నేడు 10,006 మందికి నియామక పత్రాల అందజేత
కోర్టు కేసులు, ఇతర సమస్యలతో 1,056 పోస్టులు పెండింగ్
ఏడేళ్ల నుంచి ఎదురుచూస్తున్న ఉపాధ్యాయ అభ్యర్థుల కొలువు కల బుధవారం నెరవేరబోతోంది. మొత్తం 10,006 మంది నియామక పత్రాలను అందుకోనున్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సాయంత్రం 4 గంటలకు జరిగే సభకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరై కొందరికి స్వయంగా నియామక పత్రాలు అందజేస్తారు. ఈ సందర్భంగా సీఎం కొత్త టీచర్లను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అత్యధికంగా హైదరాబాద్ జిల్లా నుంచి 761 మంది, అత్యల్పంగా పెద్దపల్లి నుంచి 82 మంది నియామక పత్రాలు పొందనున్నారు. కోర్టు కేసులు, ఇతర సమస్యల వల్ల 1,056 స్పెషల్ ఎడ్యుకేటర్లు, పీఈటీల పోస్టులు భర్తీ కాలేదని అధికారులు తెలిపారు. సీఎస్ శాంతికుమారి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తదితరులు మంగళవారం కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి సభ నిర్వహణకు సంబంధించి పలు సూచనలు చేశారు.
For More Details 9949508843
జిల్లాల వారీగా నియామక పత్రాలు అందుకునే వారి సంఖ్య
ఆదిలాబాద్- 296, కొత్తగూడెం- 421, హనుమకొండ-173, హైదరాబాద్- 761, జగిత్యాల- 299, జనగామ- 211, భూపాలపల్లి- 213, గద్వాల- 149, కామారెడ్డి- 476, కరీంనగర్- 230, ఖమ్మం- 532, ఆసిఫాబాద్- 314, మహబూబాబాద్- 365, మహబూబ్‌నగర్- 214, మంచిర్యాల- 255, మెదక్- 291, మేడ్చల్- 102, ములుగు- 185, నాగర్‌కర్నూల్- 226, నల్గొండ- 546, నారాయణపేట- 252, నిర్మల్- 299, నిజామాబాద్- 526, పెద్దపల్లి- 82, సిరిసిల్ల- 134, రంగారెడ్డి- 357, సంగారెడ్డి-490, సిద్దిపేట- 270, సూర్యాపేట- 332, వికారాబాద్- 344, వనపర్తి- 126, వరంగల్- 272, భువనగిరి- 263
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి