అంబులెన్స్ దారి కి , పోలీసులు విధులకు ఆటంకం కల్పిస్తున్న వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించిన పోలీసులు.
యాదాద్రి భువనగిరి జిల్లా (సెప్టెంబర్ 1)
భువనగిరి రామన్నపేట రహదారి అయిన తుమ్మలగూడెం కమ్మగూడెం గ్రామాల మధ్య తుమ్మలగూడెం గ్రామానికి చెందిన బీజేపీ ఆధ్వర్యంలో బీజేవైఎం కార్యకర్త పల్లపు దుర్గయ్య, గండికోట కృష్ణయ్య,వీరితో పాటు పలువురు కార్యకర్తలు రోడ్డు మరమ్మతులు చేపట్టాలని రోడ్డుకు అడ్డంగా కూర్చొని ధర్నా నిర్వహించారు.
శిథిలావస్థకు చేరిన రోడ్డును ప్రజా ప్రతినిధులు అధికారులు ఎవరు పట్టించుకోకపోవడంతో చిన్నపాటి వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటూ రాకపోకలు పూర్తిగా నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతున్న కారణంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు.
ఇట్టి సమాచారం తెలుసుకున్న వలిగొండ ఎస్ఐ కె రాఘవేంద్ర గౌడ్ తన సిబ్బందితో ధర్నా నిర్వహిస్తూన్న స్థలానికి చేరుకుని రోడ్డుపై బైఠాయించి ధర్నా పేరుతో రోడ్డు ను నిర్బంధించిన బిజెపి కార్యకర్తలతో మాట్లాడి అత్యవసరం పరిస్థితుల్లో అంబులెన్స్ వెనక నుండి వస్తుంది. దారి ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
పోలీసులు చెప్పింది పట్టించుకోకపోగా ప్రభుత్వ అధికారులతో పాటు పోలీసులు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం.. తోపులాట చోటు చేసుకుంది.
తోపులాట వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
అక్కడే ఉన్న కొంతమంది పోలీసులకు సహకరించాల్సిందిగా ధర్నా నిర్వహిస్తున్న వ్యక్తులకు విజ్ఞప్తి చెసినకూడ వినిపించుకోకుండా ధర్నా పేరుతో దాడికైనా సిద్దమే అన్నట్లుగా ప్రవర్తిస్తుండడంతో వెంటనే పరిస్థితిని గమనించిన *ఎస్ఐ కె రాఘవేంద్ర గౌడ్* వారిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి పెట్రోలింగ్ వాహనంలో వలిగొండ పోలీస్ స్టేషన్ తరలిస్తుండగా మార్గమధ్యలో పోలీస్ సిబ్బంది పైకి చేతులు జడిస్తూ పోలీస్ వాహన స్టీరింగ్ ను అటు ఇటు తిప్పడం తో ఒక్కసారిగా వాహనం రోడ్డు పక్కకు దూసుకెళ్లడంతో పెను ప్రమాదం తప్పినట్లు తెలిపిన పోలీసులు.
అంబులెన్స్ దారి కి , పోలీసులు విధులకు ఆటంకం కల్పిస్తున్న వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించిన పోలీసులు.
🔹వలిగొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని నల్లగొండ భువనగిరి ప్రధాన రహదారి కమ్మగూడెం పరిసర ప్రాంతాల్లో వర్షాల కారణంగా పూర్తిగా దెబ్బతినడంతో గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఈరోజు ధర్నా చేపట్టారు..
భారీ ట్రాఫిక్ జామ్..
🔹కనీసం అత్యవసర పరిస్థితుల్లో వెళ్లే అంబులెన్స్ కు కూడా దారి ఇవ్వకపోవడం తో అక్కడ ఉన్న ప్రయాణికులు ధర్నా చేస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు...
🔹సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని పక్కకు తొలగించే క్రమంలో ఓ వ్యక్తి పోలీసు వాహనం వెళ్తుండగా డ్రైవర్ స్టీరింగ్‌ను ఓవైపు తిప్పడం తో అదుపు తప్పి కాలువలోకి వెళ్లిన పోలీసు వాహనం స్వల్ప గాయాలతో బయటపడిన పోలీసులు...
🔹రోడ్డు మరమ్మతుల కోసం ధర్నా చేయడం బాగానే ఉంది కానీ కనీసం అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ కు దారి ఇవ్వకపోవడం పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించిన గ్రామస్తులపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేసి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు...
ప్రజలకు అసౌకర్యానికి గురిచేస్తూ పోలీసుల విధి నిర్వహణ ఆటంకం కల్పిస్తూ అంబులెన్స్ దారి కి ఆటంకం కల్పించినందుకు తుమ్మల గూడెం ( ఇంద్రపాల నగరం ) కి చెందిన పల్లెపు..దుర్గయ్య (40). ఇంద్ర పాల నగరం,
బోనగోరి సాయి కుమార్(21).
గండికోట.హరికృష్ణ..(23).
వడ్లకొండ.వెంకటేష్.(33) లను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించిన వలిగొండ పోలీసులు.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి