తెలంగాణ ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డు ద‌ర‌ఖాస్తు విధానం (Telangana State Family Degital Card Application)

 తెలంగాణ ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డు ద‌ర‌ఖాస్తు విధానం... (Telangana State Family Degital Card Application)


TG FAMILY DEGITAL CARD

ప్ర‌స్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఒక కుటుంబంలోని వారు వివిధ ప‌థ‌కాల కింద వివిధ ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాల‌ను పొందుతున్నారు. కానీ ఆ వివ‌రాల‌న్నీ ఒకే చోట లేవు. ఈ నేప‌థ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డును జారీ చేయాల‌ని నిర్ణ‌యించారు. ఈ కార్డు జారీ చేయ‌డంతో ప్ర‌భుత్వానికి సంబంధించిన 30 శాఖ‌ల స‌మాచారం ఒకే చోట ల‌భించే వీలుంటుంది. అర్హుల‌కు కూడా త్వ‌ర‌గా సంక్షేమ ఫ‌లాలు అందే అవకాశం ఉంటుంది.

 ఇటీవ‌ల సికింద్రాబాద్ ప‌రిధిలోని కంటోన్మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలో ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డుల జారీ ప్ర‌క్రియ‌కు సంబంధించి పైల‌ట్ ప్రాజెక్టును ప్రారంభించారు.
వ‌న్ స్టేట్ – వ‌న్ కార్డు ఆలోచ‌న‌తో చేప‌ట్టిన ఈ బ‌హుళ ప్ర‌యోజ‌న కార్డుల జారీ ప్ర‌క్రియ‌ను ప్ర‌జ‌లంతా వినియోగించుకోవాల‌ని రేవంత్ పిలుపునిచ్చారు.

ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డు ద‌ర‌ఖాస్తు న‌మూనా...

ఈ కార్డు దరఖాస్తును మూడు విధాలుగా విభజించారు.


మొద‌టి భాగం


మొదటి భాగంలో కుటుంబ పెద్ద వివ‌రాల‌ను న‌మోదు చేయాల్సి ఉంటుంది.
అభ్య‌ర్థి పేరు, సెల్ నంబ‌ర్, రేష‌న్ కార్డు ర‌కం, పుట్టిన తేదీ, వార్షిక ఆదాయం, విద్యార్హ‌త‌లు, కులం, వృత్తి వంటి వివ‌రాల‌ను న‌మోదు చేయాల్సి ఉంటుంది. 

రెండవ భాగం


రెండో భాగంలో అభ్య‌ర్థి చిరునామా న‌మోదు చేయాల్సి ఉంటుంది.

మూడవ భాగం


మూడో భాగంగా చాలా ఇంపార్టెంట్..
మూడో భాగంలో కుటుంబ స‌భ్యుల వివ‌రాలు పొందుప‌రచాలి. ద‌ర‌ఖాస్తుదారునితో సంబంధం, పుట్టిన తేదీ, ఆధార్ నంబ‌ర్ వంటి వివ‌రాలు న‌మోదు చేయాల్సి ఉంటుంది. ఆధార్ నంబ‌ర్, పుట్టిన తేదీల‌ను న‌మోదు చేసేట‌ప్పుడు చాలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. ఎందుకంటే ఇక్క‌డ ఏ మాత్రం పొర‌పాటు జ‌రిగినా.. ఆ కుటుంబంలోని స‌భ్యుల‌కు సంక్షేమ ప‌థ‌కాలు అంద‌క‌పోవ‌చ్చు. కాబ‌ట్టి క‌రెక్ట్‌గా ఆధార్ నంబ‌ర్, పుట్టిన తేదీ వివ‌రాల‌ను స‌మ‌ర్పించాలి. ద‌ర‌ఖాస్తుపై గ్రూప్ ఫొటో( Family Group Photo ) అతికించాల్సి ఉంటుంది. చివ‌ర‌గా ద‌ర‌ఖాస్తుదారుడు త‌న సంత‌కం చేయాల్సి ఉంటుంది.

ద‌ర‌ఖాస్తుకు జ‌త‌ప‌ర్చాల్సిన ధృవ‌ప‌త్రాలు

1. కుటుంబ పెద్ద ఆధార్ కార్డు
2. కుటుంబ స‌భ్యుల ఆధార్ కార్డులు
3. గ్రూప్ ఫొటో
4. బ‌ర్త్ స‌ర్టిఫికెట్స్(పిల్ల‌ల‌వి) త‌ప్ప‌నిస‌రిగా స‌మ‌ర్పించాల్సి ఉంటుంది.


మీకు పెన్షన్ అకౌంట్ ఉందా లేకుంటే ఈ details చూడండి SBI LIFE INSURANCE 



☝️ Smart Platina Plus


Pay 10 year's 1,00,000/-


Get Guaranteed Pension Benefit for 25 year's + Maturity Benefit


 Death benefits

👉Normal: 11 Lakh's 

👉Accidental:  11L+33 L = 

44 Lakh's with ADB Coverage


For More details contact 


Lingareddy 

Senior Agency Manager

9949508843


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి