యాసంగిలో వరి సాగు చేయవద్దు

 

యాసంగిలో వరి సాగు చేయవద్దు



తేది.06/11/2021, హైదరాబాద్

బంజారాహిల్స్ మంత్రుల నివాస సముదాయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, పాల్గొన్న పౌరసరఫరాల మంత్రి గంగుల కమలాకర్ గారు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు గారు, పౌరసరఫరాల కమీషనర్ అనిల్ కుమార్ గారు



యాసంగిలో వరి సాగు చేయవద్దు


యాసంగిలో ఎట్టి పరిస్థితులలో ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయదు


విత్తన వడ్లు సాగు చేసే రైతులు, మిల్లర్లతో ఒప్పందం చేసుకునే రైతులు నిరభ్యంతరంగా వరి సాగు చేసుకోవచ్చు



ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్న ఆశతో మాత్రం రైతులు వరి సాగు చేయవద్దు


ఇది తెలంగాణ ప్రభుత్వ విధాన నిర్ణయం


వరికి ప్రత్యామ్నాయంగా రైతులు ఇతర పంటలను సాగు చేసుకోవాలి


వానాకాలంలో ‘వరి’సాగుపై ఎలాంటి ‘వర్రీ’ వద్దు


ఎఫ్ సీ ఐ కొనకున్నా తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తుంది


దొడ్డు వడ్లయినా, సన్నరకాలయినా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది 


యాసంగి వరి కొనుగోళ్ల విషయంలో  కేంద్రప్రభుత్వం నానా యాగీ చేస్తుంది 


కేంద్రం చేతగానితనాన్ని రాష్ట్రాల మీద నెట్టివేస్తుంది


యాసంగిలో నూక శాతం ఎక్కువ ఉంటుంది .. నూక లేని వరి వంగడాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాం


యాసంగి సాగును ఒక నెల ముందుకు జరుపుకోవాలి


రైతులపట్ల మా చిత్తశుద్దిని ఎవరూ శంకించలేరు ?


ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిండు మనసుతో వ్యవసాయరంగాన్ని తీర్చిదిద్దారు


వారి కృషి ఫలితమే తెలంగాణలో దిగుబడి అవుతున్న పంటలు


కష్టపడి సాగునీటి వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం


పెండింగ్ ప్రాజెక్టులు యుద్ద ప్రాతిపదికన పూర్తి చేసుకున్నాం


మిషన్ కాకతీయతో చెరువులను పునరుద్దరించుకున్నాం


తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కృషి ఫలితమే ఈ రోజు పంటల సాగు, దిగుబడులు



ఒక కోటి 41 లక్షల ఎకరాలలో వివిధరకాల పంటలు సాగయ్యాయి


62 లక్షల 8 వేల ఎకరాలలో ఈ వానాకాలంలో వరి సాగు నమోదయింది


నాలుగైదు నెలలుగా వరి సాగులో ఇబ్బందులను రైతుల దృష్టికి తీసుకెళ్లి చైతన్యం చేస్తున్నాం


విపక్షాలు రైతులను రెచ్చగొట్టి రాజకీయం లబ్ది కోసం ప్రయత్నిస్తున్నాయి


రైతాంగం విపక్షాల చేతులలో పావులుగా మారవద్దు



ఈ వానాకాలం పత్తి సాగు చేయాలని రైతులకు విజ్ఞప్తి చేశాం


కానీ అనుకున్నంతగా రైతాంగం పత్తి సాగు చేయలేదు


ఈ రోజు మద్దతుధరకు మించి మూడు వేలు ఎక్కువకు పత్తి సాగు జరుగుతుంది


సీసీఐ మద్దతుధరకు మించి ఎక్కువ ధర లభిస్తున్నది


కోటి ఎకరాలలో పత్తి సాగు చేసినా రైతులకు మద్దతుధర దక్కుతుంది


తెలంగాణ పత్తికి అంతర్జాతీయ డిమాండ్ ఉన్నది


వరి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు విషయంలో ఆపోహాలు అవసరం లేదు .. కోతలను బట్టి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరుగుతున్నది


గత ఏడాది కేంద్రం మాట ఇచ్చిన నేపథ్యంలో తీసుకున్న ధాన్యంలో 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇంకా తెలంగాణ ప్రభుత్వం వద్ద మూలుగుతున్నది


కేంద్రం బాధ్యతారాహిత్యానికి ఇది నిదర్శనం .. దేశంలో పంటల కొనుగోళ్ల విషయంలో వారికి ఒక విధానం లేదు


తెలంగాణ ప్రభుత్వం చెప్పేది అబద్దమైతే యాసంగి కొనుగోళ్లు చేస్తాం అని బీజేపీ ప్రజాప్రతినిధులు కేంద్రం నుండి లిఖితపూర్వక హామీ తీసుకురావాలి


భారత ఆహారరంగాన్ని కార్పోరేట్లు,

ప్రైవేటుపరం చేసే కుట్రలో భాగంగా కేంద్రం కొనుగోళ్ల బాధ్యత నుండి తప్పుకుంటున్నది


కామారెడ్డిలో రైతు మరణం దురదృష్టకరం .. ప్రభుత్వం ఈ సంఘటనపై నివేదిక తెప్పించుకున్నది


బంజారాహిల్స్ మంత్రుల నివాస సముదాయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, పాల్గొన్న పౌరసరఫరాల మంత్రి గంగుల కమలాకర్ గారు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు గారు, పౌరసరఫరాల కమీషనర్ అనిల్ కుమార్ గారు


మంత్రి గంగుల కమలాకర్ గారి వ్యాఖ్యలు



సూర్యాపేట జిల్లాలో 256 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం


ఒక్క కిలో కూడా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు రాలేదు


రాష్ట్రంలో 6570 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది


ఇప్పటివరకు 2.36 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది


ప్రైవేటు మిల్లర్ల వద్ద టోకెన్ సిస్టం ఉంది .. అది సూర్యాపేట, నల్లగొండ జిల్లాలకు పరిమితం

బ్యాంకులను మోసం చేస్తున్న హర్యానా రాష్ట్ర నేరస్తులను పట్టుకున్న మంచిర్యాల పోలీసులు.

బ్యాంకులను మోసం చేస్తున్న హర్యానా రాష్ట్ర నేరస్తులను పట్టుకున్న మంచిర్యాల పోలీసులు. 



   గత కొద్ది నెలలుగా ATM వద్ద నుండి డబ్బులను డ్రా చేస్తూ వారి వద్ద వున్న ఒక చిన్న తాళం చెవితో మోసపూరితంగా ATM మెషీన్ ను పనిచేయకుండా చేసి తిరిగి వారు డబ్బులు డ్రా చేయనట్టుగా సదరు బ్యాంకు వారికి ఫిర్యాదు చేసి తిరిగి డబ్బులు బ్యాంకు  నుండి పొందుతూ బ్యాంకులను మోసం చేస్తున్న హర్యానా రాష్ట్ర నేరస్తులను పట్టుకున్న మంచిర్యాల పోలీసులు. 




తేదీ 03.11.2021 రోజున శ్రీ. నల్లపు వెంకటేష్ వృ; అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదు మేరకు రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ గౌ; శ్రీ ఎస్.చంద్ర శేఖర్ రెడ్డి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మరియు గౌ; శ్రీ. ఉదయ్ కుమార్ రెడ్డి  డిసిపి మంచిర్యాల , గౌ; శ్రీ. N. అశోక్ కుమార్ డిసిపి ( అడ్మిన్) రామగుండం , గౌ; శ్రీ.  అఖిల్ మహాజన్ IPS,  ఏసీపీ మంచిర్యాల, గార్ల ఆద్వర్యం లో       B. నారాయణ ఇన్స్ పెక్టర్ ఆఫ్ పోలిస్, మంచిర్యాల , డి. కిరణ్ కుమార్  సబ్ ఇన్స్ పెక్టర్ ఆఫ్ పోలిస్ మంచిర్యాల  మరియు బి.దివాకర్ HC 249 , శ్రీనివాస్ PC 3320,బ్రహ్మచారి  PC 3598 మరియు సిబ్బంది తో కలిసి మంచిర్యాల పట్టణం లో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా  మంచిర్యాల పట్టణం లోని రైల్వే స్టేషన్ వద్ద నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించటం తో వారిని పట్టుకొని విచారించగ  వారి పేర్లు 1) రాబిన్ ఖాన్   2) ఎజాజ్ అహ్మద్ ఖాన్  3) హరేస్  4) సాహిబ్ అలియాస్ మహమ్మద్ సాహిబ్ లు అని తెలపడం జరిగింది.వారిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరాలకు పాల్పడినట్లు ఒప్పుకోవడం జరిగింది.



నిందితుల వివరాలు  :-



A1) రాబిన్ ఖాన్ s/o ఎలియాస్, వయస్సు 25 సంవత్సరాలు, కులం - ముల్సిం, Occ: అగ్రిల్ R/O సక్రాస్ గ్రామం, జిల్లా: నుహ్, హర్యానా రాష్ట్రం,

 A2) సాహిబ్ @ మహమ్మద్ సాహిబ్ s/o ఉమర్ మొహమ్మద్, వయస్సు 20 సంవత్సరాలు, కులం - ముస్లిం, Occ: అగ్రిల్ R/O భజ్లాకా గ్రామం, జిల్లా: నుహ్, హర్యానా రాష్ట్రం,

 A3) హరీష్ s/o సహబుద్దీన్, వయస్సు 22 సంవత్సరాలు, కులం-ముస్లిం, Occ: అగ్రిల్ R/O భజ్లాకా గ్రామం, జిల్లా: నుహ్, హర్యానా రాష్ట్రం

 A4) ఎజాజ్ అహెమద్ ఖాన్ s/o జమీల్ అహెమద్ ఖాన్, వయస్సు 28 సంవత్సరాలు, కులం - ముస్లిం, Occ: సెంటర్ వర్క్ R/O సరైఖ్తాలి గ్రామం, జిల్లా: హర్యానా రాష్ట్రం పాల్వాల్.


సీజ్ చేసిన ప్రాపర్టీ వివరములు


1) ATM CARDS -30 ( axis, HDFC ,ICICI ,KOTAK MAHENDERA, IDFC and EQUIUITAS BAKS CARDS  ) 

2) Mobile Phones- 4 

3) Rs. 2,70,000/- నగదు 

4) SMALL KEY  ( ATM ఓపెన్ చేయటానికి ఉపయోగించే key  ను స్వాధీన పరుచుకొనైనది


వివరాల్లోకి వెళితే.....



నిందితులు జల్సాలకు అలవాటు పడి,  ఏదైనా తప్పుడూ మార్గం లో డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకొని   బ్యాంక్  ఏ‌టి‌ఎం కి వెళ్ళి డబ్బులు డ్రా చేసుకొనే క్రమం లో  *ఏ‌టి‌ఎం మేషన్ ను ఆఫ్ చేసి డబ్బులు తీసుకొని ఏ‌టి‌ఎం మేషన్ ఆఫ్ చేయటం వలన  వారి  అక్కౌంట్ నుండి డబ్బులు డెబిట్  అయినట్టు చూపించ లేదు. దీనితో ఏ‌టి‌ఎం నుండి డబ్బులు విత్ డ్రా చేసేటప్పుడు  ఏ‌టి‌ఎం మేసిన్ ఆగిపోతే డబ్బులు వస్తాయి, కానీ అక్కౌంట్ నుంచి కాష్  డెబిట్ కాదు  అని గ్రహించి*  దీని గురించి ఏ‌టి‌ఎం  మేసిన్ ఆపడం కోసం , *అమెరికా లో వున్న వారి బందువుల వద్ద నుండి ఏ‌టి‌ఎం  మేసిన్  ఆఫ్ చేసే  ఒక తాళం ను పెద్దమొత్తం లో డబ్బులు చెల్లించి కొనుగోలు చేసి, ఈ తాళం తో  వారి రాష్ట్రం లో  దొంగతనం చేస్తే దొరికి పోతమని గ్రహించి. చెన్నై సిటీ లో, తెలంగాణ లోని నిజామాబాద్, వరంగల్ లో పలు ఏ‌టి‌ఎం లలో  వారి మిత్రులు, బందువుల దగ్గర నుండి తీసుకున్న ఏ‌టి‌ఎం కార్డుల* నుండి పైన చెప్పిన విదంగా డబ్బులు విత్ డ్రా చేసుకొని జల్సాలకు మరియు వారి స్వంత అవసరాలకు వాడుకునేవాళ్ళు. ఇదేక్రమంలో మంచిర్యాల లో  గత 3 రోజుల నుండి  ప్రదాన రహదారి కి దగ్గర ఉన్న ఎస్‌బి‌ఐ బ్యాంక్ పక్కన గల ఏ‌టి‌ఎం లో ఇదేరకంగా చేస్తూ డబ్బులను విత్ డ్రా చేసి పంచుకున్నారు.




ప్రజలకు విజ్ఞప్తి 

పైన జరిగిన నేరము బట్టి మంచిర్యాల పట్టణం  ప్రజలకు తెలియజేయునది ఏమనగా వారి బ్యాంక్ యొక్క అక్కౌంట్ డీటైల్స్ కానీ ATM వివరములు గాని గుర్తుతెలియని వ్యక్తులకు కానీ వారి స్వంత వారికి కూడా ఎటువంటి వివరములు తెలపటం కానీ ATM ఇవ్వటం కానీ చేయవద్దని మనవి. 


చాకచక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుకొని  వారి వద్దనుండి చోరీ సొత్తును రికవరీ చేసిన B. నారాయణ ,ఇన్స్ పెక్టర్ ఆఫ్ పోలిస్, మరియు , డి. కిరణ్ కుమార్, వి ప్రవీణ్ కుమార్ ,N. దేవయ్య   సబ్ ఇన్స్ పెక్టర్ ఆఫ్ పోలిస్ మంచిర్యాల  మరియు బి.దివాకర్ HC 249 , శ్రీనివాస్ PC 3320,బ్రహ్మచారి  PC 3598  , భరత్ pc 3395 లను ఏసి‌పి మంచిర్యాల గారు అభినందించి రివార్డ్ ను అందజేయటం జరిగింది అని అఖిల్ మహాజన్ IPS,ఏసిపి మంచిర్యాల తెలిపారు.