ఏసీబీకి పట్టుబడ్డ కల్వకుర్తి విద్యుత్ శాఖ ఏఈ

 ఏసీబీకి పట్టుబడ్డ కల్వకుర్తి విద్యుత్ శాఖ ఏఈ



నాగర్‌కర్నూల్: కల్వకుర్తి విద్యుత్ శాఖ ఏఈ సురేశ్ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డారు. విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్, కరెంట్ స్తంభాల కోసం స్థిరాస్తి వ్యాపారి వద్ద ఏఈ సురేశ్ లంచం డిమాండ్ చేశారు.

ఈ నేపథ్యంలో కర్మాన్‌ఘాట్‌కు చెందిన స్థిరాస్తి వ్యాపారి సుంకర ప్రభాకర్ రెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. శుక్రవారం సాయంత్రం 5:30 గంటలకు సురేశ్‌కు ప్రభాకర్ రెడ్డి రూ. 1,00,000 ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం సురేశ్‌ను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు.

కల్వకుర్తి మండలం తాండ్ర గ్రామ సమీపంలో చంద్రభాస్కర్‌, శ్రీనివాసులు ప్లాటినం, ప్రైమ్‌ అనే రెండు వెంచర్లలలో విద్యుత్‌ ట్రాన్స్‌ ఫార్మర్లు, లైన్లు ఇతరత్రా పనుల కోసం హైదరాబాద్‌కు చెందిన ప్రభాకర్‌ అనే కాంట్రాక్టర్‌ను సంప్రదించగా అతడు కల్వకుర్తి విద్యుత్‌ కార్యాలయంలో ఏఈ సురేశ్‌ని కలిశాడు. వెంచర్లలో 100 కేడబ్ల్యూ డీటీఆర్‌ కెపాసిటీ ట్రాన్స్‌ ఫార్మర్‌ అవసరం ఉండగా ఏఈ సురేశ్ రూ.లక్ష డిమాండ్‌ చేశాడు. మరో మూడు వెంచర్ల నిర్వాహకులను ఇదే తరహాలో డబ్బులు డిమాండ్‌ చేశాడు. దీంతో ప్రభాకర్‌ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. శుక్రవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కారులో ఏఈ సురేశ్‌కు ప్రభాకర్‌ రూ.లక్ష ఇవ్వగా.. ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏఈని విచారించిన అనంతరం హైదరాబాద్‌ స్పెషల్‌ కోర్టు (నాంపల్లి)లో శనివారం ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఆయన వెంట సీఐ నర్సింహ, లింగస్వామి, సిబ్బంది ఉన్నారు.

బీజేపీ వ్యతిరేఖ పార్టీలకు టీఆర్ఎస్ డబ్బులు: కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

 బీజేపీ వ్యతిరేఖ పార్టీలకు టీఆర్ఎస్ డబ్బులు: కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు



టీఆర్ఎస్ ప్లీనరిలో కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు అబద్దాలు, అభూత కల్పనలు మాట్లాడారని పూనకం వచ్చినట్లు వ్యవహరించారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.

బీజేపీ అంటే కేసీఆర్ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎనిమిదేళ్లుగా తెలంగాణకు ఏం చేశావో చెప్పాలని కేసీఆర్ ను డిమాండ్ చేశారు. యూపీఏ హాయాంలో మంత్రిగా పనిచేసిన నువ్వు తెలంగాణకు ఏం తెచ్చావని ప్రశ్నించారు. కనీసం ఆఫీసుకు కానీ క్యాబినెట్ మీటింగ్ కానీ వెళ్లలేదని విమర్శించారు. గుణాత్మక పాలన అంటే కల్వకుంట్ల పాలనా? తండ్రి, కొడుకుల పాలనా? అని ప్రశ్నించారు. 

ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన బీజేపీ వ్యతిరేఖ పార్టీలకు టీఆర్ఎస్ డబ్బులు పంపిస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు కిషన్ రెడ్డి. జాతీయ రాజకీయాల కోెసం గతంలో విమానాన్ని అద్దెకు తీసుకుని అసదుద్దీన్ ఓవైసీతో కలిసి తిరుగుతా అని అనుకున్నారని గోవాలో 1800 మందిని రంగంలోకి దించి టీఎంసీకి అనుకూలంగా పనిచేశారని విమర్శలు చేశారు. కేసీఆర్ ఫ్రంట్ పెట్టుకోవచ్చు, టెంట్ వేసుకోవచ్చని ఎద్దేవా చేశారు. నదుల అనుసంధానం అంటే ఇల్లు ఎక్కి కేసీఆర్ లొల్లి పెడుతున్నాడు వృధా అవుతున్న నీటిని అరికట్టాలంటే నదుల అనుసoదానము తోనే సాధ్యమని నదుల అనుసంధానం పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

అయితే ప్రధాని లేదంటే యూపీ సీఎం! అంతేతప్ప.. రాష్ట్రపతి పదవిపై ఆసక్తి లేదు: మాయావతి

 అయితే ప్రధాని లేదంటే యూపీ సీఎం! అంతేతప్ప.. రాష్ట్రపతి పదవిపై ఆసక్తి లేదు: మాయావతి



లఖ్‌నవూ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తనను రాష్ట్రపతి పదవికి ఎంపిక చేస్తుందంటూ సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ చేసిన వ్యాఖ్యలపై బీఎస్పీ అధినేత్రి మాయావతి మండిపడ్డారు.

ఇలాంటి పనికిరాని మాటలను నమ్మవద్దన్నారు. రానున్న రోజుల్లో ప్రధాని పదవిని చేపట్టడం లేదా తిరిగి యూపీ సీఎం కావడంపై మాత్రమే తనకు ఆసక్తి ఉందని, అంతేతప్ప రాష్ట్రపతి పదవిలో కూర్చుని ప్రశాంత జీవితాన్ని గడపాలని లేదన్నారు. అఖిలేశ్‌ చేసిన ఈ వ్యాఖ్యల వెనుక ఆయన సీఎం కావడానికి ఉన్న అడ్డంకిని తొలగించుకునే పెద్ద కుట్రే దాగి ఉందన్నారు.

తెల్లారితే ఆ ఇంట్లో శుభకార్యం.. ఇంతలో ఆ ఇంట్లో చోరీ జరగడం తో...నిలిచిపోయిన శుభకార్యం..

తెల్లారితే ఆ ఇంట్లో శుభకార్యం.. 

ఇంతలో ఆ ఇంట్లో చోరీ జరగడం తో...నిలిచిపోయిన శుభకార్యం..



మహబూబాబాద్ జిల్లా...తెల్లారితే ఆ ఇంట్లో శుభకార్యం.. కూతురు జీవన నిశ్చితార్థం పెట్టుకున్నారు. ఇంతలో ఆ ఇంట్లో చోరీ జరగడం తో...నిలిచిపోయిన శుభకార్యం..

మహబూబాబాద్ జిల్లా పెద్ద గూడూరు మండల కేంద్రంలో బాషబోయిన ఐలయ్య తన కూతురు నిశ్చితార్థం.. సూర్యపేటకు చెందిన దగ్గరి బంధువులతో నిశ్చితార్థం కుదుర్చుకున్నారు. నిశ్చితార్థం రోజున పెళ్ళికొడుకు తాలూకు 5లక్షల నగదు, 2 తులాల బంగారు నగలు వారికి అప్పచెప్పేందుకు అన్నీ సిద్ధం చేసుకున్నారు... తెల్లారితే శుభకార్యం ఇంతలో ఆ ఇంట్లో దొంగలు పడి డబ్బు, నగలు దోచుకెళ్ళారు. దీంతో జరిగిన సంఘటన తో ఆ ఇంట్లో జరగాల్సిన శుభకార్య ఆగిపోయింది...దీనితో పోలీసులకు సమాచారం అందించడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు...సంఘటన స్థలంలో..క్లూస్ టీం, డాగ్ స్వ్కాడ్ లను రంగం లోకి దించి,నిందితులను పట్టుకునేందుకు విచారణ చేపట్టారు.


Big Breaking: ధరణిలో కొత్త మాడ్యూల్

 Big Breaking: 


ధరణిలో కొత్త మాడ్యూల్



డేటా కరెక్షన్‌కు ప్రత్యేక ఆప్షన్

8 సమస్యలకు ఒక్క క్లిక్‌తో పరిష్కారం

 సుదీర్ఘ సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. ప్రజలు వస్తున్న వినతుల మేరకు గత కొద్ది రోజులుగా ధరణిపై ప్రభుత్వం దృష్టి సారించింది. డిజిటల్ పట్టాదారు పాసు పుస్తకాల్లో జరిగిన తప్పులను సవరించేందుకు ధరణిలో మరో కొత్త సర్వీస్ మాడ్యూల్‌ను ప్రవేశ పెట్టింది.


డేటాలో జరిగిన తప్పులను ఈ ఆప్షన్ ద్వారా సవరించుకునే అవకాశం రావడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఒక్క ఆప్షన్ ద్వారా ధరణి లో సుమారు 8రకాల సమస్యలు పరిష్కారం అవుతాయి అని అధికారులు తెలిపారు.

ఈ ఆప్షన్ ద్వారా అందుబాటులోకి వచ్చే సేవలు…


1. Change of name | పేరు మార్పు


2. Change of Land nature | భూమి స్వభావం యొక్క మార్పు


3. Change of Land classification | భూమి వర్గీకరణ మార్ప

 

4. Change of Manner in which land acquired | భూమి రకం మార్పు


5. Extent Correction | పరిధి దిద్దుబాటు |


6. Missing Survey / Sub Division No. | మిస్సింగ్ సర్వే / సబ్ డివిజన్ నం


7. Transfer of land from Notional Khata ( all types ) to Patta | నోషనల్ ఖాటా ( అన్ని రకాలు ) నుండి పట్టాకు భూమిని బదిలీ చేయండి .


8. Change of land enjoyment | భూమి అనుభవంలో మార్పు /

వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మంచిర్యాల ఎమ్మెల్యే

 వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మంచిర్యాల ఎమ్మెల్యే



మంచిర్యాల:

మంచిర్యాల నియోజకవర్గం లోని హాజీపూర్ మండల పరిధిలోని పడ్తనపల్లి గ్రామంలో గురువారం మంచిర్యాల శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు  వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారభించారు.




ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో ఏర్పాటు చేసిన రైతుల సమావేశంలో ఎమ్మేల్యే  మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులపై వివక్ష చూపుతుందని, రాష్ర్టంలో పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయమని చెప్పి రైతులను ఆందోళనకు గురి చేసిందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ ప్రాంత రైతుల కోసం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసుటకు ప్రత్యేక చొరవ చూపుతున్నారని అన్నారు. 



మంచిర్యాల నియోజకవర్గం లో పడ్తనపల్లి గ్రామంలో మొదటి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో పండించిన పంటలు తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని, దళారులను నమ్మి మోసపోవద్దు అని సూచించారు.



 ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోలీ కేరి, అదనపు కలెక్టర్ మధుసూధన్ నాయక్, మంచిర్యాల వ్యవసాయ కమిటీ ఛైర్మెన్ పల్లె భుమేష్, హాజీపూర్ మండల టీఆరెఎస్ పార్టీ అధ్యక్షులు మొగిలి శ్రీనివాస్, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు

మంచిర్యాల షిర్డీ సాయిబాబా ఆలయ మహా సంప్రోక్షణ కార్యక్రమంలో పాల్గొన్న మంచిర్యాల శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు దంపతులు

 మంచిర్యాల షిర్డీ సాయిబాబా ఆలయ మహా సంప్రోక్షణ కార్యక్రమంలో పాల్గొన్న మంచిర్యాల శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు  దంపతులు, యువ నాయకులు నడిపెల్లి విజిత్



 మంచిర్యాల షిర్డీ సాయిబాబా ఆలయ మహా సంప్రోక్షణ కార్యక్రమం లో పాల్గొన్న మంచిర్యాల శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు  దంపతులకు, యువ నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ కు, ఆలయ పూజారులు,స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు.



ఆలయ మహా సంప్రోక్షణ కార్యక్రమం లో పాల్గొన్న నడిపెల్లి దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంచిర్యాల శాసనసభ్యుడు నదిపెల్లి దివాకర్ రావు గారు మాట్లాడుతూ మంచిర్యాల ప్రజలు ఎల్లవేళలా సాయి బాబా కృపతో ఆనందంగా వుండాలని, దేవుని ఆశీస్సులు అందరికీ అందాలని ఆకాంక్షించారు. 



ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య,వైస్ చైర్మన్ ముకేశ్ గౌడ్ ,   మున్సిపల్ కౌన్సిలర్స్, టీఆరెఎస్ నాయకులు, కార్యకర్తలు, ఆలయ పూజారులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.