వనరులను కాపాడుకోవడానికి కార్పేట్ సెక్యూరిటీకి వ్వతిరేకంగా పోరాడుతున్న ప్రజలపై, పాలుతాగే పసికూనల నుండి మొదలు కళ్ళు కాన రాని ముసలి వాళ్ళ వరకు అందరిపై దాడులు చేస్తున్నారు. ప్రజలకు అండగా నిలిచిన పార్టీపై, పిఎల్జీఏపై ఆపరేషన్ కగార్ పేరుతో ఒక్క ఈ పది నెలల్లో నిర్ధాక్షిణంగా కొనసాగిస్తున్న నరహంతక ఫాసిస్టు దాడులలో 200లకు పైగా మంది మరణించారు. దండ కారణ్యంలో 6,000 వేలకు పైగా మంది నిర్దోషులు అన్యాయంగా జైళ్ళలో నిర్భంధించబడి సంవత్సరాలుగా దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారు.
In Bastar, they set up camps to loot the natural resources and attack the tribal people to drive them out of the forests. In the name of tiger breeding in the National Park area, first 22 villages, then 56 villages, and the people of 78 villages are being evacuated from the mother land where they have been living for generations. The Brahminical Hindutva Pashavik BJP and Congress governments, who are committing such human abuse and environmental destruction, should implement Gram Sabha following Pesa (1996) Act against the people who are fighting for Jal,Jangal,Zamin in Bastar, self-respect, ma ullo ma Rajyam, Has Dev, Kuvvemari. , Surjagad, Bailadilla, Taral Metta etc. People who are fighting against the carpet security to protect the local natural resources, from lactating babies to blind old men are being attacked. More than 200 people have been killed in the murderous fascist attacks that have been going on relentlessly in these ten months alone in the name of Operation Kagar against the party that stood by the people and the PLGA. In the Danda case, more than 6,000 innocent people have been unjustly detained in jails and have been living a miserable life for years.
పీడిత ప్రజల పట్ల నిజాయితీ లేని ఛత్తీస్ గఢ్ డబుల్ ఇంజన్ (బిజెపి) ప్రభుత్వం చట్ట బద్దంగా పోరాడుతున్న బస్తర్ ఆదివాసి హక్కుల నాయకులైన సూరుజ్ టేకాం, పోట్టం సునీత, గజేంద్ర,సురేస్ లాంటి ప్రశ్నించే గొంతులను నొక్కేస్తుంది. ప్రజలపై జరుగుతున్న హత్యలను ఆపాలనీ, అడవులలో మొహరించిన అదనపు సైనిక బలగాలను వెనక్కి తీసుకోవాలనీ డిమాండ్ చేస్తున్నాము.
Chhattisgarh's double engine (BJP) government, which is dishonest towards the oppressed people, suppresses the questioning voices of Bastar tribal rights leaders like Suruj Tekam, Pottam Sunitha, Gajendra and Sures who are fighting against the law. We demand that the killings of people be stopped and the additional military forces stationed in the forests be withdrawn.
జనవరి 1 నాడు ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని బీజాపుర్ జిల్లా ముదువెండిలో ఆరు మాసాల చిన్నారి హత్యతో మొదలై నేటికి వారం పది రోజులకు ఒక ఊచకోత హత్యకాండను సృష్టిస్తున్నారు. హర్రా..రఘునాధనపాలెం, తులి- తులి, పాములూరు, కరున్ గడ్ ఘటనలతో మానవ సంహారాలలో ఆదివాసీ యువతను, రైతులను, విప్లవకారులను స్త్రీ-పురుష భేదం లేకుండా సామూహిక హత్యలకు పాల్పడుతున్నారు. అనేక ఘటన లలో గణనీయమైన సంఖ్యలోనే యువతను కాల్చిచంపి ఎదురుకాల్పులలో మావోయిస్టుల మరణించారని పోలీసులు కల్పిత కథలు చెపుతున్నారు. ప్రతి ఊచకోత తరువాత కేంద్ర హోం మంత్రి అమిత్ షా వాటికి సాధికారతను కల్పిస్తూ, దోషులైన పోలీసులను మెచ్చుకుంటూ నరేంద్ర మోదీ పాలనలో మావోయిస్టు రహిత భారతం నిర్మిస్తామనీ గడువు ప్రకటిస్తున్నాడు. కానీ బాధిత ప్రజలు వారి శవాలను మోసుకొని వాస్తవాలతో ప్రపంచం ముందుకు వస్తున్నారు. పోలీసుల నేరాలను నమోదు చేయిస్తున్నారు. వారి వెంట జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు నిలిచి క్షేత్ర స్థాయి నివేదికలతో నిజాలు వెలికితీస్తున్నారు.
Beginning with the murder of a six-month-old child in Muduvendi, Bijapur district of Chhattisgarh on January 1, they are creating a massacre every ten days a week. Harrah..Ragunadhanapalem, Tuli-Tuli, Pamuluru, Karungad incidents, tribal youths, farmers and revolutionaries are being killed in mass killings without any distinction between men and women. In many incidents, the police have been telling fictitious stories that Maoists have killed a significant number of youths in the crossfire. After every massacre, Union Home Minister Amit Shah empowers them, praises the guilty policemen and declares a deadline to build a Maoist-free India under the Narendra Modi regime. But the victims are carrying their corpses and coming forward to the world with the facts. Police are registering crimes. Along with them, journalists and social activists are uncovering the truth with field level reports.
ఆదివాసీ ప్రజలు తమ సంప్రదాయం ప్రకారం అడవుల్లోకి జీవిక కోసం అడవి మృగాల బారిన పడకుండా ఆత్మరక్షణ కోసం సాయుధంగా సంచరిస్తుంటారు. కానీ, కగార్ ప్రారంభమైన దగ్గరి నుండి అడవులలో వారి సంచారంపై అప్రకటిత నిషేధం అమలవుతోంది. గ్రామీణ ప్రజలను హత్య చేసిన అనేక సందర్భాలలో కనీసం మృతుల పేర్లయినా ప్రకటించకుండా, శవాల ముఖాలైనా అగుపడకుండా వాటిని పాల్తీన్ షీట్లతో కప్పేస్తూ గుర్తు తెలియని మావోయిస్టుల మరణం అంటున్నారు. శవాల పక్కన ఆయుధాలు, పేలుడు పదార్థాలు, విప్లవ సాహిత్యం పెడుతున్నారు. కొన్ని శవాలకు గెరిల్లాల యూనిఫాంలను ఎక్కిస్తున్నారు. పోలీసుల ఈ చట్ట వ్యతిరేక చర్యలన్నీ ప్రజలు వెల్లడి చేస్తున్నారు. కాల్పులతో భీతిల్లి అడవులలోకి పారిపోతున్న రైతులు అప్పటికే పెద్ద ఎత్తున వందల సంఖ్యలో మొహరించి వున్న పోలీసుల వలలో చిక్కిపోతూ తమను కాపాడండి అని విజ్ఞప్తి చేసిన వారిని సైతం కాల్చి చంపు తున్నారు. ఊచకోతలతో ప్రజలలో పెద్ద ఎత్తున భయోత్పాత వాతావరణాన్ని సృష్టిస్తున్నారు..
As per their tradition, the tribal people roam the forests armed to protect themselves from wild beasts in search of livelihood. But, an unannounced ban on their movement in the forests has been in place since the beginning of Kagar. In many cases of murdering rural people, the death of unknown Maoists is said to be by covering them with palatine sheets without announcing the names of the dead and not even revealing the faces of the corpses. Arms, explosives and revolutionary literature are placed next to the corpses. Guerrilla uniforms are being put on some corpses. People are revealing all these illegal actions of the police. The farmers fleeing into the forests, frightened by the firing, are already caught in the net of the police who have been deployed in large numbers and are shooting dead even those who appealed to them to save them. Massacres are creating a climate of terror among the people.
మన దేశ ప్రజలు ప్రభుత్వ కార్పొరేటీకరణకు, సైనీకీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఫాసిస్టు కగార్ లను నడిపినా, ఎంతటి ఊచకోతలకు పూనుకున్నా చివరకు ప్రజలు తమ న్యాయమైన,వీరోచిత పోరాటాలతో ఫాసిస్టు లెవరికైనా హిట్లర్ గతే పట్టిస్తారనీ, ప్రజలే విజయం సాధిస్తారనీ చరిత్ర మరోసారి రుజువు చేసి తీరుతుంది.
The people of our country are fighting against the corporatization and militarization of the government. History will once again prove that no matter how many massacres the fascists lead, no matter how many massacres are committed, the people will finally defeat the fascists with their just and heroic struggles, and the people will win.
దేశ, విదేశాలలోని అనేక ప్రజాహిత, ప్రగతిశీల, ప్రజాస్వామ్య, విప్లవ సంస్థలు, శక్తులు ఐక్యమై గత పది మాసాలుగా భారత ప్రజలపై, ముఖ్యంగా మధ్య భారతంలోని దండకారణ్య ఆదివాసీ, పీడిత ప్రజలపై కొనసాగుతున్న నిర్ధాక్షిణ్యమైన కార్పొరేట్ పాశవిక కగార్ సైనిక దాడులను, ఊచకోతలను నిర్ద్వంద్వంగా ఖండించండి. ప్రజా యుద్ధాన్ని కాపాడుకొండి. సైనిక కగార్ ఆపరేషన్ ను తక్షణం నిలిపి వేయాలనీ, దండకారణ్యంలో శాంతిని నెలకొల్పాలని పోరాడండి. దేశ సంపదను కాపాడుకోండి.
Many public welfare, progressive, democratic and revolutionary organizations and forces of the country and abroad have united and categorically condemn the ruthless corporate barbaric Kagar military attacks and massacres on the Indian people, especially the Dandakaranya tribals and oppressed people of Central India for the past ten months. Save the People's War. Fight to stop military Kagar operation immediately and establish peace in Dandakaranyam. Protect the country's wealth.
విప్లవాభివందనాలతో,
సమత,
దక్షిణ్ సబ్ జోనల్ బ్యూరో,
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు).
With revolutionary greetings,
equality,
Dakshin Sub Zonal Bureau,
Communist Party of India (Maoist).
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి