🗞️ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢
📰ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢
🗞️సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢
📰ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢
🗞️V6 వెలుగు➪ 🅣🅢
📰నవ తెలంగాణ ➪ 🅣🅢
🗞️నమస్తే తెలంగాణ ➪ 🅣🅢
📰మన తెలంగాణ ➪ 🅣🅢
🧾English Newspapers🗞️
☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟
☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟
ఈజీ మనీకి అలవాటు పడ్డ సైబర్ నేరగాళ్లు ఆన్లైన్ వేదికగా అమాయకులను దోచుకుంటున్నారు. సరికొత్త పద్ధతిలో వలవేస్తూ నమ్మినోళ్లను నిండాముంచుతున్నారు. *"హలో.. మేం బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాం. మీ ఏటీఎం కార్డు కాల పరిమితి ముగిసింది. ఆధార్ అనుసంధానం చేయాలి.. మీ ఖాతా సంఖ్య చెప్పండి"* అని ఒకరు. *"నేను ఆర్మీ అధికారిని* డబ్బులు అత్యవసరం ఉండడంతో తన కార్, బైక్ తక్కువ ధరకే అమ్ముతున్నా.. ఆధార్ నంబర్, అడ్రస్ చెబితే చాలు నేరుగా మీ ఇంటికే పంపుతా! అంటూ మరొకరు పోస్టులు పెట్టి... ఫోన్లు చేసి డబ్బులు కొల్లగొడుతున్న సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతున్నది. కొంతకాలంగా ఇలాంటి వారి వలలో పడి మోసపోతున్న వారి సంఖ్య పెరుగుతుంది. ఫిర్యాదుల కోసం కేంద్ర హోం శాఖ టోల్ ఫ్రీ నంబర్ 155260 తోపాటు దానికి అనుసంధానంగా రాష్ట్ర పోలీసు విభాగం డయల్ 100,112 నంబర్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ టోల్ ఫ్రీ నెంబర్ లకు తక్షణం ఫిర్యాదు చేస్తేనే న్యాయం జరుగుతుందని, అనుమానాస్పద లింకులు మెసేజ్లను కూడా ఓపెన్ చేయొద్దని, అప్రమత్తంగా ఉండాలని ప్రజల అప్రమత్తతే సైబర్ నేరగాళ్ల నుండి రక్షణ అని రామగుండము పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్.చంద్రశేఖర్ రెడ్డి ఐపిఎస్.,(డిఐజి) గారు అన్నారు
1. ఒక సైబర్ నేరగాడు తేదీ.20/9/20 న భీమిని గ్రామానికి చెందిన ఒక వ్యక్తి పేరు మీద ఫేక్ Facebook అకౌంట్ క్రియేట్ చేసి, దాని ద్వారా ఫ్రెండ్స్ ని యాడ్ చేసుకొని నా భార్య హాస్పిటల్ లో చావు బ్రతుకుల మధ్య ఉంది, తక్షణం డబ్బులు కావాలి అనగా, తన అకౌంట్ లో ఉన్న స్నేహితులకు మెసెంజర్ ద్వారా మెసేజ్ పంపగా ఒక ఫ్రెండ్ 2 వేలు, మరొక ఫ్రెండ్ వెయ్యి రూపాయలు phone pay ద్వారా పంపి తన ఫ్రెండ్ కి ఫోన్ చేయగా అట్టి మెసేజ్ నేను పంపలేదు అని తెలపగా సదరు వ్యక్తులు సైబర్ నేరగాళ్ల చేతిలో మోస పోయామని గ్రహించారు.
2. 👉ఒక సైబర్ నేరగాడు తేదీ.13.6.21 న బెల్లంపల్లి పట్టణానికి చెందిన ఒక బాధితుని కి మీ బ్యాంక్ యొక్క KYC ని update చేసుకోవాలి, లేకుంటే అకౌంట్ బ్లాక్ అవుతుంది అని ఒక లింక్ ను URL రూపంలో SMS ద్వారా పంపించగా, అది నిజమని నమ్మి click చేయగా, Rs.14,900/- లు వివిధ దపా లు గా బ్యాంక్ ఖాతా నుండి కట్ అయినవి.
3. 👉మంచిర్యాల పట్టణానికి చెందిన ఒక బాధితుడు తన SBI bank యొక్క YONO application యొక్క password మర్చిపోగా, తెలుసుకోవడానికి SBI customer care number కి కాల్ చేయాలనుకొని GOOGLE లో search చేయగా, ఒక నంబర్ రాగా వారికి ఫోన్ చేస్తే Any Desk App download చేసుకోవాలి అని చెప్పగా, వారు చూచించిన విధంగా చేయగా, Rs.9 వేలు కట్ అయినవి. తాను దొంగ customer care number కి ఫోన్ చేసి మోస పోయానని గ్రహించాడు.
4. 👉 బెల్లంపల్లి పట్టణానికి చెందిన ఒక బాధితుని కంప్యూటర్ కు సైబర్ నేరగాడు ఒక లింక్ ని పంపించగా, దానిని క్లిక్ చేయగానే దానిలో ఉన్న GMail మరియు YouTube ఛానల్ యొక్క లాగ్ ఇన్ ఐడి padsword లు తెలుసుకొని మార్చి వేశాడు.
5. 👉 గోదావరిఖని పట్టణానికి చెందిన ఒక లారీ ఓనర్ కు సైబర్ నేరగాడు ఫోన్ చేసి, మా లారీ ట్రాన్స్ పోర్ట్ ఆఫీస్ లో మీ లారీ లీజుకు పెట్టుకుంటామని నమ్మించి, registration ఖర్చుల క్రింద రెండు ధపా లుగా 72 వేల రూపాయలు Online ద్వారా పంపి మోసపోయాడు.
6. 👉 మందమర్రి పట్టణానికి చెందిన ఒక బాధితుడు 2nd hand మోటార్ సైకిల్ OLX App ద్వారా కొనుక్కోవాలని వెతికి, ఒక మోటార్ సైకిల్ నచ్చి దాని ఓనర్ కు ఫోన్ చేసి విచారించగా అతను ఆర్మీ ఉద్యోగం చేస్తాను అని తెలపగా అది నమ్మి బాదితుడు మొదట Rs.2,100/- డబ్బులు పంపిస్తే బైక్ ని ట్రాన్స్పోర్ట్ లో వేస్తానని నమ్మించి ఆ తర్వాత GST కింద 8,200 రూ.లు ఆ తరువాత ఆఫ్ పేమెంట్ కింద 16,000 రూ. లు పంపించినా కూడా, ఇంకా కావాలని ఒత్తిడి చేయగా, మొత్తం డబ్బులు మోసపోయానని గ్రహించాడు.
7. 👉 గోదావరిఖని పట్టణానికి చెందిన ఒక నిరుద్యోగి quickerjob.com లో ఉద్యోగం కోసం రిజిస్టర్ చేసుకున్నాడు. సదరు వ్యక్తి బయోడేట ఆదరంగా ఒక సైబర్ నేరగాడు బాధితునికి ఫోన్ చేసి పార్ట్ టైం జాబ్ ఆఫర్ ఉందని జాయిన్ కావాలంటే ఫోన్ పే ద్వారా 2000రూ.లు పంపించి రిజిస్టర్ చేసుకోవాలని కోరగా, డబ్బులు పంపించి మోసపోయానని గ్రహించాడు.
8. 👉 మంచిర్యాల పట్టణానికి చెందిన ఒక బాధితునికి పార్ట్ టైం జాబ్ ఉందని Text మెసేజ్ వచ్చింది. దానిని క్లిక్ చేయగా, రిజిస్టర్ చేసుకున్న తర్వాత ప్రొడక్ట్స్ ని ఆర్డర్ చేయాలి, దానికి కమీషన్ వస్తుంది అనగా వివిధ దఫాలుగా 42 వేల రూపాయలు పంపించి మోసపోయాడు.
9. 👉 గోదావరిఖని పట్టణానికి చెందిన ఒక బాధితుడు Rupeesmart అనే లోన్ యాప్ ద్వారా 5000 రూ.లు తీసుకున్నాడు. 15 రోజుల తర్వాత లోన్ చెల్లించాలని అతడికి వాట్సాప్ ద్వారా మెసేజ్ రాగా లింక్ ఓపెన్ చేసి అమౌంట్ పే చేశాడు. మరల బాధితునికి డబ్బులు కట్టాలి అని ఫోన్ రాగా ఇంతకు ముందే కట్టాను కదా, అని విచారించగా సైబర్ నేరగాళ్ల కు డబ్బులు చెల్లించి మోసపోయానని గ్రహించాడు.
👉 డెబిట్, క్రెడిట్ కార్డ్స్, యూపీఐ పిన్, పాస్వర్డ్ లను, కార్డుల సీవీవీ నెంబర్లను ఏ బ్యాంక్ అధికారి అడుగరు. వినియోగదారులు గమనించాలి. బ్యాంకు అధికారులమంటూ వచ్చే ఫోన్ కాల్క సమాధానం ఇవ్వకపోవడమే మంచిది.
👉ఫేస్బుక్, ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్ వేదికగా పలు యాప్ ద్వారా అందమైన అమ్మాయిలు, మహిళల ఫొటోలతో ఆకౌంట్లు తెరిచి ఫ్రెండ్ రిక్వెస్టులు, ఫొటోలు పంపుతారు. వలలో చిక్కేదాకా చాలా అనుకువగా ప్రవర్తించి, చిక్కిన తర్వాత బ్లాక్మె యిల్ చేసి డబ్బులు గుంజుతారు. ఇలాంటి వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
👉అపరిచితుల నుంచి వచ్చే ఆఫర్లు, లాటరీలు, డిస్కౌంట్లను నమ్మవద్దు. ఎవరూ ఊరికే మనకూ బహుమ తులు ఇవ్వరు. డబ్బులు పంపరు.
👉 ఒక్క క్లిక్తో లోన్ ఇస్తామని నమ్మిస్తూ పలు యాప్ ద్వారా లోన్లు ఇస్తారు. లోన్ మొత్తానికి 50 రెట్లు అధికంగా వసూలు చేయడమే కాదు మొత్తం తీర్చినా ఇంకా కట్టాల్సి ఉందని వేధి స్తారు. ఇలా వేధింపులు భరించలేక ఆత్మహత్య లు చేసుకుంటున్నారు.
తెలంగాణా పంచాయతీ రాజ్ శాఖ నుండి క్రీడా కోటా కింద జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకం కొరకు నోటిఫికేషన్ విడుదల - 2021
తెలంగాణా పంచాయతీ రాజ్ శాఖ నుండి క్రీడా కోటా కింద జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ప్రచురించింది. కింది ఖాళీలపై ఆసక్తి ఉన్న మరియు అన్ని అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన అభ్యర్థులు నోటిఫికేషన్ చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రకటన సంఖ్య: 2560/CPR & RE/B2/2017
మొత్తం ఖాళీలు: 172
ఈ ఖాళీల క్రీడా కేటగిరీ కింద నోటిఫై చేయబడ్డాయి
1). ఆదిలాబాద్ - 6
2). భద్రాద్రి కొత్తగూడెం - 7
3). జగిత్యాల - 5
4). జనగాన్ - 4
5). జయశంకర్ భూపాలపల్లి మరియు ములుగు - 6
6). జోగులాంబ గద్వాల్ - 3
7). కామారెడ్డి - 8
8). కరీంనగర్ - 4
9). ఖమ్మం - 9
10). కుమరంభీం ఆసిఫాబాద్ - 4
11). మహబూబాబాద్ - 7
12). మహబూబ్ నగర్ మరియు నారాయణపేట - 10
13). మంచిర్యాల్ - 4
14). మెదక్ - 6
15). మేడ్చల్ మల్కాజిగిరి - 0
16). నాగర్ కర్నూల్ - 6
17). నల్గొండ - 13
18). నిర్మల్ - 6
19). నిజామాబాద్ - 8
20). పెద్దపల్లి - 3
21). రాజన్న సిరిసిల్ల - 3
22). రంగారెడ్డి - 7
23). సంగారెడ్డి - 8
24). సిద్దిపేట - 6
25). సూర్యాపేట - 6
26). వికారాబాద్ - 8
27). వనపర్తి - 3
28). వరంగల్ రూరల్ - 5
29). వరంగల్ అర్బన్ - 1
30). యాదాద్రి భువనగిరి - 6
అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ/ గ్రాడ్యుయేషన్ మరియు కంప్యూటర్ పని పరిజ్ఞానం కలిగి ఉండాలి.
మరియు
G.O.Ms.No.74, YAT & C (క్రీడలు) విభాగం, Dt.09.08.2012 ప్రకారం ఈ నోటిఫికేషన్‌లో పేర్కొన్న మార్గదర్శకాల ప్రకారం క్రీడా కోటా కింద అర్హత కలిగి ఉండాలి.
కనిష్టం: 18 సంవత్సరాలు
గరిష్టం: 44 సంవత్సరాలు
నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు వర్తిస్తుంది
జనరల్ అభ్యర్థులకు: రూ. 800/-
Creamy layer కింద వచ్చే BC అభ్యర్థులకు రూ. 800/-
SC, ST, BC (Non-Creamy layer అభ్యర్థులకు), PH & Ex-Service Men: రూ. 400/-
చెల్లింపు గేట్‌వే లేదా నెట్ బ్యాంకింగ్ / క్రెడిట్ కార్డ్ / డెబిట్ కార్డ్ ద్వారా చెల్లించిన రుసుము. ఫీజు యొక్క ఆన్‌లైన్ చెల్లింపు ప్రయోజనం కోసం సేవలను అందించే బ్యాంకుల జాబితా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ & ఫీజు చెల్లింపు: 18-09-2021
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ & ఫీజు చెల్లింపు: 08-10-2021
నెలవారీ వేతనం రూ. 28,719/-
👉 నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్రింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేయండి..
సింగరేణిలో ఆరేళ్ల బాలికపై హత్యాచారం కేసులో తెలంగాణ ఆర్టీసీ అలర్ట్ అయింది. నిందితుడిని గుర్తించేందుకు ఆర్టీసీ బస్సుల్లో అప్రమత్తంగా ఉండాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సూచించారు.
సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలికపై హత్యాచారం కేసులో నిందితుడి కోసం తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ రంగంలోకి దిగారు. నిందితుడిని గుర్తించేందుకు ఆర్టీసీ బస్సుల్లో అప్రమత్తంగా ఉండాలని సజ్జనార్ ఆర్టీసీ సిబ్బందికి సూచించారు. నిందితుడిని గుర్తిస్తే వెంటనే 9390616366, 9490616627 నెంబర్లకు కాల్ చేయాలన్నారు. దాంతో ఆర్టీసీ ఉద్యోగులు అప్రమత్తమయ్యారు. నిందితుడు మద్యం మత్తుల్లో బస్టాండ్లలో నిద్రపోయే అవకాశం ఉందని తెలిపారు.
ఇలాంటి కేసులను చేధించడంలో ఐపీఎస్ సజ్జనార్‌కు మంచి గుర్తింపు ఉంది. అయితే ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా ఉన్న ఆయన నిందితుడిని గాలించేందుకు తెలంగాణ ఆర్టీసీని అలర్ట్ చేశారు. బస్ స్టేషన్లు, బస్సుల్లో అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. ఆర్టీసీ బస్సుల్లోనే నిందితుడు ప్రయాణించే అవకాశం ఉందని, ప్రతి బస్సులో, బస్లాండ్లలో నిందితుడి ఫొటోను పెట్టాలని ఆదేశించారు. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లతో పాటు సిబ్బంది అంతా అలర్ట్ గా ఉండాలని సూచించారు. నిందితుడు రాజు కదలికలు ఉన్నట్టుగా ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. 94906 16366, 94906 16627 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు.
కంటతడి పెట్టిస్తున్న సింగరేణి కాలనీ చిన్నారి పాట..! చిన్ని చిన్ని పాదాలురా.. అడుగులు ఏమాయెరా..?
హైదరాబాద్ నగరంలోని సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల పాపపై ఆటో డ్రైవర్ రాజు (30) హత్యాచారానికి పాల్పడ్డాడు. చిన్నారిపై అత్యాచారం చేసి ఆపై కిరాతకంగా చంపేశాడు. పసిపాపను దారుణంగా హత్యచేసిన నిందితుడిని గుర్తించి అప్పగించేంతవరకు పాప మృతదేహాన్ని కదిలించేది లేదంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.
సింగరేణి కాలనీలో అదృశ్యమైన బాలిక ఆచూకీ కోసం తల్లిదండ్రులు చుట్టుపక్కల గాలించారు. పాప ఆచూకీ తెలియకపోవడంతో ఆటో రాజుపై అనుమానం వచ్చింది. ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్న రాజు చిల్లర దొంగతనాలు చేస్తుండేవాడు. జనాలతో దురుసుగా ప్రవర్తించేవాడు. అతడే పాపను ఏమైనా చేశాడమేననే అనుమానంతో అర్థరాత్రి అతడి ఇంటి తలుపులు పగలగొట్టి చూశారు.
వారి అనుమానమే నిజమైంది.. చిన్నారి ప్రాణాలు కోల్పోయి విగతజీవిలా పడి ఉంది. ఆడుకుంటూ కేరింతలు కొట్టిన చిన్నారి చనిపోవడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. తమ పాపను దారుణంగా హత్యాచారం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. రోజులు గడుస్తున్నా నిందితుడి గురించి ఎలాంటి క్లూస్ కూడా దొరకలేదు. దాంతో నిందితుడిని గుర్తించి సమాచారం అందిస్తే.. వారికి 10లక్షల రివార్డు ఇస్తామంటూ రాజు ఫోటోను పోలీసులు విడుదల చేశారు.
A. ➡రాజకీయ నాయకులకు పెన్షన్కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయబడింది.
B. ➡ ఈ కార్యంలో భాగస్వాములు అవండి మరియు మద్దతు ఇవ్వండి.
C. ➡ ఇప్పుడు నాయకుల నాయకుడు సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు, మీ అంచనా కోసం పంపారు ..
D. ➡ప్రియమైన / గౌరవనీయమైన భారత పౌరులు ... మీరు ఈ సందేశాన్ని చదవమని అభ్యర్థన, మరియు మీరు అంగీకరిస్తే దయచేసి మీ పరిచయంలో ఉన్న ప్రజలందరికీ పంపండి మరియు ఇతరులకు పంపమని వారిని అడగండి.
E. ➡మూడు రోజుల్లో, ఈ సందేశం మొత్తం భారతదేశంలో ఉండాలి. భారతదేశంలోని ప్రతి పౌరుడు స్వరం పెంచాలి. 😝__
*2018 అభివృద్ధి చట్టం*
1. ➡ఎంపీలు పెన్షన్ పొందకూడదు ఎందుకంటే రాజకీయాలు ఉద్యోగం లేదా ఉపాధి కాదు. ఉచిత సేవ. రాజకీయ నాయకులు, ప్రజా ప్రాతినిధ్య చట్టం క్రింద ఎన్నిక చేయబడవచ్చు, పదవీ విరమణ లేదు, కానీ మళ్లీ అదే పరిస్థితిలో వారిని తిరిగి ఎన్నుకోవచ్చు. *(ప్రస్తుతం వారికి పెన్షన్ లభిస్తుంది, 5 సంవత్సరాల సేవ తర్వాత).*
2. ➡ ఇందులో మరో రుగ్మత ఏమిటంటే, ఒక వ్యక్తి మొదట కౌన్సిలర్‌గా ఉండి, తరువాత శాసనసభ్యుడిగా మారి, తరువాత ఎంపీగా మారితే, అతనికి *ఒకటి* కాదు *మూడు పెన్షన్లు* లభిస్తాయి.
దేశ పౌరులకు ఇది గొప్ప ద్రోహం ...
దీన్ని ఆపడానికి వెంటనే చట్టం చేయాలి.
3. ➡కేంద్ర వేతన సంఘంతో ఎంపీల జీత భత్యం సవరించబడుతోంది .... దీన్ని ఆదాయపు పన్ను పరిధిలోకి తీసుకురావాలి ....
4. ➡ప్రస్తుతం, ఎంపీలు తమకు తామే ఓటు వేసుకోవడం ద్వారా ఏకపక్షంగా జీతాలు మరియు భత్యాలను పెంచుతారు మరియు ఆ విషయంలో అన్ని పార్టీలు ఐక్యంగా ఉన్నాయి.
5. ➡ఎంపీల ఆరోగ్య సంరక్షణ విధానాన్ని సవరించాలి. మరియు ఇతర పౌరుల మాదిరిగానే భారతదేశ ప్రజారోగ్యం వంటి ఆరోగ్య సంరక్షణ విధానంలోనే వారిని చూసుకోవాలి. ప్రస్తుతం వారి చికిత్స తరచుగా విదేశాలలో జరుగుతుంది .. వారికి చికిత్స విదేశాలలో చేయవలసి వస్తే, వారు దానికయ్యే ఖర్చులను వారే స్వంతంగా భరించాలి .
6. ➡ విద్యుత్తు, నీరు, ఫోన్ బిల్లు వంటి అన్ని రాయితీలు తొలగించాలి. (వారు అలాంటి అనేక రాయితీలను పొందడమే కాకుండా వాటిని క్రమం తప్పకుండా పెంచుతారు)
7. ➡నేరస్థులను ఎన్నికలలో పోటీ చేయకుండా నిరోధించాలి, శిక్షాత్మక రికార్డులు, క్రిమినల్ అభియోగాలు మరియు సంకల్పం ఉన్న అనుమానాస్పద వ్యక్తులు పార్లమెంటు నుండి నిషేధించబడాలి ..
8. ➡ కార్యాలయంలోని రాజకీయ నాయకుల వల్ల వారి వల్ల కలిగే ఆర్థిక నష్టాలు కూడా వారి నుంచి తిరిగి పొందాలి, వారి నామినీలు, ఆస్తులు - ఎంపీలు కూడా సాధారణ పౌరులకు వర్తించే నిబంధనలను పాటించాలి.
9. ➡పౌరులు ఎల్‌పిజి గ్యాస్ సబ్సిడీపై తగ్గింపు లేదు ... ఎంపీలు, ఎమ్మెల్యేలకు లభించే సబ్సిడీలు, మరియు పార్లమెంట్ క్యాంటీన్‌లో సబ్సిడీతో సహా ఇతర రాయితీలు తొలగించాలి.
10. ➡పార్లమెంటులో సేవ చేయడం ఒక గౌరవం, దోపిడీకి లాభదాయకమైన వృత్తి కాదు.
11. ➡వారిఉచిత రైలు, విమానాల ప్రయాణం ఆగిపోవాలి.
12. ➡సామాన్యులు వారి దోపిడీని ఎందుకు భరించాలి?
13. 🚷ప్రతి వ్యక్తి కనీసం ఇరవై మందితో కమ్యూనికేట్ చేస్తే, భారతదేశంలో చాలా మంది ఈ సందేశాన్ని పొందడానికి మూడు రోజులు మాత్రమే పడుతుంది.
14. ➡ఈ సమస్యను లేవనెత్తడానికి ఇదే సరైన సమయం.
F. ➡పై విషయాలతో మీరు అంగీకరిస్తే, దాన్ని ఫార్వార్డ్ చేయండి.
లేకపోతే, దాన్ని తొలగించండి.
G. ➡మీరు నా 20+ లో ఒకరు, దయచేసి దీన్ని కొనసాగించండి.
- స్పృహలోకి వచ్చిన సాయిధరమ్ తేజ్
‘మెగా’ నటుడు సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.
★ శుక్రవారం స్పోర్ట్స్ బైక్‌పై ప్రయాణిస్తున్న ఆయన ప్రమాదవశాత్తూ కిందపడిపోయారు.
★ ఈ ఘటనలో సాయిధరమ్ తేజ్‌కు తీవ్రగాయాలు అయ్యాయి.
★ ప్రమాదం జరిగిన వెంటనే సాయితేజ్ అపస్మారక స్థితిలో వెళ్లినట్లు తెలుస్తోంది.
★ నగరంలోని కేబుల్ బ్రిడ్జ్-ఐకియా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
★ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ప్రమాద ప్రాంతానికి చేరుకుని, చికిత్స నిమిత్తం సాయిధరమ్ తేజ్‌ను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
★ ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోంది.
★ బైక్‌పై వేగంగా వెళ్లడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
మెడికోవర్ హాస్పిటల్ కి చేరుకున్న చిరంజీవి ,పవన్ కళ్యాణ్
సృహలొకి వచ్చిన సాయి ధరమ్ తేజ్
ఆసుపత్రి లో డాక్టర్ ని కలిసి మెరుగైన వైద్యం అందించాలని కోరారు..
బైక్‌ను నియంత్రించలేక అదుపుతప్పి కిందపడిపోయినట్లు మాదాపూర్ సీఐ తెలిపారు.
★ అంతర్గతంగా ఏమైనా గాయాలు అయ్యాయా? అన్న అనుమానంతో సాయిధరమ్ తేజ్‌కు వైద్యులు స్కాన్ చేస్తున్నారని, ప్రమాద వార్తను కుటుంబ సభ్యులకు తెలియజేసినట్లు సీఐ వివరించారు..
రోడ్డుపై ఇసుక ( మట్టి ) ఉండడంతో అదుపుతప్పి ప్రమాదానికి గురయ్యారని , ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది.
మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం అపోలో ఆసుపత్రికి తరలింపు
🎥రోడ్డు మార్గాన ఉన్న అన్ని సీసీ కెమెరాల ను కుడా పర్యవేక్షిస్తున్నాము...👮♂️పోలీసు అధికారులు
మా పార్టీని గెలిపిస్తే ఇంటికో వాషిన్ మెషీన్..! నన్ను గెలిపిస్తే మహిళలకు ఉచితంగా బంగారం ఇస్తాం..! మా అభ్యర్థిని సీఎం చేస్తే ప్రతి ఇంటికీ నెలకు రూ.10 వేలు..!
ఎన్నికల్లో ఇలాంటి ఉచిత హామీలు ఎక్కువయ్యాయి. ఏ పార్టీ మెనిఫెస్టో చూసినా ఉచితాలే దర్శనమిస్తాయి.
ఉచిత టీవీ,ఉచిత ఏసీ,ఉచిత సైకిల్,ఉచిత బైక్, మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం,ఉచిత కేబుల్ కనెక్షన్.. ఇలా ఒక్కటా రెండా.. అక్కడ అన్నీ ఉచితాలే.
ఈ ఉచిత హామీలపై మద్రాస్ హైకోర్టు మండిపడింది. ఉచిత పథకాలతో ప్రజలను బద్ధకస్తులుగా మారుస్తున్నారని..
ఏ పనీ చేయకుండా తయారు చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేసింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీ ప్రకటించిన ఉచిత హామీలకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలయింది.
ఉద్యోగాలు,మౌలిక సదుపాయాల కల్పన, విద్యా వైద్యారంగ అభివృద్ధి,రవాణా, వ్యవసాయ రంగాలను పక్కనబెట్టి.. ఉచిత హామీలపైనే అభ్యర్థులు ఫోకస్ పెడుతున్నారని పిటిషన్ వాదించారు. వీటికి కళ్లెం వేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
దానిపై విచారించిన జస్టిన్ ఎన్.కిరుబకరన్, జస్టిస్ బి.పుగలెంతి నేతృత్వంలోని ధర్మాసనం. ఉచిత పథకాలను తీవ్రంగా తప్పుబట్టింది. ఉచిత పథకాల వల్ల ప్రజలంతా సోమరిపోతులుగా మారుతున్నారని అభిప్రాయపడింది.
ఒక్కో నియోజకవర్గంలో అభ్యర్థులు తక్కువలో తక్కువ రూ.20 కోట్లు ఖర్చుపెడుతున్నారని, బిర్యానీ,బీరు కోసం ఓటువేస్తే,మీ నాయకుడిని ప్రశ్నించే నైతిక హక్కు మీకు ఎక్కడుంటుందని ప్రశ్నించింది.ప్రజాస్వామ్యంలో తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకునే స్వేచ్ఛ ప్రజలకుందని స్పష్టం చేసింది.
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఉచిత కలర్ టీవీలు,ఫ్యాన్స్,మిక్సర్ గ్రైండర్లు,ల్యాప్‌టాప్‌లు.. వంటి హామీలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అన్నాడీఎంకే పార్టీ ఉచిత వాషింగ్ మెషీన్ హామీ కూడా ఇచ్చింది.
డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు మహిళలకు రేషన్ కోసం ఆర్థిక సాయం చేస్తాయని కూడా ప్రకటించాయి. ఐతే ఈ ఉచిత హామీల సంప్రదాయం కొనసాగడం ప్రజలకు ఎంత మాత్రమూ మంచిది కాదని హైకోర్టు అభిప్రాయపడింది. రానున్న రోజుల్లో అన్నం కూడా వండి తినిపిస్తారేమోనని సెటైర్లు వేసింది.
ఉచిత హామీలను అవినీతి వ్యవహారంగా పరిగణించాల్సిన అవసరం ఉందని.వీటి వలన ఓటర్లు ప్రభావితమవుతున్నారని అభిప్రాయపడింది. ఉచిత పథకాల వలన తమిళ ప్రజలు బద్ధకస్తులుగా మారిపోయారని..
అందుకే హోటళ్లు, సెలూన్‌లు,చివరకు పొలాల్లో పనిచేసేందుకు కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూలీలను రప్పించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది మద్రాస్ హైకోర్టు కోర్టు తెలిపింది. రానున్న రోజుల్లో ఇక్కడి స్థిర, చరాస్తులకు వలస కార్మికులే యజమానులుగా మారినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది.
ఉచిత పథకాలకు సంబంధించి పిటిషనర్ పేర్కొన్న 20 ప్రశ్నలకు కేంద్ర, ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. ఉచిత హామీలకు అడ్డుకట్ట వేసే దిశగా ఎలాంటి చర్యలు చేపడతారో ఏప్రిల్ 26 లోగా చెప్పాలని స్పష్టం చేసింది.
🌻🌺🍀🌻🌺🍀🌻🌺🍀🌻🌺
పసుపు , కుంకుమ , గంధం , అగరువత్తులు , కర్పూరం , తమల పాకులు , వక్కలు , పూలు , పూలదండలు , అరటిపండ్లు , కొబ్బరి కాయలు , బెల్లం లేదా పంచదార , పంచామృతాలు , తోరము , దీపారాధన కుందులు , నెయ్యిలేక నూనె , దీపారాధన వత్తులు. వినాయకుడి ప్రతిమ , 21 రకాల ఆకులు , ఉండ్రాళ్ళు , పాయసం , భక్ష్యాలు.
వినాయక చవితి రోజు ఉదయాన్నే ఇంటిని శుభ్రం చేసుకొని మామిడి ఆకుల తోరణం కట్టుకోవాలి. వాకిళ్ళను అలంకరించు కోవాలి. కుటుంబ సభ్యులంతా తలంటుకొని స్నానం చేయాలి. దేవుని గది వుంటే అందులో లేదా పరిశుభ్రమైన ప్రదేశంలో ఒక పీటవేసి , దానిపై మనం తెచ్చుకున్న వినాయకుడి విగ్రహాన్ని వుంచాలి. తెచ్చిన పూజా సామాగ్రిని కూడా అందుబాటులో వుంచుకోవాలి. వినాయకుడికి ఉండ్రాళ్ళు చాలా ఇష్టం. మిగిలిన భక్ష్యాలున్నా లేకున్నా వీటిని తప్పని సరిగా తయారు చేసుకోవాలి.
వినాయకుడి విగ్రహం ఎదుట పీటపై కొంచెం బియ్యం పోసి దానిపై రాగి లేదా వెండి లేదా మట్టి పాత్రను వుంచాలి. దానికి పసుపు రాసి బొట్లు పెట్టాలి. దానిలో కొన్ని అక్షతలు , పూలు వేసి దానిపై మామిడి ఆకులు వుంచి ఆపై కొబ్బరికాయతో కలశం ఏర్పాటు చేసుకోవాలి. ఆ తరువాత పసుపు ముద్దతో చిట్టి పసుపు గణపతిని తయారు చేసుకోవాలి. పూజకు ముందు ఒక గ్లాసులో చెంచా లేదా ఉద్ధరిణ వుంచుకొని పక్కన మరో చిన్న ప్లేటు పెట్టుకోవాలి. పూజ చేస్తున్నప్పుడు చేతికి పసుపు, కుంకుమలు అవుతాయి కాబట్టి చేతికింద ఒక శుభ్రమైన గుడ్డను వుంచుకుంటే బాగుంటుంది.
ఓం కేశవాయ స్వాహాః
నారాయణాయ స్వాహాః
మాధవాయ స్వాహాః
గోవిందాయ నమః
విష్ణవే నమః
మధుసూదనాయ నమః
త్రివిక్రమాయ నమః
వామనాయ నమః
శ్రీధరాయ నమః
హృషీకేశాయ నమః
పద్మనాభాయ నమః
దామోదరాయ నమః
సంకర్షణాయ నమః
వాసుదేవాయ నమః
ప్రద్యుమ్నాయ నమః
అనిరుద్దాయ నమః
పురుషోత్తమాయ నమః
అధోక్షజాయ నమః
నారసింహాయ నమః
అచ్యుతాయ నమః
ఉపేంద్రాయ నమః
హరయే నమః
శ్రీ కృష్ణాయ నమః
శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః
1. యశ్శివో నామరూపానభ్యాం యాదేవీ సర్వమంగళా తయోస్సంస్మరణాత్పుంసాంసర్వతో జయ మంగళం
2. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ: యేషామిందీవరశ్శ్హ్యామో హృదయస్థోజనార్థన:
3. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయోనమామ్యహం
4. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యేత్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే.
తాత్పర్యము: మంగళ కరమైన వాటన్నిటిలోనూ అతి మంగళకరమై , సర్వ మంగళ నామధేయురాలవై , అన్ని అర్థములను సాధించి , శరణు జొచ్చిన వారికి ఆశ్రయమిచ్చే , ముక్కంటి దేవర అయిన శివుని అర్ధాంగి అయిన ఓ ! పార్వతీ , ఓ ! దుర్గాదేవీ, ఓ ! నారాయణీ, నీకు నమస్కరిస్తున్నాను.
ఓం శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః ఓం వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః ఓం శచీపురందరాభ్యాం నమః ఓం అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః ఓం శ్రీ సితారామాభ్యాం నమః ||నమస్సర్వేభ్యోం మహాజనేభ్యః అయం ముహూర్త స్సుముహూర్తోస్తు||
శ్లో: ఉత్తిష్టంతు భూతపిశాచా: ఏతే భూమి భారకా: ఏతాషామవిరోధేనబ్రహ్మకర్మ సమారభే
తా: భూతోచ్చాటన అంటే భూతపిశాచములను పారద్రోలుట. చేయబోవు కార్యమునకు అవరోధము కలిగించు భూతపిశాచములను అచటినుండి వెడలిపొమ్మని భావము.
ప్రాణాయామం (మూడు సార్లు లోపలికి గాలి పీల్చి నెమ్మదిగా వదలడం)
ఓం భూః | ఓం భువః | ఓగ్ సువః | ఓం మహాః | ఓం జనః | ఓం తపః | ఓగ్ సత్యం |
ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ ||
||ఓమా పోజ్యోతీరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోమ్||
(గృహస్థులు ఐదు వ్రేళ్ళతోను ముక్కును పట్టుకుని ఎడమరంధ్రం ద్వారా గాలిని పీల్చి , ఓం భూ: నుండి భూర్భువస్సువరోం వరకు మంత్రము చదివేంతకాలము గాలిని బంధించి తర్వాత మెల్లగా గాలిని కుడి ముక్కు రంధ్రం ద్వారావిడువ వలెను. దీనినే పూరకం , కుంభకం , రేచకం అంటారు. మంత్రం చదివే సమయంలో గాలిని బంధించుటను ప్రాణాయామము అంటారు. బ్రహ్మచారులు బొటన వ్రేలు , చిటికెన వ్రేళ్ళతో దీనిని చేయవలెను.)
అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాంగతోపినా యః స్మరేద్వై విరూపాక్షంస బాహ్యాభ్యంతరశ్శుచిః || (అని నాలుగు దిక్కులా ఉద్ధరనితో నీళ్ళు చల్లవలెను. సుద్ధి చేసినట్టుగా)
(ఎప్పుడు , ఎక్కడ, ఎవరు , ఏమి కోరి , ఏ పనిచేస్తున్నారో స్పష్టముగా చెప్పుకొనుటను సంకల్పము అంటారు.) మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభేశోభనే ముహూర్తే , శ్రీ మహావిష్ణోరాజ్ణాయా ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణ: ద్వితీయపరార్ధే , శ్వేతవరాహకల్పే, వైవస్వత మన్వంతరే , కలియుగే , ప్రథమపాదే , జంబూ ద్వీపే, భరతవర్షే , భరతఖండే , మేరోర్ధక్షిణదిగ్భాగే , …….. నదీ సమీపే……… ( శ్రీ శైలస్య) నివాసిత గృహే అస్మిన్ వర్తమాన వ్యావహారిక, చాంద్రమానేన శ్రీ…………….నామ సంవత్సరే, …………… (దక్షిణాయనే), …….. (వర్ష) ఋతౌ, ……… (భాద్రపద) మాసే, ……… (శుక్ల) పక్షే,..….. (చతుర్థ్యాం) తిథి ………………. వాసరే , శుభ నక్షత్రే , శుభయోగే శుభకరణే , ఏవంగుణ విశేషేణ విశిష్టాయాం , శుభతిధౌ శ్రీమాన్………… గోత్ర: ……….నామధేయ: ధర్మపత్నీ……………… సమేతోహం సకుటుంబస్య క్షేమస్ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృధ్హ్యర్ధం, ధర్మార్ధ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్ధ సిద్ద్యర్ధం, పుత్రపౌత్రాభివృద్ధ్యర్ధం సకలకార్యేషు సర్వదా దిగ్విజయసిద్ధ్యర్ధం, శ్రీ వరసిద్ధి వినాయక దేవతా ముద్ధిస్య శ్రీ వరసిద్ధి వినాయక దేవతాపూజాం కరిష్యే అదౌ నిర్విఘ్న పరిసమాప్త్యర్ధం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే. (నీరు ముట్టుకొనవలెను)
భవసంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణమ్ విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజ మహంభజేఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవమ్ ధ్యాయేత్సిద్ధి వినాయకమ్ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్ననాయకం
ధ్యాయేత్గజాననం దేవం తప్తకాంచనసన్నిభం, చతుర్భుజం మహాకాయం సర్వాభరణ భూషితం॥
శ్రీ మహా గణాధిపతయే నమః ధ్యాయామి
అత్రాగచ్చ జగద్వంద్య సురరాజార్చితేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భ సముద్బవ
మౌక్తికైః పుష్యరాగైశ్చ నానారత్నైర్విరాజితం రత్నసింహాసనంచారు ప్రీత్యర్థం ప్రతి గృహ్యాతాం॥
గౌరీపుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన గృహాణార్ఘ్యం మయాదత్తం గంధ పుష్పాక్షతైర్యుతం ॥
గజవక్త్ర నమస్తే~స్తు సర్వాభీష్ట ప్రదాయక భక్త్యాపాద్యం మయాదత్తం గృహాణ ద్విరదానన॥
అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ వరపూజిత గృహాణాచమనం దేవ, తుభ్యం దత్తంమయా ప్రభో ॥
దధిక్షీర సమాయుక్తం థామద్వాజ్యేన సమన్వితం మధుపర్కం గృహాణేదం గజవక్త్రం నమోస్తుతే ॥
స్నానం పంచామృతైర్దేవ గృహాణ గణనాయక అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత ॥
గంగాదిసర్వతీర్థేభ్యః ఆహృతైరమలిర్ణలైః స్నానం కురుష్వభగవానుమాపుత్ర నమోస్తుతే॥
రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యంచ మంగళం శుభప్రదం గృహాణత్వం లంబోదరహరాత్మజ ॥
*వస్త్రయుగ్మం సమర్పయామి.*
రాజితం బహ్మసూత్రం చ కాంచనం చో త్తరీయకం గృహాణ సర్వదేవజ్ఞ భక్తానామిష్టదాయక॥
*ఉపవీతం సమర్పయామి.*
చంద నాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యాతాం॥
*గంధాన్ సమర్పయామి.*
అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాంస్తండులాన్ శుభాన్ , గృహాణ పరమానంద ఈశపుత్ర నమోస్తుతే॥
*అక్షతాన్ సమర్పయామి.*
సుగంధాని సుపుష్పాణి జాజీకుంద ముఖానిచ ఏక వింశతి పత్రాణి సంగృహాణ నమోస్తుతే॥
*పుష్పాణి పూజయామి.*
*అథాంగ పూజ*
*(పుష్పములతో పూజించవలెను)*
గణేశాయ నమః - పాదౌ పూజయామి ఏకదంతాయ నమః - గుల్ఫౌ పూజయామి శూర్పకర్ణాయ నమః - జానునీ పూజయామి విఘ్నరాజాయ నమః - జంఘే పూజయామి అఖువాహనాయ నమః - ఊరూ పూజయామి హేరంబాయ నమః - కటిం పూజయామి లంబోదరాయ నమః - ఉదరం పూజయామి గణనాథాయ నమః - నాభిం పూజయామి గణేశాయ నమః - హృదయం పూజయామి స్థూలకంఠాయ నమః - కంఠం పూజయామి గజవక్త్రాయ నమః - వక్త్రం పూజయామి విఘ్నహంత్రే నమః - నేత్రం పూజయామి శూర్పకర్ణాయ నమః - కర్ణౌ పూజయామి ఫాలచంద్రాయ నమః - లలాటం పూజయామి సర్వేశ్వరాయ నమః - శిరః పూజయామి విఘ్నరాజాయ నమః - సర్వాణ్యంగాని పూజయామి4
సుముఖాయనమః - మాచీపత్రం పూజయామి।గణాధిపాయ నమః - బృహతీపత్రం పూజయామి ఉమాపుత్రాయ నమః - బిల్వపత్రం పూజయామి గజాననాయ నమః - దుర్వాయుగ్మం పూజయామి హరసూనవేనమః - దత్తూరపత్రం పూజయామి లంబోదరాయనమః - బదరీపత్రం పూజయామి గుహాగ్రజాయనమః - అపామార్గపత్రం పూజయామిగజకర్ణాయనమః - తులసీపత్రం పూజయామి , ఏకదంతాయ నమః - చూతపత్రం పూజయామి , వికటాయ నమః - కరవీరపత్రం పూజయామిభిన్నదంతాయ నమః - విష్ణుక్రాంతపత్రం పూజయామి , వటవేనమః - దాడిమీపత్రం పూజయామి , సర్వేశ్వరాయనమః - దేవదారుపత్రం పూజయామి , ఫాలచంద్రాయ నమః - మరువకపత్రం పూజయామి , హేరంబాయనమః - సింధువారపత్రం పూజయామి శూర్పకర్ణాయనమః - జాజీపత్రం పూజయామి , సురాగ్రజాయనమః - గండకీపత్రం పూజయామి , ఇభవక్త్రాయనమః - శమీపత్రం పూజయామి,వినాయకాయ నమః - అశ్వత్థపత్రం పూజయామి , సురసేవితాయ నమః - అర్జునపత్రం పూజయామి కపిలాయ నమః - అర్కపత్రం పూజయామి శ్రీ గణేశ్వరాయనమః - ఏకవింశతి పత్రాణి పూజయామి.
ఓం గజాననాయ నమః
ఓం గణాధ్యక్షాయ నమః
ఓం విఘ్నరాజాయ నమః
ఓం వినాయకాయ నమః
ఓం ద్వైమాతురాయ నమః
ఓం ద్విముఖాయ నమః
ఓం ప్రముఖాయ నమః
ఓం సుముఖాయ నమః
ఓం కృతినే నమః
ఓం సుప్రదీప్తాయ నమః
ఓం సుఖనిధయే నమః
ఓం సురాధ్యక్షాయ నమః
ఓం సురారిఘ్నాయ నమః
ఓం మహాగణపతయే నమః
ఓం మాన్యాయ నమః
ఓం మహాకాలాయ నమః
ఓం మహాబలాయ నమః
ఓం హేరంబాయ నమః
ఓం లంబజఠరాయ నమః
ఓం హయగ్రీవాయ నమః
ఓం ప్రథమాయ నమః
ఓం ప్రాజ్ఞాయ నమః
ఓం ప్రమోదాయ నమః
ఓం మోదకప్రియాయ నమః
ఓం విఘ్నకర్త్రే నమః
ఓం విఘ్నహంత్రే నమః
ఓం విశ్వనేత్రే నమః
ఓం విరాట్పతయే నమః
ఓం శ్రీపతయే నమః
ఓం వాక్పతయే నమః
ఓం శృంగారిణే నమః
ఓం ఆశ్రితవత్సలాయ నమః
ఓం శివప్రియాయ నమః
ఓం శీఘ్రకారిణే నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం బల్వాన్వితాయ నమః
ఓం బలోద్దతాయ నమః
ఓం భక్తనిధయే నమః
ఓం భావగమ్యాయ నమః
ఓం భావాత్మజాయ నమః
ఓం అగ్రగామినే నమః
ఓం మంత్రకృతే నమః
ఓం చామీకర ప్రభాయ నమః
ఓం సర్వాయ నమః
ఓం సర్వోపాస్యాయ నమః
ఓం సర్వకర్త్రే నమః
ఓం సర్వ నేత్రే నమః
ఓం నర్వసిద్దిప్రదాయ నమః
ఓం పంచహస్తాయ నమః
ఓం పార్వతీనందనాయ నమః
ఓం ప్రభవే నమః
ఓం కుమార గురవే నమః
ఓం కుంజరాసురభంజనాయ నమః
ఓం కాంతిమతే నమః
ఓం ధృతిమతే నమః
ఓం కామినే నమః
ఓం కపిత్థఫలప్రియాయ నమః
ఓం బ్రహ్మచారిణే నమః
ఓం బ్రహ్మరూపిణే నమః
ఓం మహోదరాయ నమః
ఓం మదోత్కటాయ నమః
ఓం మహావీరాయ నమః
ఓం మంత్రిణే నమః
ఓం మంగళసుస్వరాయ నమః
ఓం ప్రమదాయ నమః
ఓం జ్యాయసే నమః
ఓం యక్షికిన్నరసేవితాయ నమః
ఓం గంగాసుతాయ నమః
ఓం గణాధీశాయ నమః
ఓం గంభీరనినదాయ నమః
ఓం వటవే నమః
ఓం జ్యోతిషే నమః
ఓం అక్రాంతపదచిత్ప్రభవే నమః
ఓం అభీష్టవరదాయ నమః
ఓం మంగళప్రదాయ నమః
ఓం అవ్యక్త రూపాయ నమః
ఓం పురాణపురుషాయ నమః
ఓం పూష్ణే నమః
ఓం పుష్కరోత్ క్షిప్తహరణాయ నమః
ఓం అగ్రగణ్యాయ నమః
ఓం అగ్రపూజ్యాయ నమః
ఓం అపాకృతపరాక్రమాయ నమః
ఓం సత్యధర్మిణే నమః
ఓం సఖ్యై నమః
ఓం సారాయ నమః
ఓం సరసాంబునిధయే నమః
ఓం మహేశాయ నమః
ఓం విశదాంగాయ నమః
ఓం మణికింకిణీ మేఖలాయ నమః
ఓం సమస్తదేవతామూర్తయే నమః
ఓం సహిష్ణవే నమః
ఓం బ్రహ్మవిద్యాది దానభువే నమః
ఓం విష్ణువే నమః
ఓం విష్ణుప్రియాయ నమః
ఓం భక్తజీవితాయ నమః
ఓం ఐశ్వర్యకారణాయ నమః
ఓం సతతోత్థితాయ నమః
ఓం విష్వగ్దృశేనమః
ఓం విశ్వరక్షావిధానకృతే నమః
ఓం కళ్యాణగురవే నమః
ఓం ఉన్మత్తవేషాయ నమః
ఓం పరజయినే నమః
ఓం సమస్త జగదాధారాయ నమః
ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః
ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః
అగజానన పద్మార్కం గజాననమహర్నిశమ్అనేక దంతం భక్తానాం ఏకదంతముపాస్మహే
దశాంగం గుగ్గలోపేతం సుగంధం , సుమనోహరం , ఉమాసుత నమస్తుభ్యం గృహాణ వరదోభవ॥
ధూపమాఘ్రాపయామి॥
సాజ్యం త్రివర్తిసంయుక్తం వహ్నినాద్యోజితం మయా , గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే
దీపందర్శయామి
సుగంధాసుకృతాంశ్చైవమోదకాన్ ఘృతపాచితాన్ , నైవేద్యం గృహ్యతాంచణముద్దేః ప్రకల్పితాన్ ,
భక్ష్యం చ లేహ్యంచ చోష్యం పానీయమేవచ , ఇదం గృహాణ నైవేద్యం మయాదత్తం వినాయక ,
నైవేద్యం సమర్పయామి
సచ్చిదానంద విఘ్నేశ పుష్కరాని ధనానిచ, భూమ్యాం స్థితాని భగవాన్ స్వీకురుష్వ వినాయక
సువర్ణపుష్పం సమర్పయామి.
పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం, కర్పూర చూర్ణసంయుక్తం తాబూలం ప్రతిగృహ్యతాం
తాంబూలం సమర్పయామి
ఘృతవర్తి సహస్రైశ్చ శకలైస్థితం నీరాజనం మయాదత్తం గృహాణవరదోభవ
నీరాజనం సమర్పయామి
అథ దూర్వాయుగ్మ పూజాసవరించు
గణాధిపాయ నమః దూర్వాయుగ్మం పూజయామి
ఉమాపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి
అఖువాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి
వినాయకాయ నమః దూర్వాయుగ్మం పూజయామి
ఈశపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి
సర్వసిద్ది ప్రదాయకాయ నమః దూర్వాయుగ్మం పూజయామి
ఏకదంతాయ నమః దూర్వాయుగ్మం పూజయామి
ఇభవక్త్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి
మూషిక వాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి
కుమారగురవే నమః దూర్వాయుగ్మం పూజయామి
ఏకదంతైకవదన తథామూషిక వాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి
కుమారగురవే తుభ్యం అర్పయామి సుమాంజలిం మంత్రపుష్పం సమర్పయామి
నమస్కారము , ప్రార్థన
ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదకప్రియ నమస్తే విఘ్ననాశన ,
ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి ,
అర్ఘ్యం గృహాణ హేరంబ సర్వ భద్ర ప్రదాయక గంధ పుష్పాక్షతైర్యుక్తం పాత్రస్థం పాపనాశన ,
పునరర్ఘ్యం సమర్పయామి ,
ఓం బ్రహ్మవినాయకాయ నమః
నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశన ,
ఈప్సితంమే వరం దేహి వరత్రచ పరాంగతిమ్
వినాయక నమస్తుభ్యం సంతతం మోదక ప్రియ
నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా.
శ్రీ వినాయక వ్రత కథ
గణపతి జననము
సూతమహర్షి శౌనకాది మునులకు ఇట్లు చెప్పెను. గజముఖుడయిన అసురుడొకడు తన తపస్సుచే శంకరుని మెప్పించి కోరరాని వరము కోరినాడు తనను ఎవరూ వధించజాలని శక్తిని , శివుడు తన ఉదరమునందే నివసించవలెనని కోరినాడు ఆ ప్రకారము శివుడు అతడి కుక్షియందు బందీ అయినాడు అతడు అజేయుడైనాడు.
భర్తకు కలిగిన ఈ స్థితి పార్వతీ దేవికి చాలా దుఃఖహేతువైనది, జగత్తుకు శంకరుడు లేనిస్థితియది , జగన్మాతయగు పార్వతి భర్తను విడిపించు ఉపాయమునకై విష్ణువు నర్థించినది , విష్ణువు గంగిరెద్దువాని వేషము ధరించినాడు. నందీశ్వరుని గంగిరెద్దుగా వెంట తీసుకొని వెళ్లినాడు గంగిరెద్దునాడించి గజముఖాసురుని మెప్పించాడు గజముఖాసురుడు ఆనందంతో *"ఏమి కావలయునో కోరుకో"* అన్నాడు విష్ణుదేవుని వ్యూహము ఫలించినది, నీ ఉదరమందున్న శివుని కొరకై ఈ నందీశ్వరుడు వచ్చాడు శివుని నందీశ్వరుని వశము చేయుమన్నాడు గజముఖాసురునికి శ్రీహరి వ్యూహమర్థమయింది తనకు అంత్యకాలము దాపురించినదని గుర్తించాడు అయినా మాట తప్పుట కుదరదు కుక్షియందున్న శివుని ఉద్దేశించి *"ప్రభూ శ్రీహరి ప్రభావమున నా జీవితము ముగియుచున్నది నా యనంతరం నా శిరస్సు త్రిలోకపూజితమగునట్లు , నా చర్మమును నిరంతరము నీవు ధరించునట్లు అనుగ్రహించవలసింది"* అని ప్రార్థించి తన శరీరమును నందీశ్వరుని వశము చేశాడు నందీశ్వరుడు యుదరమును చీల్చి శివునికి అందుండి విముక్తి కల్గించాడు శివుడు గజముఖాసురుని శిరమును , చర్మమును తీసుకొని స్వస్థానోన్ముఖుడైనాడు
అక్కడ పార్వతి భర్త రాక గురించి విని పరమానందముతో భర్తకు స్వాగతము పలుకుటకై సన్నాహమందున్నది తనలో తాను ఉల్లసిస్తూ , స్నానాలంకారముల ప్రయత్నములో తనకై ఉంచిన నలుగుపిండితో ఆ ఉల్లాసముతో పరధ్యానముగా ఒక ప్రతిమను చేసినది అది చూడముచ్చటైన బాలుడుగా కనిపించినది దానికీ ప్రాణప్రతిష్ఠ చేయవలెననిపించినది అంతకు పూర్వమే ఆమె తన తండ్రియగు పర్వత రాజు ద్వారా గణేశ మంత్రమును పొందినది, ఆ మంత్రముతో ఆ ప్రతిమకు ప్రాణ ప్రతిష్ఠ చేసినది ఆ దివ్యసుందర బాలుని వాకిటనుంచి, తన పనులకై లోనికి వెళ్ళింది.
శివుడు తిరిగి వచ్చాడు , వాకిట ఉన్న బాలుడు అతనిని అభ్యంతరమందిరము లోనికి పోనివ్వక నిలువరించాడు. తన మందిరమున తనకే అటకాయింపా ! శివుడు రౌద్రముతో ఆ బాలుని శిరచ్ఛేదము చేసి లోనికేగినాడు.
జరిగిన దానిని విని పార్వతి విలపించింది శివుడు చింతించి వెంటనే తన వద్దనున్న గజముఖాసురుని శిరమును ఆ బాలుని మొండెమునకు అతికి ఆ శిరమునకు శాశ్వతత్వమును , త్రిలోకపూజనీయతను కలిగించాడు గణేశుడు గజాననిడై శివపార్వతుల ముద్దులపట్టియైనాడు విగతజీవుడైన గజముఖాసురుడు అనింద్యుడై మూషిక రూపమున వినాయకుని వాహనమై శాశ్వ్తతస్థానమును పొందాడు. గణపతిని ముందు పూజించాలి.
గణేశుడు అగ్రపూజనీయుడు
ఆది దేవుడు విఘ్నేశ్వరుడు కాని ప్రకృత గజాననమూర్తి మాట ఏమిటి ? ఈ గజాననునికి ఆ స్థానము కలుగవలసి ఉంది శివుని రెండవ కుమారుడైన కుమారస్వామి తనకు ఆ స్థానమును కోరినాదు శివుడు ఇరువురికీ పోటీ పెట్టినాడు "మీలో ఎవరు ముల్లోకములలోని పవిత్రనదీ స్నానాలు చేసి ముందుగా నావద్దకు వచ్చెదరో వారికి ఈ ఆధిపత్యము లభిస్తుందన్నాడు కుమారస్వామి వేగముగా సులువుగా సాగి వెళ్ళినాడు గజాననుడుమిగిలిపోయినాడు త్రిలోకముల పవిత్ర నదీ స్నాన ఫలదాయకమగు ఉపాయమర్థించాడు వినాయకుని బుద్ధి సూక్ష్మతకు మురిసిపోయిన పరమశివుడు అట్టి ఫలదాయకమగు నారాయణ మంత్రమును అనుగ్రహించాడు నారములు అనగా జలములు , జలమున్నియు నారాయణుని ఆధీనాలు అనగా ఆ మంత్ర ఆధీనములు , మంత్ర ప్రభావము చేత ప్రతీ తీర్థస్నానమందును కుమార స్వామి కన్నాముందే వినాయకుడు ప్రత్యక్షము కాజొచ్చాడు వినాయకునికే ఆధిపత్యము లభించినది.
చంద్రుని పరిహాసం
గణేశుడు జ్ఞానస్వరూపి , అగ్రపూజనీయుడు , జగద్వంద్యుడూ। ఈ విషయమును విస్మరించిన చంద్రుడు వినాయకుని వింతరూపమునకు విరగబడి నవ్వాడు।
(చంద్రుడుమనస్సుకు సంకేతము) ఫలితముగా లోకమునకు చంద్రుడనను సరణీయుడైనాడు। ఆతని మాన్యత నశించింది। నింద్యుడయినాడు। ఆతడిపట్ల లోకము విముఖత వహించాలి। అనగా అతనిని చూడరాదు చూచిన యెడల అజ్ఞానముతో నింద్యుడయినట్లే, లోకులు కూడా అజ్ఞానులు నింద్యులు అవుతారు। నిందలకు గురియగుతారు।
చంద్రునికి కలిగిన శాపము లోకమునకు కూడా శాపమైనది. లోకులు చంద్రుని చూడకుండుటెట్లు ? నీలాపనిందల మధ్య సవ్యముగా సాగుట ఎట్లు ? చంద్రుడు జరిగిన పొరపాటుకు పశ్చాత్తాపము చెందాడు. లోకులును ఈ శాపము నుండి విముక్తికై గణపతిదేవుని అర్థించారు. కరుణామయుడగు ఆ దేవుడు విముక్తికై ఉపాయము సూచించాడు. బాధ్రపద శుద్ధ చవితినాడు తన పూజచేసి తన కథను చెప్పుకొని అక్షతలు శిరమున ధరించిన యెడల నిష్కళంక జీవితములు సాధ్యమగునని అనుగ్రహించాడు.
ఇది ఎల్లరికి విధియని వక్కాణించబడింది. దీనిలో ఏమరుపాటు ఎంతటివారికి అయినా తగదని శ్యమంతకమణ్యుపాఖ్యానము ద్వారా మరింత స్పష్టము చేయబడింది.
శ్యమంతకోపాఖ్యానము
చంద్ర దర్శనం నీలాపనింద:
ఒకానొక వినాయక చతుర్థి సందర్భమున శ్రీ కృష్ణపరమాత్మ పాలలో చంద్రబింబమును చూచుట సంభవించింది. దాని దుష్ఫలితము ఆయనకు తప్పలేదు. సత్రాజిత్తు అను నాతడు సూర్యోపాసనచే శ్యమంతకమను మణిని సంపాదించాడు. దినమునకు ఎనిమిది బారువుల బంగారము నీయగల మణియది. అంతటి శక్తివంతమైన మణి పరిపాలకుని వద్ద ఉండదగినదని ధర్మజ్ఞుడగు శ్రీకృష్ణుడు భావించాడు. ఆ విషయము సత్రాజిత్తునకు సూచించాడు. అతనికి ఆ సూచన రుచించలేదు.
అనంతరము సత్రాజిత్తు తమ్ముడగు ప్రసేనుడు విలాసముగా ఆ మణిని ధరించివేటకై అడవికి వెళ్ళినాడు. అది ఆతనికి నాశనహేతువైనది. ఆ మణిని చూచి మాంసఖండమని భ్రమించిన సింహమొకటి అతడిని వెంటాడి చంపి మణిని నోటకరచుకొని పోయింది.
నిజము తెలియని సత్రాజిత్తు మణి ప్రలోభముతో శ్రీకృష్ణుడే తన తమ్ముని చంపి అపహరించాడని అనుమానించి నిందపాలు చేసాడు.
ఆ నింద బాపుకొనుట శ్రీకృష్ణునికి ఆవశ్యకమైనది.
అడవిలో అన్వేషణ సాగించాడు. ఒకచోట ప్రసేనుని కళేబరము కనిపించింది. అచట కనిపించిన సింహపు కాలిజాడల వెంట సాగి వెళ్ళాడు. ఒక ప్రదేశమున సింహము , భల్లూకం పోరాడిన జాడలు కనిపించాయి. శ్రీకృష్ణుడు భల్లూకపు కాలిజాడల వెంట వెళ్ళాడు. అవి ఒక గుహలోకి వెళ్ళాయి. గుహలో ఒక బాలునికి ఉన్న ఊయల తొట్టికి మణి వేలాడగట్టబడి ఉంది. శ్రీకృష్ణుడు ఆ మణిని అందుకున్నాడు. ఇంతలో భయంకరముగా అరచుచు ఒక భల్లూకం అతనిపై బడింది. భీకర సమరం సాగింది ఒక దినము కాదు , రెండు దినములు కాదు, ఇరువది ఎనిమిది దినములు. క్రమంగా ఆ భల్లూకమునకు శక్తి క్షీణించజొచ్చింది.
అది సామాన్య భల్లూకము కాదు. మహాభక్తుడు శక్తివంతుడైన జాంబవంతుడు. రామాయణ కాలమునాటి ఆ జాంబవంతుడు కర్మబంధములు విడివడక నిలిచియున్నాడు. అజేయుడాతడు. ఎవరివల్లను అతడు క్షీణబలుడగు ప్రశ్నేలేదు. ఒక్క శ్రీరామచంద్రుని వల్లనే అది సాధ్యము. ఈ విషయము తెలిసిన జాంబవంతుడు తాను ఇన్ని దినములు పోరాడుతున్నది శ్రీరామచంద్రునితోనేనని గుర్తించి స్తోత్రము చేయనారంభించాడు.
అది త్రేతాయుగపు గాథ. ఇది ద్వాపరయుగము. ఆ యవతారములో జాంబవంతుని సేవలకు మెచ్చిన శ్రీరామచంద్రుడు ఒక వరము కోరుకొమ్మనగా అవివేకముతో జాంబవంతుడు స్వయముగా శ్రీరామచంద్రునితో ద్వంద్వ యుద్ధమును కోరినాడు. అది శ్రీరామకార్యము గాదు కానఅప్పుడు నెరవేరలేదు. అవివేకముతో అతడు కోరిన కోరిక జాంబవంతునకు దీర్ఘకాల కర్మబంధమయినది. ఇప్పుడు కర్మ పరిపక్వమయినది. నేడీ రూపమున ఆ ద్వంద్వ యుద్ధము సంఘటిల్లినది. అవివేకము వైదొలగినది. అహంభావము నశించింది. శరీరము శిథిలమయింది. జీవితేచ్ఛ నశించింది. శ్రీకృష్ణపరమాత్మ రూపమున తనను అనుగ్రహించ వచ్చినది ఆ శ్రీరామచంద్ర ప్రభువేనని గ్రహించి ప్రణమిల్లి ఆ మణిని , ఆ మణీతో పాటు తన కుమార్తె జాంబవతిని అప్పగించి కర్మబంధ విముక్తి పొందాడు జాంబవంతుడు.
శ్రీకృష్ణుడు మణిని తీసుకుని నగరమునకు వెళ్ళి పురజనులను రావించి జరిగిన యదార్థమును వివరించి నిందబాపుకున్నాడు. నిజము తెలిసిన సత్రాజిత్తు కూడా పశ్చాత్తాపము చెంది మణిని తన కుమార్తెయగు సత్యభామను శ్రీకృష్ణునకిచ్చి వివాహము చేశాడు. ధర్మజ్ఞుడగు శ్రీకృష్ణుడు మణిని నిరాకరించి సత్యభామను స్వీకరించాడు.
వినాయక వ్రతము చేయక చంద్రబింబమును చూచుట వలన జరుగు విపరీతమును స్వయముగా అనుభచించిన శ్రీకృష్ణపరమాత్మ లోకుల యెడల పరమదయాళువై బాధ్రపద శుద్ధ చవితినాడు వినాయకుని యథాశక్తి పూజించి ఈ శ్యమంతకమణి కథను అనగా అందలి హితబోధను చెప్పుకొని, గణేశతత్వము పట్ల భక్తి వినయములతో శిరమున అక్షింతలు ధరించిన యెడల నాడు చంద్రదర్శనము చేసినను నిష్కారణ నిందా భయముండదని లోకులకు వరము ఇచ్చాడు. అది మొదలు మనకు శ్యమంతకమణి గాథను వినుట సాంప్రదాయమయినది.
పూజచేసి కథనంతయు విను అవకాశము లేనివారు... సింహ ప్రసేనమవధీత్ సింహో జాంబవతా హతాః ఇతి బాలక మారోదః తవ హ్యేషశ్యమంతకః
సింహము ప్రసేనుని చంపినది. ఆ సింహమును జాంబవంతుడు చంపెను. కనుక ఓ బిడ్డా ఏడువకు. ఈ శ్యమంతకము నీదే అను అర్థము గల పై శ్లోకమునైనా పఠించుట ద్వారా ఆ విషయము స్మరించదగియున్నదని చెప్పబడింది. ఇది జాంబవంతుని గుహలో ఊయలలోని బిడ్డను లాలించుతూ పాడిన పాట అని చెప్పబడింది.
సర్వేజనాః సుఖినో భవంతు.
విఘ్నేశ్వర చవితి పద్యములు
ప్రార్థన :
తొండము నేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్‌మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపుల మందహాసమున్.కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయైయుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిపా నీకు మ్రొక్కెదన్.
తలచెదనే గణనాథునితలచెదనే విఘ్నపతిని దలచినపనిగాదలచెదనే హేరంబునిదలచెద నా విఘ్నములను తొలగుట కొరకున్
అటుకులు కొబ్బరి పలుకులుచిటిబెల్లము నానుబ్రాలు చెరకురసంబున్‌నిటలాక్షు నగ్రసుతునకుబటుతరముగ విందుచేసి ప్రార్థింతు మదిన్.
వినాయక మంగళాచరణము
ఓ బొజ్జగణపయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాళ్ళ మీదికి దండు పంపు
కమ్మనినేయుయు కడుముద్దపప్పును బొజ్జవిరగ గదినుచు పొరలుకొనుచు - జయమంగళం నిత్య శుభమంగళం
వెండి పళ్ళెములో వేయివేల ముత్యాలు కొండలుగ నీలములు కలయబోసి
మెండుగను హారములు మెడనిండ వేసుకొని దండిగా నీకిత్తుఘనహారతి - జయమంగళం నిత్య శుభమంగళం
శ్రీ మూర్తి వ్యందునకు చిన్మయానందునకు భాసురోతునకు శాశతునకు
సోమార్కనేత్రునకు సుందరాకారునకు కామరూపునకు శ్రీగణనాథునకు - జయమంగళం నిత్య శుభమంగళం
ఏకదంతమును ఎల్లగజవదనంబు బాగైన తొండంబు కడుపుగలుగు
బోడైన మూషికము సొరదినెక్కాడుచు భవ్యముగ దేవగణపతికినిపుడు - జయమంగళం నిత్య శుభమంగళం
చెంగల్వ చామంతి చెలరేగి గన్నేరు తామర తంగేడు తరచుగాను
పుష్పజాతూ దెచ్చి పూజింతు నేనిపుడు బహుబుద్ధీ గణపతికి బాగుగాను - జయమంగళం నిత్య శుభమంగళం
తొండము నేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్
మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపుల మందహాసమున్. కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై యుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు మొక్కెదన్.
మరొక పద్యం కూడా విద్యార్థులకు ఉచితమైనది.
తొలుత నవిఘ్నమస్తనుచు ధూర్జటీ నందన నీకు మ్రొక్కెదన్ ఫలితము సేయవయ్య నిని ప్రార్థన సేసెద నేకదంత నా వలపటి చేతి ఘంటమున వాక్కున నెపుడు బాయకుండుమీ తలపున నిన్ను వేడెదను దైవగణాధిప లోక నాయకా!
ఇక వినాయకుని 16 పేర్లతో కూడిన ప్రార్థనా శ్లోకము
సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతుండ శ్శూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజః షోడశైతాని నామాని యః పఠే చ్ఛృణుయాదపి ....
*🌹🙏ఓం నమో వేంకటేశాయ🙏🌹*
*🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏*
🕉🙏🕉🙏🕉🙏🕉🙏🕉🙏🕉
*🍀🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🍀*