అతి వేగం.... పల్టీ కొట్టిన కారు
నగరంలోని పంజాగుట్టలో జరిగిన రోడ్డు ప్రమాదంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఉదయం ఓ కారు పంజాగుట్ట వద్ద బీభత్సం సృష్టించింది. అతివేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో కారులోని వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
A road accident in the city's Panjagutta left people terrified. In the morning, a car created havoc at Panjagutta. The speeding car lost control and overturned. The people in the car were seriously injured in the incident.
పంజాగుట్ట ప్రజాభవన్ పక్కన ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈరోజు ఉదయం ఓ కారు పంజాగుట్ట వైపునకు వస్తుండగా అనుకోని ప్రమాదం జరిగింది. కారులో ఉన్న వ్యక్తి అతివేగంతో కారును నడిపించాడు. ఈ క్రమంలో పంజాగుట్ట వద్దకు రాగానే కారు అదుపుతప్పింది. మితిమీరిన వేగంతో వాహనం దూసుకురావడంతో అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. కారు వచ్చిన వేగానికి చుట్టుపక్కల వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా కారు పల్టీలు కొట్టడంతో వాహనదారులు అవాక్కయ్యారు. వెంటనే చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు.
The accident took place near Panjagutta Praja Bhavan. An unexpected accident took place today morning while a car was coming towards Panjagutta. The person in the car drove the car at high speed. In this sequence, the car went out of control when it reached Panjagutta. The vehicle over-speeded and overturned. The young people traveling in the car sustained serious injuries in the accident. The speed of the car caused the nearby motorists to panic. The motorists were taken aback when the car overturned. Immediately the neighbors reached there and informed the police.
ట్రాఫిక్ పోలీసులు అక్కడకు చేరుకుని కారులో ఇరుక్కున్న యువకులను బయటకు తీశారు. చికిత్స నిమిత్తం వారిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఉదయమే ఈ ప్రమాదం జరగడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. వెంటనే పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేసి.. ప్రమాదానికి గురైన కారు అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ప్రమాదానికి గురైన కారు ఎవరది.. వారు ఎక్కడి నుంచి వస్తున్నారు... మందు సేవించి వాహనం నడుపుతున్నారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. కారులో ప్రయాణిస్తున్న వారి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా.. అతివేగంగా కారు నడపడంపై ఇటు పోలీసులు.. అటు వాహనదారులు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
The traffic police reached there and pulled out the youths who were stuck in the car. They were taken to a government hospital for treatment. The accident occurred early in the morning and the traffic was disrupted. Immediately the police cleared the traffic and moved the accident car from there. The police have registered a case and are investigating the incident. However, the police have taken up the investigation from the point of view of whose car was involved in the accident, where they were coming from, whether they were driving the vehicle under the influence of drugs. The details of those traveling in the car are to be known. Meanwhile, the police, motorists and people are expressing their anger over the speeding of the car.
.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి