తూర్పు కాపు సంక్షేమ సంఘం‌ చే పాలూరు టానీషా కు అభినందన సత్కారం

తూర్పు కాపు సంక్షేమ సంఘం‌ చే పాలూరు టానీషా కు అభినందన సత్కారం



చిరంజీవి పాలూరు టానీషా కు అతి చిన్న వయసులో 12 సంవత్సరాలకే పదవ తరగతిలో 525/600  మార్కులు సాదించునందుకు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తూర్పు కాపు సంక్షేమ సంఘం తరుపున గాజువాక ఏరియా తూర్పు కాపు సంక్షేమ సంఘ సభ్యులు మరియు విశాఖ జిల్లా తూర్పు కాపు సంక్షేమ సంఘ సభ్యులు చే టానీషా కు ఘన సత్కారం చేసినట్లు తూర్పు కాపు సంక్షేమ సంఘం గాజువాక ఏరియా గౌరవ అధ్యక్షులు శ్రీ జమ్ము రమణ, గాజువాక అధ్యక్షులు శ్రీ    యర్లంకి రాజేశ్వరి నాయుడు కార్యదర్శి గుడివాడ శ్రీ రాములు నాయుడు, సహాయ కార్యదర్శి శ్రీ కొమ్ము రమేష్, ఉపాధ్యక్షులు శ్రీ పెదలంక కాంతారావు, జిల్లా కోశాధికారి శ్రీ కడగుల చిన్నారావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగినట్లు తూర్పు కాపు సంక్షేమ సంఘం కన్వీనర్ శ్రీ గిరడ ప్రసాద్ మరియు అధ్యక్షులు రాజేశ్వర నాయుడు మరియు స్వామి విద్యా నికేతన్ హై స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మణ స్వామి తెలియజేశారు .... 

ప్రభుత్వం విడుదల చేసిన 2022 పదవ తరగతి ఫలితాలలో అతి చిన్న వయస్సు(12 సం*) లో పదవ తరగతి పరిక్షాల్లో అత్యధికంగా 525/600 మార్కులతో ఉత్తీర్ణత సాధించిన పాలూరు టానీషా ...


విశాఖ జిల్లాకే కాకుండా మా ఆంధ్ర ప్రదేశ్ తూర్పు కాపు జాతి ఆణిముత్యం చదువుల తల్లి టానిషా ను చూస్తే గర్వకారణంగా చెప్పుకునే నేపాధ్యంలో... మా విశాఖ జిల్లా తూర్పు కాపు సంక్షేమ సంఘం వారు... వీరితో పాటు విశాఖ విద్యా విహార్ ప్రిన్సిపాల్ షేక్ వల్లి గారు కూడా పిల్లల్ని  బొకే తో ఆశీర్వదిస్తూ అభినందించారు..



 గాజువాక హైస్కూల్ రోడ్డు ప్రాంతంకి చెందిన స్వామి విద్యానికేతన్ హై స్కూల్ నడుపుతున్న వారి ... తల్లిదండ్రులు డాక్టర్ పాలూరు లక్ష్మణ స్వామి మరియు  పాలూరు దేవి ల రెండవ సంతానం చదువుల తల్లి టానీషా 12 ఏళ్ళకే పదవ తరగతిలో అత్యధిక మార్కులతో ఉత్తీర్ణత సాధించి రికార్డ్ సృష్టించింది, మొదట నుండి చదువులలో అడ్వాన్స్ గా ఉండే టానీషా వయస్సు వారు ఇంక ఆరోవ తరగతి చదువుతుండగా టానీషా మాత్రం పదవ తరగతి పూర్తి చేసింది, అంతటి తో ఆగకుండా జాతీయస్థాయిలో స్కౌట్స్ అండ్ & గైడ్స్ మరియు కూచిపూడిలో ఆంధ్రప్రదేశ్ తరుపున పలు రాష్ట్రాలలో పాల్గోని అందరి మన్నాలు పొందింది, ఇప్పుడు పదవ తరగతి అనంతరం... ఆకాష్ విద్య సంస్ధలలో డాక్టర్ అవ్వాలి అనే తన కోరికని బలపర్చుకోవడానికి జాతీయ స్థాయిలో జరిగే నీట్ ఎగ్జామ్ కి అత్యధిక స్థానం సాధించుట కొరుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది .......

అంతేకాకుండా పాలూరు టానీషా ...

అన్నయ్య ...

పాలూరు పూజేషే కూడా తన చెల్లెలుకు తగినట్లే ఇదే విద్యా సంవత్సరంలో లో తను చదివే పాఠశాలలో ( స్వామి విద్యా నికేతన్ హై స్కూల్ ) లో  అత్యధిక మార్కులు 539/600  సాదించిన విద్యార్థిగా  ఉన్నాడు పూజేషే కూడా తన చెల్లి లాగే అనేక జాతీయ  కార్యక్రమాల్లో పాల్గొని ఇప్పటికే జాతీయంగా నాలుగు  జాతీయ అవార్డులు రివార్డులు లో... కొన్ని మచ్చుకు..



హర్యానా రాష్ట్రంలోని (అంబాలా) లో ; సిక్కిం లో జరిగే అంతర్జాతీయ సమైక్యత ర్యాలీలో మిగతా దేశాలతో పాల్గొని మన ఆంధ్రప్రదేశ్ యొక్క.. విధి విధానాలు వేష..భాషలు ఆహారఫు అలవాట్లు,ఆచార వ్యవహారాలు , వివాహ పద్ధతులు, వేష భాషలు మొదలైనవన్నీ ప్రపంచ దేశాలు కు వివిధ రూపాలలో చూపు నందుకు గాను ..మన ఆంధ్రప్రదేశ్ కు రెండు జాతీయ అవార్డులు కైవసం చేసుకున్నాడు మరియు గోవా లో జాతీయ యూత్ అడ్వెంచర్ క్యాంపులో వివిధ కేటగిరీల కింద ఇద్దరు పిల్లలు మన ఆంధ్రప్రదేశ్ కు ఆణిముత్యాలు గా నిలుచారు....

ఇద్దరు మా తూర్పుకాపు ఆణిముత్యాలు... భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ తరుపున మన ఆంధ్రప్రదేశ్ లో... పూజేషే రాష్ట్రపతి అవార్డు... తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు... అదేవిధంగా టానీషా ( గవర్నర్ అవార్డు )రాజ్య పురస్కారం సంపాదించి, రాష్ట్రపతి అవార్డు కు అర్హత సాధించి ఉన్నది...

 అన్నకు తగిన చెల్లి - చెల్లికి తగిన అన్న  నువ్వేంటి నేను అనేట్టు  మన ఆంధ్రప్రదేశ్ లో తూర్పు కాపు జాతికే మంచి పేరు ప్రఖ్యాతలు భవిష్యత్తులో తీసుకు వస్తారు అనే భావనతో మేము  వారి ఇద్దరినీ ఆశీర్వదిస్తూ... అభినందిస్తూ... చిరంజీవులు ఇద్దరూ పాలూరు పూజేషే మరియు టానీషాలకు ఆశీస్సులు తెలియజేస్తూ.....

        

గాజువాక ఏరియా మరియు విశాఖ ఉమ్మడి జిల్లా తూర్పు కాపు సంక్షేమ సంఘం..🌷🌷🌷🌹🌹🌹💐💐💐

మే ఏనిమిదిన అమ్మలకు ఆర్టీసీ ప్రయాణం ఉచితం

 మే ఏనిమిదిన అమ్మలకు ఆర్టీసీ ప్రయాణం ఉచితం 



హైదరాబాద్‌:

 అంతర్జాతీయ మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని మే 8న ఆర్టీసీలోని అన్ని కేటగిరీ బస్సుల్లో అమ్మలు ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని ఆర్టీసీ కల్పించింది.

ఐదేళ్ల లోపు చిన్నారులతో ప్రయాణించే మాతృమూర్తులందరికీ ఈ వెసులుబాటు ఉంటుందని ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎండీ సజ్జనార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. పల్లెవెలుగు మొదలు ఏసీ సర్వీసుల వరకు ఈ అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ సందర్భంగా అమ్మలందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

సరస్సులో కొట్టుకొచ్చిన రూ.2వేల నోట్ల కట్టలు

 సరస్సులో కొట్టుకొచ్చిన రూ.2వేల నోట్ల కట్టలు



ఓ సరస్సులో రూ.2వేల నోట్ల కట్టలు భారీగా కొట్టుకొచ్చాయి.. అయితే ఆ నోట్ల కట్టలు మొత్తం 30 నుంచి 32నోట్ల కట్టటుంటాయి. రాజస్థాన్​ అజ్మేర్​లోని ఆనాసాగర్ సరస్సులో రూ.2వేల నోట్ల కట్టలు తేలియాడాయి.

పాలిథీన్​ బ్యాగులో ఉన్న వీటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 30 నుంచి 32 నోట్ల కట్టలు ఉన్నాయని, అన్నీ రూ.2వేల నోట్లే అని అధికారులు చెప్పారు. పుష్కర్​ రోడ్డులోని ఈ సరస్సులో భారీగా కరెన్సీ నోట్లు ఉన్నాయని తమకు సమాచారం అందిందని, వచ్చి చూస్తే నిజంగానే నోట్ల కట్టలు ఉన్నాయని చెప్పారు. అయితే ఈ నోట్లు నకిలీవా?

లేక నిజమైనవా? అనే విషయం తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. చూడటానికి మాత్రం నిజమైన నోట్ల లాగే ఉన్నాయని, నీటిలో తడవడం వల్ల నిర్ధారించుకోలేకపోతున్నట్లు చెప్పారు. నిపుణుల సాయంతో నోట్లు అసలువో, కాదో తెలుసుకుంటామన్నారు.


రిటైర్మెంట్ తర్వాత ప్రశాంతమైన జీవితం గడపడానికి రెగ్యులర్ ఇన్కమ్ ఎంతో అవసరం.


రిటైర్మెంట్ తర్వాత ప్రశాంతమైన జీవితం గడపడానికి రెగ్యులర్ ఇన్కమ్ ఎంతో అవసరం.  



SBI LIFE DM LINGAREDDY 9949508843

 రిటైర్మెంట్ తర్వాత ప్రశాంతమైన జీవితం గడపడానికి రెగ్యులర్ ఇన్కమ్ ఎంతో అవసరం.  ఇరవై ఐదు సంవత్సరాల పాటు నెలనెలా గ్యారెంటీ రెగ్యులర్ ఇన్కమ్ అందిస్తున్న స్మార్ట్ ప్లాటినా ప్లస్ గురించి కొన్ని వివరాలు


 పెట్టుబడి కాలం: 35 సంవత్సరాలు గల వ్యక్తి తన పెన్షన్ ఎకౌంట్లో సంవత్సరానికి లక్ష రూపాయల చొప్పున 10 సంవత్సరాలపాటు 10 లక్షలు జమ చేసి.



 వెయిటింగ్ పీరియడ్: 1 ఈ సంవత్సరం పాటు ఆగి


 పెన్షన్ రాబడి: 10 సంవత్సరాల పాటు ఉ పెన్షన్ అకౌంట్ లో డబ్బులు జమ చేసుకొని ఒక సంవత్సరం ఆగి అక్కడ నుండి 25 సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం 86,940/-  లేదా నెల నెలా 7,245/- మొత్తంగా  21,73,500/- (86,940 X 25 yrs) రూపాయలు పెన్షన్ గా అందుతుంది.


 మెచ్యూరిటీ: 25 వ సంవత్సరం పెన్షన్ తో పాటు 11 లక్షల రూపాయలు భవిష్యత్తు నిధిగా  అందించబడును.


 పెట్టుబడి: 10 లక్షలు

పెన్షన్:.         21,73,500/-

మెచ్యూరిటీ: 11,00,000/-

 మొత్తం రాబడి: 32,73,500/- గ్యారెంటీ గా బాడ్ లో రాసి ఇవ్వబడును ....


 వడ్డీ 6.75%...... ఈ అవకాశం కొద్ది రోజులు మాత్రమే...




ఏసీబీకి పట్టుబడ్డ కల్వకుర్తి విద్యుత్ శాఖ ఏఈ

 ఏసీబీకి పట్టుబడ్డ కల్వకుర్తి విద్యుత్ శాఖ ఏఈ



నాగర్‌కర్నూల్: కల్వకుర్తి విద్యుత్ శాఖ ఏఈ సురేశ్ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డారు. విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్, కరెంట్ స్తంభాల కోసం స్థిరాస్తి వ్యాపారి వద్ద ఏఈ సురేశ్ లంచం డిమాండ్ చేశారు.

ఈ నేపథ్యంలో కర్మాన్‌ఘాట్‌కు చెందిన స్థిరాస్తి వ్యాపారి సుంకర ప్రభాకర్ రెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. శుక్రవారం సాయంత్రం 5:30 గంటలకు సురేశ్‌కు ప్రభాకర్ రెడ్డి రూ. 1,00,000 ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం సురేశ్‌ను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు.

కల్వకుర్తి మండలం తాండ్ర గ్రామ సమీపంలో చంద్రభాస్కర్‌, శ్రీనివాసులు ప్లాటినం, ప్రైమ్‌ అనే రెండు వెంచర్లలలో విద్యుత్‌ ట్రాన్స్‌ ఫార్మర్లు, లైన్లు ఇతరత్రా పనుల కోసం హైదరాబాద్‌కు చెందిన ప్రభాకర్‌ అనే కాంట్రాక్టర్‌ను సంప్రదించగా అతడు కల్వకుర్తి విద్యుత్‌ కార్యాలయంలో ఏఈ సురేశ్‌ని కలిశాడు. వెంచర్లలో 100 కేడబ్ల్యూ డీటీఆర్‌ కెపాసిటీ ట్రాన్స్‌ ఫార్మర్‌ అవసరం ఉండగా ఏఈ సురేశ్ రూ.లక్ష డిమాండ్‌ చేశాడు. మరో మూడు వెంచర్ల నిర్వాహకులను ఇదే తరహాలో డబ్బులు డిమాండ్‌ చేశాడు. దీంతో ప్రభాకర్‌ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. శుక్రవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కారులో ఏఈ సురేశ్‌కు ప్రభాకర్‌ రూ.లక్ష ఇవ్వగా.. ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏఈని విచారించిన అనంతరం హైదరాబాద్‌ స్పెషల్‌ కోర్టు (నాంపల్లి)లో శనివారం ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఆయన వెంట సీఐ నర్సింహ, లింగస్వామి, సిబ్బంది ఉన్నారు.

బీజేపీ వ్యతిరేఖ పార్టీలకు టీఆర్ఎస్ డబ్బులు: కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

 బీజేపీ వ్యతిరేఖ పార్టీలకు టీఆర్ఎస్ డబ్బులు: కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు



టీఆర్ఎస్ ప్లీనరిలో కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు అబద్దాలు, అభూత కల్పనలు మాట్లాడారని పూనకం వచ్చినట్లు వ్యవహరించారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.

బీజేపీ అంటే కేసీఆర్ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎనిమిదేళ్లుగా తెలంగాణకు ఏం చేశావో చెప్పాలని కేసీఆర్ ను డిమాండ్ చేశారు. యూపీఏ హాయాంలో మంత్రిగా పనిచేసిన నువ్వు తెలంగాణకు ఏం తెచ్చావని ప్రశ్నించారు. కనీసం ఆఫీసుకు కానీ క్యాబినెట్ మీటింగ్ కానీ వెళ్లలేదని విమర్శించారు. గుణాత్మక పాలన అంటే కల్వకుంట్ల పాలనా? తండ్రి, కొడుకుల పాలనా? అని ప్రశ్నించారు. 

ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన బీజేపీ వ్యతిరేఖ పార్టీలకు టీఆర్ఎస్ డబ్బులు పంపిస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు కిషన్ రెడ్డి. జాతీయ రాజకీయాల కోెసం గతంలో విమానాన్ని అద్దెకు తీసుకుని అసదుద్దీన్ ఓవైసీతో కలిసి తిరుగుతా అని అనుకున్నారని గోవాలో 1800 మందిని రంగంలోకి దించి టీఎంసీకి అనుకూలంగా పనిచేశారని విమర్శలు చేశారు. కేసీఆర్ ఫ్రంట్ పెట్టుకోవచ్చు, టెంట్ వేసుకోవచ్చని ఎద్దేవా చేశారు. నదుల అనుసంధానం అంటే ఇల్లు ఎక్కి కేసీఆర్ లొల్లి పెడుతున్నాడు వృధా అవుతున్న నీటిని అరికట్టాలంటే నదుల అనుసoదానము తోనే సాధ్యమని నదుల అనుసంధానం పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

అయితే ప్రధాని లేదంటే యూపీ సీఎం! అంతేతప్ప.. రాష్ట్రపతి పదవిపై ఆసక్తి లేదు: మాయావతి

 అయితే ప్రధాని లేదంటే యూపీ సీఎం! అంతేతప్ప.. రాష్ట్రపతి పదవిపై ఆసక్తి లేదు: మాయావతి



లఖ్‌నవూ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తనను రాష్ట్రపతి పదవికి ఎంపిక చేస్తుందంటూ సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ చేసిన వ్యాఖ్యలపై బీఎస్పీ అధినేత్రి మాయావతి మండిపడ్డారు.

ఇలాంటి పనికిరాని మాటలను నమ్మవద్దన్నారు. రానున్న రోజుల్లో ప్రధాని పదవిని చేపట్టడం లేదా తిరిగి యూపీ సీఎం కావడంపై మాత్రమే తనకు ఆసక్తి ఉందని, అంతేతప్ప రాష్ట్రపతి పదవిలో కూర్చుని ప్రశాంత జీవితాన్ని గడపాలని లేదన్నారు. అఖిలేశ్‌ చేసిన ఈ వ్యాఖ్యల వెనుక ఆయన సీఎం కావడానికి ఉన్న అడ్డంకిని తొలగించుకునే పెద్ద కుట్రే దాగి ఉందన్నారు.