all in one news లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
all in one news లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

తెలంగాణలో ధూంధాంగా దసరా దావత్.. Dhundham Dussehra dawat celebration in Telangana..

 💥తెలంగాణలో ధూంధాంగా దసరా దావత్..

Dhundham Dussehra dawat celebration in Telangana..





 10 రోజుల్లో రూ.1,100 కోట్ల మందు తాగేశారు

1,100 crores of drugs were consumed in 10 days



హైదరాబాద్: తెలంగాణలో దసరానాడు ముక్క, సుక్క లేకుండా పండగ పూర్తి కాదు. ఏటా బతుకమ్మ, దసరా సందర్భంగా రాష్ట్రంలో లిక్కర్ అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయి. ఈసారి కూడా మందుబాబులు అదే ఒరవడిని కొనసాగిస్తూ భారీ రికార్డు నెలకొల్పారు. కేవలం 10 రోజుల వ్యవధిలో రూ.1,100 కోట్లకుపైగా మందును తాగేశారు. పది రోజుల్లో వెయ్యి కోట్ల మేర మద్యం విక్రయాలు జరిగినట్లు ఆబ్కారీ అధికారులు చెబుతున్నారు. బార్లు, మద్యం దుకాణాలతో పాటుగా పబ్ లలోనూ అమ్మకాలు పెరిగాయి. దీంతో సర్కార్ ఖజానాకు.. మద్యం భారీగా ఆదాయం తెచ్చి పెట్టింది. మద్యం అమ్మకాల్లో ఎప్పటిలాగే హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది.

Hyderabad: In Telangana, Dussehra festival is not complete without drug and non veg . Every year during Bathukamma and Dussehra, sales of liquor in the state are increasing hugely. This time too, the drug addicts continued the same trend and set a huge record. In just 10 days, more than Rs.1,100 crores of drugs were consumed. Excise officials say that the sale of liquor worth one thousand crores was done in ten days. Along with bars and liquor stores, sales also increased in pubs. As a result, alcohol has brought huge income to the government treasury. As always, Hyderabad is at the top in liquor sales.




17 లక్షల బీర్లు..

17 LAKHS BEERS

రాష్ట్రంలో 2 వేల 260 మద్యం దుకాణాలు, 1,171బార్లు, రెస్టారెంట్లు ఉన్నాయి. వీటితో పాటుగా పబ్బుల్లోనూ మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఏటా దసరా వేళ తెలంగాణలో మద్యం ఎక్కువ మొత్తంలో అమ్ముడవుతుంది. ఈ సారి అదే అంచనాతో ముందుగానే ఎక్సైజ్ శాఖ అధికంగా మద్యం నిల్వలను సిద్ధం చేసుకుంది. ఆర్డర్లు కూడా ఊహించిన దాని కన్నా అధికంగా ఉండటంతో రాష్ట్ర సర్కార్ ఖజానాకు కాసుల వర్షం కురిసింది. బార్లు సైతం తగినంత స్టాక్‌ను అందుబాటులో ఉంచాయి. దసరాకు ముందు నుంచే మొదలైన మద్యం కిక్కు శని, ఆదివారాల్లో పీక్స్‌కు చేరింది.


There are 2 thousand 260 liquor shops, 1,171 bars and restaurants in the state. In addition to these, the sale of alcohol is continuing in pubs. Every year during Dussehra, liquor is sold in large quantities in Telangana. This time, with the same estimate, the Excise Department has prepared large stocks of liquor in advance. As the orders were also higher than expected, the state government's coffers rained money. Bars also keep enough stock available. The liquor kick that started before Dussehra reached its peak on Saturday and Sunday.


సెప్టెంబర్ 30 వరకు 2 వేల 838 కోట్ల అమ్మకాలు జరగ్గా... అక్టోబర్ నెల ప్రారంభం నుంచి 11వ తేదీ వరకు రూ 1,100 కోట్ల మేర విలువైన 10 లక్షల 44వేల కేసుల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఆబ్కారీ అధికారులు చెబుతున్నారు. 10 రోజులవ్యవధిలోనే 17 లక్షల 59 వేల బీర్లు అమ్ముడుపోయాయట. మద్యం అమ్మకాల్లో ఉమ్మడి రంగారెడ్డి టాప్‌లో ఉండగా ఉమ్మడి కరీంనగర్, నల్లగొండ, వరంగల్ జిల్లాలు తర్వాతి మూడు స్థానాల్లో ఉన్నాయి.


Excise officials say that 10 lakh 44 thousand cases of liquor worth Rs 1,100 crore were sold from the beginning of October to the 11th of October while 2 thousand 838 crores were sold till September 30. 17 lakh 59 thousand beers were sold within 10 days. In terms of liquor sales, Ranga Reddy is the top district while Karimnagar, Nalgonda and Warangal districts are in the next three positions.


స్వల్పంగా తగ్గిన ఆదాయం..

A slight decrease in income.


ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో మద్యం అమ్మకాలు ప్రభుత్వానికి భారీ ఆదాయాన్ని సమకూర్చాయి. గత ఏడాది అక్టోబర్‌ 1 నుంచి 10వ తేదీతో పోలిస్తే ఈ ఏడాది ఇదే సమయంలో పది రోజులకుగానూ అమ్మకాలు కాస్త తగ్గాయి. గ్రేటర్ హైదరాబాద్, సికింద్రాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, శంషాబాద్, సరూర్‌నగర్‌, వికారాబాద్ జిల్లాల పరిధిలో 674 మద్యం దుకాణాలు ఉండగా, 2023లో మద్యం అమ్మకాల ద్వారా రూ.317 కోట్ల 21 లక్షల ఆదాయం సమకూరినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం రూ.312 కోట్లే ఖజానాకు వచ్చింది. గతంతో పోల్చితే ఎక్సైజ్ ఆదాయం రూ.5 కోట్ల 18 లక్షలు తగ్గడం గమనార్హం..


Liquor sales in joint Rangareddy districts have provided huge revenue to the government. Compared to October 1 to 10 last year, the sales for ten days at the same time this year have decreased slightly. Officials say that there are 674 liquor shops in Greater Hyderabad, Secunderabad, Medchal, Malkajigiri, Shamshabad, Sarurnagar and Vikarabad districts, and in 2023, an income of Rs. 317 crore 21 lakhs will be collected from the sale of liquor. At present only Rs.312 crores have come to the treasury. It is noteworthy that the excise revenue has decreased by Rs. 5 crores and 18 lakhs compared to the previous year.



ఇడ్లిలో జర్రి ప్రత్యక్షం ! జగిత్యాల జిల్లాలోని ఓ హోటల్లో.... Jagityal District Viral news

ఇడ్లిలో జర్రి ప్రత్యక్షం !




 హోటళ్లలో తిండి తినాలంటే జనాలు జంకుతున్నారు. ఇప్పటికే.. ఫుడ్ సేఫ్టీ అధికారులు చేస్తున్న తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో.. ఆహార పదార్థాల్లో బల్లులు, జెర్రీలు వస్తుండటం ఇప్పుడు ప్రజలను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవలే హైదరాబాద్‌లోని ఓ ఫేమస్ హోటల్‌లో పప్పులో జెర్రీ కనిపించగా.. ఇప్పుడు జగిత్యాలలోని ఓ పేరు మోసిన టిఫిన్ సెంటర్‌లోనూ ఇడ్లీలో జెర్రీ ప్రత్యక్షమైంది. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.




 జగిత్యాల జిల్లా కేంద్రంలోని టిఫిన్స్‌కు ఫేమస్ అయిన.. ఓ హోటల్‌కు ఆదివారం (అక్టోబర్ 13న) రోజున ఓ కస్టమర్ తన కుటుంబంతో సహా వచ్చాడు. తన రెండేళ్ల కొడుకుకు తినిపించేందుకు ఇడ్లీ వడ ఆర్డర్ చేశాడు. వాళ్లు ఇచ్చిన పార్సిల్ తీసి.. పిల్లాడికి తినిపిస్తున్న క్రమంలో.. అందులో జెర్రీ అవశేషాలు కనిపించాయి. అది చూసి.. షాక్ అయిన ఆ కుటుంబం వెంటనే.. హోటల్ యజమానిని ప్రశ్నించగా.. నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. మిగతా కస్టమర్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేయటంతో.. అది జెర్రీ కాదని.. పేపర్ అని కాసేపు, దారం అని మరికాసేపు బుకాయించాడు. నోట్లో వేసుకుని తినిచూపించాలని కూడా ప్రయత్నించాడు. కానీ.. అది జెర్రీ అని తేలటంతో వెంటనే ఉమ్మేశాడు. దీంతో.. ఆ ఇడ్లీలను చెత్తడబ్బాలో పడేయటానికి ప్రయత్నించిన హోటల్ సిబ్బందిని అడ్డుకుని.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. 





ఈ క్రమంలో.. హోటల్ యజమాని బాధితులతో వాగ్వాదానికి దిగాడు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కస్టమర్లందరినీ బయటికి పంపించేసి.. హోటల్‌ని మూసేశారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఫుడ్ ఐటమ్స్ పరిశీలించి.. హోటల్‌‍కు జరిమానా కూడా విధించారు. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కస్టమర్లు కోరుతున్నారు. చిన్న చిన్న పిల్లల కోసం చాలా మంది హోటల్ నుంచి టిఫిన్స్ తీసుకెళ్తుంటారని.. ఇలా జెర్రీలు, బల్లులు వస్తే.. పిల్లలకు ఏమైనా జరిగితే పరిస్థితి ఏంటని కస్టమర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.



వ్యక్తిత్వంలో వజ్రం - మన జాతికి దొరికిన రత్నం రతన్ టాటా (Ratan Tata)

 వ్యక్తిత్వంలో వజ్రం - మన జాతికి దొరికిన రత్నం



డ్రైవరు కాకుండా నలుగురు ప్రయాణిస్తున్న ఆ కారు దిల్లీ వైపు వెళ్తోంది. ఆ నలుగురూ ఒక మీటింగ్ కు హాజరవ్వాలి. ఇంతలో ఒక టైరు పంచరు ఆయ్యింది. అందరూ దిగారు. డ్రైవరు మరో టైరును బిగించేపని చూస్తున్నాడు , ముగ్గురిలో ఒకరు సిగరెట్టు వెలిగించాడు , ఒకాయన సెల్ ఫోన్ తీసి మాట్లాడుతున్నాడు , మరొకాయన వెంట తెచ్చుకొన్న ఫ్లాస్కులోని కాఫీ తాగుతున్నాడు. రెండు నిమిషాయలయ్యాక ఆ ముగ్గురికీ నాల్గవ వ్యక్తి గుర్తుకొచ్చాడు , అపుడు ఆ ముగ్గురూ ఆయన వంక చూసి ఆశ్ఛర్యపోయారు. ఎందుకంటే ఆయన తన చొక్కా స్లీవ్ పైకి అనుకొని , టై ను భుజం వెనక్కి వేసుకొని , జాకీ , స్పానర్ తీసుకొని డ్రైవర్ కు సహాయపడుతున్నాడు. ఈ ముగ్గురూ అవాక్కయ్యారు.  కారణం ఆ నాల్గవ వ్యక్తి రతన_టాటా.  '' సార్ , మీరు ? '' '' అవును ,  మనం మీటింగ్ కు వెళ్ళాలి , టైరు మార్చడానికి డ్రైవర్ కు 15 ని. సమయం పడుతుంది , కానీ నేను సహాయపడితే 8 నిమిషాల్లో అతను ఆ పని పూర్తీచేస్తాడు. మనకు 7 ని. కలిసొస్తాయి కదా ? ''  అన్నారు రతన్ టాటా. [ Respect to Time is Respect to Life ] 





TATA Group ఎందుకు ఆ స్థాయికి ఎదిగిందో దాని అధినేత అయిన రతన్ టాటాను చూస్తే తెలుస్తుంది ! 


బాల్యంలో  ఆయన తల్లి తండ్రులు విడిపోయారు , అవ్వ పెంచిపెద్ద చేసింది. 


యవ్వనంలో ఆయన girl friend  మోసం చేసింది. 


ఆతరువాత కంపెనీ కి విపరీతమైన నష్టాలు , సవాళ్ళు ఎదురయ్యాయి. 


కానీ ఆయన తన మంచితనాన్ని , దయను , లక్ష్యాన్ని , నిజాయితీని , సమయపాలనను , క్రమశిక్షణను , కఠోర పరిశ్రమను మరచిపోలేదు. #TATA సంస్థను ఆయన ఏ స్థాయికి తీసుకొచ్చారో క్రింద వివరాలు చదివితే తెలుస్తుంది : 


టాటా సంస్థ అయిన TCS  యొక్క స్టాక్ మార్కెట్ విలువ పాకిస్తాన్ దేశపు మొత్తం స్టాక్ మార్కెట్ విలువతో సమానం.  


భారతదేశపు GDP కి TATA సంస్థ ఒక్కటే 4 % కాంట్రిబ్యూట్ చేస్తుంది. 


ప్రతి ఏటా  అస్సాం , ఒడిషా , హిమాచల్ ప్రదేశ్ , గోవా లు కలిపి ఎంత tax కడతాయో అంత tax ను ఒక్క TATA సంస్థనే దేశానికి చెల్లిస్తుంది. [ 50000   కోట్లు ]  




నవంబరు 26 , 2008 లో పాకిస్తాన్ యొక్క ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా మన ముంబై నగరంలోని TATA సంస్థ యొక్క TajHotel మీద [ కింద ఫోటోలో కనిపిస్తుంది ]  ఆత్మాహుతి దాడి చేసి వందలమందిని చంపిన సంఘటనలో, చనిపోయిన ప్రతి వ్యక్తి కుటుంబాన్ని వ్యక్తిగతంగా కలిసి  ఒక్కొక్కరికీ 25 నుండీ 50 లక్షల దాకా సహాయం అందించారు రతన్ టాటా ; ఆ సమయం లో తమ హోటల్ లో డ్యూటీలో వుండి మరణించిన  , గాయపడిన ప్రతి పోలీసు , ప్రతి ఇతర ఉద్యోగి కుటుంబం లో ఒక్కొక్కరికి తన సంస్థలో ఉద్యోగం ఇచ్చాడు , వాళ్ళ పిల్లల చదువు , పెళ్ళిళ్ళ  బాధ్యత ను తానే తీసుకొన్నాడు ; అంతకంటే ఆశ్చర్యమేమంటే ఆ దాడి సమయంలో దేవిక అనే చిన్న పాప హోటల్ కు వచ్చివుంటుంది , ఆమెను గది బయటపెట్టి ఆమె తండ్రి , మామయ్య toilet లోకి వెళ్ళివుంటారు , అప్పుడే ఆ దాడి జరిగింది , వాళ్ళిద్దరూ మరణించారు. ఆ చిన్న పాప బ్రతికింది , తరువాత ఆనాడు హోటల్లో చిన్నపిల్లలు , స్త్రీలు , వృద్ధులు అని చూడకుండా కాల్పులు జరిపి వందలమందిని చంపిన నరరూప రాక్షసుడు అజ్మల్ కసబ్ ను గుర్తుపట్టింది ఆ చిన్న పాపనే. ఆ చిన్న పాపను ఆసుపత్రిలో చేర్పించి , కోలుకొనేలా చేసి , ఆమె చదువుకు ఏర్పాట్లు చేసి , ఉద్యోగం కూడా తన కంపెనీలోనే ఇస్తానని చెప్పి , ఆమె పెళ్ళి బాధ్యతను కూడా కూడా రతన్ టాటా నే తీసుకొన్నారు. మరో ఆశ్చర్యమేమంటే  ఆ దాడి సమయంలో రోడ్డు మీద వెళుతున్న , అక్కడ చిన్న చిన్న వ్యాపారాలు [చేపలు పట్టడం ,  పావ్ బాజీ , పానీపూరి , భేల్ పూరి , పాన్ బీడా , చాయ్ దుకాణాల ]  నడుపుకొనేవారికెవ్వరికీ TATA సంస్థతో ఏ సంబంధాలు లేకపోయినా , వారందరికీ నష్టపరిహారం అందించారు రతన్ టాటా. అన్నిటికంటే పెద్ద ఆశ్చర్యమేమంటే ఈ అన్ని పనులనూ రతన్ టాటా దాడి జరిగిన తరువాత కేవలం 20 రోజుల్లో పూర్తీచేసేసారు. అందుకే ఆయన గురించి ఒక స్నేహితుడు ఇలా వ్రాసాడు :  Don't mess with him ; if you give him Deep Insults , he will transform them into Deep Results.  


నా దృష్టిలో రతన్ టాటా సూటు బూటు వేసుకొన్న స్వామి వివేకానంద. ఇద్దరూ బ్రహ్మచారులే. మొదటి వ్యక్తి '' ధ్యానంతో '' దేశాన్ని మార్చాడు, రెండవ వ్యక్తి '' ధనంతో '' దేశానికి సేవ చేశాడు.  . .

మొదటి ర్యాంక్‌ వచ్చినా ఉద్యోగం లేదు.. డీఎస్సీ అభ్యర్థుల ఎంపికలో గందరగోళం (TG DSC SELACTION LIST)

 మొదటి ర్యాంక్‌ వచ్చినా ఉద్యోగం లేదు.. డీఎస్సీ అభ్యర్థుల ఎంపికలో గందరగోళం


ఓ వైపు టీచర్ల నియామక పత్రాలు అందించబోతున్నామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది.. మరోవైపు అదే నియామకాల ప్రక్రియలో మెరిట్‌ ఉన్నా ఉద్యోగాలు రాలేదని డీఎస్సీ క్వాలిఫైడ్‌ అభ్యర్థులు కన్నీటి పర్యంతమవుతున్నారు.


మొదటి ర్యాంకు సాధించినా అర్హులుకారని వెనక్కి పంపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బోళ్ల రాజశేఖర్‌రెడ్డి అనే వ్యక్తి నాన్‌ లోకల్‌ కింద ఎస్‌.ఏ సోషల్‌ తెలుగు మీడియంలో మొదటి ర్యాంకు సాధించాడు.

అన్‌ రిజర్వ్‌డ్‌ పోస్టులో అతడికి కేటాయించాల్సిన ఉద్యోగాన్ని మరొకరికి కేటాయించారని హైదరాబాద్‌ విద్యాశాఖ అధికారి రోహిణికి దరఖాస్తు పెట్టుకున్నారు. ఇలా చాలా మంది తమకు అన్యాయం జరిగిందని డీఈవోకు దరఖాస్తుల రూపంలో మొరపెట్టుకున్నారు.

ఇన్‌సర్వీస్‌ తిప్పలు

హైదరాబాద్‌ జిల్లాలో ఉపాధ్యాయ పోస్టులకు 616 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. వీరికి బుధవారం ఎల్‌బీ స్టేడియంలో సీఎం రేవంత్‌రెడ్డి నియామక పత్రాలు అందజేస్తారు. హైదరాబాద్‌లో 878 పోస్టులకుగాను 262 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక పెండింగ్‌లో ఉంది.

ఉర్దూ మీడియం రిజర్వేషన్‌ కేటగిరిలో అభ్యర్థులు లేకపోవడంతో పోస్టులు పెండింగ్‌లో ఉంచినట్టు అధికారులు తెలిపారు. అదేవిధంగా ఇన్‌సర్వీస్‌లో ఉండి సెలవులు పెట్టకుండానే బీఈడీ చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సుమారు 8మంది అభ్యర్థుల ఎంపిక పెండింగ్‌లో పడినట్టు తెలిసింది. దీంతో సదరు అభ్యర్థులు తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు.


పరీక్షల విభాగం ముందుగానే తమను నిరాకరించాల్సిందని.. పరీక్షకు అనుమతించి ర్యాంకు వచ్చాక ఇప్పుడు ఇన్‌సర్వీస్‌ అని ఇబ్బందులు సృష్టించడం సరైనది కాదని వాపోయారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు

తెలంగాణ ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డు ద‌ర‌ఖాస్తు విధానం (Telangana State Family Degital Card Application)

 తెలంగాణ ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డు ద‌ర‌ఖాస్తు విధానం... (Telangana State Family Degital Card Application)


TG FAMILY DEGITAL CARD

ప్ర‌స్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఒక కుటుంబంలోని వారు వివిధ ప‌థ‌కాల కింద వివిధ ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాల‌ను పొందుతున్నారు. కానీ ఆ వివ‌రాల‌న్నీ ఒకే చోట లేవు. ఈ నేప‌థ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డును జారీ చేయాల‌ని నిర్ణ‌యించారు. ఈ కార్డు జారీ చేయ‌డంతో ప్ర‌భుత్వానికి సంబంధించిన 30 శాఖ‌ల స‌మాచారం ఒకే చోట ల‌భించే వీలుంటుంది. అర్హుల‌కు కూడా త్వ‌ర‌గా సంక్షేమ ఫ‌లాలు అందే అవకాశం ఉంటుంది.

 ఇటీవ‌ల సికింద్రాబాద్ ప‌రిధిలోని కంటోన్మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలో ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డుల జారీ ప్ర‌క్రియ‌కు సంబంధించి పైల‌ట్ ప్రాజెక్టును ప్రారంభించారు.
వ‌న్ స్టేట్ – వ‌న్ కార్డు ఆలోచ‌న‌తో చేప‌ట్టిన ఈ బ‌హుళ ప్ర‌యోజ‌న కార్డుల జారీ ప్ర‌క్రియ‌ను ప్ర‌జ‌లంతా వినియోగించుకోవాల‌ని రేవంత్ పిలుపునిచ్చారు.

ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డు ద‌ర‌ఖాస్తు న‌మూనా...

ఈ కార్డు దరఖాస్తును మూడు విధాలుగా విభజించారు.


మొద‌టి భాగం


మొదటి భాగంలో కుటుంబ పెద్ద వివ‌రాల‌ను న‌మోదు చేయాల్సి ఉంటుంది.
అభ్య‌ర్థి పేరు, సెల్ నంబ‌ర్, రేష‌న్ కార్డు ర‌కం, పుట్టిన తేదీ, వార్షిక ఆదాయం, విద్యార్హ‌త‌లు, కులం, వృత్తి వంటి వివ‌రాల‌ను న‌మోదు చేయాల్సి ఉంటుంది. 

రెండవ భాగం


రెండో భాగంలో అభ్య‌ర్థి చిరునామా న‌మోదు చేయాల్సి ఉంటుంది.

మూడవ భాగం


మూడో భాగంగా చాలా ఇంపార్టెంట్..
మూడో భాగంలో కుటుంబ స‌భ్యుల వివ‌రాలు పొందుప‌రచాలి. ద‌ర‌ఖాస్తుదారునితో సంబంధం, పుట్టిన తేదీ, ఆధార్ నంబ‌ర్ వంటి వివ‌రాలు న‌మోదు చేయాల్సి ఉంటుంది. ఆధార్ నంబ‌ర్, పుట్టిన తేదీల‌ను న‌మోదు చేసేట‌ప్పుడు చాలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. ఎందుకంటే ఇక్క‌డ ఏ మాత్రం పొర‌పాటు జ‌రిగినా.. ఆ కుటుంబంలోని స‌భ్యుల‌కు సంక్షేమ ప‌థ‌కాలు అంద‌క‌పోవ‌చ్చు. కాబ‌ట్టి క‌రెక్ట్‌గా ఆధార్ నంబ‌ర్, పుట్టిన తేదీ వివ‌రాల‌ను స‌మ‌ర్పించాలి. ద‌ర‌ఖాస్తుపై గ్రూప్ ఫొటో( Family Group Photo ) అతికించాల్సి ఉంటుంది. చివ‌ర‌గా ద‌ర‌ఖాస్తుదారుడు త‌న సంత‌కం చేయాల్సి ఉంటుంది.

ద‌ర‌ఖాస్తుకు జ‌త‌ప‌ర్చాల్సిన ధృవ‌ప‌త్రాలు

1. కుటుంబ పెద్ద ఆధార్ కార్డు
2. కుటుంబ స‌భ్యుల ఆధార్ కార్డులు
3. గ్రూప్ ఫొటో
4. బ‌ర్త్ స‌ర్టిఫికెట్స్(పిల్ల‌ల‌వి) త‌ప్ప‌నిస‌రిగా స‌మ‌ర్పించాల్సి ఉంటుంది.


మీకు పెన్షన్ అకౌంట్ ఉందా లేకుంటే ఈ details చూడండి SBI LIFE INSURANCE 



☝️ Smart Platina Plus


Pay 10 year's 1,00,000/-


Get Guaranteed Pension Benefit for 25 year's + Maturity Benefit


 Death benefits

👉Normal: 11 Lakh's 

👉Accidental:  11L+33 L = 

44 Lakh's with ADB Coverage


For More details contact 


Lingareddy 

Senior Agency Manager

9949508843


హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు లైవ్: ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం

 హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు లైవ్: ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం

HARYANA


కురుక్షేత్ర యూనివర్శిటీలోని నాలుగు స్ట్రాంగ్ రూమ్‌లలో ఈవీఎం యంత్రాలను భద్రపరిచారు.


హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ముందు భద్రతా సిబ్బంది స్ట్రాంగ్ రూమ్ బయట కాపలాగా ఉన్నారు.

సింగిల్ ఫేజ్ 15వ హర్యానా అసెంబ్లీ సాధారణ ఎన్నికలు శనివారం (అక్టోబర్ 5, 2024) 68% పోలింగ్‌తో జరిగాయి. ఓట్ల లెక్కింపు మంగళవారం అక్టోబర్ 7 ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం అయ్యింది.

మొత్తం 90 సీట్లకు గాను 46 సీట్లు గెలిచిన వారు విజేతలుగా నిలుస్తరు.


రేపటి నుండి బడికి సెలవులు

బ్రేకింగ్ న్యూస్ 

రేపటి నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు 

తెలంగాణ రాష్ట్రంలోని స్కూల్ లకు రేపటి నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి.. 


శనివారము ఎఫ్ ఏ 2 పరీక్షలు ముగిశాక రేపటి నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు మొదలవుతాయని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. 

1 నుండి 9 వ తరగతి విద్యార్థులకు సెలవులు ఉంటాయి. రేపటి నుండి పదవ తరగతి విద్యార్థులకు రివిజన్ తరగతులు ప్రారంభమవుతాయి.. 

ప్రతి రోజు ఒక టీచర్ స్కూల్ హాజరై. పదవ తరగతి విద్యార్థులకు రివిజన్ క్లాసులు తీసుకోవాలి అని విద్యా శాఖ తెలిపింది.

టాప్ 10 న్యూస్ టుడే 29/10/2021

1) ఆన్‌లైన్‌లో పోస్ట్ పెట్టి.. మాజీ మిస్​ తెలంగాణ ఆత్మహత్యాయత్నం..


2) గంజాయి విక్రయిస్తే చర్యలు తప్పవు మంచిర్యాల ఏ సి పి అఖిల్ మహాజన్


3)యువకులకు క్రికెట్ కిట్స్ పంపిణీ చేసిన మంచిర్యాల ఏసీపీ అఖిల్ మహాజన్ ఐపీఎస్


4)ధరణిలో ఇబ్బందులు.. ఏడాదైనా రైతులకు తప్పని తిప్పలు


5)పలువురు ఎస్సైల బదిలీలు


6)పేకాట స్థావరం పై లక్షేట్టిపేట  పోలీసుల ఆకస్మిక దాడి


7)గంజాయి చెట్లను స్వాధీనం చేసుకుని వాటిని ధ్వంసం  చేసి తగుల బెట్టిన లక్షేటిపేట ఆబ్కారీ సి ఐ 


8)ప్రీతమ్ జకల్కర్ తో సమంత దుబాయ్ టూర్.


9)అర్దరాత్రి యువతి గొంతు కోసిన యువకుడు 


10)బిగ్ బ్రేకింగ్......కరోన మూడో ముప్పు మొదలైంది!!_





1) ఆన్‌లైన్‌లో పోస్ట్ పెట్టి.. మాజీ మిస్​ తెలంగాణ ఆత్మహత్యాయత్నం.. 

  


హైదరాబాద్‌ నారాయణ గూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని హాసిని 2018లో మిస్ తెలంగాణగా ఎంపికైంది. ఆమె ప్రస్తుతం హైదరాబాద్‌లోని హిమాయత్‌ నగర్‌లో నివాసం ఉంటుంది. అయితే ఇంట్లో ఎవరూ లేని సమయంలో హాసిని ఉరేసుకుని ఆత్మహత్యకు యత్నించింది.ఈ క్రమంలోనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇది చూసిన ఆమె స్నేహితులు వెంటనే పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు హిమాయత్ నగర్ రోడ్ నెంబర్ 6లో ఉన్న తన ఫ్లాట్‌లోకి వెళ్లి యువతిని రక్షించి హైదర్ గూడ అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ ఆమెకు పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. ప్రమాదం ఏం లేదని తేల్చారు. అయితే హాసిని ఇలా చేయడానికి ఆర్థిక ఇబ్బందులే కారణమని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలోనే ఆమె ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చని వారు అనుమానిస్తున్నారు. మరోవైపు తనను ఓ యువకుడు శారీరకంగా వేధించాడని హాసిని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే ఆమె ఆత్మహత్యకు యత్నించడంతో..  ఏ కారణం చేత ఆమె ఇలా చేసిందనేది తేలాల్సి ఉంది.అయితే సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఎందుకు చనిపోవాలని అనుకుంది..? అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. హాసినిది తెలంగాణలోని ఖమ్మం జిల్లా. ఆమెకు ఇద్దరు అక్కలు, ఒక అన్నయ్య.తనది పేద కుటుంబం అని,తాను బ్యూటీపార్లర్‌లో వర్క్ చేసేదానిని గతంతో ఓ ఇంటర్యూలో హాసిని చెప్పుకొచ్చింది.


2) గంజాయి విక్రయిస్తే చర్యలు తప్పవు మంచిర్యాల ఏ సి పి అఖిల్ మహాజన్



మంచిర్యాల: దండేపల్లి

గంజాయి ఎవరైనా అమ్మినా వినియోగించిన కఠిన చర్యలు తప్పవని అవసరమైతే వారిపై పీడీ యాక్ట్ సైతం నమోదు చేస్తామని మంచిర్యాల్ ఏ సి పి అఖిల్ మహాజన్ హెచ్చరించారు. గంజాయి రహిత రాష్ట్రంగా మార్చేందుకు ముఖ్యమంత్రి  కెసిఆర్ కృషి చేస్తున్నారని రాష్ట్ర పోలీస్ శాఖ డి సి పి ఆదేశాల మేరకు రామగుండం కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, మంచిర్యాల డిసిపి ఉదయ్ కుమార్ రెడ్డి పర్యవేక్షణలో సబ్ డివిజన్ పరిధిలో ప్రతిరోజు గంజాయికి బానిసలైన వ్యక్తులకు,ప్రాథమిక దశలో ఉన్న వారికి కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు గంజాయి విక్రయిస్తున్న వారిని కూడా అదుపులోకి తీసుకుని అరెస్టు చేయడం జరుగుతుందని ఏసీపీ తెలిపారు. లక్షేట్టీపెట్ సర్కిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దండేపల్లి మండలం రాజు గూడా గ్రామంలో కుంరం శ్యామ్ రావు అను వ్యక్తి  తళ్ళపేట బస్ స్టాండ్ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఏముల విజయ్ కుమార్ గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని పట్టుకొని మరియు కుమ్రం శ్యామ్ రావు వద్ద నుండి 250 గ్రాములు మరియు వారికి గంజాయి సరఫరా చేస్తున్న లోతోర్రే గ్రామం ఎన్నారం మండలానికి చెందిన కుర్సింగ జుగాది రావు,సోయం గగ్రు,పూసం సంపత్ రావు మరియు నైతం లింగు అను వారిని అదుపులోకి తీసుకోవడం గురించి వెళ్తుండగా లోతోరె గ్రామానికి 1 km దూరం లో ఆ నలుగురు వ్యక్తులు కుమ్రం శ్యామ్ రావు కి అమ్మి పెట్టడానికి తీసుకువస్తుండగా అదుపులోకి తీసుకోవడం జరిగింది. మరియు వారి వద్ద  నుండి 250 గ్రాములు స్వాధీనం చేసుకొని వారిని అరెస్ట్ చేయడం జరిగింది. మీడియా సమావేశానికి ఎసిపి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఇప్పటివరకు దండేపల్లి పీఎస్ పరిధిలో మూడు కేసులు నమోదు చేసి 16 మంది నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 2910 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. యువత గంజాయి కి అలవాటుపడి ఆ మత్తులో నేరాలకు పాల్పడుతున్నారని తల్లిదండ్రులు వారి పిల్లల పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ వారి కదలికలు గమనించాలని సూచించారు.ఈ విషయంలో చాలా కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని అందులో భాగంగా గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం ఎక్కడైనా తెలిస్తే ఆయ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిబ్బందికి సమాచారం అందించాలని వారి వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుందని ఏసీపీ తెలిపారు. ఈ మీడియా సమావేశంలో లక్షెట్టిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ కరీముల్లా ఖాన్ తో పాటు దండేపల్లి ఎస్ఐ శ్రీకాంత్,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

యూట్యూబ్ విడియో కొసం క్లిక్ చేయండి


3) యువకులకు క్రికెట్ కిట్స్ పంపిణీ చేసిన మంచిర్యాల ఏసీపీ అఖిల్ మహాజన్ ఐపీఎస్



   రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి ఐపిఎస్, డిసిపి మంచిర్యాల ఉదయ్ కుమార్ రెడ్డి  గార్ల  ఆదేశాల మేరకు కాల్వ దండేపల్లి పోలీస్ స్టేషన్ పరిధి ద్వారకా గ్రామ యువతకు క్రికెట్ కిట్ లు, మంచిరాల ఏసిపి అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారు పంపిణీ చేయడం జరిగింది.


 ఈ సందర్భంగా ఏసీపీ గారు మాట్లాడుతూ.. ఫ్రెండ్లీ పోలీసింగ్, కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా క్రీడా స్ఫూర్తి, సమయ కార్యాచరణ, సానుకూల వైఖరిని యువతలో ప్రోత్సహించడం కోసం యువత  ఎటువంటి చెడు కార్యకలాపాలకు బానిసలై జీవితాలు నాశనం చేసుకోవద్దని వారికి సూచించారు. క్రీడలు బలాన్ని మరియు మానసిక ఆనందాన్ని ఇవ్వగలవు అన్నారు.


 ఏసిపి గారి వెంట లక్షట్ పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ కరిముల్లా ఖాన్, దండేపల్లి ఎస్ఐ శ్రీకాంత్ పాల్గొన్నారు.

4) ధరణిలో ఇబ్బందులు.. ఏడాదైనా రైతులకు తప్పని తిప్పలు



TS: ధరణిలో నిషేధిత జాబితాలో చేరిన పట్టాభూములు విడిపించుకునేందుకు ఏడాదిగా రైతులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగుతున్నా కష్టాలు మాత్రం తీరట్లేదు. తమ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని దాదాపు లక్షమంది దరఖాస్తు చేసుకోగా సుమారు 20 శాతం మందికే పరిష్కారం లభించింది. 43 శాతం దరఖాస్తులు కలెక్టర్ల వద్ద పెండింగ్‌లో ఉండగా మిగిలిన 37 శాతం దరఖాస్తులను తిరస్కరించారు. ధరణి సమస్యల విభాగంలో దరఖాస్తుతోపాటు సమర్పించిన ఆధారాలను ప్రాతిపదికగా తహసీల్దార్, ఆర్డీవోలు పరిశీలన చేస్తున్నారు. అందుకు చాలా సమయం పడుతోంది. నిషేధిత జాబితాలో దేవాదాయ, అటవీ, భూదాన్‌ పేరిట భూములున్నాయి. వాటిని పరిష్కరించాలంటే ఆయాశాఖలు ఎన్​వోసీ ఇవ్వాల్సి ఉంటుంది. అందుకు ఆ శాఖల అధికారులు నిరాకరిస్తుండటంతో కలెక్టర్ల వద్ద పెండింగ్‌ దరఖాస్తుల సంఖ్య పెరుగుతోంది. గతంలో ఈ తరహా సమస్య వస్తే వీఆర్​వో, ఆర్​ఐ ద్వారా పంచనామాచేయించి తహసీల్దార్, ఆర్డీఓ విచారణ చేసేవారు. క్షేత్రస్థాయిలో వీఆర్వో వ్యవస్థ రద్దుతో ధరణి సేవలు లోపభూయిష్టంగా మారాయి. ఇప్పటికైనా ధరణి వ్యవస్థను రద్దు చేసి సమస్యలను పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు.


ఇటీవలే ధరణిలో సవరణలు చేసిన ప్రభుత్వం కలెక్టర్ల లాగిన్‌లో మార్పులు చేయడంతో సమస్యల పరిష్కారంపై అధికారులు దృష్టిసారించారు. వాటిని ఇప్పడికప్పుడు పరిష్కారం చేయడం అంత వేగంగా సాధ్యం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రెవెన్యూ శాఖలో సేవలందించిన విశ్రాంత అధికారుల సూచనలు తీసుకొని ధరణి అమలు చేసినట్లేతే ఈ సమస్యలు వచ్చేవి కావని చెబుతున్నారు. 


కొలిశెట్టి లక్ష్మయ్య, మాజీ ఛైర్మన్ రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం

సాధారణంగా దరఖాస్తు అధికారి తిరస్కరిస్తే కారణం తెలపాలి. కానీ నెలలు గడుస్తున్నా తిరస్కరించడానికి గల కారణాలు చెప్పకపోవడంపై సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. చాలా భూములు నిషేధిత జాబితాలో కనిపిస్తుడటంతో రైతులకు కష్టాలు తప్పట్లేదు. భూరికార్డుల ప్రక్షాళన చేపట్టినప్పుడే భూయజమానుల భాగస్వామ్యం తీసుకుంటే బాగుండేదని భూచట్టాల రూపకల్పన నిపుణులు సూచిస్తున్నారు. 

ప్రొఫెసర్ ఎం. సునీల్‌కుమార్, భూచట్టాల రూపకల్పన నిపుణులు

పట్టా భూమిని నిషేధితజాబితాలో చేర్చడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబ, ఇతర అవసరాల కోసం భూమి విక్రయించాలంటే నిషేధిత జాబితాలో ఉండటం వల్ల రిజిస్ట్రేషన్‌ కావడం లేదు. వాటికి తోడు పేరు, సర్వే నంబరు తప్పు ఉందని, కమతం విస్తీర్ణంలో హెచ్చుతగ్గుల పరిష్కారానికి ధరణిలో సరైన మార్గం లేకపోవడం వల్ల సమస్యలు తప్పడం లేదు. కొన్ని సమస్యలు మినహా ధరణి అద్భుతంగా ఉందని వాటని పరిష్కరిస్తే భూసమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని రెవెన్యూ శాఖ అధికారులు చెబుతున్నారు.

బి.గీత, తహసీల్దార్ జాయింట్ సబ్‌ రిజిస్ట్రార్, మేడ్చల్

భూసమగ్ర సర్వే చేస్తే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఇప్పటికే ఆ దిశగా కృషి చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఆ మేరకు మంత్రివర్గం ఉపసంఘం వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు స్వీకరిస్తోందని వివరించారు. 

నిరంజన్‌రెడ్డి,

వ్యవసాయ శాఖ మంత్రి

ఇప్పటికైనా వేగంగా దరఖాస్తులను పరిష్కరిస్తే మేలు జరుగుతుందన్న అభిప్రాయం పలువురి నుంచి వ్యక్తమవుతోంది.

5) పలువురు ఎస్సైల బదిలీలు


నిర్మల్‌ : జిల్లాలో ఎస్సైలను బదిలీ చేస్తూ గురువారం సాయంత్రం ఎస్పీ ప్రవీణ్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీచేశారు. బదిలీ అయిన ఎస్సైల ను తక్షణం రిలీవ్‌ చేయాలని ఆదేశించారు. సాయి కుమార్‌ ముధోల్‌ నుండి లోకేశ్వరం, మహేష్‌ కుభీర్‌ నుంచి బాసర బదిలీ అయ్యారు.  సాయికిరణ్‌ భైంసా రూరల్‌ నుంచి ముధోల్‌కు, కే.రాజు కడెం నుంచి పెంబి, ఎండీ షరీఫ్‌ కుంటాల నుంచి భైంసా టౌన్‌, ఎం.కృష్ణసాగర్‌రెడ్డి సారంగాపూర్‌ రెగ్యులర్‌గా, శ్రీనివాస్‌ నిర్మల్‌ రూరల్‌ నుంచి ఎస్సై 2 నిర్మల్‌ రూరల్‌, శివరామకృష్ణ తానూర్‌ నుండి భైంసా రూరల్‌ 2 ఎస్సై, ప్రసాద్‌ దిలావర్‌పూర్‌ పూర్తిస్థాయి, కందులరాణి మామడ నుండి నర్సాపూర్‌ (జి), స్రవంతి నర్సాపూర్‌ నుంచి కుంటాల, జ్యోతిమణి సోన్‌ నుంచి దస్తూరాబాద్‌, ఎల్‌. వెంకటరమణ నర్సా పూర్‌ నుంచి సీసీఎస్‌ నిర్మల్‌, శ్రీరామ్‌ ప్రదీప్‌ బాసర నుండి వీఆర్‌ నిర్మల్‌, జి. రాజన్న తానూర్‌ నుండి సీసీఎస్‌ నిర్మల్‌, బాలకృష్ణ, యాసిర్‌ అరాఫత్‌ భైంసా నుండి సీసీఎస్‌ నిర్మల్‌, సుమన్‌ నిర్మల్‌ రూరల్‌ నుండి డీఎస్బీ నిర్మల్‌, దయానంద్‌రావు కడెం నుండి కదం ఎస్సై 2గా, తసియుద్దీన్‌ భైంసా నుండి వీఆర్‌ నిర్మల్‌, కే. రోహిణి దిలావర్‌పూర్‌ వీఆర్‌ నిర్మల్‌, జివి. రమణరెడ్డి డీఎస్బీ నిర్మల్‌, గంగాధర్‌, శివాజీ నిర్మల్‌ నుండి వీఆర్‌ నిర్మల్‌కు బదిలీ అయ్యారు. కొందరు అటాచ్‌మెంట్‌ ఉన్న ఎస్సైలకు పూర్తిస్థాయి బాధ్యత అప్పగించారు.

6) పేకాట స్థావరం పై లక్షేట్టిపేట  పోలీసుల ఆకస్మిక దాడి



06 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్...


6000 వేల రూపాయల నగదు స్వాధీనం



 లక్షెట్టిపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాపూర్ గ్రామశివారులో డబ్బులు పందెంగా పెట్టుకుని పేకాట ఆడుతున్నారు నమ్మదగిన సమాచారం మేరకు ఎస్ఐ చంద్రశేఖర్ తమ సిబ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీ నిర్వహించి అక్కడే ఉన్న ఆరుగురు అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 6000 రూపాయల నగదు, పేకాట ముక్కలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదుపులోకి తీసుకున్న వీరిని లక్షెట్టిపేట్ పోలీస్ స్టేషన్ కి తరలించి కేసు నమోదు చేయడం జరిగింది.


 పట్టుబడిన వారి వివరాలు


1. నిమ్మల రమేష్ గౌడ్ s/o లాంగాగౌడ్

2.నిమ్మల శంకరయ్య s/o పాపాగౌడ్

3.కోట స్వామి s/o పోషాగౌడ్

4.గుర్రాల కృష్ణ s/o రాజయ్య

5.పార్వతి శ్రీనివాస్ s/o పోషయ్య

6.ఇండ్ల లింగయ్య s/o పోశయ్య  r/o లక్సెట్టిపేట మండలం తిమ్మాపూర్ గ్రామం


 ఈ సందర్భంగా ఎస్ఐ చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ...... తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు అనే అత్యాశకు పోయి చాలా మంది పేకాట బానిసలుగా మారుతున్నారు  అని అప్పుల పాలవుతున్న కుటుంబలను రోడ్డుపాలు చేస్తున్నారన్నారు. పేకాట ఆడుతూ పట్టుబడిన వారు వారి ప్రవర్తన మార్చుకో నట్లయితే  వారిపై పీడీ యాక్ట్  అమలు చేయడం జరుగుతుందని హెచ్చరించారు.

7)గంజాయి చెట్లను స్వాధీనం చేసుకుని వాటిని ధ్వంసం  చేసి తగుల బెట్టిన లక్షేటిపేట ఆబ్కారీ సి ఐ 



మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని బెహరన్ గూడ లో  మెస్రం భాది రావు అనేవ్యక్తి ఇంటి సమీపంలో సాగు చేసిన  

5 గంజాయి చెట్లను స్వాధీనం చేసుకుని వాటిని ధ్వంసం  చేసి తగుల బెట్టిన లక్షేటిపేట ఆబ్కారీ సి ఐ బా బా ,మంచిర్యాల డి టి ఎఫ్ సి ఐ గంగా రెడ్డి ,

8)ప్రీతమ్ జకల్కర్ తో సమంత దుబాయ్ టూర్... 




సమంత దుబాయ్ టూర్ సంచలనానికి తెరలేపింది. దానికి కారణం ఆమె ఈ ట్రిప్ ప్రీతమ్ జుకల్కర్ తో వెళ్లడమే.


సమంత పర్సనల్ స్టైలిష్, డిజైనర్ ప్రీతమ్ జుకల్కర్ పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగింది. సమంత విడాకులకు కారణం ఇతడే అంటూ మీడియా కోడై కూసింది. సమంత అతనితో సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయటకు తీసి నానా రాద్ధాంతం చేశారు. 

ఈ నేపథ్యంలో ప్రీతమ్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. సమంతను తాను అక్కగా భావిస్తానని, తమ మధ్య ఉన్న రిలేషన్ ఏమిటో నాగ చైతన్యకు కూడా తెలుసని మీడియా ద్వారా వెల్లడించారు. అయినా సమంత, అక్కినేని అభిమానులు ప్రీతమ్ ని టార్గెట్ చేయడం మానలేదు. నిప్పులేకుండా పొగరాదంటూ, నెగిటివ్ కామెంట్స్ చేశారు. నిజం ఏదైనా... ఇంత రచ్చ జరిగినప్పుడు  ఎవరైనా కొన్నాళ్ళు దూరంగా ఉంటారు. కానీ అందరిలా ఆలోచిస్తే ఆమె సమంత ఎందుకు అవుతుంది...? ఫ్యాన్స్ మైండ్ బ్లాక్ చేస్తూ, సమంత ప్రీతమ్ తో కలిసి దుబాయ్ ట్రిప్ కి వెళ్లారు. అంతే కాకుండా ప్రీతమ్ తో దిగిన ఫోటో ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో షేర్ చేసి, దుబాయ్ వెళుతున్నట్లు కామెంట్ చేశారు.వీరిద్దరితో పాటు సమంత మేకప్ ఆర్టిస్ట్ సాధనా సింగ్ ఉన్నారు. ఇక ఈ ట్రిప్ ద్వారా సమంత మీరు ఎన్ని అనుకున్నా నేను భయపడేది లేదని చెప్పే ప్రయత్నం చేశారు. అదే సమయంలో మీడియా ద్వారా ఈ న్యూస్ బయటికి వస్తే మరింత నెగిటివ్ గా ప్రొజెక్ట్ అవుతుంది. అందుకే సమంత స్వయంగా చెప్పినట్లు ఉన్నారు. ఏది ఏమైన సమంత నిర్ణయాలు సాధారణ అభిమానులను షాక్ కి గురిచేస్తున్నాయి.

9) అర్దరాత్రి యువతి గొంతు కోసిన యువకుడు 



హైదరాబాద్  గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్టినాగులపల్లిలో  అర్ధరాత్రి ప్రియురాలి బెడ్రూంలోకి చొరబడిన ప్రియుడు కత్తితో గొంతు కోశాడు.యువతి అరవడంతో తల్లిదండ్రులు, బంధువులు నిందితుడిని పట్టుకుని చితకబాదారు.జీడిమెట్లకు చెందిన బాయన ప్రేమ్ సింగ్ (21) కేపీహెచ్‌బీలోని ఎంఎన్ ఆర్ డిగ్రీ కళాశాలలో చదువుతున్నాడు. మాదాపూర్‌లోని వెంకటేశ్వర ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో చదువుతున్న గొడీల రూఖీ సింగ్ (21) బంధువు కావడంతో పరిచయం ఏర్పడింది.

వట్టినాగులపల్లికి చేరుకున్న ప్రేమ్ సింగ్ బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల సమయంలో యువతి బెడ్ రూమ్ తలుపు తన్ని లోనికి చొరబడ్డాడు. కత్తితో యువతి గొంతు కోయడానికి ప్రయత్నించగా అప్పటికే అప్రమత్తమై గట్టిగా కేకలు వేసింది. కుటుంబ సభ్యులు లేచి యువకుడిని పట్టుకుని చితకబాది బంధించారు. యువతికి గొంతు, అరచేయి, కాలు, మణికట్టు వద్ద కత్తి గాట్లు పడ్డాయి. చికిత్స నిమిత్తం యువతిని కాంటినెంటల్ హాస్పిటల్‌లో, యువకుడిని కిమ్స్ హాస్పిటల్‌లో చేర్పించారు. గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. గంజాయి మత్తులో ప్రేమ్ సింగ్ ఘతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

10)బిగ్ బ్రేకింగ్......కరోన మూడో ముప్పు మొదలైంది!!_



- 2022 జనవరి-ఏప్రిల్ మధ్య ఉధృతి పెరిగి తీవ్రస్థాయికి


- జాగ్రత్తలు లేకుంటే ఈసారి అల్లకల్లోలం


- మా లెక్కలు తప్పవు


- ఎయిమ్స్ వెల్లడి



_అక్టోబర్ నెల నుంచి క్రమంగా కేసులు పెరిగి, 2022 జనవరి - ఏప్రిల్ మధ్య కట్టడి చేయలేనంత తీవ్ర స్థాయికి కరోనా చేరే అవకాశం ఉందని అంచనా వేశారు. దీంతో కచ్చితంగా ప్రజలు సూచనలు పాటించాలని ఎయిమ్స్ ఆరోగ్య గణాంక నిపుణులు హెచ్చరించారు. టూరిస్ట్‌ల సంఖ్య పెరగడం, సభలు, సమావేశాలతో ప్రజలు గుమిగూడటం మూడో ఉద్ధృతికి దారి తీయొచ్చని తెలిపారు. ఇటీవల టూరిస్ట్ లు పెరిగిన మనాలి, డార్జిలింగ్‌ ప్రాంతాల్లో కొవిడ్‌ కేసులు పెరిగాయని పేర్కొన్నారు._


_రాష్ట్రాలు ఆంక్షలను పాటించకపోతే మూడో ఉద్ధృతి ఆటోమేటిక్‌గా పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. భారత్‌లో మూడో వేవ్‌లో కొన్ని ప్రాంతాల్లో రోజువారీ కేసులు 103శాతం వరకూ ఉండొచ్చనే అంచనా వేశారు. ఇక కొవిడ్‌ ఆంక్షల్ని పూర్తిగా ఎత్తేసినా,  పర్యాటకుల తాకిడి లేకపోతే మూడో ఉద్ధృతి తీవ్రత కొంతమేర తగ్గుతుందని తెలిపారు. ఆంక్షల ఎత్తివేతతో పాటు సెలవు రోజుల్లో పర్యాటకుల సంఖ్య పెరిగితే మాత్రం మహమ్మారి వ్యాప్తి ఎక్కువగా ఉంటుందన్నారు._


_సోషల్ డిస్టెన్స్‌ పాటించకపోతే కరోనా వంటి శ్వాసకోశ సంబంధ రోగాలు విస్తృతంగా వ్యాపించే అవకాశాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. హోటళ్లు, కేఫ్‌లలో కూర్చొని ఎక్కువసేపు మాట్లాడుకోవడం.. షేక్‌హ్యాండ్ ఇచ్చుకోవడం వంటి పనులతో కరోనా ముప్పు ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. పర్యాటకులు పెరిగి స్థానిక వ్యాపారులకు లబ్ధి చేకూరుతుంది కానీ... టూరిస్ట్‌లు, స్థానికులు, అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. కరోనా వ్యాప్తి పెరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని... అప్పుడే అందరి సంక్షేమాన్ని కాపాడుకుంటూ ముందడుగు వేయడం సాధ్యమవుతుందన్నారు._


_దేశానికి మూడో ఉద్ధృతి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ సూచించారు. కోవిడ్ అంశంపై తమ నిపుణులు పేర్కొన్న గణాంకాలు  ఇప్పటివరకు తప్పలేదని హెచ్చరించారు._


_ముఖ్యంగా ప్రస్తుత పండగల సీజన్‌లో అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. కనీసం మరో 6-8 వారాల పాటు బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తే మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టే అవకాశముందని చెప్పారు._



టాప్ 10 న్యూస్ టుడే 04/10/2021

టాప్ 10 న్యూస్ టుడే 

  1. పంట దక్కక అప్పు తీర్చలేక ఇద్దరు రైతుల బలవన్మరణం..
  2. దళిత బందు విధి విధానాలు జారీ చేసిన ప్రభుత్వం...
  3. పెట్రో మంట.. మరో సారి పెరిగిన పెట్రోల్ రేట్
  4. 8 న ఈటల రాజేందర్ నామినినేషన్.బీజేపీ అభ్యర్థిగా అధికారిక ప్రకటన.
  5. కొత్త బైక్ కంటే 2 హెల్మెట్లు ఇవ్వాల్సిందే..
  6. తిరిగి తెలంగాణకి విక్రమ్ జిత్ దుగ్గల్...
  7. TSRTC ఉద్యోగులకు ఆర్టీసి బంపర్ ఆఫర్.. ఐదు ఏళ్ల వరకు సెలవలు....
  8. కఠినంగా జేఈఈ అడ్వాన్స్డ్ ......పేపర్ 1 తో పోల్చుకుంటే పేపర్ 2 కష్టం. రేపు సాయంత్రం వెబ్ సైట్ లో ఓఎంఆర్ పత్రం
  9. టీటీడీ శ్రీ పద్మావతి ఆస్పత్రిలో సేవలందించడానికి దరఖాస్తులు ఆహ్వానించిన టీటీడీ.
  10. కరోనా 199 రోజుల కనిష్టానికి ఆక్టివ్ కేసులు.   

1)పంట దక్కక అప్పు తీర్చలేక ఇద్దరు రైతుల బలవన్మరణం..



TG: భారీ వర్షాలకు పంటలు దెబ్బతినడంతో తీవ్ర మనోవేదనకు గురైన ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. పంట పెట్టుబడి కోసం చేసిన అప్పులు తీర్చే దారి లేక ఆదిలాబాద్‌, సిరిసిల్ల జిల్లాల్లో ఇద్దరు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ మండలం సొనాల గ్రామానికి చెందిన ఎకిలం శశిధర్‌(28) మూడెకరాల సొంత భూమితో పాటు, 12 ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. 12 ఎకరాల్లో సోయా, మూడెకరాల్లో పత్తి వేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సోయా పంట నీట మునగగా.. పత్తి దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. బ్యాంకులో రూ.లక్ష, ప్రైవేటులో మరో రూ.4 లక్షల అప్పులున్నాయి. పంటలు నష్టపోవడంతో రుణాలు ఎలా తీర్చాలనే మనోవేదనతకు గురైయ్యాడు. ఆదివారం బజార్‌హత్నూర్‌ మండలం కొలారి శివారులోని తన పంటపొలంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శశిధర్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం జవారిపేట గ్రామానికి చెందిన గౌవేని రాజయ్య(45) 6 ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి పంట సాగుచేస్తున్నాడు. కొన్నేళ్లుగా పంట దిగుబడులు సరిగా రావడంలేదు. ఇటీవల కురిసిన వర్షాలకు ఈ ఏడాది పంటా దెబ్బతింది. మరోవైపు రూ.10 లక్షల అప్పు ఉండటంతో మనోవేదనకు గురైయ్యాడు. ఆదివారం పత్తి చేనుకు వెళ్లిన పురుగుల మందు తాగి తన సోదరుడికి ఫోన్‌ చేసి చెప్పాడు. వెంటనే రాజయ్య భార్య, సోదరుడు చేను వద్దకు వెళ్లి.. అపస్మారక స్థితిలో ఉన్న రాజయ్యను సిరిసిల్ల ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

2)దళిత బందు విధి విధానాలు జారీ చేసిన ప్రభుత్వం...



హైదరాబాద్‌: దళితబంధు పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం అదనపు విధివిధానాలు జారీ చేసింది. ఈమేరకు మార్గదర్శకాలు ప్రకటిస్తూ ఎస్సీ అభివృద్ధిశాఖ ఆదేశాలు జారీ చేసింది. లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ పూర్తయ్యాక దళితబంధు కోసం ప్రత్యేకంగా బ్యాంకు ఖాతా తెరవాలని, సంబంధిత పాసుపుస్తకాలను లబ్ధిదారులకు అందించాలని తెలిపింది. ఆఖాతాలోకి రూ.9.90లక్షలు కలెక్టర్‌ బదిలీ చేయాలని పేర్కొంది.

రూ.10లక్షలతో నిధులతో సాధ్యమైతే రెండు విభిన్న యూనిట్లకు అనుమతి

లబ్ధిదారులను వారు ఆసక్తి కనబర్చే యూనిట్లను బట్టి గ్రూపులుగా వర్గీకరించాలని.. వ్యవసాయం- అనుబంధ రంగాలు, రవాణా రంగం, తయారీ- పరిశ్రమల రంగం, రిటైల్‌ దుకాణాలు, సేవలు- సరఫరా రంగాలుగా విభజించాలని తెలిపింది. ఆయా రంగాల వారీగా రిసోర్స్‌ పర్సన్స్‌ను ఎంపిక చేయడంతో పాటు బృందాలను కలెక్టర్‌ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. రూ.10లక్షలు యూనిట్‌ వ్యయం అయ్యే ప్రాజెక్టులను రిసోర్స్‌ బృందాలు రూపొందించాలి. మొత్తం రూ.10లక్షలు విలువచేసేలా రెండు సబ్‌ యూనిట్లు కూడా ఉండొచ్చని ప్రభుత్వం తెలిపింది. ఒకరి కంటే ఎక్కువ మంది లబ్ధిదారులు కలిసి  ఎక్కువ మొత్తంతో పెద్ద యూనిట్‌కు కూడా అవకాశం ఇవ్వాలని పేర్కొంది.

యూనిట్ల అవసరాల దృష్ట్యా లబ్ధిదారులకు శిక్షణ

రిసోర్స్ బృందాలతో కలెక్టర్ లబ్ధిదారుల వద్దకు వెళ్లి వారికి వివిధ యూనిట్లపై అవగాహన కల్పించాలి. అవసరమైతే రిసోర్స్ బృందాలు ఎక్కువమార్లు కూడా లబ్దిదారుల వద్దకు వెళ్లాలని ప్రభుత్వం తెలిపింది. లబ్ధిదారుని ప్రాధాన్యం, ఆసక్తి, అనుభవం, యూనిట్ ఆర్థిక సాధ్యాసాధ్యాలను యూనిట్ ఎంపికలో పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. యూనిట్ల ఖరారు అనంతరం వారికి అందులో శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. ఆయా రంగాలు, యూనిట్ల అవసరాల దృష్ట్యా రెండు నుంచి ఆరు వారాల పాటు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం తెలిపింది. ఇదే సమయంలో లబ్దిదారులు ఎంచుకున్న యూనిట్ల పనితీరు పరిశీలన కోసం పర్యటనలు ఏర్పాటు చేయాలని, ఆయా రంగాల్లో విజయవంతమైన వారిచే అవగాహన  కల్పించాలని సూచించింది. లబ్ధిదారుల కుటుంబాలకు యూనిట్ పై పూర్తి అవగాహన కలిగి, పూర్తి స్థాయిలో నడిపించేందుకు సిద్ధమైనట్లు కలెక్టర్, రీసోర్స్ బృందం సంతృప్తి చెందితే యూనిట్ ను వారికి అందించాలని తెలిపింది. మంజూరు అనంతరం కూడా యూనిట్ల నిర్వహణలో రిసోర్స్ బృందాలు లబ్దిదారులకు తగిన సహకారం అందించాల్సి ఉంటుంది. యూనిట్లన్నీ మంజూరై పూర్తి స్థాయిలో నడిచేలా ప్రతిదశలోనూ పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేయాలని జిల్లా కలెక్టర్, బృందాలకు ప్రభుత్వం స్పష్టం చేసింది.

3)పెట్రో మంట మరో సారీ పెరిగిన పెట్రోల్ రేట్..


























దిల్లీ: దేశంలో సామాన్యుడిపై పెట్రో మంట కొనసాగుతుంది. వరుసగా రుగుతున్న ధరలు సరికొత్త రికార్డ్‌లను క్రియేట్‌ చేస్తున్నాయి. ఆదివారం సైతం లీటర్‌ పెట్రోల్‌ పై 25పైసలు, డీజిల్‌ పై 30పైసలు పెరిగింది. దీంతో దేశంలో పలు ప్రధాన నగరాల్లో డీజిల్‌ ధరలు సెంచరీని క్రాస్‌ చేశాయి. ముఖ్యంగా గత నాలుగు రోజులుగా పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదే సమయంలో ఇంధన ధరల పెంపుపై కేంద్రం చెప్పిన కారణాలపై పెదవి విరిస్తున్నారు.  

దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో పెరిగిన పెట్రోల్‌ డీజిల్‌ ధరలు

హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.106.26 ఉండగా.. డీజిల్ ధర రూ.98.72 ఉంది.  

విజయవాడలో పెట్రోల్ ధర రూ.108.57 ఉండగా డీజిల్ ధర రూ.100.45 ఉంది.  

వైజాగ్‌లో పెట్రోల్ ధర రూ.107.19 ఉండగా..డీజిల్ ధర రూ.99.14 ఉంది. 

ఢిల్లీలో  పెట్రోల్‌ ధర రూ.102.39 ఉండగా.. డీజిల్‌ ధర రూ.108.43 ఉంది

కోల్‌ కతాలో పెట్రోల్‌ ధర రూ. 103 ఉండగా .. డీజిల్‌ ధర రూ.93.87 ఉంది

4)8 న ఈటల రాజేందర్ నామినినేషన్.బీజేపీ అభ్యర్థిగా అధికారిక ప్రకటన.



























కరీంనగర్‌: అందరూ ఊహించినట్లుగానే హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో భాజపా అభ్యర్థిగా ఈటల రాజేందర్‌ ఖరారయ్యారు. పార్టీ రాష్ట్ర కమిటీ పంపిన ప్రతిపాదనల మేరకు ఆయన పేరును ఖరారు చేస్తూ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్‌ ఆదివారం ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 8న నామినేషన్‌ వేసేందుకు ఈటల ముహూర్తాన్ని ఖరారు చేసుకున్నారు. ఎసైన్డ్‌ భూముల విషయమై ఆరోపణలను ఎదుర్కొన్న రాజేందర్‌ను రాష్ట్ర మంత్రివర్గం నుంచి మే 2న బర్తరఫ్‌ చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక నేతగా గుర్తింపు పొందిన ఆయన హుజూరాబాద్‌, కమలాపూర్‌ నియోజకవర్గాల నుంచి వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. జూన్‌ 12న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. జూన్‌ 14న దిల్లీలో భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆ పార్టీలో చేరారు.

5)కొత్త బైక్ కంటే 2 హెల్మెట్లు ఇవ్వాల్సిందే




హైదరాబాద్: మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా బహుదూర్‌పల్లికి చెందిన లక్ష్మి తన భర్తతో కలిసి కొద్దిరోజుల క్రితం మియాపూర్‌లో జరిగే శుభకార్యానికి ద్విచక్ర వాహనంపై వెళ్లారు. బాచుపల్లి వద్ద రాంగ్‌రూట్‌లో వచ్చిన టిప్పర్‌ ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే అసువులు బాశారు. శిరస్త్రాణం ఉండటంతో భర్త మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు.

రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా ద్విచక్ర వాహనదారులు మృతి చెందుతుండగా.. శిరస్త్రాణం లేకపోవడం వల్లే అధిక మరణాలు సంభవిస్తున్నాయి. 2019లో రాష్ట్రవ్యాప్తంగా 21,999 ప్రమాదాలు జరగగా.. 6,964 మంది చనిపోయారు. వీరిలో 2,863 మంది ద్విచక్ర వాహనదారులే. మృతుల్లో 1,996 మంది డ్రైవర్లు, 867 మంది పిలియన్‌ రైడర్లు ఉన్నారు. వాహనం నడిపేవారితో పాటు పిలియన్‌ రైడర్‌ (వెనక కూర్చున్న వ్యక్తి) శిరస్త్రాణం ధరిస్తే ప్రాణాపాయం నుంచి బయటపడొచ్చు. వాహనాలు విక్రయించే డీలర్లే రెండు శిరస్త్రాణాలను ఉచితంగా ఇవ్వాలని నిబంధనలున్నాయి. వాటిని చాలామంది బేఖాతరు చేస్తుండటమే అసలు సమస్య.

ఇదీ నిబంధన 

కేంద్ర మోటారు వాహనాల నిబంధనలు, 1989లోని 138(4)(ఎఫ్‌) ప్రకారం.. ప్రతి ద్విచక్ర వాహనం అమ్మకం సమయంలో కొనుగోలుదారుకు తయారీదారుల నుంచి తెప్పించి డీలర్లు తప్పనిసరిగా రెండు శిరస్త్రాణాల్ని ఉచితంగా అందించాలి. అవి కచ్చితంగా బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్‌ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. వాహనం తయారీ సమయంలో పాటించే వివిధ భద్రత ప్రమాణాల్లో శిరస్త్రాణాన్నీ పరిగణించాలి.

ఉచిత శిరస్త్రాణాలు పొందడం తమ హక్కు అని.. చాలామంది వాహనదారులకు అవగాహన లేదు. కొందరు డీలర్లను అడిగితే తయారీదారులు సరఫరా చేయడం లేదంటూ చేతులెత్తేస్తున్నారు. ఓ ప్రముఖ సంస్థకు చెందిన ఒకరిద్దరు డీలర్లు తప్ప ఎక్కడా ఉచితంగా అందిస్తున్న దాఖలాలు లేవు.

ఇలా చేయాలి..

* రిజిస్ట్రేషన్‌ సమయంలో ఆర్టీవో కార్యాలయాల్లో వాహనం ఇన్‌వాయిస్‌తోపాటు ఉచిత శిరస్త్రాణాలు పొందినట్లు చూపించే ధ్రువీకరణపత్రం జత చేయడాన్ని తప్పనిసరి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

* వాహన డీలర్లు రెండు శిరస్త్రాణాల్ని ఉచితంగా తమకు ఇచ్చినట్లు కొనుగోలుదారు ధ్రువీకరణ ఇవ్వకపోతే వాహనం రిజిస్ట్రేషన్‌ ఆపేయాలి. అలాంటి సందర్భాల్లో డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలి.

* షోరూంలలో ‘ఉచిత నిబంధన’ బోర్డులను తప్పనిసరిగా ప్రదర్శించాలి.

* తెలంగాణలో 2020-21 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 9,06,705 వాహనాలు విక్రయించగా.. వాటిలో 6,45,954 (71.2 శాతం) ద్విచక్ర వాహనాలే.

* ద్విచక్ర వాహనదారుల ప్రమాద మరణాల్లో దేశంలో తెలంగాణ అయిదో స్థానంలో ఉంది.

* రాష్ట్రంలో ట్రాఫిక్‌ పోలీసులు విధిస్తున్న జరిమానాల్లో 70 శాతానికిపైగా శిరస్త్రాణం ధరించని కేసులే ఉంటున్నాయి. 2019లో 72,74,713 (73.3 శాతం), 2020లో అక్టోబరు నాటికి 89,13,892 (78.13 శాతం) కేసులు నమోదయ్యాయి.

6)తిరిగి తెలంగాణకి విక్రమ్ జిత్ దుగ్గల్... 



 తెలంగాణ కేడర్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి విక్రమ్‌జీత్‌ దుగ్గల్‌ను ఆకస్మికంగా రిలీవ్‌ చేస్తూ పంజాబ్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వెంటనే తిరిగి వెళ్లాలని ఆదేశిస్తూ ఆ రాష్ట్ర హోంశాఖ మూడు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు డీజీపీ మహేందర్‌రెడ్డికి సమాచారం అందించింది. రామగుండం కమిషనర్‌గా పనిచేస్తూ.. ఇంటర్‌స్టేట్‌ డిప్యుటేషన్‌పై 2019 ఏప్రిల్‌లో ఆయన సొంత రాష్ట్రం పంజాబ్‌కు వెళ్లారు. ఆ రాష్ట్ర సీఎంగా పనిచేసిన అమరీందర్‌సింగ్‌ అప్పట్లో దుగ్గల్‌ను సొంత రాష్ట్రానికి పిలిపించుకున్నారు. అమృత్‌సర్‌ కమిషనర్‌గా ఉంటూ రిలీవ్‌ అయ్యారు. ఇటీవలే అమరీందర్‌ ప్రభుత్వం మారిన నేపథ్యంలోనే కొత్త సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

7)TSRTC ఉద్యోగులకు ఆర్టీసి బంపర్ ఆఫర్.. ఐదు ఏళ్ల వరకు సెలవలు....


ఐదేళ్ల వరకు సెలవులు

అయినా మీ ఉద్యోగం భద్రం

డ్రైవర్లు, కండక్టర్లకు ఆర్టీసీ బంపర్‌ ఆఫర్‌

3 వేల మిగులు సిబ్బంది నేపథ్యంలో నిర్ణయం

‘అసాధారణ సెలవు’ను పునరుద్ధరించిన సంస్థ 


హైదరాబాద్‌: మస్తాన్, శేఖర్‌కే కాదు.. వీరిలా సుదీర్ఘ సెలవు పెట్టాలనుకునే డ్రైవర్, కండక్టర్లకు ఆర్టీసీ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. వీరికి ‘అసాధారణ సెలవు’విధానం వర్తింపజేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వు జారీ చేసింది. మీరు ఏదైనా కారణంతో విధులకు హాజరుకాలేని పరిస్థితి ఉందా.. అయితే దరఖాస్తు చేసుకోండి.. ‘అసాధారణ సెలవు’ఇచ్చేస్తామంటూ డిపో మేనేజర్లు డ్రైవర్, కండక్టర్లకు సూచిస్తున్నారు. దీంతో భారీ సంఖ్యలో సిబ్బంది ఈ ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ లీవ్‌ (ఈఓఎల్‌)’కు దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు.  

గుర్తొచ్చిందే తడవు అమల్లోకి..

రెండేళ్ల క్రితం కార్మికుల సమ్మె సందర్భంగా ఆర్టీసీ 1,300 అద్దె బస్సులను అదనంగా తీసుకుంది. వాటిల్లో అద్దె బస్సు యజమానులే ప్రైవేటు డ్రైవర్లను ఏర్పాటు చేసినందున అంతమేర సంస్థ డ్రైవర్లు మిగిలిపోయారు. ఆ వెంటనే వేయి బస్సులను ఆర్టీసీ తగ్గించుకోవటంతో మళ్లీ డ్రైవర్లు, కండక్టర్లు మిగిలిపోయారు. ఇలా ప్రస్తుతం దాదాపు 3 వేల మంది డ్రైవర్లు, కండక్టర్లు మిగిలిపోయి ఉన్నారు.

వీరికి పని లేకపోయినా జీతం చెల్లించాల్సిందే. అసలే అంతంత మాత్రంగా ఉన్న సంస్థ ఆర్థిక పరిస్థితి, మిగులు ఉద్యోగుల నేపథ్యంలో ఆర్టీసీకి ఈ అసాధారణ సెలవు గుర్తొచ్చింది. ఇలా సిబ్బంది మిగిలిపోతే ఈ సెలవు ఇవ్వచ్చని ఆర్టీసీ విధివిధానాల్లో ఉంది. గతంలో అమలు చేశారు కూడా. తర్వాత డ్రైవర్, కండక్టర్ల కొరత దృష్ట్యా దీన్ని నిలిపేశారు.   

గరిష్టంగా ఐదేళ్లే..: ఈఓఎల్‌ కింద గరిష్టంగా ఐదేళ్లపాటు సెలవులో ఉండొచ్చు. అప్పటివరకు వారి ఉద్యోగం అలాగే పదిలంగా ఉంటుంది. మిగిలి ఉన్న సెలవులను వినియోగించుకున్నంత మేర వారికి జీతం వస్తుంది. ఆ తర్వాత ఎలాంటి జీతం ఉండదు. అయితే జీతం రాకపోయినా పరవాలేదు సెలవు దొరి కితేచాలు అనుకునే.. అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నవా రికి, విదేశాలకు వెళ్లే ఆలోచన ఉన్నవారికి, రిటైర్మెంట్‌కు చేరువలో ఉన్న వారికి ఇది ఉపకరిస్తుంది. 

ఇబ్బందిగా మారిన రెండేళ్ల పొడిగింపు

గత సమ్మె తర్వాత ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ కాలాన్ని రెండేళ్లు పొడిగించారు. దీంతో 58 ఏళ్లకు బదులు 60 ఏళ్ల వయస్సు వరకు ఉద్యోగంలో కొనసాగే అవకాశం ఏర్పడింది. ఇది డ్రైవర్లు, కండక్టర్లకు ఇబ్బందిగా మారింది. వీరిలో చాలామంది 58 ఏళ్ల వయసు వచ్చేవరకు ఈ విధులు నిర్వర్తించడానికే ఇబ్బంది పడుతుంటారు. ఆరోగ్యపరంగా ఏర్పడే సమస్యలే దీనికి ప్రధాన కారణం. ఈ పరిస్థితుల్లో సర్వీసు మరో రెండేళ్లు పొడిగించటంతో చాలామంది నిస్సహాయ స్ధితిలో ఉన్నారు. తాజాగా ఇలాంటివారు కూడా ఈ అసాధారణ సెలవును వినియోగించుకునేందుకు, ఇతర ఆదాయ మార్గాలు చూసుకునేందుకు అవకాశం ఏర్పడింది.  

►మస్తాన్‌ ఆర్టీసీలో కండక్టర్‌.. కుటుంబ అవసరాలకు ఆదాయం సరిపోక పోవడంతో దుబాయ్‌ వెళ్లి పెద్దమొత్తంలో సంపాదించుకోవాలనుకుంటున్నాడు. నాలుగైదేళ్ల పాటు అక్కడే ఉండాలనే ఉద్దేశంతో అప్పటివరకు ఆర్టీసీ విధులకు రాలేనంటూ సెలవు ఆర్జీ పెట్టాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఇంత సుదీర్ఘ సెలవు పెడితే ఉద్యోగం ఉంటుందా? అనే సందిగ్ధంలో ఉన్నాడు. 

►శేఖర్‌ హైదరాబాద్‌లో బస్సు డ్రైవర్‌.. మరో నాలుగేళ్లలో రిటైర్మెంట్‌ ఉంది. కానీ ఇటీవల ఒంట్లో నిస్సత్తువగా ఉంటూ నగరంలో డ్రైవింగ్‌ చేయటానికి ఇబ్బంది పడుతున్నాడు. విధులకు వెళ్లొద్దని కుటుంబసభ్యులు సూచిస్తుండటంతో సుదీర్ఘ సెలవు పెట్టేసి ఇతర ఆదాయ మార్గాలు చూసుకోవాలనుకుంటున్నాడు. కానీ సంస్థ అనుమతిస్తుందో, లేదోనన్న అనుమానంతో ఉన్నాడు.

ఫిర్యాదులు నాకు చెప్పండి: సజ్జనార్‌

హైదరాబాద్‌: ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి చురుగ్గా వ్యవహరిస్తున్న సజ్జనార్‌.. ప్రయాణికులు, సొంత సిబ్బంది ఆర్టీసీకి సంబంధించి ఫిర్యాదులను, సూచనలను నేరుగా తన దృష్టికి తేవాలని సూచించారు. md@tsrtc.telangana.gov.in మెయిల్‌ ఐడీని వెల్లడించారు. @tsrtcmdoffice ట్విట్టర్‌ ఖాతాను కూడా అనుసరించాల్సిందిగా కోరారు.

8)కఠినంగా జేఈఈ అడ్వాన్స్డ్ ......పేపర్ 1 తో పోల్చుకుంటే పేపర్ 2 కష్టం. రేపు సాయంత్రం వెబ్ సైట్ లో ఓఎంఆర్ పత్రం




ఈనాడు- హైదరాబాద్‌, అమరావతి: ఐఐటీల్లో ప్రవేశానికి దేశవ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ కఠినంగా ఉందని నిపుణులు స్పష్టం చేశారు. గత ఏడాది పరీక్షతో పోల్చుకున్నా కష్టంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈసారి ఉదయం జరిగిన పేపర్‌-1 కంటే మధ్యాహ్నం జరిగిన పేపర్‌-2 ప్రశ్నపత్రం కష్టంగా ఉందని పేర్కొన్నారు. అధిక శాతం మంది విద్యార్థులు గణితం ప్రశ్నలకు ఎక్కువ సమయం వెచ్చించాల్సి వచ్చిందని, రసాయనశాస్త్రం ప్రశ్నలు క్లిష్టంగాను, భౌతికశాస్త్రం మధ్యస్తంగానూ ఉన్నాయని శ్రీచైతన్య జేఈఈ జాతీయ డీన్‌ ఎం.ఉమాశంకర్‌ చెప్పారు. మొత్తంమీద సగటు విద్యార్థికి ఈ పరీక్ష చాలా కఠినంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. రసాయనశాస్త్రం మార్కులు ఈసారి ఉత్తమ ర్యాంకును నిర్ణయిస్తాయన్నారు. సగటున 18 శాతం మార్కులు అంటే.. 360కి 65 వస్తే జనరల్‌ కేటగిరీ విద్యార్థులు అడ్వాన్స్‌డ్‌లో ఉత్తీర్ణులై కౌన్సెలింగ్‌కు అర్హత సాధిస్తారని అంచనా వేశారు. పేపర్‌-1, 2లో గణితం ప్రశ్నలు క్లిష్టంగా ఉన్నాయని విజయవాడకు చెందిన శారదా విద్యాసంస్థల నిపుణుడు విఘ్నేశ్వరరావు చెప్పారు. తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 25 వేల మంది పరీక్ష రాశారు. కొందరు విద్యార్థులు 310కి పైగా మార్కులు సాధించే అవకాశం ఉందని తెలుస్తోంది.

9)టీటీడీ శ్రీ పద్మావతి ఆస్పత్రిలో సేవలందించడానికి దరఖాస్తులు ఆహ్వానించిన టీటీడీ.


తిరుపతిలోని శ్రీపద్మావతి పిల్లల హృదయాలయం(శ్రీపద్మావతి చిల్డ్రన్స్‌ హార్ట్‌ సెంటర్‌) ఆసుపత్రిలో స్వచ్ఛందంగా సేవలందించడానికి దేశంలో గుర్తింపు పొందిన వైద్య నిపుణుల నుంచి తితిదే దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రాణదానం పథకం కింద నిర్వహిస్తున్న ఈ ఆసుపత్రిలో నవజాత శిశువులు, పిల్లలకు గుండె శస్త్ర చికిత్సలు, వైద్యసేవలు అందించడానికి పదిహేను ఏళ్ల అనుభవం కలిగి, హిందూ మతానికి చెందిన పీడియాట్రిక్‌ కార్డియో థొరాసిక్‌ సర్జన్లు అర్హులని తెలిపింది. ఈ సేవలు రెండు విధానాల్లో ఉంటాయని పేర్కొంది. ఆప్షన్‌-ఎ కింద సేవకు వచ్చే వైద్యుడితోపాటు ఐదుగురు కుటుంబ సభ్యులకు ఉచిత వసతి, తిరుమల శ్రీవారి ప్రొటోకాల్‌ దర్శనం, తిరుపతి-తిరుమల మధ్య ఉచిత రవాణా సదుపాయం కల్పించనుంది. ఆప్షన్‌-బి కింద తితిదే నియమ నిబంధనల మేరకు వైద్య నిపుణులకు పరస్పర ఒప్పందం ప్రకారం పారితోషికం చెల్లిస్తుంది. రెండో ఆప్షన్‌ ఎంచుకున్న వారికి వసతి, దర్శనం, స్థానిక రవాణా సదుపాయాలు ఉండవు. ఆసక్తి ఉన్న వైద్యులు cmo.adldirector@gmail.com మెయిల్‌ ఐడీకి వివరాలు పంపాలని కోరింది.

10)కరోనా 199 రోజుల కనిష్టానికి ఆక్టివ్ కేసులు.   




దిల్లీ: దేశంలో కొవిడ్‌ కేసుల సంఖ్య ఆదివారం మరింత తగ్గి 199 రోజుల కనిష్ఠానికి చేరింది. గత 24 గంటల్లో కొత్తగా 22,842 మంది వైరస్‌బారిన పడగా.. 25,930 మంది కోలుకున్నారు. 244 కొవిడ్‌ మరణాలు సంభవించాయి. మొత్తంగా వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య  3,38,13,903కి చేరగా.. వీరిలో 3,30,94,529 మంది కోలుకున్నారు. 4,48,817 మంది మహమ్మారికి బలైపోయారు. మరోవైపు దేశవ్యాప్తంగా 90.51 కోట్ల టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.

సైబర్ నేరగాళ్ల వల... చిక్కారో ఖాతా ఖాళీ... తక్షణ ఫిర్యాదులకు జాతీయ హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ 155260, డయల్ 100,112

సైబర్ నేరగాళ్ల  వల... చిక్కారో ఖాతా ఖాళీ...

తక్షణ ఫిర్యాదులకు జాతీయ హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ 155260, డయల్ 100,112



NCRP portal (www.cybercrime.gov.in) లో కూడా  ఫిర్యాదు చేయవచ్చు

 

     ఈజీ మనీకి అలవాటు పడ్డ సైబర్ నేరగాళ్లు ఆన్లైన్ వేదికగా అమాయకులను దోచుకుంటున్నారు. సరికొత్త పద్ధతిలో వలవేస్తూ నమ్మినోళ్లను నిండాముంచుతున్నారు. *"హలో.. మేం బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాం. మీ ఏటీఎం కార్డు కాల పరిమితి ముగిసింది. ఆధార్ అనుసంధానం చేయాలి.. మీ ఖాతా సంఖ్య చెప్పండి"* అని ఒకరు. *"నేను ఆర్మీ అధికారిని* డబ్బులు అత్యవసరం ఉండడంతో తన కార్, బైక్ తక్కువ ధరకే అమ్ముతున్నా.. ఆధార్ నంబర్, అడ్రస్ చెబితే చాలు నేరుగా మీ ఇంటికే పంపుతా! అంటూ మరొకరు పోస్టులు పెట్టి... ఫోన్లు చేసి డబ్బులు కొల్లగొడుతున్న సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతున్నది. కొంతకాలంగా ఇలాంటి వారి వలలో పడి మోసపోతున్న వారి సంఖ్య పెరుగుతుంది. ఫిర్యాదుల కోసం కేంద్ర హోం శాఖ టోల్ ఫ్రీ నంబర్ 155260 తోపాటు దానికి అనుసంధానంగా రాష్ట్ర పోలీసు విభాగం డయల్ 100,112 నంబర్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ టోల్ ఫ్రీ నెంబర్ లకు తక్షణం ఫిర్యాదు చేస్తేనే న్యాయం జరుగుతుందని, అనుమానాస్పద లింకులు మెసేజ్లను కూడా ఓపెన్ చేయొద్దని, అప్రమత్తంగా ఉండాలని ప్రజల అప్రమత్తతే సైబర్ నేరగాళ్ల నుండి రక్షణ అని రామగుండము పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్.చంద్రశేఖర్ రెడ్డి ఐపిఎస్.,(డిఐజి) గారు అన్నారు



రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ వారం రోజుల వ్యవధి లో రిపోర్ట్ అయిన కొన్ని కేసుల వివరాలు...


1. ఒక సైబర్ నేరగాడు తేదీ.20/9/20 న భీమిని గ్రామానికి చెందిన ఒక వ్యక్తి పేరు మీద ఫేక్ Facebook అకౌంట్ క్రియేట్ చేసి, దాని ద్వారా ఫ్రెండ్స్ ని యాడ్ చేసుకొని నా భార్య హాస్పిటల్ లో చావు బ్రతుకుల మధ్య ఉంది, తక్షణం డబ్బులు కావాలి అనగా, తన అకౌంట్ లో ఉన్న స్నేహితులకు మెసెంజర్ ద్వారా మెసేజ్ పంపగా ఒక  ఫ్రెండ్  2 వేలు, మరొక ఫ్రెండ్  వెయ్యి రూపాయలు phone pay ద్వారా పంపి తన ఫ్రెండ్ కి ఫోన్ చేయగా అట్టి మెసేజ్ నేను పంపలేదు అని తెలపగా సదరు వ్యక్తులు సైబర్ నేరగాళ్ల చేతిలో మోస పోయామని గ్రహించారు.



2. 👉ఒక సైబర్ నేరగాడు తేదీ.13.6.21 న బెల్లంపల్లి పట్టణానికి చెందిన ఒక బాధితుని కి మీ బ్యాంక్ యొక్క KYC ని update చేసుకోవాలి, లేకుంటే అకౌంట్ బ్లాక్ అవుతుంది అని ఒక లింక్ ను URL రూపంలో SMS ద్వారా పంపించగా, అది నిజమని నమ్మి click చేయగా, Rs.14,900/- లు వివిధ దపా లు గా బ్యాంక్ ఖాతా నుండి  కట్ అయినవి.



3. 👉మంచిర్యాల పట్టణానికి చెందిన  ఒక బాధితుడు తన SBI bank యొక్క YONO application యొక్క password మర్చిపోగా, తెలుసుకోవడానికి SBI customer care number కి కాల్ చేయాలనుకొని GOOGLE లో search చేయగా, ఒక నంబర్ రాగా వారికి ఫోన్ చేస్తే Any Desk App download చేసుకోవాలి అని చెప్పగా, వారు చూచించిన విధంగా చేయగా, Rs.9 వేలు కట్ అయినవి. తాను దొంగ customer care number కి ఫోన్ చేసి మోస పోయానని గ్రహించాడు.



4. 👉 బెల్లంపల్లి పట్టణానికి చెందిన ఒక బాధితుని  కంప్యూటర్ కు సైబర్ నేరగాడు ఒక లింక్ ని పంపించగా, దానిని క్లిక్ చేయగానే దానిలో ఉన్న GMail  మరియు YouTube ఛానల్ యొక్క లాగ్ ఇన్ ఐడి padsword లు తెలుసుకొని మార్చి వేశాడు.



5. 👉 గోదావరిఖని పట్టణానికి చెందిన ఒక లారీ ఓనర్ కు సైబర్ నేరగాడు ఫోన్ చేసి, మా లారీ ట్రాన్స్ పోర్ట్ ఆఫీస్ లో మీ లారీ లీజుకు పెట్టుకుంటామని నమ్మించి, registration ఖర్చుల క్రింద రెండు ధపా లుగా 72 వేల రూపాయలు Online ద్వారా పంపి మోసపోయాడు.



6. 👉 మందమర్రి పట్టణానికి చెందిన ఒక బాధితుడు 2nd hand మోటార్ సైకిల్ OLX App ద్వారా కొనుక్కోవాలని వెతికి,  ఒక మోటార్ సైకిల్ నచ్చి దాని ఓనర్ కు ఫోన్ చేసి విచారించగా అతను ఆర్మీ ఉద్యోగం చేస్తాను అని తెలపగా అది నమ్మి బాదితుడు మొదట Rs.2,100/- డబ్బులు పంపిస్తే బైక్ ని ట్రాన్స్పోర్ట్ లో వేస్తానని నమ్మించి ఆ తర్వాత GST కింద 8,200 రూ.లు ఆ తరువాత ఆఫ్ పేమెంట్ కింద 16,000 రూ. లు పంపించినా కూడా, ఇంకా కావాలని ఒత్తిడి చేయగా, మొత్తం డబ్బులు మోసపోయానని గ్రహించాడు.



7. 👉 గోదావరిఖని పట్టణానికి చెందిన ఒక నిరుద్యోగి quickerjob.com లో ఉద్యోగం కోసం రిజిస్టర్ చేసుకున్నాడు. సదరు వ్యక్తి బయోడేట ఆదరంగా ఒక సైబర్ నేరగాడు బాధితునికి ఫోన్ చేసి పార్ట్ టైం జాబ్ ఆఫర్ ఉందని జాయిన్ కావాలంటే ఫోన్ పే ద్వారా 2000రూ.లు పంపించి రిజిస్టర్ చేసుకోవాలని కోరగా, డబ్బులు పంపించి మోసపోయానని గ్రహించాడు.



8. 👉 మంచిర్యాల పట్టణానికి చెందిన ఒక బాధితునికి పార్ట్ టైం జాబ్ ఉందని Text మెసేజ్ వచ్చింది. దానిని క్లిక్ చేయగా, రిజిస్టర్ చేసుకున్న తర్వాత ప్రొడక్ట్స్ ని ఆర్డర్ చేయాలి, దానికి కమీషన్ వస్తుంది అనగా వివిధ దఫాలుగా 42 వేల రూపాయలు పంపించి మోసపోయాడు.



9. 👉 గోదావరిఖని పట్టణానికి చెందిన ఒక బాధితుడు Rupeesmart అనే లోన్ యాప్ ద్వారా 5000 రూ.లు తీసుకున్నాడు.  15 రోజుల తర్వాత లోన్ చెల్లించాలని అతడికి వాట్సాప్ ద్వారా మెసేజ్ రాగా లింక్ ఓపెన్ చేసి అమౌంట్ పే చేశాడు. మరల బాధితునికి డబ్బులు కట్టాలి అని ఫోన్ రాగా ఇంతకు ముందే కట్టాను కదా, అని విచారించగా సైబర్ నేరగాళ్ల కు డబ్బులు చెల్లించి మోసపోయానని గ్రహించాడు.



అప్రమత్తతే రక్షణ

👉 డెబిట్, క్రెడిట్ కార్డ్స్, యూపీఐ పిన్, పాస్వర్డ్ లను, కార్డుల సీవీవీ నెంబర్లను ఏ బ్యాంక్ అధికారి అడుగరు. వినియోగదారులు గమనించాలి. బ్యాంకు అధికారులమంటూ వచ్చే ఫోన్ కాల్క సమాధానం ఇవ్వకపోవడమే మంచిది.


👉ఫేస్బుక్, ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్ వేదికగా పలు యాప్ ద్వారా అందమైన అమ్మాయిలు, మహిళల ఫొటోలతో ఆకౌంట్లు తెరిచి ఫ్రెండ్ రిక్వెస్టులు, ఫొటోలు పంపుతారు. వలలో చిక్కేదాకా చాలా అనుకువగా ప్రవర్తించి, చిక్కిన తర్వాత బ్లాక్మె యిల్ చేసి డబ్బులు గుంజుతారు. ఇలాంటి వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.


👉అపరిచితుల నుంచి వచ్చే ఆఫర్లు, లాటరీలు, డిస్కౌంట్లను నమ్మవద్దు. ఎవరూ ఊరికే మనకూ బహుమ తులు ఇవ్వరు. డబ్బులు పంపరు.


👉 ఒక్క క్లిక్తో లోన్ ఇస్తామని నమ్మిస్తూ పలు యాప్ ద్వారా లోన్లు ఇస్తారు. లోన్ మొత్తానికి 50 రెట్లు అధికంగా వసూలు చేయడమే కాదు మొత్తం తీర్చినా ఇంకా కట్టాల్సి ఉందని వేధి స్తారు. ఇలా వేధింపులు భరించలేక ఆత్మహత్య లు చేసుకుంటున్నారు.