పెళ్లి అయిన మూడు రోజులకే గర్భవతి... తమ్ముడు తో రెండో పెళ్లి చేసిన ప్రియుడు వాళ్ల స్కెచ్ కి ప్రియుడి మైండ్ బ్లాక్...
వైజాగ్ చీటింగ్ లేడీ:
ఒక వైపు ప్రియుడుతో ఎఫైర్ సాగిస్తూనే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకుంది ఈ మహిళ. అంతేనా ఇంతటితో ఆగకుండా భర్తను నట్టేట ముంచి అతడి నుండి భారీగా బంగారం డబ్బులు దండుకుంది.
భారతీయ సంస్కృతి సాంప్రదాయాలలో వైవాహిక బంధానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది.పెళ్లి(marriage) అనే బంధాన్ని ప్రతి ఒక్కరూ గౌరవిస్తూ ఉంటారు. కానీ ఈ మహిళ మాత్రం ఆ బంధాన్ని అపహాస్యం పాలు చేసింది. ఓవైపు ప్రియుడితో ఎఫైర్ సాగిస్తూనే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకుంది. అంతటితో ఆగకుండా భర్తను నట్టేట ముంచి భారీగా డబ్బులు బంగారం దండుకుంది. ఆహారంలో కూడా తనలోనే మహానటిని బయటపెట్టి ప్రియుడి కథ,స్క్రీన్ ప్లే, డైరెక్షన్ తో నాటకాన్ని రక్తికట్టించింది.
అంతేనా రెండో భర్త కూడా జెర్క్ ఇచ్చి మూడో పెళ్లి చేసుకుంది. వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం లోని గాజువాక ప్రాంతానికి చెందిన నబారు రేణుక అనే యువతికి కొంత కాలంక్రితం జగదీశ్ అనే యువకుడితో పెద్దలు పెళ్లి చేశారు. అయితే ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే పెళ్లి అయిన మూడు రోజులకే రేణుక గర్భవతి అని తేలడంతో భర్త రేణుక ను వదిలేశాడు.
ఇది కూడా చదవండి: గాంధీ హాస్పిటల్ హత్యచర ఘటన సుఖాంతం
అప్పటికీ శ్రీనివాస్ అనే వ్యక్తి ని ప్రేమించిన రేణుక. అతడితో హద్దులు దాటడం తో గర్భవతి అయింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన శ్రీనివాస్ వాయిదా వచ్చాడు. ఈలోగా రేణుక పాపకు జన్మనిచ్చింది. ఇదిలా ఉంటే మరో యువతితో పెళ్లికి సిద్ధమైన శ్రీనివాస్ ను రేణుక ఆర తీయగా పాప బాధ్యత తాను తీసుకుంటానని నగదు డిపాజిట్ కూడా చేస్తానని సర్ది చెప్పి పెద్దలు చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.
అయితే రేణుకను వదిలించుకునే ఈ క్రమంలో శ్రీనివాస్ కి ఒక కన్నిగ్ ఐడియా తట్టింది. వెంటనే ఆమెను కూర్చోబెట్టి తన ప్లాన్ వివరించాడు. శ్రీనివాస్ పిన్ని కొడుకు అయినా నా ప్రసాద్ ఆర్మీ లో ఉద్యోగం చేస్తున్నాడు అని చెప్పి అతని ఫోన్ నెంబర్ మరియు కొన్ని ఫోటోలు శ్రీనివాస్ రేణుక కి పంపి ప్రసాద్ ని లైన్ లో పెట్టమని చెప్పాడు. ప్రేమ చెప్పిన ప్లాన్ ని పక్కాగా అమలుచేసిన రేణుక ప్రసాద్ నీ అనుకున్నట్టే ముగ్గులోకి దించింది. తర్వాత తనకు చెప్పకుండా అతన్ని పెళ్లి చేసుకునే లాగా చేసింది ఉద్యోగరీత్యా లక్నో లో ఉన్న ప్రసాద్ అన్న వెంటనే భార్యను కూడా కాపురానికి తీసుకెళ్లాడు. అక్కడ ప్రసాద్ రేణుక కి లక్షల విలువ చేసే బంగారం కొనిపెట్టాడు. కొంతకాలం తర్వాత రేణుక తనకి జీవీఎంసీ లో ఉద్యోగం వచ్చిందని ప్రసాద్ ని నమ్మించి తిరిగి వైజాగ్ వచ్చి ప్రియుడు శ్రీనివాస్ తో సెటిల్ అయింది. ఈ లోగా కరోన రావడంతో ప్రసాద్ విశాఖకు రాలేకపోయాడు. కానీ తరచూ రేణుక తో ఫోన్లో మాట్లాడుతూ ఉండేవాడు.
ఆ తర్వాత రేణుక పథకం ప్రకారం మా అమ్మకి హెల్త్ బాగా లేదని ఇంట్లో వెయ్యాలని డబ్బులు పంపమని ప్రసాద్ అని అడగడం మొదలు పెట్టింది. ఇలా పలుమార్లు బైపాస్ అంటూ, గొంతు సర్జరీ అని ఇతర చికిత్సల పేరుతో ప్రసాద్ నుండి 45 లక్షల రూపాయలు దండుకుంది. చివరకు అమ్మ చనిపోయిందని ప్రసాదం నమ్మించింది. ఆర్మీ లో ఉండడం కాలేకపోవడంతో తనకు తెలియకుండా ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలో పనిచేస్తున్న సాయి అనే యువకుని మూడో పెళ్లి చేసుకుంది.చివరకు రేణుక అసలు రంగు బయట పడటం తో ప్రసాద్ గాజువాక పోలీసు లని ఆశ్రయించగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి