ఉద్యోగాల భర్తీ హుళక్కేనా..!
- మరో 6 నెలలు ఉద్యోగాల భర్తీ లేనట్టే
- జాబ్ క్యాలెండర్ అటకెక్కినట్టేనా ?
- ఏడాదికి 2 లక్షల ఉద్యోగాల భర్తీపై నీలినీడలు
- ఎస్సీ వర్గీకరణను సాకుగా చూపించి తప్పించుకునే యత్నం
రెండు లక్షల ఉద్యోగాలు భర్తీచేస్తాం. ఏటా జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించి అమలుచేస్తాం’ అంటూ యువత, నిరుద్యోగులను మభ్యపెట్టి అధికారంలో వచ్చిన కాంగ్రెస్ సర్కారు ఇప్పుడు హామీ నుంచి తప్పించుకునేందుకు స్కెచ్‌వేసింది. ఏకంగా ఉద్యోగాల భర్తీని అటకెక్కించేందుకు పటిష్టమైన ప్రణాళికను సిద్ధం చేసింది. ఎస్సీ వర్గీకరణను సాకుగా చూపించి మరో ఆరు నెలలపాటు నోటిఫికేషన్లు లేకుండా.. ఉద్యోగాల భర్తీని పక్కనపెట్టేందుకు సర్కారు సిద్ధమైంది. దీంతో ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాల భర్తీ అటకెక్కినట్టే.
రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలుకు ఏకసభ్య కమిషన్‌ను నియమించనున్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం ప్రకటించారు. 60 రోజుల్లో నివేదికను తెప్పించాలని గడువుగా విధించారు. ఏకసభ్య కమిషన్ నివేదిక వచ్చాకే నూతన నోటిఫికేషన్లు ఉద్యోగాల భర్తీ అంటూ సెలవిచ్చారు. అంటే ఈ నివేదిక వచ్చే వరకు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నిలిచిపోయినట్టే. అంత వరకు ఒక్కటంటే ఒక్క ఉద్యోగాన్ని భర్తీచేయరన్న మాట. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ నియమించిన విచారణ సంఘాల సంగతి చూస్తే నిరుద్యోగ యువత ఉద్యోగాలపై ఆశలు వదులుకోవాల్సిందే. కాళేశ్వరం ప్రాజెక్ట్, విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు, థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణంపై ప్రభుత్వం రెండు విచారణ సంఘాలను నియమించింది. మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలని సూచించింది. కానీ 8 నెలలు దాటినా విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. గడువును పొడిగిస్తూనే ఉంది. ఇదే తరహాలో ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ నివేదిక 60 రోజుల్లో సాధ్యమేనా..? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ నివేదిక వచ్చేదెన్నడు.. అమలుచేసేదెన్నడు.. ఉద్యోగాలు భర్తీ అయ్యేదెన్నడు అన్న ప్రశ్నలు నిరుద్యోగులను పీడిస్తున్నాయి. మొత్తంగా ప్రణాళిక బద్ధంగా ఉద్యోగాల భర్తీ నుంచి తప్పించుకునేందుకు ప్రభుత్వం వేసిన పన్నాగమని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు.
For More Details 9949508843
జాబ్ క్యాలెండర్‌లో భర్తీచేయాల్సిన ఉద్యోగాలు
ట్రాన్స్‌కో, టీజీ ఎస్పీడీసీఎల్, టీజీ ఎన్పీడీసీఎల్‌లో ఏఈ, ఏఈఈ, సబ్ ఇంజినీర్ ఇతర పోస్టులు
అన్ని ఇంజినీరింగ్ విభాగాల్లో గెజిటెడ్ క్యాటగిరీ – ఇంజినీరింగ్ సర్వీస్ ఉద్యోగాలు
గ్రూప్-1 ప్రిలిమినరీ, అసిస్టెంట్ ఫారెస్ట్ కన్జర్వేటర్ సహా 19 క్యాటగిరీ పోస్టులు
గెజిటెడ్ స్కేల్ ఇతర ప్రొఫెషనల్ సర్వీసెస్ (గ్రూప్స్‌లోని లేని) పోస్టులు
పాఠశాల విద్యాశాఖలో టీచర్ పోస్టులు
అటవీశాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులు
పోలీసుశాఖలో ఎస్‌ఐ, కానిస్టేబుల్ పోస్టుల భర్తీ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి