1) సోలార్ వాహనం..ఆవిష్కరణ అద్భుతం
2) ఎస్పీఎం కార్మికులకు భద్రత ఏది ?
3) కొత్త వృద్ధాప్య పింఛన్ల మంజూరు కోసం దరఖాస్తుల స్వీకరణ
4)పోడు భూముల పరిష్కారానికి కార్యాచరణ చేపట్టాలని సీఎం ఆదేశం
5)దండేపల్లి లో డ్రాగన్ కుంగ్ ఫు పోటీలు
6)ఉద్యోగ వయసు పరిమితిని 40 ఏళ్లకు పెంచాలి
7)గుడిసె కూలి ఐదుగురు మృతి
8)సింగరేణి లాబాల వాట విషయంలో తప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న టిబిజికేఎస్....సారయ్య.
1)సోలార్ వాహనం..ఆవిష్కరణ అద్భుతం
సూర్యరశ్మితో పరుగులు పెడుతున్న ట్రాలీ..
మెట్‌పల్లి యువకుడి వినూత్న ఆలోచన
మండిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. లీటరు చమురు ధర ఇప్పటికే రూ.వంద దాటేసింది. మరోవైపు, పెరిగిపోతున్న కాలుష్యంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలోని బీడీ కాలనీకి చెందిన యువకుడు అల్లాడి ప్రణయ్ కుమార్ నడుం బిగించారు. పెట్రోల్, డీజిల్ అవసరం లేకుండా, సూర్యరశ్మితో నడిచే సోలార్ పవర్ ఎలక్ట్రిక్ వాహనాన్ని ఆవిష్కరించారు. పారిశుధ్య కార్మికులు చెత్తను తరలించేందుకు, రైతులకు సాగు పనుల్లో ఉపయోగపడేలా దీనిని రూపొందించారు. నాలుగు చక్రాలతో నడిచే ఈ బండికి హైడ్రాలిక్ జాక్ సిస్టమ్‌ను అమర్చారు. ఇది సుమారు ఎనిమిది క్వింటాళ్ల బరువును మోస్తుంది. సోలార్ ప్యానెళ్లు, నాలుగు బ్యాటరీలు, మోటార్లతో తయారు చేసిన ఈ వాహనానికి సుమారు రూ.2 లక్షల వరకు ఖర్చయింది.
గంటకు 40కి.మీ వేగంతో ప్రయాణించే ఈ వాహనం ఒక్కసారి చార్జ్ చేస్తే 30 కి.మీ వరకు వెళుతుంది. జీపులు, కారు, ఆటో, ట్రాలీ ఆటో వంటి వాహనాలకు ఇలా సోలార్ పలకలు అమర్చి వినియోగించుకోవడానికి వీలుంటుందని ప్రణయ్ అంటున్నారు. సాధారణ వాహనాలను సోలార్ పవర్‌గా మార్చడానికి రూ.రెండు లక్షలు అవుతుందని చెబుతున్నారు. ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తే మరిన్ని ఆవిష్కరణలు చేయడానికి ప్రయత్నిస్తానని ప్రణయ్ కుమార్ తెలిపారు.
2)ఎస్పీఎం కార్మికులకు భద్రత ఏది ?
-ప్రమాదాలు నిత్యకృత్యం
-పరిహారానికి లేదు మార్గం-
కార్మిక సంఘాలున్నా సమస్యలకు లేదు మోక్షం
-అధికారులు స్పందిస్తేనే మనుగడ
కాగజ్‌నగర్‌లోని ఎస్పీఎంలో కార్మికులకు భద్రత లేని పరిస్థితి నెలకొంది. మిల్లులో యాజమాన్యం రక్షణతో కూడు కున్న చర్యలు తీసుకున్నప్పటికీ ప్రమాదాలు జరుగు తున్నాయి. మూడురోజుల క్రితం ఎలక్ర్టికల్ డిపార్టు మెంటులో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుడు శంకర్ ప్రమాదశాత్తు కిండపడిపోయి చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. న్యాయపరంగా రావాల్సిన పరిహారం అందలేదన్న ఆరోపణలున్నాయి. మిల్లు పునరుద్ధరణ జరిగిన తర్వాత తరుచూ ప్రమాదాలు జరిగాయి. అయితే వీటిని బయటకి పొక్కనీయకుండా యాజమాన్యం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఆరునెలల క్రితం కూడా కాంట్రాక్టు కార్మికుడు వికాస్‌నాయక్ మృతి చెందాడు. మిల్లులో తరుచూ ప్రమాదాలు జరుగుతుండడంతో విధులు నిర్వహించాలంటే కార్మికుల్లో అభద్రతా భావం ఏర్పడుతోందని కార్మిక సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. కార్మికుడు చనిపోతే న్యాయపరంగా రావాల్సిన పరిహారం కూడా ఇచ్చే విషయంలో యాజ మాన్యం ముందడుగు వేయడం లేదన్న ఆరోపణలున్నాయి.
పరిహారం ఇవ్వడం లేదు..
2018లో మిల్లు పునరుద్ధరణ జరిగిన తర్వాత మిల్లులోని భాగాలను మరమ్మతులు చేసే క్రమంలో పలుమార్లు ప్రమాదాలు జరిగాయి. ఇందులో కొంత మంది కార్మికులకు గాయాలు కూడా అయ్యాయి. రెండేళ్ల క్రితం బాయిలర్ నిర్మాణ పనుల్లో భారీ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇతర రాష్ట్రాలకు చెందిన ముగ్గురు కార్మికులు ప్రాణాలు కొల్పోయారు. వీరి విషయంలో కూడా పరిహారం అందలేదని కార్మికులు పేర్కొంటున్నారు. 2014నుంచి మిల్లు మూత బడడంతో అన్ని మిషనరీలను తరుచూ మరమ్మతులు చేసేందుకు యాజమాన్యం చర్యలు తీసుకుంది. ఈ విషయంలోనే తరుచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రక్షణ విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు గట్టిగా నిఘా పెట్టాలని పలువురు డిమాండు చేస్తున్నారు. పరిహారం విషయంలో యాజమాన్యం మొండి వైఖరి వహిస్తోందని బీజేపీ నాయకుడు డాక్టర్ హరీష్ బాబు మండిపడ్డారు. ప్రమాదాల విషయంలో నిర్లక్ష్యం చేస్తే ఊరుకునేది లేదని పేర్కొంటున్నారు. కార్మిక చట్టం ప్రకారం పరిహారం అందిస్తేనే తమకు న్యాయం జరు గుతుందని పలువురు కార్మికులు డిమాండు చేస్తు న్నారు. మూడు రోజుల క్రితం కాంట్రాక్టు కార్మికుడు శంకర్ మృతిచెందిన విషయంలో కూడా పరిహారం ఎంత ఇచ్చారు..? ఏ ప్రతిపాదికన ఇచ్చారన్నది కూడా ఇంతవరకు యాజమాన్యం ప్రకటించలేదు.
దీంతో కార్మికుల ప్రాణాలకు విలువ లేకుండా పోతోందని కార్మిక సంఘాలు యాజమాన్యం తీరుపై మండి పడుతున్నాయి. న్యాయపరంగా పరిహారం అందకుంటే పోరుబాట పడుతామని కార్మిక సంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారు. మిల్లులో ఎంతమంది స్థానికులు, స్థానికేతరులు పని చేస్తున్నారన్నది జాబితా స్పష్టంగా తేలాల్సి ఉంది. స్థానికేతరులు చనిపోతే యాజమాన్యం ఎంత పరిహారం ఇస్తోందనేది ఇంకా తేలడం లేదు. ఈ విషయంలో కలెక్టర్‌తోపాటు రెవెన్యూ అధికారులు, కార్మికశాఖ స్పందించి మిల్లులో పనిచేసే కార్మికులపై కూలంకుషంగా జాబితా రూపొందించాలని, వీరందరికి యాజమాన్యం ఈఎస్‌ఐ, పీఎఫ్ కల్పిస్తోందా? లేదా అనే కోణంలో సమగ్ర విచారణ జరపాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండు చేస్తున్నారు. కార్మి కుడు చనిపోతే పరిహారం కోసం డిమాండ్ చేసే ప్రక్రియలో యాజమాన్యం పోలీసుల సహాయంతో అణగదొక్కేందుకు చర్యలు తీసుకుంటోందని పలువురు పేర్కొంటున్నారు. కార్మికులకు న్యాయం కోసం అధికారులు స్పందించాలని అంతా డిమాండు చేస్తున్నారు.
కార్మికుడు చనిపోతే పరిస్థితి దారుణం..
-అంబాల ఓదెలు, కార్మిక సంఘం నాయకుడు
మిల్లులో కార్మికుడు చనిపోతే పరిస్థితి దారుణంగా ఉంటోంది. పరిహారం విషయంలో జేకే యాజమాన్యం స్పష్టంగా ప్రకటించడం లేదు. చనిపోయిన కార్మికుడికి ఎంత సర్వీసు ఉందో దాన్ని పరిగణలోకి తీసుకొని పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. విధి నిర్వహణలో చనిపోతే ప్రత్యేక ప్యాకేజీతోపాటు ఇంటిలోని కుటుంబ సభ్యులకు ఒకరికి ఉద్యోగం ఇప్పిస్తే బాగుంటుంది. వీటన్నిటినీ పక్కనపెట్టి యాజమాన్యం ఇష్టాను సారంగా నిర్ణయం తీసుకుంటోంది. ఇక్కడ కార్మికులకు ముమ్మాటికీ అన్యాయమే జరుగుతోంది. అధికారులు తేరుకొని సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలి.
3)కొత్త వృద్ధాప్య పింఛన్ల మంజూరు కోసం దరఖాస్తుల స్వీకరణ
TS: కొత్త వృద్ధాప్య పింఛన్ల (Old Age Pensions) మంజూరు కోసం దరఖాస్తుల స్వీకరించనున్నారు. 57 ఏళ్లు నిండిన వారి నుంచి పింఛన్ల దరఖాస్తులు తీసుకోనున్నారు. సోమవారం నుంచి ఈ నెలాఖరు వరకు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం చేపట్టనున్నారు. మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.
2019 నుంచి నిలిచిన ప్రక్రియ...
రాష్ట్రంలో 2019 జులై నుంచి కొత్త పింఛన్ల మంజూరు ప్రక్రియ నిలిచిపోయింది. తెరాస ప్రభుత్వం తొలిసారిగా అధికారంలోకి వచ్చినప్పుడు ఆసరా పింఛన్లను రూ. వెయ్యికి, వికలాంగులకు ఇచ్చే పింఛన్లను రూ. 2 వేలకు పెంచింది. ఏ ఆధారంలేని నిరుపేద అర్హులు ఫించన్లతోనైనా బతకవచ్చనే ఆనందం వ్యక్తం చేశారు. తిరిగి రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత రూ. వెయ్యిగా పింఛన్‌ను 2016 రూపాయలకు, 2 వేలను 3016 రూపాయలకు పెంచడంతో అర్హుల ఆనందం అంతా ఇంతా కాదు. కానీ వృద్ధాప్య పిఛన్లకు 65 ఏళ్లు వయసు ఉండాలని ప్రభుత్వ చెప్పడంతో చాలామందికి పింఛన్ వర్తించకుండా పోయింది.
అనర్హులు ఎవరంటే?
దరఖాస్తుదారు వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షలు, పట్టణప్రాంతాల్లో రూ.2 లక్షలు మించొద్ధు. దరఖాస్తుదారు పేరిట మెట్ట భూమి 7.5 ఎకరాలు, మాగాణి 5 ఎకరాల్లోపు ఉండాలి. కుటుంబంలో ఇది వరకే పింఛను పొందుతుంటే మరొకరు అనర్హులుగా తేల్చుతారు. విచారణ సమయంలో ఇవన్నీ చూశాకే అర్హులను గుర్తిస్తారు. ఆ తర్వాతే పింఛను మంజూరవుతుంది.
దరఖాస్తు ఇలా..
ఈ నెల 31తో 57 ఏళ్లు నిండిన వారంతా వృద్ధాప్య పింఛను పొందేందుకు అర్హులుగా పరిగణిస్తారు. సంబంధీకులు దగ్గరలోని మీసేవ కేంద్రాలకు వెళ్లి తగు ఆధారాలతో దరఖాస్తు చేయాలి. వయసు నిర్ధరణకు పంచాయతీ, మున్సిపల్ జారీ చేసిన జనన ధ్రువీకరణపత్రాలు లేదా గతంలో చదివిన విద్యాసంస్థలు జారీచేసిన పత్రాలు, లేదంటే ఓటరు గుర్తింపుకార్డులో నమోదైన వయసును ఆధారంగా చూపించాలి. దరఖాస్తుకు ఆధార్‌కార్డు, వయసు నిర్ధరణ పత్రంతో పాటు బ్యాంకు పాసుపుస్తకం, పాస్‌పోర్టుసైజ్ ఫొటోతో స్వయంగా దరఖాస్తుదారు వెళ్లి వేలిముద్ర వేయాల్సి ఉంటుంది.
4)పోడు భూముల పరిష్కారానికి కార్యాచరణ చేపట్టాలని సీఎం ఆదేశం
పోడు భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ముఖ్యమంత్రి దృష్టిసారించారు. రాష్ట్రంలోని పోడు భూములపై అధికారులతో సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష (CM KCR Review on Podu Lands) నిర్వహించారు. పోడు భూముల పరిష్కారానికి కార్యాచరణ చేపట్టాలని ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. దసరా తర్వాత కార్యాచరణ ప్రారంభించాలని సూచించారు. పోడు సాగుదారుల లెక్క తేల్చి సమస్య పరిష్కరించాలన్నారు.
గజం భూమి కూడా అన్యాక్రాంతం కావొద్దు..
అడవుల నడిమధ్యలో పోడు సాగు ఉండొద్దని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. నడి అడవిలోని పోడు సాగును మరో చోటకు తరలించాలన్న ముఖ్యమంత్రి.. అలాంటి సాగుదారులకు అడవి అంచున భూమి కేటాయిస్తామన్నారు. పోడు భూమి తరలించి ఇచ్చిన వారికి సర్టిఫికెట్లు ఇవ్వాలన్నారు. సాగుకు నీటి సౌకర్యంతో పాటు విద్యుత్ వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. పోడు రైతులకు రైతుబంధు, రైతుబీమా కూడా ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. పోడు భూముల వ్యవహారం లెక్క తేలిన తర్వాత ఒక్క గజం అటవీభూమి కూడా అన్యాక్రాంతం కావొద్దని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
అటవీ పరిరక్షణ కమిటీలను నియమించాలి..
దురాక్రమణలు అడ్డుకోవడానికి రక్షణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు సూచించారు. అడవుల రక్షణ కోసం ఎలాంటి కఠిన చర్యలకూ వెనకాడవద్దన్నారు. పోడు సమస్యపై అవసరమైతే అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామన్నారు. అటవీ పరిరక్షణ కమిటీలు నియమించి..విధివిధానాలను రూపొందించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.
ఆక్రమణకు గురికావొద్దనేది అంతిమ లక్ష్యం
ఈనెల మూడోవారంలో పోడు రైతుల నుంచి దరఖాస్తుల స్వీకరణ చేపట్టాలన్నారు. దరఖాస్తుల ఆధారంగా క్షేత్రస్థాయిలో భూమిని పరిశీలించాలని.. ఎమ్మెల్యేల సూచనలు, సలహాలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గిరిజన, అటవీశాఖలతో సమన్వయం చేసుకోవాలన్నారు. నవంబర్ నుంచి అటవీ భూముల సర్వే, సరిహద్దుల గుర్తించి.. అవసరమైన మేరకు కందకాలు తవ్వకంతో పాటు ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలన్నారు. పకడ్బందీ చర్యల కోసం అవసరమైతే పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని.. అడవులు ఆక్రమణకు గురికావొద్దనేది అంతిమలక్ష్యమని సీఎం స్పష్టం చేశారు.
5)దండేపల్లి లో డ్రాగన్ కుంగ్ ఫు పోటీలు
డ్రాగన్ స్వాడ్ కుంగ్ ఫు అకాడమీ .ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆదివారం మండల కేంద్రంలోని పద్మశాలి భవనంలో మాస్టర్ బొడ్డు. రాయమల్లు.సిహెచ్. రాజేందర్ .కె మహేష్ లు బెల్టు పోటీలు నిర్వహించారు.
ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దండేపల్లి ఎస్ ఐ తాళ్ల .శ్రీకాంత్ పాల్గొన్నారు.
అనంతరం ఎస్ ఐ మాట్లాడుతూ డ్రాగన్ స్వాడ్ కుంగ్ ఫు నేటి యూవతరానికి ఎంతో ఆత్మరక్షణ ఉంటుంది అన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి