తెలంగాణలో ధూంధాంగా దసరా దావత్.. Dhundham Dussehra dawat celebration in Telangana..

 💥తెలంగాణలో ధూంధాంగా దసరా దావత్..

Dhundham Dussehra dawat celebration in Telangana..





 10 రోజుల్లో రూ.1,100 కోట్ల మందు తాగేశారు

1,100 crores of drugs were consumed in 10 days



హైదరాబాద్: తెలంగాణలో దసరానాడు ముక్క, సుక్క లేకుండా పండగ పూర్తి కాదు. ఏటా బతుకమ్మ, దసరా సందర్భంగా రాష్ట్రంలో లిక్కర్ అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయి. ఈసారి కూడా మందుబాబులు అదే ఒరవడిని కొనసాగిస్తూ భారీ రికార్డు నెలకొల్పారు. కేవలం 10 రోజుల వ్యవధిలో రూ.1,100 కోట్లకుపైగా మందును తాగేశారు. పది రోజుల్లో వెయ్యి కోట్ల మేర మద్యం విక్రయాలు జరిగినట్లు ఆబ్కారీ అధికారులు చెబుతున్నారు. బార్లు, మద్యం దుకాణాలతో పాటుగా పబ్ లలోనూ అమ్మకాలు పెరిగాయి. దీంతో సర్కార్ ఖజానాకు.. మద్యం భారీగా ఆదాయం తెచ్చి పెట్టింది. మద్యం అమ్మకాల్లో ఎప్పటిలాగే హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది.

Hyderabad: In Telangana, Dussehra festival is not complete without drug and non veg . Every year during Bathukamma and Dussehra, sales of liquor in the state are increasing hugely. This time too, the drug addicts continued the same trend and set a huge record. In just 10 days, more than Rs.1,100 crores of drugs were consumed. Excise officials say that the sale of liquor worth one thousand crores was done in ten days. Along with bars and liquor stores, sales also increased in pubs. As a result, alcohol has brought huge income to the government treasury. As always, Hyderabad is at the top in liquor sales.




17 లక్షల బీర్లు..

17 LAKHS BEERS

రాష్ట్రంలో 2 వేల 260 మద్యం దుకాణాలు, 1,171బార్లు, రెస్టారెంట్లు ఉన్నాయి. వీటితో పాటుగా పబ్బుల్లోనూ మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఏటా దసరా వేళ తెలంగాణలో మద్యం ఎక్కువ మొత్తంలో అమ్ముడవుతుంది. ఈ సారి అదే అంచనాతో ముందుగానే ఎక్సైజ్ శాఖ అధికంగా మద్యం నిల్వలను సిద్ధం చేసుకుంది. ఆర్డర్లు కూడా ఊహించిన దాని కన్నా అధికంగా ఉండటంతో రాష్ట్ర సర్కార్ ఖజానాకు కాసుల వర్షం కురిసింది. బార్లు సైతం తగినంత స్టాక్‌ను అందుబాటులో ఉంచాయి. దసరాకు ముందు నుంచే మొదలైన మద్యం కిక్కు శని, ఆదివారాల్లో పీక్స్‌కు చేరింది.


There are 2 thousand 260 liquor shops, 1,171 bars and restaurants in the state. In addition to these, the sale of alcohol is continuing in pubs. Every year during Dussehra, liquor is sold in large quantities in Telangana. This time, with the same estimate, the Excise Department has prepared large stocks of liquor in advance. As the orders were also higher than expected, the state government's coffers rained money. Bars also keep enough stock available. The liquor kick that started before Dussehra reached its peak on Saturday and Sunday.


సెప్టెంబర్ 30 వరకు 2 వేల 838 కోట్ల అమ్మకాలు జరగ్గా... అక్టోబర్ నెల ప్రారంభం నుంచి 11వ తేదీ వరకు రూ 1,100 కోట్ల మేర విలువైన 10 లక్షల 44వేల కేసుల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఆబ్కారీ అధికారులు చెబుతున్నారు. 10 రోజులవ్యవధిలోనే 17 లక్షల 59 వేల బీర్లు అమ్ముడుపోయాయట. మద్యం అమ్మకాల్లో ఉమ్మడి రంగారెడ్డి టాప్‌లో ఉండగా ఉమ్మడి కరీంనగర్, నల్లగొండ, వరంగల్ జిల్లాలు తర్వాతి మూడు స్థానాల్లో ఉన్నాయి.


Excise officials say that 10 lakh 44 thousand cases of liquor worth Rs 1,100 crore were sold from the beginning of October to the 11th of October while 2 thousand 838 crores were sold till September 30. 17 lakh 59 thousand beers were sold within 10 days. In terms of liquor sales, Ranga Reddy is the top district while Karimnagar, Nalgonda and Warangal districts are in the next three positions.


స్వల్పంగా తగ్గిన ఆదాయం..

A slight decrease in income.


ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో మద్యం అమ్మకాలు ప్రభుత్వానికి భారీ ఆదాయాన్ని సమకూర్చాయి. గత ఏడాది అక్టోబర్‌ 1 నుంచి 10వ తేదీతో పోలిస్తే ఈ ఏడాది ఇదే సమయంలో పది రోజులకుగానూ అమ్మకాలు కాస్త తగ్గాయి. గ్రేటర్ హైదరాబాద్, సికింద్రాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, శంషాబాద్, సరూర్‌నగర్‌, వికారాబాద్ జిల్లాల పరిధిలో 674 మద్యం దుకాణాలు ఉండగా, 2023లో మద్యం అమ్మకాల ద్వారా రూ.317 కోట్ల 21 లక్షల ఆదాయం సమకూరినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం రూ.312 కోట్లే ఖజానాకు వచ్చింది. గతంతో పోల్చితే ఎక్సైజ్ ఆదాయం రూ.5 కోట్ల 18 లక్షలు తగ్గడం గమనార్హం..


Liquor sales in joint Rangareddy districts have provided huge revenue to the government. Compared to October 1 to 10 last year, the sales for ten days at the same time this year have decreased slightly. Officials say that there are 674 liquor shops in Greater Hyderabad, Secunderabad, Medchal, Malkajigiri, Shamshabad, Sarurnagar and Vikarabad districts, and in 2023, an income of Rs. 317 crore 21 lakhs will be collected from the sale of liquor. At present only Rs.312 crores have come to the treasury. It is noteworthy that the excise revenue has decreased by Rs. 5 crores and 18 lakhs compared to the previous year.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి