1) ఆన్లైన్లో పోస్ట్ పెట్టి.. మాజీ మిస్ తెలంగాణ ఆత్మహత్యాయత్నం..
2) గంజాయి విక్రయిస్తే చర్యలు తప్పవు మంచిర్యాల ఏ సి పి అఖిల్ మహాజన్
3)యువకులకు క్రికెట్ కిట్స్ పంపిణీ చేసిన మంచిర్యాల ఏసీపీ అఖిల్ మహాజన్ ఐపీఎస్
4)ధరణిలో ఇబ్బందులు.. ఏడాదైనా రైతులకు తప్పని తిప్పలు
5)పలువురు ఎస్సైల బదిలీలు
6)పేకాట స్థావరం పై లక్షేట్టిపేట పోలీసుల ఆకస్మిక దాడి
7)గంజాయి చెట్లను స్వాధీనం చేసుకుని వాటిని ధ్వంసం చేసి తగుల బెట్టిన లక్షేటిపేట ఆబ్కారీ సి ఐ
8)ప్రీతమ్ జకల్కర్ తో సమంత దుబాయ్ టూర్.
9)అర్దరాత్రి యువతి గొంతు కోసిన యువకుడు
10)బిగ్ బ్రేకింగ్......కరోన మూడో ముప్పు మొదలైంది!!_
1) ఆన్లైన్లో పోస్ట్ పెట్టి.. మాజీ మిస్ తెలంగాణ ఆత్మహత్యాయత్నం..
హైదరాబాద్ నారాయణ గూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని హాసిని 2018లో మిస్ తెలంగాణగా ఎంపికైంది. ఆమె ప్రస్తుతం హైదరాబాద్‌లోని హిమాయత్ నగర్లో నివాసం ఉంటుంది. అయితే ఇంట్లో ఎవరూ లేని సమయంలో హాసిని ఉరేసుకుని ఆత్మహత్యకు యత్నించింది.ఈ క్రమంలోనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇది చూసిన ఆమె స్నేహితులు వెంటనే పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు హిమాయత్ నగర్ రోడ్ నెంబర్ 6లో ఉన్న తన ఫ్లాట్‌లోకి వెళ్లి యువతిని రక్షించి హైదర్ గూడ అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ ఆమెకు పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. ప్రమాదం ఏం లేదని తేల్చారు. అయితే హాసిని ఇలా చేయడానికి ఆర్థిక ఇబ్బందులే కారణమని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలోనే ఆమె ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చని వారు అనుమానిస్తున్నారు. మరోవైపు తనను ఓ యువకుడు శారీరకంగా వేధించాడని హాసిని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే ఆమె ఆత్మహత్యకు యత్నించడంతో.. ఏ కారణం చేత ఆమె ఇలా చేసిందనేది తేలాల్సి ఉంది.అయితే సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఎందుకు చనిపోవాలని అనుకుంది..? అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. హాసినిది తెలంగాణలోని ఖమ్మం జిల్లా. ఆమెకు ఇద్దరు అక్కలు, ఒక అన్నయ్య.తనది పేద కుటుంబం అని,తాను బ్యూటీపార్లర్‌లో వర్క్ చేసేదానిని గతంతో ఓ ఇంటర్యూలో హాసిని చెప్పుకొచ్చింది.
2) గంజాయి విక్రయిస్తే చర్యలు తప్పవు మంచిర్యాల ఏ సి పి అఖిల్ మహాజన్
మంచిర్యాల: దండేపల్లి
గంజాయి ఎవరైనా అమ్మినా వినియోగించిన కఠిన చర్యలు తప్పవని అవసరమైతే వారిపై పీడీ యాక్ట్ సైతం నమోదు చేస్తామని మంచిర్యాల్ ఏ సి పి అఖిల్ మహాజన్ హెచ్చరించారు. గంజాయి రహిత రాష్ట్రంగా మార్చేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ కృషి చేస్తున్నారని రాష్ట్ర పోలీస్ శాఖ డి సి పి ఆదేశాల మేరకు రామగుండం కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, మంచిర్యాల డిసిపి ఉదయ్ కుమార్ రెడ్డి పర్యవేక్షణలో సబ్ డివిజన్ పరిధిలో ప్రతిరోజు గంజాయికి బానిసలైన వ్యక్తులకు,ప్రాథమిక దశలో ఉన్న వారికి కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు గంజాయి విక్రయిస్తున్న వారిని కూడా అదుపులోకి తీసుకుని అరెస్టు చేయడం జరుగుతుందని ఏసీపీ తెలిపారు. లక్షేట్టీపెట్ సర్కిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దండేపల్లి మండలం రాజు గూడా గ్రామంలో కుంరం శ్యామ్ రావు అను వ్యక్తి తళ్ళపేట బస్ స్టాండ్ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఏముల విజయ్ కుమార్ గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని పట్టుకొని మరియు కుమ్రం శ్యామ్ రావు వద్ద నుండి 250 గ్రాములు మరియు వారికి గంజాయి సరఫరా చేస్తున్న లోతోర్రే గ్రామం ఎన్నారం మండలానికి చెందిన కుర్సింగ జుగాది రావు,సోయం గగ్రు,పూసం సంపత్ రావు మరియు నైతం లింగు అను వారిని అదుపులోకి తీసుకోవడం గురించి వెళ్తుండగా లోతోరె గ్రామానికి 1 km దూరం లో ఆ నలుగురు వ్యక్తులు కుమ్రం శ్యామ్ రావు కి అమ్మి పెట్టడానికి తీసుకువస్తుండగా అదుపులోకి తీసుకోవడం జరిగింది. మరియు వారి వద్ద నుండి 250 గ్రాములు స్వాధీనం చేసుకొని వారిని అరెస్ట్ చేయడం జరిగింది. మీడియా సమావేశానికి ఎసిపి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఇప్పటివరకు దండేపల్లి పీఎస్ పరిధిలో మూడు కేసులు నమోదు చేసి 16 మంది నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 2910 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. యువత గంజాయి కి అలవాటుపడి ఆ మత్తులో నేరాలకు పాల్పడుతున్నారని తల్లిదండ్రులు వారి పిల్లల పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ వారి కదలికలు గమనించాలని సూచించారు.ఈ విషయంలో చాలా కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని అందులో భాగంగా గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం ఎక్కడైనా తెలిస్తే ఆయ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిబ్బందికి సమాచారం అందించాలని వారి వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుందని ఏసీపీ తెలిపారు. ఈ మీడియా సమావేశంలో లక్షెట్టిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ కరీముల్లా ఖాన్ తో పాటు దండేపల్లి ఎస్ఐ శ్రీకాంత్,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
యూట్యూబ్ విడియో కొసం క్లిక్ చేయండి
3) యువకులకు క్రికెట్ కిట్స్ పంపిణీ చేసిన మంచిర్యాల ఏసీపీ అఖిల్ మహాజన్ ఐపీఎస్
రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి ఐపిఎస్, డిసిపి మంచిర్యాల ఉదయ్ కుమార్ రెడ్డి గార్ల ఆదేశాల మేరకు కాల్వ దండేపల్లి పోలీస్ స్టేషన్ పరిధి ద్వారకా గ్రామ యువతకు క్రికెట్ కిట్ లు, మంచిరాల ఏసిపి అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారు పంపిణీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఏసీపీ గారు మాట్లాడుతూ.. ఫ్రెండ్లీ పోలీసింగ్, కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా క్రీడా స్ఫూర్తి, సమయ కార్యాచరణ, సానుకూల వైఖరిని యువతలో ప్రోత్సహించడం కోసం యువత ఎటువంటి చెడు కార్యకలాపాలకు బానిసలై జీవితాలు నాశనం చేసుకోవద్దని వారికి సూచించారు. క్రీడలు బలాన్ని మరియు మానసిక ఆనందాన్ని ఇవ్వగలవు అన్నారు.
ఏసిపి గారి వెంట లక్షట్ పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ కరిముల్లా ఖాన్, దండేపల్లి ఎస్ఐ శ్రీకాంత్ పాల్గొన్నారు.
4) ధరణిలో ఇబ్బందులు.. ఏడాదైనా రైతులకు తప్పని తిప్పలు
TS: ధరణిలో నిషేధిత జాబితాలో చేరిన పట్టాభూములు విడిపించుకునేందుకు ఏడాదిగా రైతులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగుతున్నా కష్టాలు మాత్రం తీరట్లేదు. తమ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని దాదాపు లక్షమంది దరఖాస్తు చేసుకోగా సుమారు 20 శాతం మందికే పరిష్కారం లభించింది. 43 శాతం దరఖాస్తులు కలెక్టర్ల వద్ద పెండింగ్‌లో ఉండగా మిగిలిన 37 శాతం దరఖాస్తులను తిరస్కరించారు. ధరణి సమస్యల విభాగంలో దరఖాస్తుతోపాటు సమర్పించిన ఆధారాలను ప్రాతిపదికగా తహసీల్దార్, ఆర్డీవోలు పరిశీలన చేస్తున్నారు. అందుకు చాలా సమయం పడుతోంది. నిషేధిత జాబితాలో దేవాదాయ, అటవీ, భూదాన్ పేరిట భూములున్నాయి. వాటిని పరిష్కరించాలంటే ఆయాశాఖలు ఎన్వోసీ ఇవ్వాల్సి ఉంటుంది. అందుకు ఆ శాఖల అధికారులు నిరాకరిస్తుండటంతో కలెక్టర్ల వద్ద పెండింగ్ దరఖాస్తుల సంఖ్య పెరుగుతోంది. గతంలో ఈ తరహా సమస్య వస్తే వీఆర్వో, ఆర్ఐ ద్వారా పంచనామాచేయించి తహసీల్దార్, ఆర్డీఓ విచారణ చేసేవారు. క్షేత్రస్థాయిలో వీఆర్వో వ్యవస్థ రద్దుతో ధరణి సేవలు లోపభూయిష్టంగా మారాయి. ఇప్పటికైనా ధరణి వ్యవస్థను రద్దు చేసి సమస్యలను పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు.
ఇటీవలే ధరణిలో సవరణలు చేసిన ప్రభుత్వం కలెక్టర్ల లాగిన్‌లో మార్పులు చేయడంతో సమస్యల పరిష్కారంపై అధికారులు దృష్టిసారించారు. వాటిని ఇప్పడికప్పుడు పరిష్కారం చేయడం అంత వేగంగా సాధ్యం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రెవెన్యూ శాఖలో సేవలందించిన విశ్రాంత అధికారుల సూచనలు తీసుకొని ధరణి అమలు చేసినట్లేతే ఈ సమస్యలు వచ్చేవి కావని చెబుతున్నారు.
కొలిశెట్టి లక్ష్మయ్య, మాజీ ఛైర్మన్ రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం
సాధారణంగా దరఖాస్తు అధికారి తిరస్కరిస్తే కారణం తెలపాలి. కానీ నెలలు గడుస్తున్నా తిరస్కరించడానికి గల కారణాలు చెప్పకపోవడంపై సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. చాలా భూములు నిషేధిత జాబితాలో కనిపిస్తుడటంతో రైతులకు కష్టాలు తప్పట్లేదు. భూరికార్డుల ప్రక్షాళన చేపట్టినప్పుడే భూయజమానుల భాగస్వామ్యం తీసుకుంటే బాగుండేదని భూచట్టాల రూపకల్పన నిపుణులు సూచిస్తున్నారు.
ప్రొఫెసర్ ఎం. సునీల్‌కుమార్, భూచట్టాల రూపకల్పన నిపుణులు
పట్టా భూమిని నిషేధితజాబితాలో చేర్చడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబ, ఇతర అవసరాల కోసం భూమి విక్రయించాలంటే నిషేధిత జాబితాలో ఉండటం వల్ల రిజిస్ట్రేషన్ కావడం లేదు. వాటికి తోడు పేరు, సర్వే నంబరు తప్పు ఉందని, కమతం విస్తీర్ణంలో హెచ్చుతగ్గుల పరిష్కారానికి ధరణిలో సరైన మార్గం లేకపోవడం వల్ల సమస్యలు తప్పడం లేదు. కొన్ని సమస్యలు మినహా ధరణి అద్భుతంగా ఉందని వాటని పరిష్కరిస్తే భూసమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని రెవెన్యూ శాఖ అధికారులు చెబుతున్నారు.
బి.గీత, తహసీల్దార్ జాయింట్ సబ్ రిజిస్ట్రార్, మేడ్చల్
భూసమగ్ర సర్వే చేస్తే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఇప్పటికే ఆ దిశగా కృషి చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఆ మేరకు మంత్రివర్గం ఉపసంఘం వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు స్వీకరిస్తోందని వివరించారు.
నిరంజన్‌రెడ్డి,
వ్యవసాయ శాఖ మంత్రి
ఇప్పటికైనా వేగంగా దరఖాస్తులను పరిష్కరిస్తే మేలు జరుగుతుందన్న అభిప్రాయం పలువురి నుంచి వ్యక్తమవుతోంది.
5) పలువురు ఎస్సైల బదిలీలు
నిర్మల్ : జిల్లాలో ఎస్సైలను బదిలీ చేస్తూ గురువారం సాయంత్రం ఎస్పీ ప్రవీణ్ కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. బదిలీ అయిన ఎస్సైల ను తక్షణం రిలీవ్ చేయాలని ఆదేశించారు. సాయి కుమార్ ముధోల్ నుండి లోకేశ్వరం, మహేష్ కుభీర్ నుంచి బాసర బదిలీ అయ్యారు. సాయికిరణ్ భైంసా రూరల్ నుంచి ముధోల్‌కు, కే.రాజు కడెం నుంచి పెంబి, ఎండీ షరీఫ్ కుంటాల నుంచి భైంసా టౌన్, ఎం.కృష్ణసాగర్రెడ్డి సారంగాపూర్ రెగ్యులర్‌గా, శ్రీనివాస్ నిర్మల్ రూరల్ నుంచి ఎస్సై 2 నిర్మల్ రూరల్, శివరామకృష్ణ తానూర్ నుండి భైంసా రూరల్ 2 ఎస్సై, ప్రసాద్ దిలావర్పూర్ పూర్తిస్థాయి, కందులరాణి మామడ నుండి నర్సాపూర్ (జి), స్రవంతి నర్సాపూర్ నుంచి కుంటాల, జ్యోతిమణి సోన్ నుంచి దస్తూరాబాద్, ఎల్. వెంకటరమణ నర్సా పూర్ నుంచి సీసీఎస్ నిర్మల్, శ్రీరామ్ ప్రదీప్ బాసర నుండి వీఆర్ నిర్మల్, జి. రాజన్న తానూర్ నుండి సీసీఎస్ నిర్మల్, బాలకృష్ణ, యాసిర్ అరాఫత్ భైంసా నుండి సీసీఎస్ నిర్మల్, సుమన్ నిర్మల్ రూరల్ నుండి డీఎస్బీ నిర్మల్, దయానంద్‌రావు కడెం నుండి కదం ఎస్సై 2గా, తసియుద్దీన్ భైంసా నుండి వీఆర్ నిర్మల్, కే. రోహిణి దిలావర్పూర్ వీఆర్ నిర్మల్, జివి. రమణరెడ్డి డీఎస్బీ నిర్మల్, గంగాధర్, శివాజీ నిర్మల్ నుండి వీఆర్ నిర్మల్‌కు బదిలీ అయ్యారు. కొందరు అటాచ్మెంట్ ఉన్న ఎస్సైలకు పూర్తిస్థాయి బాధ్యత అప్పగించారు.
6) పేకాట స్థావరం పై లక్షేట్టిపేట పోలీసుల ఆకస్మిక దాడి
06 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్...
6000 వేల రూపాయల నగదు స్వాధీనం
లక్షెట్టిపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాపూర్ గ్రామశివారులో డబ్బులు పందెంగా పెట్టుకుని పేకాట ఆడుతున్నారు నమ్మదగిన సమాచారం మేరకు ఎస్ఐ చంద్రశేఖర్ తమ సిబ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీ నిర్వహించి అక్కడే ఉన్న ఆరుగురు అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 6000 రూపాయల నగదు, పేకాట ముక్కలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదుపులోకి తీసుకున్న వీరిని లక్షెట్టిపేట్ పోలీస్ స్టేషన్ కి తరలించి కేసు నమోదు చేయడం జరిగింది.
పట్టుబడిన వారి వివరాలు
1. నిమ్మల రమేష్ గౌడ్ s/o లాంగాగౌడ్
2.నిమ్మల శంకరయ్య s/o పాపాగౌడ్
3.కోట స్వామి s/o పోషాగౌడ్
4.గుర్రాల కృష్ణ s/o రాజయ్య
5.పార్వతి శ్రీనివాస్ s/o పోషయ్య
6.ఇండ్ల లింగయ్య s/o పోశయ్య r/o లక్సెట్టిపేట మండలం తిమ్మాపూర్ గ్రామం
ఈ సందర్భంగా ఎస్ఐ చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ...... తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు అనే అత్యాశకు పోయి చాలా మంది పేకాట బానిసలుగా మారుతున్నారు అని అప్పుల పాలవుతున్న కుటుంబలను రోడ్డుపాలు చేస్తున్నారన్నారు. పేకాట ఆడుతూ పట్టుబడిన వారు వారి ప్రవర్తన మార్చుకో నట్లయితే వారిపై పీడీ యాక్ట్ అమలు చేయడం జరుగుతుందని హెచ్చరించారు.
7)గంజాయి చెట్లను స్వాధీనం చేసుకుని వాటిని ధ్వంసం చేసి తగుల బెట్టిన లక్షేటిపేట ఆబ్కారీ సి ఐ
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని బెహరన్ గూడ లో మెస్రం భాది రావు అనేవ్యక్తి ఇంటి సమీపంలో సాగు చేసిన
5 గంజాయి చెట్లను స్వాధీనం చేసుకుని వాటిని ధ్వంసం చేసి తగుల బెట్టిన లక్షేటిపేట ఆబ్కారీ సి ఐ బా బా ,మంచిర్యాల డి టి ఎఫ్ సి ఐ గంగా రెడ్డి ,
8)ప్రీతమ్ జకల్కర్ తో సమంత దుబాయ్ టూర్...
సమంత దుబాయ్ టూర్ సంచలనానికి తెరలేపింది. దానికి కారణం ఆమె ఈ ట్రిప్ ప్రీతమ్ జుకల్కర్ తో వెళ్లడమే.
సమంత పర్సనల్ స్టైలిష్, డిజైనర్ ప్రీతమ్ జుకల్కర్ పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగింది. సమంత విడాకులకు కారణం ఇతడే అంటూ మీడియా కోడై కూసింది. సమంత అతనితో సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయటకు తీసి నానా రాద్ధాంతం చేశారు.
ఈ నేపథ్యంలో ప్రీతమ్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. సమంతను తాను అక్కగా భావిస్తానని, తమ మధ్య ఉన్న రిలేషన్ ఏమిటో నాగ చైతన్యకు కూడా తెలుసని మీడియా ద్వారా వెల్లడించారు. అయినా సమంత, అక్కినేని అభిమానులు ప్రీతమ్ ని టార్గెట్ చేయడం మానలేదు. నిప్పులేకుండా పొగరాదంటూ, నెగిటివ్ కామెంట్స్ చేశారు. నిజం ఏదైనా... ఇంత రచ్చ జరిగినప్పుడు ఎవరైనా కొన్నాళ్ళు దూరంగా ఉంటారు. కానీ అందరిలా ఆలోచిస్తే ఆమె సమంత ఎందుకు అవుతుంది...? ఫ్యాన్స్ మైండ్ బ్లాక్ చేస్తూ, సమంత ప్రీతమ్ తో కలిసి దుబాయ్ ట్రిప్ కి వెళ్లారు. అంతే కాకుండా ప్రీతమ్ తో దిగిన ఫోటో ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో షేర్ చేసి, దుబాయ్ వెళుతున్నట్లు కామెంట్ చేశారు.వీరిద్దరితో పాటు సమంత మేకప్ ఆర్టిస్ట్ సాధనా సింగ్ ఉన్నారు. ఇక ఈ ట్రిప్ ద్వారా సమంత మీరు ఎన్ని అనుకున్నా నేను భయపడేది లేదని చెప్పే ప్రయత్నం చేశారు. అదే సమయంలో మీడియా ద్వారా ఈ న్యూస్ బయటికి వస్తే మరింత నెగిటివ్ గా ప్రొజెక్ట్ అవుతుంది. అందుకే సమంత స్వయంగా చెప్పినట్లు ఉన్నారు. ఏది ఏమైన సమంత నిర్ణయాలు సాధారణ అభిమానులను షాక్ కి గురిచేస్తున్నాయి.
9) అర్దరాత్రి యువతి గొంతు కోసిన యువకుడు
హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్టినాగులపల్లిలో అర్ధరాత్రి ప్రియురాలి బెడ్రూంలోకి చొరబడిన ప్రియుడు కత్తితో గొంతు కోశాడు.యువతి అరవడంతో తల్లిదండ్రులు, బంధువులు నిందితుడిని పట్టుకుని చితకబాదారు.జీడిమెట్లకు చెందిన బాయన ప్రేమ్ సింగ్ (21) కేపీహెచ్‌బీలోని ఎంఎన్ ఆర్ డిగ్రీ కళాశాలలో చదువుతున్నాడు. మాదాపూర్‌లోని వెంకటేశ్వర ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో చదువుతున్న గొడీల రూఖీ సింగ్ (21) బంధువు కావడంతో పరిచయం ఏర్పడింది.
వట్టినాగులపల్లికి చేరుకున్న ప్రేమ్ సింగ్ బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల సమయంలో యువతి బెడ్ రూమ్ తలుపు తన్ని లోనికి చొరబడ్డాడు. కత్తితో యువతి గొంతు కోయడానికి ప్రయత్నించగా అప్పటికే అప్రమత్తమై గట్టిగా కేకలు వేసింది. కుటుంబ సభ్యులు లేచి యువకుడిని పట్టుకుని చితకబాది బంధించారు. యువతికి గొంతు, అరచేయి, కాలు, మణికట్టు వద్ద కత్తి గాట్లు పడ్డాయి. చికిత్స నిమిత్తం యువతిని కాంటినెంటల్ హాస్పిటల్లో, యువకుడిని కిమ్స్ హాస్పిటల్లో చేర్పించారు. గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. గంజాయి మత్తులో ప్రేమ్ సింగ్ ఘతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
10)బిగ్ బ్రేకింగ్......కరోన మూడో ముప్పు మొదలైంది!!_
- 2022 జనవరి-ఏప్రిల్ మధ్య ఉధృతి పెరిగి తీవ్రస్థాయికి
- జాగ్రత్తలు లేకుంటే ఈసారి అల్లకల్లోలం
- మా లెక్కలు తప్పవు
- ఎయిమ్స్ వెల్లడి
_అక్టోబర్ నెల నుంచి క్రమంగా కేసులు పెరిగి, 2022 జనవరి - ఏప్రిల్ మధ్య కట్టడి చేయలేనంత తీవ్ర స్థాయికి కరోనా చేరే అవకాశం ఉందని అంచనా వేశారు. దీంతో కచ్చితంగా ప్రజలు సూచనలు పాటించాలని ఎయిమ్స్ ఆరోగ్య గణాంక నిపుణులు హెచ్చరించారు. టూరిస్ట్‌ల సంఖ్య పెరగడం, సభలు, సమావేశాలతో ప్రజలు గుమిగూడటం మూడో ఉద్ధృతికి దారి తీయొచ్చని తెలిపారు. ఇటీవల టూరిస్ట్ లు పెరిగిన మనాలి, డార్జిలింగ్ ప్రాంతాల్లో కొవిడ్ కేసులు పెరిగాయని పేర్కొన్నారు._
_రాష్ట్రాలు ఆంక్షలను పాటించకపోతే మూడో ఉద్ధృతి ఆటోమేటిక్‌గా పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. భారత్‌లో మూడో వేవ్‌లో కొన్ని ప్రాంతాల్లో రోజువారీ కేసులు 103శాతం వరకూ ఉండొచ్చనే అంచనా వేశారు. ఇక కొవిడ్ ఆంక్షల్ని పూర్తిగా ఎత్తేసినా, పర్యాటకుల తాకిడి లేకపోతే మూడో ఉద్ధృతి తీవ్రత కొంతమేర తగ్గుతుందని తెలిపారు. ఆంక్షల ఎత్తివేతతో పాటు సెలవు రోజుల్లో పర్యాటకుల సంఖ్య పెరిగితే మాత్రం మహమ్మారి వ్యాప్తి ఎక్కువగా ఉంటుందన్నారు._
_సోషల్ డిస్టెన్స్ పాటించకపోతే కరోనా వంటి శ్వాసకోశ సంబంధ రోగాలు విస్తృతంగా వ్యాపించే అవకాశాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. హోటళ్లు, కేఫ్‌లలో కూర్చొని ఎక్కువసేపు మాట్లాడుకోవడం.. షేక్‌హ్యాండ్ ఇచ్చుకోవడం వంటి పనులతో కరోనా ముప్పు ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. పర్యాటకులు పెరిగి స్థానిక వ్యాపారులకు లబ్ధి చేకూరుతుంది కానీ... టూరిస్ట్‌లు, స్థానికులు, అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. కరోనా వ్యాప్తి పెరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని... అప్పుడే అందరి సంక్షేమాన్ని కాపాడుకుంటూ ముందడుగు వేయడం సాధ్యమవుతుందన్నారు._
_దేశానికి మూడో ఉద్ధృతి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఎయిమ్స్ డైరెక్టర్ సూచించారు. కోవిడ్ అంశంపై తమ నిపుణులు పేర్కొన్న గణాంకాలు ఇప్పటివరకు తప్పలేదని హెచ్చరించారు._
_ముఖ్యంగా ప్రస్తుత పండగల సీజన్లో అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. కనీసం మరో 6-8 వారాల పాటు బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తే మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టే అవకాశముందని చెప్పారు._