తూర్పు కాపు సంక్షేమ సంఘం చే పాలూరు టానీషా కు అభినందన సత్కారం
చిరంజీవి పాలూరు టానీషా కు అతి చిన్న వయసులో 12 సంవత్సరాలకే పదవ తరగతిలో 525/600 మార్కులు సాదించునందుకు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తూర్పు కాపు సంక్షేమ సంఘం తరుపున గాజువాక ఏరియా తూర్పు కాపు సంక్షేమ సంఘ సభ్యులు మరియు విశాఖ జిల్లా తూర్పు కాపు సంక్షేమ సంఘ సభ్యులు చే టానీషా కు ఘన సత్కారం చేసినట్లు తూర్పు కాపు సంక్షేమ సంఘం గాజువాక ఏరియా గౌరవ అధ్యక్షులు శ్రీ జమ్ము రమణ, గాజువాక అధ్యక్షులు శ్రీ యర్లంకి రాజేశ్వరి నాయుడు కార్యదర్శి గుడివాడ శ్రీ రాములు నాయుడు, సహాయ కార్యదర్శి శ్రీ కొమ్ము రమేష్, ఉపాధ్యక్షులు శ్రీ పెదలంక కాంతారావు, జిల్లా కోశాధికారి శ్రీ కడగుల చిన్నారావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగినట్లు తూర్పు కాపు సంక్షేమ సంఘం కన్వీనర్ శ్రీ గిరడ ప్రసాద్ మరియు అధ్యక్షులు రాజేశ్వర నాయుడు మరియు స్వామి విద్యా నికేతన్ హై స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మణ స్వామి తెలియజేశారు ....
ప్రభుత్వం విడుదల చేసిన 2022 పదవ తరగతి ఫలితాలలో అతి చిన్న వయస్సు(12 సం*) లో పదవ తరగతి పరిక్షాల్లో అత్యధికంగా 525/600 మార్కులతో ఉత్తీర్ణత సాధించిన పాలూరు టానీషా ...
విశాఖ జిల్లాకే కాకుండా మా ఆంధ్ర ప్రదేశ్ తూర్పు కాపు జాతి ఆణిముత్యం చదువుల తల్లి టానిషా ను చూస్తే గర్వకారణంగా చెప్పుకునే నేపాధ్యంలో... మా విశాఖ జిల్లా తూర్పు కాపు సంక్షేమ సంఘం వారు... వీరితో పాటు విశాఖ విద్యా విహార్ ప్రిన్సిపాల్ షేక్ వల్లి గారు కూడా పిల్లల్ని బొకే తో ఆశీర్వదిస్తూ అభినందించారు..
గాజువాక హైస్కూల్ రోడ్డు ప్రాంతంకి చెందిన స్వామి విద్యానికేతన్ హై స్కూల్ నడుపుతున్న వారి ... తల్లిదండ్రులు డాక్టర్ పాలూరు లక్ష్మణ స్వామి మరియు పాలూరు దేవి ల రెండవ సంతానం చదువుల తల్లి టానీషా 12 ఏళ్ళకే పదవ తరగతిలో అత్యధిక మార్కులతో ఉత్తీర్ణత సాధించి రికార్డ్ సృష్టించింది, మొదట నుండి చదువులలో అడ్వాన్స్ గా ఉండే టానీషా వయస్సు వారు ఇంక ఆరోవ తరగతి చదువుతుండగా టానీషా మాత్రం పదవ తరగతి పూర్తి చేసింది, అంతటి తో ఆగకుండా జాతీయస్థాయిలో స్కౌట్స్ అండ్ & గైడ్స్ మరియు కూచిపూడిలో ఆంధ్రప్రదేశ్ తరుపున పలు రాష్ట్రాలలో పాల్గోని అందరి మన్నాలు పొందింది, ఇప్పుడు పదవ తరగతి అనంతరం... ఆకాష్ విద్య సంస్ధలలో డాక్టర్ అవ్వాలి అనే తన కోరికని బలపర్చుకోవడానికి జాతీయ స్థాయిలో జరిగే నీట్ ఎగ్జామ్ కి అత్యధిక స్థానం సాధించుట కొరుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది .......
అంతేకాకుండా పాలూరు టానీషా ...
అన్నయ్య ...
పాలూరు పూజేషే కూడా తన చెల్లెలుకు తగినట్లే ఇదే విద్యా సంవత్సరంలో లో తను చదివే పాఠశాలలో ( స్వామి విద్యా నికేతన్ హై స్కూల్ ) లో అత్యధిక మార్కులు 539/600 సాదించిన విద్యార్థిగా ఉన్నాడు పూజేషే కూడా తన చెల్లి లాగే అనేక జాతీయ కార్యక్రమాల్లో పాల్గొని ఇప్పటికే జాతీయంగా నాలుగు జాతీయ అవార్డులు రివార్డులు లో... కొన్ని మచ్చుకు..
హర్యానా రాష్ట్రంలోని (అంబాలా) లో ; సిక్కిం లో జరిగే అంతర్జాతీయ సమైక్యత ర్యాలీలో మిగతా దేశాలతో పాల్గొని మన ఆంధ్రప్రదేశ్ యొక్క.. విధి విధానాలు వేష..భాషలు ఆహారఫు అలవాట్లు,ఆచార వ్యవహారాలు , వివాహ పద్ధతులు, వేష భాషలు మొదలైనవన్నీ ప్రపంచ దేశాలు కు వివిధ రూపాలలో చూపు నందుకు గాను ..మన ఆంధ్రప్రదేశ్ కు రెండు జాతీయ అవార్డులు కైవసం చేసుకున్నాడు మరియు గోవా లో జాతీయ యూత్ అడ్వెంచర్ క్యాంపులో వివిధ కేటగిరీల కింద ఇద్దరు పిల్లలు మన ఆంధ్రప్రదేశ్ కు ఆణిముత్యాలు గా నిలుచారు....
ఇద్దరు మా తూర్పుకాపు ఆణిముత్యాలు... భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ తరుపున మన ఆంధ్రప్రదేశ్ లో... పూజేషే రాష్ట్రపతి అవార్డు... తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు... అదేవిధంగా టానీషా ( గవర్నర్ అవార్డు )రాజ్య పురస్కారం సంపాదించి, రాష్ట్రపతి అవార్డు కు అర్హత సాధించి ఉన్నది...
అన్నకు తగిన చెల్లి - చెల్లికి తగిన అన్న నువ్వేంటి నేను అనేట్టు మన ఆంధ్రప్రదేశ్ లో తూర్పు కాపు జాతికే మంచి పేరు ప్రఖ్యాతలు భవిష్యత్తులో తీసుకు వస్తారు అనే భావనతో మేము వారి ఇద్దరినీ ఆశీర్వదిస్తూ... అభినందిస్తూ... చిరంజీవులు ఇద్దరూ పాలూరు పూజేషే మరియు టానీషాలకు ఆశీస్సులు తెలియజేస్తూ.....
గాజువాక ఏరియా మరియు విశాఖ ఉమ్మడి జిల్లా తూర్పు కాపు సంక్షేమ సంఘం..🌷🌷🌷🌹🌹🌹💐💐💐